నందిగం సురేష్ దగ్గరకి జగన్ ఎందుకు వెళ్తున్నట్టో...?!

వైసీపీ నాయకుడు జగన్ ప్రస్తుత రొటీన్ ఏంటంటే... తాడేపల్లి, బెంగళూరు, లండన్ మధ్య ఆసులో కండెలాగా తిరగడం... రాజకీయాలు చేయడానికి శవాల కోసం అన్వేషించడం... కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా విషం కక్కాలా అని ఆలోచించడం, జైల్లో పడుతున్న తన పార్టీ నాయకులను పరామర్శించి, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మీద నోరు పారేసుకోవడం... ఇదీ ఆయన టైమ్ ‌టేబుల్. ఈ టైమ్‌ టేబుల్‌లో భాగంగానే జగన్ బుధవారం నాడు గుంటూరు జైలుకు వెళ్ళనున్నారన్న వార్తలు వస్తున్నాయి. 2021లో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా వున్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. ఆటలో అరటిపండు, పాటలో పనసపండు లాంటి అవుతు శ్రీనివాసరెడ్డిని పక్కన పెడితే, జగన్ ఇప్పుడు గుంటూరు జైలుకు ముఖ్యంగా వెళ్తున్నది నందిగం సురేష్‌ని పరామర్శించడానికి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, నిజానికి జగన్ గుంటూరు జైలుకు వెళ్తున్నది, నందిగం సురేష్‌తో మిలాఖత్ అవుతున్నది ఆయన్ని పరామర్శించడానికా? లేక తనతో మిలాఖత్ అయి చేసిన ఘోరమైన నేరం విషయంలో తన పేరు బయట పెట్టొద్దని బెదిరించడానికా? ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అధికారంలో వున్నంతకాలం జగన్ తన విధ్వంస కార్యకలాపాలను నిర్వహించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలను దారుణంగా వాడేశారు. వాళ్ళని వీధి రౌడీలకంటే కింద స్థాయికి దిగజార్చేసి, తెలుగుదేశం నాయకులను దుర్భాషలాడటానికి, దాడులు చేయడానికి ఉపయోగించారు. అందులో భాగంగానే నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. రాజకీయంగా ఏ స్థాయీ లేని తనను ఎంపీ చేసిన జగన్ అంటే నందిగం సురేష్‌కి చెప్పలేనంత అభిమానం. అందుకే జగన్ చూసిరమ్మంటే కాల్చి వచ్చేస్తూ వుంటారు. అధికారంలో వున్నప్పుడు ఇలాంటి పనులు ఎన్నో చేసిన నందిగం సురేష్, అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ చెప్పినట్టే చేశారు. అదేంటో తెలుసా? కృష్ణా బ్యారేజ్‌ ధ్వసం అయ్యే విధంగా బోట్లను వదలటం.  ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రకాశం బ్యారేజ్‌ని బోట్లు ఢీకొనడం వెనుక జగన్ హస్తం వుంది. జగన్ ఆదేశించారు. వైసీపీ నాయకులు ఆచరించారు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి బోట్లను అడ్డంగా పెట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చాలని సజ్జలకు జగన్ చెప్పారు. అదే విషయాన్ని నందిగం సురేష్, తలశిల రఘురాంలకు సజ్జల వాట్సాప్ కాల్ ద్వారా చెప్పారు. వరద నీటిలో బోట్లను వదిలిన అనంతరం పని అయిపోయిందని సజ్జలకి తలశిల రఘురాం, నందిగం సురేష్ వివరించారు. కాబట్టి, ప్రకాశం బ్యారేజ్‌ని ధ్వంసం చేయడం ద్వారా లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసే కుట్ర జగన్ దగ్గర ప్రారంభమైంది. సజ్జల, నందిగం సురేష్, తలశిల రఘురాం తదితరుల ద్వారా అమల్లోకి వచ్చింది. కొండపైన కొలువుండి అంతా చూస్తు్న్న కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఈ ఘోరం జరగక్కుండా ఆగింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో వున్న నందిగం సురేష్ చాలా డిప్రెషన్లో వున్నట్టు తెలుస్తోంది. అట్టడుగు స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి.. ఇప్పుడు ‘ఎస్ బాస్’ అంటూ ఏ అడ్డమైన పని చెప్పినా చేసే ఒక కిరాయి రౌడీ స్థాయికి దిగజారి జైల్లో పడ్డానే అన్న బాధలో ఆయన వున్నట్టు తెలుస్తోంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్టు సమాచారం. ఇలాంటి మానసిక పరిస్థితిలో ఆయన ఇక ఇలాంటి జీవితం వద్దు అనుకుని మారిపోతే పరిస్థితి ఏమిటి? అప్రూవర్‌గా మారిపోయి తనతో ఈ నేరాలన్నీ చేయించింది జగన్ అనే విషయాన్ని స్పష్టంగా చెబితే ఏమవుతుంది? ఇంకేమవుతుంది? జగన్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఈ ప్రమాదాన్ని ఊహించిన జగన్ ప్రకాశం బ్యారేజ్ ఘటన వెనుక వున్నది నందిగం సురేష్ హస్తం అనే విషయం బయటపడుతూ వుండగానే, అప్పటి వరకు లేని గుంటూరు జైలుకు వెళ్ళి నందిగం సురేష్‌ని పరామర్శించే ప్రోగ్రామ్‌ని సడెన్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు జగన్ గుంటూరు జైలుకు వెళ్తున్నది నందిగం సురేష్‌తో మిలాఖత్ అయి పరామర్శించడానికి కాదు... ప్రకాశం బ్యారేజ్ బోట్ల ప్రమాదం విషయంలో తనతో నందిగం సురేష్ మిలాఖత్ అయిన విషయం బయటపెట్టొద్దని బెదిరించడానికే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

