ఏపీ రాజముద్రతో పట్టాదార్ పాస్‌బుక్‌లు!
posted on Jul 29, 2024 @ 4:42PM
ఆంధ్రప్రదేశ్ రైతులు ఐదేళ్ళపాటు భరించిన దరిద్రం వదలబోతోంది. ఇంతకాలం రైతులు సహించిన నరకం తప్పబోతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు అందబోతున్నాయి. జగన్ దుర్మార్గ పాలనలో రైతుల భూమి హక్కుపత్రమైన పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో ముద్రించారు. తమ ఆస్తి హక్కుపత్రం మీద జగన్ ముఖం చూడలేక రైతులు ఇంతకాలం తల్లడిల్లిపోతూ వచ్చారు. ఇదేమని ప్రశ్నిస్తే కొరివితో తల గోక్కున్నట్టే అవుతుందని వాళ్ళలో వాళ్లే కుమిలిపోతూ వచ్చారు. జగన్ ముఖారవిందం వున్న పాస్ పుస్తకాలను చించిపారేయాలన్నంత ఆవేశం వచ్చినా తమాయించుకున్నారు. అయితే కొంతమంది రైతులైతే ఏదయితే అది అయిందని బహిరంగానే తమ పట్టాదార్ పాస్ పుస్తకాలను చించేసిన సందర్భాలు కూడా వున్నాయి. ఇప్పుడు ఆ చీకటి రోజులు పోయాయి కాబట్టి కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో వున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను త్వరలో ఆంధ్రప్రదేశ్ రైతులకు అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులూ.. కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందుకోండి.. పాత పుస్తకాలు చించిపారేయండి.