మహేష్ '1'..ఫస్ట్ డే హైదరాబాద్‌లో 685 షోలు!

      '1నేనొక్కడినే' ...ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే టాపిక్. ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా డిసెంబర్ 10 విడుదలకానున్న ‘వన్‌’ ను భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో తొలి రోజు ఏకంగా.....110కి పైగా థియేటర్లు, మల్టీ ప్లెక్సులు కలిసి మొత్తం 685 షోలు ప్రదర్శించనున్నారని సమాచారం. నిజంగా ఇదేగాని జరిగితే తొలి రోజు కలెక్షన్ లలో మహేష్ చరిత్ర సృష్టించడం ఖాయం. మొత్తానికి ‘ప్రిన్స్‌’... తెరపై క్రియేట్‌ చేసే ‘వన్‌’డర్‌ ఏమిటో చూడాలంటే... మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

యూట్యూబ్‌‍ను దున్నేస్తున్న మహేష్

      సూపర్ స్టార్ మహేష్ ''1 నేనొక్కడినే'' చిత్రం విడుదలకి ముందే రికార్డుల వేట మొదలుపెట్టాడు. నూతన సంవత్సరం కానుకగా విడుదలైన '1 నేనొక్కడినే' ట్రైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క రోజులో ఈ వీడియోకి ఐదు లక్షల క్లిక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిక్స్ 8 లక్షలు క్రాస్ చేసింది. రిలీజ్ కి ముందే రికార్డ్ లు సృష్టిస్తున్న ఒక్కడు...విడుదల తరువాత ఎన్ని సంచలనాలను నమోదు చేస్తాడో! ఈనెల 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ బాలనటుడిగా తెరంగ్రేటం చేయబోతున్నారు.

నేడే రెండవ ఎవడు విడుదల

  రాంచరణ్ నటించిన "ఎవడు" వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు సంక్రాంతి బరిలో పోటీ పడుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తుంది. తాజాగా "ఫ్రీడం.." అనే సాంగ్ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న తరుణంలో ఈ చిత్ర రెండవ ట్రైలర్ ను అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ ను శుక్రవారం నగరంలో ఓ థియేటర్ లో విడుదల చేయనున్నారు. దీనికి చరణ్ రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శృతిహాసన్, ఎమిజాక్సన్ హీరోయిన్లు.

మంచు వారిపై వర్మ జేజేలు

  మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఒట్టు". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో రామోజీఫిల్మ్ సిటీలోని ప్రియా డెయిరీ దగ్గర జరుగుతుంది. ఓ నాయకుడిని పొగుడుతూ, అతనికి జనాలందరూ కూడా జేజేలు కొడుతున్న సన్నివేశాన్ని ఇటీవలే చిత్రీకరించారు. ఇక్కడ వచ్చే నెల 11 వరకు చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో విష్ణు మంచు నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా పూర్తి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

'1 నేనొక్కడినే' ట్రైలర్...రికార్డులు బ్రేక్!!

      గత కొంతకాలంగా '1 నేనొక్కడినే' ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కొత్త సంవత్సరం కానుకగా '1 నేనొక్కడినే' ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ ట్రైలర్ చూసిన వారంతా ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ ను సేట్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ లో చూపించిన లోకేషన్లు, యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయిలో వున్నాయని..ఇవి సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచుతున్నాయని చెబుతున్నారు. మహేష్ బాబు చెప్పినట్లే... ఆయన కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవడం ఖాయమని ప్రిన్స్ అభిమానులు సంబరపడిపోతున్నారు.    

విప్పుతాడా? విప్పడా?