దివ్వెల మాధురి దువ్వాడ ఇంటికి..! వైసీపీ లీడర్ల ప్రేమకథ కంచికి..!?

ఒకపక్క ఆ పుణ్యపురుషుడు దువ్వాడ శ్రీనివాస్... మరోపక్క దగాపడ్డ వీరనారీ దువ్వాడ వాణి... వీళ్ళిద్దరి మధ్య మహిళా శిరోమణి దివ్వెల మాధురి... ఈ వైసీపీ లీడర్ల డైలీ సీరియల్ కథ ఇప్పటికైనా కంచికి చేరినట్టేనా? ఇంకా మిగిలే వుందా? దువ్వాడ శ్రీనివాస్ వుంటున్న ఇల్లు మాకు ఇవ్వాల్సిందే అంటూ ఒకవైపు దువ్వాడ వాణి.. నా అడల్ట్రీ దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఇల్లు ఆల్రెడీ దువ్వాడ వాణికి ఇచ్చేశాడు.. ఈ చిన్నిల్లు  మాత్రం నా సొంతం అంటూ దివ్వెల మాధురి ఇంతకాలం రోడ్డు మీద పడ్డారు. ఒకరినొకరు తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టుపొట్టు తిట్టుకున్నారు. వీళ్ళ తిట్లు వినే అదృష్టం మాత్రమే  తెలుగువాళ్ళకి దక్కిందిగానీ, ఈ వీర నారిమణులిద్దరూ ఒకరికొకరు ఎదురై జుట్టూ జుట్టూ పట్టుకుని... డిష్యూం.. డిష్యూం అని తన్నుకునే సీన్ చూసే అదృష్టం మాత్రం కలగలేదు. వీళ్ళిద్దరి పరిస్థితి ఇలా వుంటే,  వీళ్ళిద్దరి మధ్యలో ఆయనకిద్దరు తరహాలో ఆడకత్తెర మధ్య పోకచెక్కలా నలిగిపోయాడు దువ్వాడ శ్రీనివాస్. ఆయన కూడా మధ్యమధ్యలో మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నాడు... కష్టాలు చెప్పుకున్నాడు.  లబోదిబోమన్నాడు. ఈయన ఒకవైపు లబోదిబో అంటుంటే, మరోవైపు దువ్వాడ వాణి కూడా మీడియా ముందుకు వచ్చి కారాలూ మిరియాలూ నూరింది. వీళ్ళిద్దరి సీరియస్ మేటర్స్ మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్‌లాగా దివ్వెల మాధురి డాన్సింగ్ రీల్స్, యాక్సిడెంట్ డ్రామాస్, లీకేజ్ ఫోన్ కాల్స్.తో ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ఇన్ని రకాలుగా ఈ ముగ్గురూ చాలా రోజుల నుంచి తెలుగు ప్రజల బుర్రలు హీటెక్కించేశారు. వీళ్ళ డైలీ సీరియల్ చూస్తున్న ఆడ లేడీసు ఇళ్ళలో టీవీ సీరియల్స్ చూడ్డం మానేశారు. డైలీ సీరియల్స్.కి మించిన ఎమోషన్స్.తో ట్విస్టులతో, ఎఫెక్టులతో సాగిన దువ్వాడ వారి దువ్వెన గారి బాగోతం వ్యవహారం చూస్తూ బుర్రలు ఖరాబు చేసుకున్నారు. మొత్తానికి దివ్వెల మాధురి మాస్టర్ ప్లాన్ వేసి దువ్వాడ శ్రీనివాస్  ఇంటిని పాత బాకీ కింద తన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏ ఇల్లూ లేని దువ్వాడ శ్రీనివాస్ ఆ చిన్న ఇంట్లోనే ఆశ్రయం పొందుతున్నాడు. ఇక దువ్వాడ వాణి తన పెద్ద ఇంట్లో వుండటమే తప్ప ఈ చిన్న ఇంటికి వచ్చి హడావిడి చేయడానికి అవకాశం లేదు. ఇంతకాలం ఆ ఇల్లు దువ్వాడ శ్రీనివా‌స్‌ది కాబట్టి దువ్వాడ వాణి వచ్చి నానా రచ్చా చేసేది. ఇప్పుడు ఆ ఇల్లు చట్టప్రకారం దివ్వెల మాధురిది కాబట్టి ఇక దువ్వాడ వాణికి ఈ ఇంటి దగ్గరకి వచ్చి సీన్ క్రియేట్ చేసే సీన్ లేకుండా పోయింది. అందుచేత ఇకనైనా ఈ ముగ్గురూ రోడ్డుమీద పడి రచ్చ చేయకుండా ఎవరి కొంపలో వాళ్ళు వుంటే వాళ్ళకీ మంచిది.. తెలుగు డైలీ సీరియళ్ళకీ మంచింది. ఇలాంటి రచ్చలు ఎన్ని చేసినా ఆ జగన్ ఏమీ పట్టించుకోడు కాబట్టి వీళ్ళిలా ఇంతకాలం వీరంగం ఆడారు. ఇక ఇంతకుమించి వీరంగం ఆడారంటే వీళ్ళని జనమే తరిమి కొడతారు. ఎలా ఏడుస్తారో ఏమోగానీ, మీమీ కొంపల్లో మీ ఏడుపేదో మీరు ఏడవండి. రోడ్డుకి, మీడియాకి ఎక్కి న్యూసెన్స్ చేయకండి. ఏంటీ... అర్థమవుతోందా?

‘తూర్పు’ తిరిగి దణ్ణం పెడుతున్న కూటమి బంధం?

