విశ్వనాధ్ గారి బర్త్ డే స్పెషల్
posted on Feb 19, 2014 9:29AM
విశ్వనాద్ సినిమాలు తెలుగంతా తీయగా...తీపంత హీయిగా..హాయిగొలిపే తీరుగా..సెలయేరులా, గలగల పారే గోదావరిలా...గోదారిలోని నావలా, నావతెరచాపలా..మురిపిస్తూ..మై మరపిస్తుంటాయి...తెలుగన్న తెలుగు సినిమాలన్న మక్కువ గలవారు..ముందుగా విశ్వనాధ్ సినిమాలే చూడాలనుకుంటారు....ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ వుండవు..భారి సెట్టింగ్స్ వుండవు....ద్వంద్వార్ధపు సంభాషణలు అర్ధం పర్ధంలేని సన్నివేశాలు అసలుండవు.. ఆయనా అయిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయ్..
ఎంతో మంది కళాకారుల్ని అందించిన గుంటూరు జిల్లానే విశ్వనాధుణ్నీ అందించింది..సత్సాంప్రదాయపు కుటుంబం లో జన్మించిన ఆయన సాంప్రదాయబద్దంగా పెరిగారు..విశ్వనాధ్ చిన్నతనం కళలతో సంబంధం లేకుండా సాగింది అని అంటే ఎవ్వరు నమ్మరు..విశ్వనాధ్ తండ్రి వాహిని ప్రొదక్షన్ లో రిజినల్ మేనేజర్ గా చేసేవారు దాంతో ఆయన విద్యబ్యాసం విజయవాజ,గుంటూరులో సాగంది..
డిగ్రీ పూర్తి చేసిన విశ్వనాధ్ ఎక్కడో చోట పనిచేయాలని తన మేనమామ సలహ పై ఆయన తండ్రి ఆయన్ను మద్రాస్ వాహిని స్టూడియొలో సౌండ్ విభాగం లో రికార్డిస్ట్ గా చేర్పించారు....ఆ విధం గా జీవనోపాధి కోసమే చిత్రరంగ ప్రవేశం చేసారు తప్పితే విశ్వనాధ్ కు చిన్నప్పటినుంచీ కళా దృష్టి వుందని అనుకోవలసిన అవసరం లేదు...అలా టెక్నీషియన్ గా విశ్వనాధ్ కెరీర్ సినిమాలతోనే ప్రారంభమైయింది
మహమహుల సమక్షం లో తన కెరీర్ కు గట్టి పునాదులు వేసుకున్నారు విశ్వనాధ్..సౌండ్ రికార్డస్ట్ గా చేయడం వల్ల దాదాపు అన్ని రకాల సినిమాలకు పని చేస్తూ, అందరు ప్రముఖులతోనూ పరిచయం పెంచుకుంటూ..తనలోని దర్శకుణ్ని వెలికి తీసారు..శంకరాభరణం,సాగరసంగమం, సిరివెన్నెల,స్వాతి ముత్యం, స్వాతికిరణం,స్వయంకృషి, స్వర్ణకమలం వంటి ఎన్నో సినిమాలు ఆయన కళాతృష్ణకి తార్కాణాలు. ఆయన సినిమాల్లోని సంగీతం అజరామరం. ఎన్ని పాటలున్నా,ఎన్నిపాటలు విన్నా ఆయన సినిమాల్లోని పాటలు వింటేనే మనసుకి ఆహ్లాదం, శాంతి సంగీత నృత్యాల నేపథ్యం తీసుకొన్నా ప్రతిచిత్రం ఒక భిన్నమైన చిత్రమే.
విశ్వనాద్ చిత్రాల్లో నాటకీయత, కృత్రిమత్వం అసలేమాత్రం వుండవు..పాత్రలు చాలా సహజం గా ప్రవర్తిస్తాయి తప్పితే...నటించినట్టే అనిపించదు..అందుకే ఆయన సినిమాలకు ఇప్పటికీ జీవముంటుంది.. తెలుగు అనే పదానికి విశ్వనాద్ నిలువెత్తు నిదర్శనం..సత్సాంప్రదాయాన్ని సంగీతం తో ఎంతో ఇంపుగా వినసొంపుగా చూపించడం ఈయన శైలి అందుకే విశ్వనాధుని చిత్రాలు విశ్వజనరంజకం అయ్యాయి...