    ఫలానా హీరోయిన్‌ తన రాబోయే సినిమాలో రెచ్చిపోయి ఎక్స్‌పోజింగ్‌ చేసేసిందట, బికినీలూ గికినీలూ వేసేసిందట... అంటూ సినిమాకి ముందే బోలెడంత హడావిడి జరగడం ఇప్పుడు పెద్ద విశేషమేమీ కాదు (కొండకచో... ఒక్కోసారి సినిమా నిర్మాతలే ఇలాంటి ముందస్తు ప్రమోషన్‌లూ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటారని కూడా అంటుంటారు.) ఇప్పుడు ఒక సినిమా విషయంలో అదే జరుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్‌ స్థానాన్ని ఓ హీరో ఆక్రమించడమే విశేషం. ఆ సినిమా పేరు ‘వన్‌’. ఇక ఆ పేరు చెప్పగానే హీరో ఎవరనేది చెప్పనక్కర్లేదనుకోండి. విషయానికి వస్తే... ఈ సినిమా ప్రారంభించిన దగ్గర్నుంచి అన్నీ స్పెషల్సే. ముఖ్యంగా ఈ సినిమా కోసం హీరో మహేష్‌బాబు... సిక్స్‌ప్యాక్‌ కోసం వర్కవుట్స్‌ చేస్తున్నాడనేది వెరీ వెరీ స్పెషల్‌ న్యూస్‌. అసలే టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ స్టార్‌గా పేరున్న మహేష్‌... సిక్స్‌ప్యాక్‌ కూడా చేస్తే ఇక అమ్మాయిలంతా ఫిదా అయిపోతారనే విషయంలో నో డౌట్‌. ఈ ‘సిక్సీ’లుక్‌ కోసం మహేష్‌ ఓ విదేశీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని నియమించుకున్నాడని కూడా వార్తలు వచ్చేశాయి. సరే... అదలా ఉంచితే... సినిమా పూర్తయి, విడుదల తేదీ కూడా నిర్ణయమైపోయింది. ఇప్పుడు మళ్లీ మహేష్‌ సిక్స్‌ప్యాక్‌ న్యూస్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీని సారాంశం ఏమిటంటే... ‘వన్‌’లో మహేష్‌ సిక్స్‌ప్యాక్‌ చూపడం లేదట. తనకు కండలు చూపడం ఇష్టం లేదు కాబట్టి... తాను ఈ సినిమాలో చొక్కా విప్పలేదని మహేష్‌ చెప్తున్నాడట. మరొక వార్త ఏమిటంటే... అసలు మహేష్‌ సిక్స్‌ప్యాక్‌ కోసం ప్రయత్నం చేయనేలేదని, వన్‌లో ఉన్న యాక్షన్‌ సీన్స్‌కు కావల్సిన ఫిట్‌నెస్‌ సాధించడం కోసమే ట్రైనర్‌ను నియమించుకున్నాడని. మొత్తానికి వీటిలో ఏది నిజమో తెలియాలంటే ‘ప్రిన్స్‌’... తెరపై క్రియేట్‌ చేసే ‘వన్‌’డర్‌ ఏమిటో చూడాలంటే... మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

'2014' సినీ సింహాసనం ఎవరిది?