కూటమి బంధం సడలుతోందా? ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ, జనసేన శ్రేణుల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా రగులుతున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తే ఔననే సమాధానమే చెప్పాలి. అసలీ విభేదాలకు బీజం గత ఏడాది ఫిబ్రవరిలోనే పడిందని చెప్పాలి. గత ఏడాది ఫిబ్రవరి 17న చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా అనపర్తి వెడుతుండగా, అప్పటి సబ్ ఇన్ స్పెక్టర్ వాసు ఆధ్వర్యంలో  పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. అవరోధాలు కల్పించారు. వాహనాలను నిలిపివేశారు. దీంతో చంద్రబాబు చిమ్మ చీకట్లో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచి మరీ అనపర్తి చేరుకున్నారు.  అప్పట్లో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా  రామచంద్రపురం ఎస్ఐగా వాసును కొనసాగించడం పట్ల అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాసును ఎస్ఐగా కొనసాగించే విషయంలో  మంత్రి  వాసంశెట్టి సుభాష్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేంటంటే.. అప్పట్లో నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి తెలుగుదేశం ఇన్ చార్జిగా ఉన్నారు. ప్రస్తుత మంత్రి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ వైసీపీలో ఉన్నారు.  ఎన్నికల సమయంలో పొత్తులలో భాగంగా అనపర్తి నియోజకవర్గం బీజేపీకి కేటాయించడంతో చంద్రబాబు సూచన మేరకు నల్లమల్ల రామక‌ృష్ణారెడ్డి  బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వాసంశెట్టి సుభాష్ వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరి రామచంద్రాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి అయ్యారు.  ఇప్పుడు ఎస్ ఐ వాసును రామచంద్రాపురంలో కొనసాగించడంపై నల్లమల్లి, వాసంశెట్టి మధ్య విభేదాలకు కారణమైంది.  రామచంద్రాపురం ఎస్ఐగా నాడు చంద్రబాబును అడ్డుకున్న వాసును కొనసాగించడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు పోన్ ద్వారా తెలియజేసినా ఫలితం లేకపోవడంతో  నల్లమల్లి విషయాన్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లడానికి సిద్ధమౌతున్నారు. విశేషమేమిటంటే ఈ విషయంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం నల్లమల్లికి మద్దతుగా నిలుస్తున్నారు.  మొత్తం మీద ఒక ఎస్ఐ  విషయంలో తెలుగుదేశం మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటువంటి వాతావరణం తూర్పు గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉందని అంటున్నారు. 

హుస్సేన్ సాగర్ లోనే గణేష్ నిమజ్జనం

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి లైన్ క్లియర్ అయ్యింది. 2012లో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు యధావిధిగా హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. చివరి నిముషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం సరికాదని పేర్కొంది. దీంతో పోలీసులు హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు నిషేధం అంటూ పెట్టిన బోర్డులు తొలగిస్తున్నారు. 