ఓలమ్మో.. అందరి ముందే ‘ఫ్రెంచ్’ కిస్ పెట్టేసింది!
posted on Jul 31, 2024 @ 4:05PM
మొన్నామధ్య ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక ప్రపంచం మొత్తాన్నీ తనవైపు తిప్పుకుంది. ఈ ఒలింపిక్స్ వేడుక మాత్రమే కాదు.. మరో విషయం కూడా ప్రపంచ వ్యాప్తంగా ‘హాట్’ పాయింట్‌గా మారింది. అదేంటంటే, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ని ఫ్రాన్స్ స్పోర్ట్స్ మంత్రి ఎమీలా కాస్టెరా అందరి ముందు ముద్దుపెట్టుకోవడం. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ స్థాయి వేడుకకి ఆతిథ్యం ఇస్తున్న ఆనందంలో ఫ్రెంచ్ ప్రభుత్వం వుంది. ప్రారంభ వేడుకల సందర్భంలో ఆ ఆనందం ప్రభుత్వానికి సంబంధించిన అందర్లోనూ వుంది. వేడుక ప్రారంభం కాగానే అందరూ ఒకర్నొకరు అభినందించుకుంటూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. అయితే, ఎగ్జయిట్మెంట్ కాస్త ఎక్కువైపోయిన క్రీడా మంత్రిణి ఎమీలా కాస్టెరా మాత్రం ఆనందం పట్టలేక తన ఎదురుగానే వున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కి లటుక్కుమని ముద్దు పెట్టేసింది. దాంతో అక్కడున్నవాళ్ళందరూ షాకైపోయారు. కొంతమంది, ఇదేంట్రా బాబూ అనుకుంటే, మరికొంతమంది మరీ ఇంత పబ్లిగ్గానా అనుకున్నారు. ఇంకొంతమంది అయితే, ఆ ముద్దేదో నాకు పెడితే ఎంత బాగుండేదో అనుకున్నారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ, ఇలా ముద్దు పెట్టుకున్న పాయింట్ సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటో బయటకి రావడంతో ఆ సంచలనం మరింత పెరిగింది. దేశ అధ్యక్షుణ్ణి మినిస్టరమ్మ ఏదో ఎగ్జయిట్‌మెంట్లో ముద్దు పెట్టుకుని వుంటుందిలే అని కొందరు అంటుంటే, అదేం కాదు.. వీళ్ళిద్దరి మధ్య అంతకుముందు నుంచే ఏదో వుంది అని కొందరు అంటున్నారు.