      2013 వెళ్లి ...2014 వచ్చేస్తోంది. ఈ సమయంలో 2013 లో తీపి కబుర్లు అంటే హిట్ కొట్టిన హీరోలు..వారి సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కి సంతోషం పంచుతున్నాయి. నిర్మాతలకు మరెన్ని సినిమాలు ప్రారంభించేలా చేస్తున్నాయి. 2013లో హిట్, ఫ్లాఫ్ ల మాట అటుంచితే మన స్టార్ హీరోలు ఎంటర్ట్నైమెంట్ పంచడానికి పెద్ద గ్యాప్ తీసుకోవడం లేదు....రెట్టించిన ఉత్సాహంతో తర్వాత ప్రాజెక్టులలో బిజీ అవుతున్నారు. ఈ ఏడాది గత ఏడాదికి మించి విజయాలని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి 2014 ఆశించినట్టుగానే సాగుతోందా? 2014 లో ఏ హీరోలకి కలిసి వస్తుందో ఒకసారి విశ్లేషిద్దాం.   సూపర్ స్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్:       గత ఏడాదిలాగే ఈసారి కూడా సంక్రాంతి రేసులో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ పోటీ పడబోతున్నారు. అయితే ఈ సారి సీన్ కొంచెం రివర్స్ అయింది... గత ఏడాది 'నాయక్' అంటూ సింగిల్ గా రంగంలోకి దూకిన చరణ్  ఈ సారి 'ఎవడు' అంటూ మల్టీ స్టారర్ మూవీ తో వస్తున్నాడు.   సాధారణంగా ఇంత ఆలస్యమైన సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉండవు. కానీ ‘ఎవడు’పై అంచనాలు మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. గత సంక్రాంతికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సూపర్ డూపర్ హిట్ కావడం, అగ్రహీరోలకి 7వ చిత్రం బ్లాక్ బస్టర్ కావటం సెంటిమెంట్ పరంగా ‘ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే చార్టుబస్టర్‌లో నెం.1 ఆడియోగా ఉండటం విశేషం.   అదే విధంగా గత ఏడాది ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' మల్టీస్టారర్స్ తో వచ్చిన మహేష్ ఈ సారి '1 నేనొక్కడినే'  అంటూ తన దూకుడు చూపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్, మహేష్ , సుకుమార్ మొదటిసారి పనిచేస్తున్న చిత్ర౦ కావడం... అలాగే సంక్రాంతి సెంటిమెంట్ మహేష్ బాగా కలిసి వస్తుండడం..ఈ సినిమా పై 'హైప్' ను ఇంకా పెంచుతున్నాయి. మహేష్ బాబు 1 నేనొక్కడినే ఆడియో ఇటీవలే విడుదలై యువతను ఊపేస్తోంది. ఈ రెండు సినిమాల్లో సోకాల్డ్ కమర్షియల్ అంశాలతో పాటు కాసిన్ని నవ్వులు కూడా ఉన్నట్టయితే ఈ సినిమాలు 'యాభై కోట్లు' దాటడం అంత కష్టమేమి కాదని అంటున్నారు విశ్లేషకులు.      పవన్ సింహాసనం కొట్టేస్తాడా..!! 2012లో 'గబ్బర్‌సింగ్‌'తో ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయిన పవన్ కళ్యాణ్...‘అత్తారింటికి దారేది’తో ఏకంగా ఆల్‌ టైమ్‌ నంబర్‌ వన్‌ హిట్‌ అందుకున్నాడు. మళ్లీ పవన్‌ పరాజయాల పరంపర కొనసాగిస్తాడని అనుకున్న వాళ్లు ఎవరైనా ఉంటే ‘అత్తారింటికి దారేది’తో ‘పవన్‌ ఈజ్‌ బ్యాక్‌’ అనేశారు. 2014లో ‘గబ్బర్‌సింగ్‌ 2’తో హ్యాట్రిక్‌ కొట్టేసి '1' సింహాసనం తనదేనని అంటాడా?    ఎన్టీఆర్ 'రభస' చేస్తాడా?   ఎన్టీఆర్‌కి ఈసారి కూడా టాప్‌ ఫైవ్‌ హిట్స్‌లో చోటు దక్కలేదు. భారీ అంచనాలతో విడుదలైన ‘బాద్‌షా’ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్‌ సాధించింది. ఓవరాల్‌గా నలభై అయిదు కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసి ఎన్టీఆర్‌కి తొలిసారి నలభై కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించిపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో సంచలనాలని మాత్రం సృష్టించలేదు. కాని 2014లో మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 'రభస' చేస్తానని అంటున్నారు. సంతోష్‌ శ్రీనివాస్‌తో చేస్తున్న 'రభస'లో ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుందని అంటున్నారు.   అల్లు అర్జున్‌ 'టాప్‌ గేర్‌'..!! పూర్‌ ఫామ్‌లో ఉన్న పూరి జగన్నాథ్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ చేసిన అల్లు అర్జున్‌ కేవలం ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకున్నాడు. కానీ అల్లు అర్జున్‌ సినిమాల లైనప్‌ బాగుంది. సురేందర్‌తో ‘రేసుగుర్రం’ అనే కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్న బన్నీ ఆ తర్వాత త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో నటించబోతున్నాడు. కాబట్టి 2014లో అల్లు అర్జున్‌ జోరు మళ్లీ పెరిగి టాప్‌ గేర్‌లోకి వెళ్లవచ్చు. రవితేజ 'కేర్‌ఫుల్‌'..!! కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూసిన రవితేజ ఎట్టకేలకు ‘బలుపు’ చూపించాడు. ఈ చిత్రంతో రవితేజ ఫ్లాప్‌ స్ట్రీక్‌ ఎండ్‌ అయి, మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. ఇకపై మళ్లీ పట్టు కోల్పోకూడదని రవితేజ ఎప్పుడూ లేనంత కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడిప్పుడు. బలుపు రిలీజ్‌ అయి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు అతని కొత్త సినిమా మొదలు కాలేదు. 'సో' 2014 లో తన జోరును పెంచడానికి కేర్‌ఫుల్ గా అడుగులు వేస్తున్నాడు.   రామ్ 'వేక్ అప్':   గత ఏడాది ‘ఎందుకంటే ప్రేమంట’తో ఫ్లాప్‌ అయిన రామ్‌ ఈసారి ‘ఒంగోలు గిత్త’గా కొమ్ములు విరగ్గొట్టుకుని, మసాలాతో పూర్తిగా డీలా పడ్డాడు. ఇంకా తన తదుపరి చిత్రమేది అనేది అతను ఫిక్స్‌ కాలేదు. రామ్ కి 2013 వేక్‌`అప్‌ కాల్‌. ఇప్పటికీ జాగ్రత్త పడకపోతే... 2014లో ఇబ్బందులు తప్పవు. మళ్ళీ  చైతు 'తడాఖా'..!   నాగచైతన్య ఎట్టకేలకు ‘తడాఖా’ చూపించాడు. ఈ చిత్ర విజయంతో మళ్లీ చైతన్య మునుపటిలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. రాబోయే సినిమాల్లో ఆటోనగర్‌ సూర్య, మనం ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి '2014' కెరీర్‌ పరంగా నాగచైతన్యకి చాలా కీలకం. గోపీచంద్‌ సక్సెస్?   గోపీచంద్‌ ‘సాహసం’ సినిమాతో యావరేజ్‌ ఫలితాన్ని అందుకున్నాడు. ఇప్పటికీ అతని కష్టాలు అయితే తొలగిపోలేదు. హీరో అయిన కొత్తల్లో వరుస విజయాలు అందుకున్న గోపీ ఇప్పుడా రోజుల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. వెటరన్‌ డైరెక్టర్‌ బి. గోపాల్‌తో చేస్తున్న సినిమా ఎంతవరకు అతని ఎదురు చూపులకి బదులిస్తుందో మరి. '2014' మన కళ్ళకి పండుగలా సాగాలంటే...మన హీరోలకి సక్సెస్ లు రావాలి...అలా సక్సెస్ లు కావాలంటే వారు కాస్త పంథా మార్చాలి. ఏది ఏమైనా ..ఈ సంవత్సరం అయినా మంచి హిట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడాలని ఆశిద్దా౦.                   