2021 లో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఎకో ఫ్రెండ్లీ అంటే మట్టి గణేష్ ప్రతిమలను మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని, మిగిలిన పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే కృత్రిమ నీటి కుంటలోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు ధిక్కరణ పిటిషన్ ను చివరి నిముషంలో దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పోలీసుల తీరుపై అనుమానం, అసహనం!?

జగన్ హయాంలో ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగింది. జగన్ సహా ఆయన కేబినెట్ మంత్రులు, వైసీపీ నేతలు, శ్రేణులూ కూడా యథాశక్తి చెలరేగిపోయారు. ఇష్టారీతిగా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అదేమని ప్రశ్నించిన వారిని నానా రకాలుగా హింసించారు. అక్రమ కేసులు బనాయించారు. పోలీసు శాఖను వైసీపీ అసోసియేట్ గా మార్చేసుకుని దాడులు తాము చేసి బాధితులపై కేసులు నమోదు చేయించారు. అక్రమ అరెస్టులతో భయానక వాతావరణం సృష్టించారు.  సరే జగన్ అరాచకపాలనకు జనం తమ ఓటుతో చరమగీతం పాడారు. తెలుగుదేశం కూటమి సర్కార్ ఇప్పుడు అధికారంలో ఉంది. వైసీపీ గతంలో పాల్పడిన అక్రమాలు, అన్యాయాలు, దాడులు, హింసాకాండలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలూ దేవాలయంగా భావించే పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులో ప్రధాన నిందితులు ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందగం సురేష్, విజయవాడ వైసీపీ కోఆర్డినేటర్ దేవినేని అవినాష్ ముందస్తు బెయిలు కోసం ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో వారి అరెస్టు అనివార్యమని అంతా భావించారు. కానీ పోలీసులు మాత్రం వారిలో మాజీ ఎంపీ నందిగం సురేష్ వినా మిగిలిన వారిని పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. వారంతా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ లోగా ఈ కేసులో అరెస్టును తప్పించుకుని తిరుగుతున్న వారిలో దేవినేని అవినాష్ ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఒక వేళ సుప్రం కోర్టులో ఆయనకు బెయిలు లభిస్తే.. ఈ కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న వారంతా ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టుకు వెళతారు. వారికీ యాంటిసిపేటరీ బెయిలు లభిస్తే లభించవచ్చు. ముందస్తు బెయిలు ఊరటే కానీ, వారిని కేసుల నుంచి విముక్తి చేయదు.  కానీ హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడమే కాకుండా సుప్రీం ను ఆశ్రయిస్తామనీ అంత వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న నిందితుల వినతిని కూడా కోర్టు తోసి పుచ్చి రోజులు గడుస్తున్నా పోలీసులు పరారీలో ఉన్నవారి ఆచూకీ కూడా కనిపెట్టలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తెలుగుదేశం శ్రేణుల్లో అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కొందరు పోలీసులు ఇప్పటికీ వైసీపీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ నేతలను కాపాడుతున్నరన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

