వరద సహాయ కార్యక్రమాలకు మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు

అధికారం అంటే హంగూ ఆర్భాటం కాదు, నిరాడంబరత, ప్రజా సేవ అని నిరూపిస్తున్నారు తెలుగుదేశం కూటమి మంత్రులు. కనీవినీ ఎరుగని రీతిలో వరద బెజవాడ నగరాన్ని జల దిగ్బంధం చేస్తే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా, కూటమి ప్రభుత్వ మంత్రులంతా క్షేత్ర స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలలో భాగస్వాములై నిర్విరామంగా పని చేస్తున్నారు. బాధితులకు అండదండగా ఉంటామనీ, ఉన్నామనీ భరోసా కల్పిస్తున్నారు.  ఓ వైపు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాలు పంచుకుంటూనే, మరో వైపు సమీక్షల్లో పాల్గొంటూ మరింత మెరుగైన సేవలు అందించే విషయంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇలాంటి ఓ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఐటీ, మానవవనరుల మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనకు మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.   వరద పరిస్థితుల్లో మంత్రులంతా తమతమ ఎస్కార్ట్ వాహనాలను విత్ డ్రా చేసుకుని వాటిని బాధితులకు సహాయ పునరావాల కార్యక్రమాలకు వినియోగించాలని లోకేష్ చేసిన ప్రతిపాదనకు మంత్రులంతా క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపారు. దీంతో వరద నేపథ్యంలో మంత్రులంతా ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వారి ఎస్కార్ట్ వాహనాలు బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహారం, తాగునీరు, మందులు తరలించే వాహనాలకు ఎస్కార్ట్ గా ఉంటాయి. చివరి బాధితుడి వరకూ సాయం అందాలన్న చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా ఆయన కేబినెట్ మొత్తం పని చేస్తున్నది. ఇంతటి విపత్తులోనూ బాధితులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

డిజాస్టర్ హెల్స్ కోసం డ్రోన్లు... బాబు విజన్ కు సర్వత్రా ప్రశంసలు

సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబకు ఎవరూ సాటి రారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి సిఎంగా ఐదేళ్లు, ఇప్పుడు కూడా ఆయన ప్రజల ప్రయోజనాల కోసం సాంకేతికను వాడుకునే విషయంలో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారు.  విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన సందర్భంగా ఆయన అహర్నిశలూ ప్రజల క్షేమం కోసం, వారికి సత్వరంగా సహాయం అందించడం కోసం తపన పడ్డారు. విజయవాడలోని ముంపు ప్రాంతాలను చేరుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా కూడా చేరుకోలేని ముంపు ప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు ఆయన  డ్రోన్ లను వినియోగించారు. వాటి ద్వారా అహారం, నిత్యావసరాలు, అత్యవసర మందుల పంపిణీ జరిగేలా చూశారు. బహుశా ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు డ్రోన్ల వినియోగం దేశంలో ఇదే మొదటి సారి కావచ్చు. ఇటీవలి కాలంలో డ్రోన్ల ప్రయోజనం, ఉపయోగాల గురించి పదే పదే చెప్పిన చంద్రబాబు సరిగ్గా అవసరమైన సమయంలో వాటిని సంపూర్ణంగా వినియోగించి ప్రజలను ఆదుకున్నారు.  కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడి ద్వారా ఈ ఆపత్సమయంలో డ్రోన్లను రాష్ట్రానికి రప్పించి, సరైన సమయంలో సమర్ధవంతంగా వాటి సేవలను వినియోగించుకున్నారు. డిజాస్టర్ హెల్స్ కోసం తొలిసారిగా డ్రోన్లను రంగంలోకి దింపి సకాలంలో బాధితులను ఆదుకున్నారు. ఆయన విజన్ కు, ప్రజలకు కష్ట సమయంలో అండగా నిలవడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోని పట్టుదలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.  