కాజల్‌... మహా... కాస్ట్‌లీ గురూ...

      ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్స్‌ పరంగా నెంబర్‌వన్‌ హీరోయిన్‌ ఎవరు? అని అడిగితే ఠక్కున చెప్పేస్తాం సమంత అని. మరి రెమ్యునరేషన్‌ పరంగా అంటే... తడుముకునే వాళ్లం. అయితే కాజల్‌ పుణ్యమాని మనకా తడుముకునే అవస్థ తప్పింది. ఇప్పటిదాకా తెలుగులో ఏ హీరోయిన్‌ అందుకోనంత రెమ్యునరేషన్‌ అందుకుంటూ కాజల్‌... కొత్త చరిత్రకు ఆజ్యం పోసింది. ఈ క్రేజీగాళ్‌... కమల్‌హాసన్‌తో ‘ఉత్తమ విలన్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా కోసం ఏకంగా టాప్‌ హీరోతో సమానంగా రూ.2కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుందని సమచారం.   అంతేకాదు... రామ్‌చరణ్‌, క్రష్ణవంశీల కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమా కోసం కూడా పెద్ద మొత్తాన్నే డిమాండ్‌ చేసి సాధించుకుందట. చందమామతో తనకు హిట్టొచ్చిందని క్రష్ణవంశీ, మగధీర, నాయక్‌ సినిమాల్లో తన సక్సెస్‌ జోడీ అని రామ్‌చరణ్‌... సెంటిమెంట్‌గా ఫీలవ్వడంతో... ఈ నాజూకు భామ అడిగినంత ముట్టజెప్పారట. ఈ రెండు సినిమాలకూ కాజల్‌ వసూళ్లు చూసిన సినీ జనం... నెంబర్‌వన్‌ అంటే ఇంకొకర్ని ఎలా చెప్పుకుంటాం అని అనుకుంటున్నారట. సినిమాల్లో నటించడంతో పాటు అవసరాన్ని, సెంటిమెంట్‌ను బాగానే మార్కెట్‌ చేసుకుంటున్న ఈ కాస్ట్‌లీ గాళ్‌... తన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే అభిమానుల కోసం ఒక మొబైల్‌ అప్లికేషన్‌ కూడా  ఇటీవలే రిలీజ్‌ చేసింది. అమ్మో... కాజల్‌... అసాధ్యురాలే.