హీరో రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు

హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన  బంగారం  రాజ్ తరుణ్ దొంగతనం చేసినట్లు  లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన  వాటిలో మంగళసూత్రం, బంగారం ఉన్నట్లు నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. తాను కొనుగోలు చేసిన జ్యువలరీ షాపు బిల్లులను లావణ్య పోలీసులకు సమర్పించారు.  బీరువాలో దాచుకున్న బంగారం రాజ్ తరుణ్ దొంగతనం చేసినట్లు లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగారం విలువ 12 లక్షల రూపాయలు ఉంటుందని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య గతంలో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజ్ తరుణ్ హైకోర్టును కోరారు.  హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది.ఈ కేసు కొనసాగుతుండగానే రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు నమోదు కావడం  చర్చనీయాంశమైంది.   

అడ్డెడ్డే... ఇది పెద్ద కష్టమే!

మిగతా విషయాల్లో ఏమోగానీ, ఒక విషయంలో మాత్రం మన ఇండియాని తలదన్నే దేశం ప్రపంచంలోనే లేదు. ఆ ఒక్క విషయంలో మాత్రం మన ఇండియన్స్ ఉద్ధండపిండాలే! ఇంతకీ ఆ ఒక్క విషయం ఏంటా అని ఆలోచనలో పడి, ఎక్కడకెక్కడికో వెళ్ళిపోయి, ఏదేదో ఊహించుకోకండి. ఎక్కువ సస్పెన్స్ లేకుండా  అదేంటో నేనే చెప్పేస్తా. అదేనండీ.. పిల్లల్ని కనడం. అవునండీ బాబు.. పిల్లల్ని కనే విషయంలో మన ఇండియన్ల తర్వాతే ఎవరైనా! దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నట్టుగా... మనం మన గురజాడ గారి అడుగుజాడల్లో నడుస్తూ మన దేశాన్ని జనాభాలో నంబర్‌వన్ దేశంగా నిలిపాం. రాబోయే రోజుల్లో ఏ దేశమూ మనకు పోటీగా నిలవకుండా వుండాలని ‘ఆ’ కృషిని నిరంతరం కొనసాగిస్తున్నాం. మన పరిస్థితి ఇలా వుంటే ఆ రష్యా పరిస్థితి మరోలా వుంది. గత కొద్ది సంవత్సరాలుగా రష్యాలో పుట్టే పిల్లల సంఖ్య దారుణంగా పడిపోయిందట. వయసు పైబడినవారు టపా కట్టేస్తున్న సంఖ్య మాత్రం పెరుగుతూనే వుందిగానీ, పుట్టేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా వుంది. ఇలా అయితే రష్యాలో జనాభా భారీ స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం వుందని ఆ దేశంవాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు.  