అర్ధరాత్రి వరకు కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు కష్టం వచ్చిందంటే విలవిలలాడిపోతారు. వారి కష్టాలను తీర్చి సాధారణ జీవితం గడిపే వరకూ నిద్రాహారాలు మరచిపోతారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆయన తీరు అదే.  గతంలో ఉత్తరాఖండ్ విలయంలో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రాలకు, వారి ప్రాంతాలను పంపించేందుకు చంద్రబాబు పడిన తపన చేసిన కృషి ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన అధికారంలో లేరు. విపక్ష నేత. ప్రజలను ఆదుకునే విషయంలో  ఆయనకు రాజకీయాలతో పని లేదు. ప్రజల క్షేమమే ముఖ్యం. ఇక విశాఖను హుద్ హుద్ తుపాను అతలాకుతలం చేసిన సమయంలో కూడా రోజుల తరబడి విశాఖలోనే బస చేసి, విశాఖ కలెక్టరేట్ నే తన సెక్రటేరియెట్ గా మార్చుకుని బస్సులోనే విశ్రాంతి తీసుకుంటూ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించిన సంగతీ తెలిసిందే. ఇప్పుడు బెజవాడను కనీవినీ ఎరుగని వరద ముంచెత్తిన ఆపత్సమయంలోనూ చంద్రబాబు నిద్రాహారాలను పట్టించుకోకుండా బెజవాడలోనే మకాం వేసి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 1) అర్థరాత్రి నుంచీ ఆయన నిర్విరామంగా వరద బాధితులను ఆదుకోవడంలోనే నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ, కలెక్టరేట్ లో సమీక్షలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ అవిశ్రాంతంగా గడిపారు. సోమవారం (ఆగస్టు 2)న కూడా ఆయన అదే పని చేస్తూ గడిపారు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకూ ఆయన విజయవాడ కలెక్టరేట్ లోనే ఉండి  సహాయక చర్యలు, వరద నిర్వహణపై పర్యవేక్షించారు.  సీఎంతో పాటు  పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం పంపిణీ, అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలను జనాల తరలింపు తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించి పనులు జరిగేలా చూశారు. ముంపు ప్రాంతాల ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందేలా చూశారు. మరీ రిమోట్ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా అహార పదార్థాలు, మందులను అందించారు.  

సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎన్ఆర్ఐ రూ. కోటి విరాళం

ఆంధప్రదేశ్ లో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు ప్రాంతాల ప్రజల సహాయ పునరావాస కార్యక్రమాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. అందులో భాగంగా ఎన్ఆర్ఐ గుత్తికొండ శ్రీనివాస్ వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయానికి తన వంతుగా కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించి కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అందించారు.  వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురి చేశాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకునేందుకు విరాళం అందించానని గుత్తికొండ శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్విరామంగా కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చెక్కును అందుకున్న చంద్రబాబు    శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయాభివృద్ధికి రూ.18 కోట్లు అందజేశారని, ప్రస్తుత విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకుగాను శ్రీనివాస్ ను చంద్రబాబు  అభినందించారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... 5 నుంచి భారీ వర్షాలు 

తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. గత వంద సంవత్సరాలలో ఇంత భారీ వర్షాలు వచ్చిన సందర్బం లేదు. ఈ నెల 5న అంటే గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ వాసులను మరో మారు ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కృష్ణానది ఉప్పొంగింది. ప్రకాశం బ్యారేజిలో భారీ ప్రవాహం కొనసాగుతుంది. కృష్ణానది నీరు సముద్రంలో పూర్తిగా కలవడం లేదు. సోమవారం అమవాస్య కావడంతో సముద్ర కెరటాలు భారీగా రావడంతో సముద్రంలోకి నీరు చేరడం లేదు. ఈ కెరటాలవల్ల నీళ్లు కలవకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అమవాస్య రోజు సముద్రంలో అలజడి ఉంటుంది. ఈ అలజడి తీర ప్రాంతవాసులకు కునుకు లేకుండా చేసింది. మంగళవారం నుంచి కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రంలోకి ఇంకే అవకాశమున్నప్పటికీ గురువారం మరో అల్పపీడనం రానుందని వచ్చిన హెచ్చరికతో ఎపి వాసులను మరింత ఆందోళనకు గురి చేసింది. ఈ హెచ్చరిక ప్రభావం తెలంగాణలో కాస్త తక్కువే ఉంది. తెలంగాణలోని ఎనిమిదిజిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ఇప్పటికే  అధికారులను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సెలవు పెట్టరాదని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతి కుమారి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలని ఆమె ఆదేశించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మొత్తం 11 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ  అధికారులు తెలిపారు.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గోదవరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారుల హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసింది. సహాయక శిబిరాల వద్ద నిత్యావసర వస్తువులను నిల్వ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఈ సాయంత్రానికి 47 అడుగులకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ఖమ్మం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సమాయత్తమైంది.  మరో వైపు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం ఆందోళన చెందుతున్నారు.