మూడోసారి చెర్రీతో కాజల్ రొమాన్స్

  కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. రామ్ చరణ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అయితే చరణ్ సరసన నటించే హీరోయిన్ కోసం దర్శకుడు గతకొంత కాలంగా వెతుకుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా తమన్నాను అనుకున్నారు. కానీ తమన్నా ప్రస్తుతం తెలుగులో "ఆగడు", "బాహుబలి" చిత్రాలతో పాటు, హిందీలో రెండు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. అందుకే తమన్నా స్థానంలో తాజాగా కాజల్ ను ఎంపిక చేసారు. "బాద్ షా" తర్వాత తెలుగులో కాజల్ ఏ ఒక్క చిత్రం కూడా ఒప్పుకోలేదు. దాంతో ఈ చిత్రంలో నటించేందుకు కాజల్ వెంటనే ఒప్పేసుకుంది. పైగా కాజల్ కు "చందమామ" చిత్రంతో హీరోయిన్ గా మంచి పేరు వచ్చేలా చేసిన దర్శకుడు కృష్ణవంశీ చిత్రం కావడం వలన వెంటనే ఒప్పేసుకుంది."మగధీర", "నాయక్" చిత్రాల తర్వాత చెర్రీ, కాజల్ కాంబినేషన్ ఇది మూడవసారి. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఐటెం హీరోయిన్ కాదంట...!

  కొత్త సంవత్సరపు వీడ్కోలు కోసం ఇప్పటికే చాలా కంపెనీలు హీరోయిన్లను భారీ మొత్తంలో పారితోషకం ఇచ్చి మరీ బుక్ చేసుకున్నారు. అయితే హీరోయిన్ నిత్యా మీనన్ ను కూడా సదరు ఓ కంపెనీ వారు వెళ్లి మూడు గంటలు సరదాగా మీ డాన్సులతో అలరిస్తే 70 లక్షల వరకు ఇస్తామని ఆఫర్ చేసారంట. అయితే ఈ ఆఫర్ ను నిత్యా సున్నితంగా.."నాకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేదు" అని చెప్పిందట. అయితే ఆ కంపెనీ వారు అంతటితో ఊరుకోకుండా.."మీకు పారితోషకం ఎంతో చెప్పండి.. అంతే ఇస్తామంటూ" వెటకారంగా మాట్లాడాడంట. దాంతో నిత్యాకు ఒళ్ళుమండి.."ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఈవెంట్స్ లో ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్ లాగా కనిపిస్తున్నానా?" అంటూ సదరు కంపెనీ మేనేజర్ ను అక్కడే ఉతికి అరేసినంత పని చేసిందట.

'కాల్‌గాళ్’‌... చేసింది గాయం: శ్రియ

      చాలా కాలం నుంచి ఉన్నానంటే ఉన్నానన్నట్టు సినీరంగంలో అరకొర సినిమాలకే పరిమితమైపోయిన స్లిమ్‌గాళ్‌...శ్రియ... కాస్త తీరుబాటుగా ఉందనేమో... తన కెరీర్‌ను విశ్లేషించుకోవడం మొదలుపెట్టింది. అందులో భాగంగా... తాను చేసిన తప్పుల్ని నెమరేసుకుంది. హిట్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్నప్పుడు చేసిన ఐటమ్‌ సాంగ్స్‌ తనను దెబ్బతీశాయందీ భామ. అంతేకాదు ఎంతో ఆశపడి ‘పవిత్ర’లో చేసిన కాళ్‌గాళ్‌ పాత్ర తనకు ఏ మాత్రం ఉపయోగపడలేదని బాధగా చెప్పింది. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఐటమ్‌ సాంగ్స్‌తో అదరగొట్టేస్తుంటే తనుకూడా అలా ట్రెండ్‌ తెద్దానుకున్నానని, బాలీవుడ్‌ హీరోయిన్లకు బ్రేక్‌ నిచ్చిన వేశ్యపాత్రను స్ఫూర్తిగా తీసుకుని పవిత్ర చేశానని చెప్తున్న శ్రియకు... ఇప్పటికైనా జ్ఞానోదయమయిందంటా... ‘ఎవరినో చూసి వాత పెట్టుకోకూడదని’.

బాలీవుడ్‌ జంటల ‘ఫస్ట్‌’నైట్‌ ఎక్కడ?

