మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిన శాంతి
posted on Jul 29, 2024 @ 3:30PM
గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి సడెన్ గా కోర్డు గడపదొక్కింది. నాలుగు గోడల మధ్య ఉన్న ఈ వ్యవహారాన్ని మీడియాకెక్కిన శాంతి యూటర్న్ తీసుకుంది. తను పరువు తీస్తున్న మీడియాపై యాక్షన్ తీసుకోవాలని అని కోర్టు గడపతొక్కింది. మీడియాలో ఆమె ప్రైవేసీకి భంగం కలిగే విధంగా ప్రచారం జరుగుతుందని హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు కు మొరపెట్టుకుంది. శాంతి వాదనలను బల పరిచే విధంగా కోర్టు ఉత్తర్వులు జారి చేసింది. ఇకపై శాంతి వ్యక్తిగత జీవనాన్ని ప్రసారం చేస్తే కోర్టు దిక్కరణ అవుతుందని శాంతి తరపు న్యాయవాది పేర్కొన్నారు. శాంతి భర్త మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో గుప్పు మంటున్నాయి. . శాంతికి పుట్టిన మగబిడ్డ తన బిడ్డ కాదని మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్నారు. శాంతి వైకాపా రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డి డిఎన్ ఏ టెస్ట్ చేస్తే సరిపోతుందని మదన్ మోహన్ బలంగా నమ్ముతున్నారు. యూట్యూబ్ సంస్థకు కోర్టు నోటీసులు జారి చేసింది. శాంతి కంటెంట్ పూర్తిగా తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతిని వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లోబరుచుకున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.