ఎమ్మెల్యే యార్లగడ్డ.. ముంపు బాధితులకు అన్నదాత

ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌తంలో ఎప్పుడూలేని విధంగా విజ‌య‌వాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది.   విజ‌య‌వాడ న‌గ‌రంతోపాటు.. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాలు నీట మునిగాయి. స్థానికంగా కురుస్తున్న వ‌ర్షానికితోడు.. ఎగువ ప్రాంతాల నుంచి వ‌స్తున్న భారీ వ‌ర‌ద కార‌ణంగా బుడ‌మేరు, కృష్ణా న‌దులు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ వ‌ద‌ర నీటిలో మునిగిపోయాయి.. వ‌ర‌ద‌ల తీవ్ర‌త‌ను ముందే అంచ‌నా వేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప్రారంభించారు. ఆదివారం ఉద‌యం నుంచే ఆయ‌న స్వ‌యంగా రంగంలోకిదిగి విజ‌య‌వాడలోని వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. వ‌ర‌ద ముంపులో ఉన్న ప్ర‌తిఒక్క‌రికి ఆహారం, తాగునీరు అందేలా అధికారుల‌కు ఆదేశిస్తూ.. అవసరమైన చోట ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలని ఆదేశిం చడమే కాకుండా, వరద బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాలను క్షణం క్షణం పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా వ‌ర‌ద ముంపు  ప్రాంతాలలో బోటులో పర్యటించి మరీ  ముంపు బాధితుల‌కు చంద్ర‌బాబు ధైర్యం చెప్పారు. మ‌రోవైపు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర‌ద ముంపుకు గురైన గ్రామాల్లో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. మోకాళ్ల‌లోతుకుపైగా నీళ్ల‌లోనూ ముంపు ప్రాంతాల‌కు వెళ్లి మరీ బాధితుల‌కు ధైర్యాన్ని చెబుతూ వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.  ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలోని ముంపు గ్రామాలకు వెళ్లే దారిలో ఉన్న సింగ్ నగర్, గన్నవరం రూరల్ మండలం అంబాపురంలను వరదనీరు ముంచెత్తింది. మోకాళ్ల‌లోతుకుపైగా నీళ్ల‌లోనే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అంబాపురం గ్రామానికి చేరుకుని ప్ర‌జ‌ ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేశారు. ఓ అపార్మెంట్ మెుదటి అంతస్తు వరకూ వరదనీరు చేరిందంటే అక్క‌డ‌ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని వీధుల్లో భారీ వరదతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కారు. దీంతో వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు పడవలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలంటూ అధికారుల‌ను కోరారు. అయితే, వారి నుంచి స‌రియైన స‌మాధానం రాక‌పోవ‌టంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తెలుగుయువత అధ్యక్షుడు పరుచూరి నరేష్, తెలుగుయువత సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలతో  క‌లిసి ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ స్వ‌యంగా రంగంలోకి దిగారు. స్థానిక స‌ర్పంచ్ సీత‌య్య‌తో క‌లిసి ట్రాక్ట‌ర్ల స‌హాయంతో గ్రామంలోని సుమారు 500 మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వ‌యోవృద్ధుల‌ు, పేసెంట్లు ఉండ‌టంతో జేసీబీల స‌హాయంతో వారిని గ్రామం నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు స్థానికుల స‌హాయంతో ఎమ్మెల్యే తీవ్రంగా శ్ర‌మించారు. కానీ, వ‌ర‌ద ఉధృతి అంత‌కంత‌కు పెర‌గ‌డంతో జేసీపీ కూడా ముంపు గ్రామానికి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయినా కూడా వెనక్కు తగ్గకుండా ఓ పక్క ముంపు బాధితులకు భరోసా ఇస్తూనే మరో పక్క వారికి భోజన ఏర్పాట్లు చేశారు.   ఇప్పటి వరకూ దాదాపు 40 వేల మందికి పైగా అహారం అందించారు. ఆ కార్యక్రమం  నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వరద ముంపు నుంచి గ్రామాలు బయటపడి, వరద బాధితులు సాధారణ జీవనం గడిపే వరకూ  ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా, నిరంతరాయంగా కొనసాగిస్తామని యార్లగడ్డ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరు పట్ల తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో అలవాటైన జడత్వం నుంచి అధికారులు ఇంకా బయటకు రాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి బాధితులను పరామర్శించి, వారికి భరోసా కల్పించి అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తరువాత మాత్రమే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందనీ, ఇంకా కొందరు అధికారులు మాత్రం సహాయ పునరావాల కార్యక్రమాల విషయంలో నెమ్మదిగానే కదులుతున్నారని యార్లగడ్డ విమర్శించారు.   అంబాపురం గ్రామం 1వ వార్డులో రెండుమూడు రోడ్ల‌లో దాదాపు 14 నుంచి 15అడుగుల‌కు మించి ఎత్తులో వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హించింది. చాలామంది డాబాపైకి వెళ్లారు. ఎమ్మెల్యే, అధికారుల‌తోపాటు టీడీపీ శ్రేణులు వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.  గన్నవరం మండలం ముస్తాబాద్, సావరగూడెం గ్రామాలు జలమయం అయ్యాయి. ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ ఆయా గ్రామాల‌కు చేరుకొని వారికి ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందించ‌డంతోపాటు.. వారిని బోట్ల స‌హాయంతో స‌ర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేశారు. గ‌న్న‌వ‌రం మండ‌లంలోని గొల్ల‌న‌ప‌ల్లిలో చెరువులు ఉప్పొంగి ప్ర‌వ‌హించ‌డంతో వాహ‌న రాక‌పోక‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ‌ ఆయా ప్రాంతాల‌కు అతిక‌ష్టం మీద‌ చేరుకొని  అక్కడి బాధితులకు కూడా ఆహార ప్యాకెట్లు అందేలా చర్యలు తీసుకున్నారు.  గ‌న్న‌వ‌రం నియోక‌వ‌ర్గంలో వ‌ర‌ద ముంపు గ్రామాల్లోని ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ప్ర‌తీఒక్క‌రిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తామ‌ని, అన్నివిధాల ఆదుకుంటామ‌ని  భ‌రోసా ఇచ్చారు. శ‌నివారం (ఆగస్టు 31) సాయంత్రం నుంచి నిర్విరామంగా వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేలా ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు కృషి చేశారు. సోమ‌వారం బోట్లు, ఎన్డీఆర్ ఎప్ సిబ్బంది రంగంలోకి దిగ‌డంతో వారి స‌హాయంతో ముంపు ప్రాంత‌ల్లోని ప్ర‌జ‌ల‌ను ఎమ్మెల్యే ద‌గ్గ‌రుండి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. పున‌రావాస కేంద్రాల్లోని ప్ర‌జ‌ల‌కు భోజ‌న ఏర్పాట్లు చేయ‌డంతో పాటు.. వారికి స‌రియైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించేలా ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ కృషి చేశారు. యార్లగడ్డతో పాటు పరచూరి నరేష్, తెలుగుయువత, తెలుగుదేశం కార్యకర్తలు వరద బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

