కవితకు మళ్లీ బెయిల్ నిరారణ
posted on Jul 31, 2024 @ 12:55PM
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోమారు నిరాశే ఎదురైంది. గత నాలుగు నెలల నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉండిపోయింది. ఈడీ అధికారులు కవితను హైద్రాబాద్ లోని స్వ గృహంలో అరెస్ట్ చేశారు. ఇది పొలిటికల్ అరెస్ట్ అని కవితతో బాటు బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. కవితకు బెయిల్ లభించకపోవడంతో కెటీఆర్ , హరీష్ రావులు డిల్లీలోని బిజెపి పెద్దలను కలిసారు. ప్రధాని అయితే వారికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. బిజెపితో కల్సి పని చేస్తామని బిఆర్ఎస్ నేతలు ఢిల్లీ పెద్దలకు చెప్పారు. కాంగ్రెస్ ను నిలువరించడానికి కలిసి పని చేద్దామని కెటీఆర్, హరీష్ రావు ప్రతిపాదనను బిజెపి నేతలు ఖరాఖండిగా నో అని చెప్పేశారు. పార్లమెంటు ఎన్నికల్లో జిరోకి పడిపోయిన బిఆర్ఎస్ తో కలిసి పని చేయడం కుదరదన్నారు. బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేయాలని షరతు విధించడంతో కెసీఆర్ ఆలోచనలో పడ్డారు. బిఆర్ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం ఇష్టం లేక కెసీఆర్ ఈ షరతుకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చి 16న అరెస్టయ్యారు. అప్పటి నుంచీ ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు.
పలుమార్లు ఆమె పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుండడంతో అధికారులు ఆమెను వర్చువల్‌గా కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, కాబ్టటి కవిత రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.