      న్యూఇయర్‌ పార్టీని, వెంటనే వచ్చే 1వ తేదీ రాత్రి సమయాన్ని ఆనందంగా గడిపేందుకు మన బాలీవుడ్‌ తారలు ఒక్కొక్కొరు ఒక్కోరకంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సారి బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ తన భార్య గౌరి, పిల్లలను తీసుకుని థాయ్‌లాండ్‌లోని పుఖెట్‌కు వెళుతున్నారు. చాలా కాలం తర్వాత తన భార్యా పిల్లలతో అటు హాలిడే ట్రిప్‌, ఇటు న్యూఇయర్‌ పార్టీ రెండూ ఎంజాయ్‌ చేస్తున్నాడు షారూఖ్‌.    బాలీవుడ్‌ గుడ్‌ హజ్బెండ్‌ అక్షయ్‌ తన భార్య ట్వింకిల్‌ఖన్నా, పిల్లలతో కలిసి గోవాలో న్యూఇయర్‌ జోష్‌లో మునిగిపోనున్నాడు. ఇక కూతురి ముద్దుమురిపాలతో ఆనందోత్సాహాల్లో ఉన్న ఐశ్వర్య, అభిషేక్‌ జంట జాయ్‌నైట్‌ కోసం దుబాయ్‌ బయలుదేరనున్నారు. ఇక అమీర్‌ఖాన్‌ ఎప్పటిలానే తన భార్య కిరణ్‌, తన కొడుకుతో కలిసి పంచంగనిలోని తన స్వంత ఇంట్లో కొత్త సంవత్సరారంభాన్ని ఆస్వాదించనున్నాడు. ఏక్‌ దో తీన్‌ మాధురి దీక్షిత్‌... తన భర్త శ్రీరామ్‌నెనేతో కలిసి సింగపూర్‌లో పార్టీయింగ్‌కు సిద్ధమైంది. లైఫ్‌ని ఎలా ఎంజాయ్‌ చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి అన్నట్టుండే... సైఫ్‌ అలీఖాన్‌, కరీనాకపూర్‌ల జంట... ఎప్పటిలానే స్విట్జర్లాండ్‌లోని జిస్తాడ్‌కు వెళ్లనుంది. అయితే ఈసారి అక్కడ స్కైయింగ్‌ నేర్చుకోవాలని కూడా వీరు అనుకుంటున్నారట. సింగిల్‌గా, బ్యాచిలర్స్‌గా ఉన్నవారు వారి వారి ‘ప్రత్యేక’ మైన వ్యక్తులతో కలిసి... సీక్రెట్‌ సరదాలకు సిద్ధమయ్యారట. ఈ ఏడాది విజయాలతో మైమరచిపోతున్న దీపికాపదుకునే... వాటిని ఆస్వాదించేందుకు ఇప్పటికే మాల్థీవులు వెళ్లిపోయింది. అక్కడ తన సన్నిహితులతో గడుపుతోంది. అయితే 31కి మాత్రం ఈ భామ ముంబయి వచ్చేసి న్యూఇయర్‌ పార్టీని ఫ్రెండ్స్‌తో థూమ్‌ థామ్‌ అనిపిస్తానంటోంది. ఆర్‌.రాజ్‌కుమార్‌ విజయంతో జోష్‌ మీదున్న హీరో షాహిద్‌కపూర్‌ లాస్‌ఏంజెల్స్‌లో కొత్త ఏడాదిని స్వాగతించనున్నాడు. సో... బ్యూటీ సోనమ్‌ కపూర్‌ రాజస్థాన్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకుని గోవాకు వెళ్లిపోతోంది. అక్కడ ఫుల్‌ పార్టీ అట.

నాని కపిరాజు పాటలు విడుదల

  నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన "జెండాపై కపిరాజు" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. వి.వి.వినాయక్ ఆడియో సిడీని విడుదల చేసి, నాని తండ్రి రాంబాబుకి అందించారు. ఈ సంధర్భంగా హీరో నాని మాట్లాడుతూ... "ఆహా కళ్యాణం" షూటింగ్ కారణంగా ఈ సినిమాకు అడపాదడపా అంతరాయాలు ఏర్పడినా కూడా దర్శకుడు సముద్రఖని భరించారు. నా నుండి తనకు ఏం కావాలో అది రాబట్టుకున్నారు. ఇరవై, ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న నటులు మాత్రమే చేయగలిగే ఫీట్ ని.... అతి తక్కువ సమయంలో చేసే అవకాశం నాకు ఈ సినిమా ద్వారా దక్కింది. అది నిజంగా నా అదృష్టం. ఈ సినిమ నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నా నటన వలన ఈ సినిమా వంద రోజులు ఆడితే.. తమిళంలో జయం రవి నటనకు 175 రోజులు ఆడుతుంది." అని అన్నారు. ఈ చిత్రంలో నాని సరసన అమలాపాల్, రాగిణి కథానాయికలు. జివిప్రకాష్ సంగీతాన్ని అందించాడు.