వరద బాధితులకు అండగా దివీస్..!

వరద ముప్పును ఎదుర్కొంటున్న విజయవాడ ప్రజలకు పలువురు అండగా నిలుస్తున్నారు. పలు సంస్థలు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. విజయవాడలోని అనేక కాలనీలలో ప్రజలు, పిల్లలు, వృద్దులు భోజన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు దివీస్ సంస్థ యాజమాన్యాన్ని కదిలించాయి. దివీస్ యాజమాన్యం వెంటనే స్పందించి ప్రతి రోజూ లక్షా 70 వేల మందికి పైగా ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, ఏ.పీ, అక్షయ పాత్ర అనుబంధ సంస్థ సహకారంతో అందజేస్తున్నామని దివీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ దివి తెలిపారు. వార్తల ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి ముంపు ప్రాంతవాసులకు ఆహారాన్ని అందించేందుకు సహకరిస్తున్న  దివీస్ యాజమాన్యాన్ని ప్రభుత్వ ప్రతినిధులు అభినందించారు.  

జగన్ బ్యాచ్ అధికారులకు బాబు క్లాస్!

విజయవాడ వరద ముంపు బాధితులను ఆదుకోవడానికి ఏడుపదుల వయసు దాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి పనిచేస్తుంటే, జగన్ బ్యాచ్ అధికారులు మాత్రం తూతూమంత్రంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విపత్తు సమయంలో కూడా రాజకీయాలను ప్రదర్శిస్తున్నారు. అలాంటి అధికారులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యల్లో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో వ్యవహరించినిన తరహా అలసత్వం వదిలించుకోకపోతే సహించేది లేదు అంటూ ఆయన జగన్ బ్యాచ్ అధికారులను హెచ్చరించారు. సహాయక చర్యల కోసం స్వయంగా తానే రంగంలోకి దిగినా అధికారులు మొద్దునిద్ర వీడకపోతే ఎలా అంటూ ఆగ్రహించారు. కావలసిన స్థాయిలో ఆహార పదార్థాలు  తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో కొందరు ఉన్నతాధికారుల కారణంగా ఆహారం పంపిణీలో జాప్యం జరిగిందని ఓ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జగన్ బ్యాచ్ అధికారులు విధులు నిర్వహించిన ప్రాంతాల్లో ఈ పరిస్థితి వుందని ఆయన చెప్పారు. ఆహార పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఆ అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నట్టు గుర్తించానని సదరు మంత్రి ముఖ్యమంత్రికి చెప్పారు. మంత్రి చెప్పిన అంశాన్ని తీవ్రంగా పరిణించిన చంద్రబాబు ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో జాప్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని.. ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పారు.

