ఆస్పత్రిలో విజయమ్మకి చికిత్స... బెంగళూరులో జగన్ భజన!
posted on Jul 29, 2024 @ 8:30PM
తల్లీ, చెల్లీ అంటే ఎంతమాత్రం అభిమానం లేని సిల్లీ ఫెలో ఎవరయ్యా అంటే మన జగన్ అని ఎంతమాత్రం తడుముకోకుండా చెప్పవచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య, మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తల్లి అయిన విజయమ్మ గత కొన్ని రోజులుగా బంజారాహిల్స్.లోని ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. జగన్ గత కొంతకాలంగా తాడేపల్లి నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి తాడేపల్లికి, మధ్యమధ్యలో బెంగళూరుకి, అంతకుముందు నెల్లూరు సెంట్రల్ జైలుకి, ఆ తర్వాత వినుకొండలోని రషీద్ ఇంటికి వెళ్ళారు. ఇన్నిచోట్లకి వెళ్ళి ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్టు పోజులు కొడుతున్నారుగానీ, తనను ప్రపంచంలోకి తెచ్చిన తల్లి గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే, తల్లిదగ్గరకి వెళ్ళడానికి కూడా ఇతగాడికి తీరికలేకుండా పోయింది. అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడన్నట్టుగా వుంది జగన్ వ్యవహారశైలి. కన్నతల్లినే పట్టించుకోని ఈ పుత్రరత్నం ఏపీలో వున్న అక్కచెల్లెళ్ళని, అవ్వతాతలను ఆదుకుంటాడట.. ఏడిసినట్టుంది! ఢిల్లీ నుంచి తాడేపల్లికి వచ్చిన తర్వాత, మళ్ళీ ఎగేసుకుంటూ ఆ బెంగళూరుకు వెళ్ళి భజన చేయకపోతే, ఆస్పత్రిలో వున్న తల్లిని పరామర్శించవచ్చుగా?