భారీ వర్షాల నుంచి తెలంగాణకు ఊరట 

తెలంగాణకు భారీ వర్షాల నుంచి ఊరట లభించింది మంగళవారం  నుంచి... తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు నుంచి రేపటి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈదురు గాలులు బలంగా వేయనున్నాయి.  తెలంగాణ ప్రాంతంలో అన్ని చెరువులు నిండిపోయాయి. వాగులు వంకలు ఉప్పొంగడంతో పలువురు మృత్యువాత పడటంతో సోమవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అయితే అనూహ్యంగా వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయని వెదర్ రిపోర్ట్ రావడం పట్ల  పలువురు హర్షం వెలిబుచ్చారు. 

మాజీ మంత్రి రోజా మారరా.. దేవుని స‌న్నిధిలో అదేం తీరు?!

ఏపీలో అధికారం కోల్పోయిన తరువాతకూడా వైసీపీ నేత‌ల ప్ర‌వ‌ర్త‌న కుక్క‌తోక వంక‌ర అనే చందంగానే ఉంది. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో జ‌గ‌న్, ఆయ‌న‌ బ్యాచ్ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని విధంగా ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న సాగించారు. దీంతో ప్ర‌జ‌లు వైసీపీకి ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌కుండా కేవ‌లం ప‌ద‌కొండు స్థానాల‌కే ప‌రిమితం చేశారు. ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌రువాత గ‌తంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్ పై బూతుల‌తో రెచ్చిపోయిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, ఆర్కే రోజాలు రాజ‌కీయాల్లో పూర్తిగా ఇన్ యాక్టివ్  అయ్యారు. వీరిలో రోజా వైసీపీని వీడుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీ రాజ‌కీయాల‌కు వీడ్కోలు ప‌లికి త‌మిళ రాజ‌కీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని వైసీపీ శ్రేణుల్లోనే విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. రోజా ఏపీ రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం పట్ల వైసీపీ శ్రేణుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది.  ఎందుకంటే.. వైసీపీ దారుణంగా ఓడిపోవ‌టానికి అధికారంలో ఉన్న స‌మ‌యంలో రోజా ప్ర‌వ‌ర్తించిన తీరుకూడా ఓ కార‌ణ‌మ‌ని ఆ పార్టీ శ్రేణులు ఆగ్ర‌హంతో ఉన్నారు. తాజాగా రోజా త‌మిళ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అంశంపై నోరు విప్పారు. తాను ఏపీ రాజ‌కీయాల్లోనే ఉంటాన‌ని, వైసీపీలోనే కొన‌సాగుతాన‌ని చెప్పారు. అయితే వైసీపీ శ్రేణులు మరీ ముఖ్యంగా నగరి నియోజకవర్గ పార్టీ వర్గాలు  రోజా వైసీపీని  వీడితేనే బెట‌ర్ అనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌రువాత రోజా మాట‌ తీరులో మార్పు వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఆమె మాట‌తీరులోనూ, ప్ర‌వ‌ర్త‌న‌లోనూ ఇసుమంతైనా మార్పు రాలేదు. ఏ రాజ‌కీయ పార్టీ నేత‌లైనా ఎన్నిక‌ల్లో ఓడిపోతే.. ఓటమికి కారణాలు సమీక్షించుకుంటారు. ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఓటమికి కారణాలు ఏమిటి?   ఏ మండ‌లంలో.. ఏ గ్రామంలో తనకు ఓట్లు త‌క్కువగా పోల‌య్యాయి. కార‌ణాలు ఏమిటి.. అనే విష‌యాల‌పై త‌మ అనుచ‌రుల‌తో స‌మావేశ‌మై స‌మీక్షించుకుంటారు. మ‌రోసారి అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ రాజ‌కీయాల్లో ముందుకెళ్తారు. కానీ  రోజా స్టైలే వేరు. వైసీపీ ఓటమిని ఈవీఎంలపై నెట్టేశారు. ఈ వీఎంల‌లో ఏదో మ‌త‌లబు జ‌రిగింది.. అందుకే వైసీపీ అభ్య‌ర్థులు ఓడిపోయార‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల్లో వైసీపీకి ఆద‌ర‌ణ ఉంది.. సునామీలా పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలకు కారణమేంటన్నది   త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తుందంటూ వ్యాఖ్యానించడం ద్వారా వైసీపీ ఓట‌మి ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుకాద‌నే అర్థం వ‌చ్చేలా రోజా మాట్లాడారు. అంటే.. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150కిపైగా సీట్లు వ‌చ్చినప్పుడు ఈవీఎంలు సూప‌ర్ అంటూ పేర్కొన్న‌ రోజాకు.. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటమికి మాత్రం ఈవీఎంలపై నెపం నెట్టేస్తున్నారు.  రోజా చేసిన ఈ వ్యాఖ్య‌ల పట్ల వైసీపీ శ్రేణుల‌కు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న‌ప్పుడు బూతుల‌తో పార్టీ ప‌రువు తీసిన రోజా.. ఎన్నిక‌లైన రెండు నెల‌ల త‌రువాత మీడియా ముందుకొచ్చి అడ్డ‌గోలుగా నోరు పారేసుకోవ‌టం ప‌ట్ల ఆ పార్టీ నేత‌లు తీవ్ర‌ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోఉన్న స‌మ‌యంలో నెల‌లో అనేక‌సార్లు మంత్రి హోదాలో రోజా తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వెళ్లేవారు. వెళ్తూవెళ్తూ ఆమెతో పాటు అనేక‌ మందిని వెంట‌పెట్టుకొని వెళ్లేవారు. ఈ క్ర‌మంలో ఆమె తిరుమ‌ల టికెట్లు అమ్ముకొని పెద్ద‌మొత్తంలో అవినీతికి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆమె తిరుప‌తి వెళ్లిన స‌మ‌యంలో తిరుమ‌ల కొండ‌పైనే అస‌త్యాలు, త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసేవారు. అప్ప‌ట్లో రోజా తీరు ప‌ట్ల వైసీపీ నేత‌లు సైతం అభ్యంత‌రం తెలిపారు. కానీ, వైఎస్ జ‌గ‌న్ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉండ‌టంతో రోజా తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోయారు. అయితే  ఇటీవ‌ల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత తొలిసారి శ‌నివారం రోజా తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనానికి వెళ్లారు. కొండ‌పైనే రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేశారు. ఆమె ఏమైనా నిజాలు చెప్పారా అంటే.. దేవున్ని ద‌ర్శించుకొనివ‌చ్చి కొండ‌పైనే ప‌చ్చిఅబ‌ద్దాలు చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నేరాలు పెరిగాయి.. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు, హ‌త్య‌లు పెరిగాయంటూ కూట‌మి ప్ర‌భ‌త్వంపై విషం క‌క్కారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండునెల‌లే అయ్యింది. వైసీపీ  గ‌త ఐదేళ్ల  వైసీపీ  అరాచ‌క పాల‌న‌తో అస్త‌వ్య‌స్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయి. కానీ, రోజా మాత్రం.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఆడ పిల్ల‌లు సేఫ్ గా ఉన్నారు.. కూట‌మి హ‌యాంలో ఆడ‌వాళ్లు బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డుతున్నార‌ని తిరుమలేశుని సాక్షిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో గుడ్ల‌వల్లేరు ఇంజ‌నీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఘ‌ట‌నపైనా రోజా మాట్లాడారు. వైసీపీ హ‌యాంలో వేలాది మంది మ‌హిళ‌లు మిస్సింగ్ అయ్యారు. అనేక మందిపై అఘాయిత్యాలు, హ‌త్య‌లు జ‌రిగాయి. కానీ, రోజా మాత్రం జ‌గ‌న్ హ‌యాంలో ఒక్క మ‌హిళ‌పైనా దాడి జ‌ర‌గ‌లేదు.. రెండు నెల‌ల్లోనే ఏపీలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు, హ‌త్యా ఘ‌ట‌న‌లు పెరిగాయంటూ  తిరుమ‌ల కొండ‌పైనే అబ‌ద్దాలు చెప్ప‌డం చూసి వైసీపీ శ్రేణులుసైతం ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. వాస్త‌వానికి వైసీపీ ఐదేళ్ల హ‌యాంలో నేరాల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. నేష‌న‌ల్ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదికను ప‌రిశీలిస్తే..  వైసీపీ హ‌యాంలో అబ‌ల‌ల‌పై రోజుకు 49 అఘాయిత్యాలు చొప్పున జ‌రిగాయి.  2021లో 17,752 నేరాలు జ‌రిగాయి. ఇందులో 1,204 మంది మ‌హిళ‌పై అత్యాచారం జ‌ర‌గ్గా.. వారిలో 614 మంది బాలిక‌లే. వైసీపీలో అధికారంలో ఉన్న‌న్ని రోజులు క్రైం రేటు ఎక్కువ‌గానే ఉంది. కానీ, రోజా మాత్రం దిశా యాప్ తో మహిళల జోలికివచ్చేవారిలో భయం పుట్టించామంటూ తిరుమ‌ల కొండ‌పైనే  సినిమా డైలాగ్ తరహాలో చెప్పారు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో త‌న తీరుతో ప్ర‌జ‌ల్లో వైసీపీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చిన రోజా.. మ‌ళ్లీ ఏపీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అవుతుండ‌టంతో వైసీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నారట. వైసీపీని, ఏపీ రాజ‌కీయాల‌ను వీడి రోజా త‌మిళ రాజ‌కీయాల్లోకి వెళ్తే బాగుంటుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతుంది. ఒకవేళ వైసీపీలో ఉన్నా.. ఆమె నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేలా వైసీపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని, లేకుంటే ప్రజల్లో పార్టీపై ఉన్న కాస్త ఆదరణ కూడా పోతుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద తిరుమలేశుని కొండపై ఆమె అవాస్తవాలు నిస్సంకోచంగా, నిర్భయంగా మాట్లాడేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘోర పరాజయం తరువాత కూడా ఆమె తీరు ఇసుమంతైనా మారలేదని పరిశీలకులు అంటున్నారు. గత రెండు నెలలుగా పూర్తి స్థాయిగా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్న రోజా ఇప్పుడు మళ్లీ ఇలా ఎంట్రీ ఇచ్చి గతంలోలా రెచ్చపోవడానికి కారణం ఆమె తమిళనాట పొలిటికల్ ఎంట్రీకి ద్వారాలు మూసుకుపోవడమే కారణమని అంటున్నారు. దాంతో రోజా అనివార్యంగా ఏపీ పాలిటిక్స్ లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడటమే కాక, వైసీపీ వినా  మరో పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేకపోవడంతో  రోజా వైసీపీని పట్టుకు వెళాడక తప్పడం లేదని చెబుతున్నారు. 

వరదల్లో  చనిపోయిన వారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా: రేవంత్ రెడ్డి 

తెలంగాణలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్ష సూచన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ అప్రమత్తం చేసుకోవాలని రేవంత్ సూచన చేశారు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరద పోటెత్తింది. అనేక మంది మృత్యువాతపడ్డారు. వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రాన్ని సాయం కోరాలని రేవంత్  అధికారులను ఆదేశించారు. జరిగిన నస్టంపై అంచనా వేసి నివేదిక ఇవ్వాలని రేవంత్ సిఎం అధికారులకు హుకుం జారీ చేశారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వ‌ర‌ద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

అంతకంతకూ పెరుగుతున్న నీటిమట్టం!

కృష్ణా నది వరద గంటగంటకూ పెరుగుతోంది. 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద. 1903లో, 2009లో వరద నీరు పది లక్షల క్యూసెక్కులు దాటాయి. ఇప్పుడు ఏకంగా  11 లక్షల క్యుసెక్కులు దాటేసింది. ఇంకో 30, 40 వేల క్యూసెక్కుల వరద నీరు అదనంగా వస్తే  ప్రకాశం బ్యారేజ్‌పై నుంచి వరద నీరు వెళుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.38 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద 24.3 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. 

కూల్చివేతలకు ఇక హైడ్రా విరామం

గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలను నేలకూలుస్తున్న హైడ్రా స్పీడ్ తగ్గించింది. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అనతికాలంలో ప్రజాభిమానాన్ని చూరగొంది. కాంగ్రెస్ కు బద్ద శత్రువైన  బిజెపి కూడా హైడ్రా కూల్చివేతలకు సంఘీభావం తెలిపింది. పేద, బడుగు ప్రజల ఇళ్లను కూల్చొద్దని ఒక స్టేట్ మెంట్ తప్పితే పెద్దగా ప్రతిఘటించిన సందర్భం లేనే లేదు.  హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలను తొలగించే సాహసాన్ని ప్రజలు కీర్తించారు.  మజ్లిస్ పార్టీకి చెందిన ఫాతిమా కాలేజి కూల్చివేతకు ‘హైడ్రా’ రంగం సిద్దం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రేవంత్ సర్కార్ వెనకడుగు వేసింది. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉంటే కాలేజి యాజమాన్యాలే  కూల్చివేయాలని  హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.  ప్రస్తుతం కూల్చివేతలను  హైడ్రా పూర్తిగా ఆపింది. ఇప్పటికే పలు అక్రమ కట్టడాలను గుర్తించినప్పటికీ వాటిని తొలగించే పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునగడం వల్ల ప్రజల సహాయక చర్యల కోసం  వేచి చూస్తున్నారు.  వర్షాలు తగ్గుముఖం పడితే హైడ్రా పనులు పునరుద్దరణ జరుగుతాయి. ముంపు ప్రాంతాలను రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లలోని అక్రమ కట్టడాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని రంగనాథ్  హెచ్చరించారు. 

విజయవాడకు చేరుకున్న ఎన్.డి.ఆర్.ఎఫ్..!

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్.డి.ఆర్.ఎఫ్. (విపత్తుల నిర్వహణ సంస్థ) టీమ్స్ విజయవాడకు చేరుకున్నాయి. పంజాబ్ నుంచి 4, తమిళనాడు నుంచి 3, ఒడిశా నుంచి 3 ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు విజయవాడకు సోమవారం ఉదయానికి చేరుకున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో సహా ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు వచ్చాయి. ఇప్పటికే 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. హెలికాప్టర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మధ్యాహ్నం లోపు మరో 4 హెలికాప్టర్లు విజయవాడకు వస్తాయి. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని ఎన్.డి.ఆర్.ఎఫ్. మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్.కి దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.

ప్రకాశం బ్యారేజీకి స్వల్ప డ్యామేజీ.. కోట్టుకు వచ్చిన బోట్ల వెనుక కుట్ర కోణం!?

కృష్ణా నదికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వరద వచ్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. అధికారులు అనుక్షణం నీటి ప్రవాహాన్ని గమనిస్తూ, గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎగువ నుంచి ఇసుక బోటు వచ్చి 60వ గేటును ఢీకొంది. దీంతో స్వల్పంగా డ్యామేజీ జరిగింది. వరద ఉధృతి తీవ్రంగా ఉన్న సమయంలో బోటు ఎలా వచ్చిందని అధికారులు పరిశీలిస్తుండగానే మరో నాలుగు బోట్లు కొట్టుకు రావడంతో దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.    ఇవి ప్రమాదవశాత్తూ కొట్టుకువచ్చాయా లేక ఎవరైనా కావాలని బోట్లను వదిలారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో   చంద్రబాబు నివాసానికి ముప్పు వాటిల్లే విధంగా   బోటు అడ్డుతగిలిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం నీటి ప్రవాహాన్ని పెంచేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలను ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.   అధికారులు సైతం  బోట్లు కొట్టుకురావడం వెనక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న చంద్రబాబును విలేకరులు అడిగితే.. అవన్నీ తరువాత ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడను, ముందు బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలి.  అని సమాధానం ఇచ్చారు. ఇలా ఉండగా బోట్లు కొట్టుకు వచ్చిన సంఘటనపై  ఇరిగేషన్, రివర్ కన్జర్వేటివ్ శాఖల అధికారులు విచారణ జరుపుతున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా వరద వచ్చింది. ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో  వరద తగ్గుముఖం పట్టే వరకూ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను నిలిపివేయాలని  అధికారులు నిర్ణయించారు. కనీ వినీ ఎరగని స్థాయిలో కృష్ణానది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది.  చరిత్రలోనే తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి బ్యారేజీకి 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద వచ్చింది. గతంలో  1903వ సంవత్సరంలో 10.60 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత 2009 అక్టోబర్ లో 10.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ రికార్డులన్నిటినీ తిరగరాస్తూ  11.20 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని అధికారులు వివరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 23.6 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఇది ఇంకా పెరిగితే బ్యారేజీ పై నుంచి వరద పారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ కారణంగా బ్యారేజీపై నుంచి రాకపోకలు నిలిపివేసే యోచన చేశారు.  ఇప్పటికే బ్యారేజీ దిగువన పలు గ్రామాలు నీటమునిగాయి. గేట్లను పూర్తిగా పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

విజయవాడలో సహాయ, పునరావాల కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులు

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న విజయవాడలో వరద బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో బాధితులకు అందుబాటులో ఉంటారు.  బాధితులకు అందించే సహాయ, పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు. ఆయా ప్రాంతాలలో వరద సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించే అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవే.  ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822 2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153 3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124 4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481 5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941 6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078 7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180 8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739 9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069 10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539 11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088 12. దేవినగర్ - కే.ప్రియాంక 8500500270 13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125 విజయవాడ పశ్చిమ 14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026 15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067 16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645 17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260 విజయవాడ తూర్పు 18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163 19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772 20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148 21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677 22. కృష్ణలంక - పీఎం సుభాని 7995087045 23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959 విజయవాడ రూరల్ 24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852 25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859 26. జక్కంపూడి - నాగమల్లిక 9966661246 27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399 28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595 29. అంబాపురం- బి. నాగరాజు 8333991210