ఈ ఏడాది జూన్ వరకు రష్యాలో ఐదు లక్షల 99 వేల 6 వందల మంది పిల్లలు పుట్టారు. ఇది గత ఏడాదితో పుట్టిన పిల్లల సంఖ్యతో పోలిస్తే 16 వేలు తక్కువ. పుట్టేవాళ్ళ నంబర్ ఇలా తగ్గిపోతే, పోయేవాళ్ళ నంబర్ మాత్రం పెరిగిపోయింది. ఈ ఏడాదిలో జూన్ వరకు చూస్తే, 3 లక్షల 25 వేల వందమంది చనిపోయారు. గత ఏడాది పోయినవాళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇది 49 వేలు ఎక్కువ. అంటే ఏంటి? అప్‌లోడ్ ఎక్కువైపోయింది. డౌన్‌లోడ్ తక్కువైపోయింది. అంతేకాకుండా, పిల్లల్ని కనడంలో తమవంతు కృషి చేయాల్సిన రష్యన్ యూత్‌లో 15 వేలమంది ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో చనిపోయారు. రష్యాలో జనాభా సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే గుడ్డిలో మెల్లలాగా ఈ మధ్యకాలంలో రష్యాకి వలస వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. దాంతో జనాభా సంఖ్య ప్రాబ్లం కొద్దిగా కవర్ అవుతోంది. అయినా సరే, జనాభాని ఇలా పెంచడం కాదు.. మనమే కష్టపడి పెంచాలని రష్యావాళ్ళు అనుకుంటున్నారు. దీనికోసం ‘ప్రత్యేక జనాభా ఆపరేషన్’ అనే కార్యక్రమాన్ని రష్యా ప్రభుత్వం చేపట్టింది. అదేంటీ... పిల్లల్ని తగ్గించడానికి ఆపరేషన్లు చేస్తారు కదా అనుకుంటున్నారు కదా? ఇది మీరు అనుకుంటున్న ఆపరేషన్ కాదు... జననాల సంఖ్య పెంచడానికి రష్యా ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకం. ఈ పథకం ప్రకారం రష్యాలో ఏ మహిళ అయినా పది లేదా అంతకంటే ఎక్కువ పిల్లల్ని కంటే ఆ మహిళకు మిలియన్ రూబెల్స్.. అంటే మన ఇండియా కరెన్సీలో 13 లక్షల రూపాయలు ఇస్తారట. కాకపోతే దీనికి ఒక కండీషన్ కూడా వుంది. అదేంటంటే, ఆ మహిళ మినిమమ్ పదిమంది పిల్లల్ని కనాలి. పదో బిడ్డ మొదటి పుట్టినరోజున ఈ డబ్బు రష్యా ప్రభుత్వం ఆ తల్లికి ఇస్తుంది. దీని వెనుక ఇంకో తిరకాసు కూడా వుందండోయ్... పదో బిడ్డ పుట్టినరోజు జరుపుకునే రోజు నాటికి ఆ పది పిల్లల పిల్లి.. సారీ.. పది పిల్లల తల్లి తాలూకు మిగతా తొమ్మిది మంది పిల్లలు జీవించే వుండాలి. అదీ విషయం. ఇలా వరసబెట్టి పది పిల్లల్ని కనేసి క్యాష్ ప్రైజ్ తీసుకోవాలని చాలామంది రష్యన్ లేడీస్‌కి వున్నప్పటికీ, ఈ కండీషన్ల కారణంగా కాంపిటీషన్లోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారట. మొత్తానికి రష్యాకి పెద్ద కష్టమే వచ్చి పడింది. అయినా ఇలాంటి విషయాలు మన ఇండియన్లని చూసి నేర్చుకోవచ్చు కదా!

లాస్ వెగాస్ ఐటీ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం

అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల కన్సార్షియం  ఐటీసర్వ్ అలయెన్స్   వార్షిక సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడికి ఆహ్వానం అందింది. అలాగే ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నూ సదస్సు నిర్వాహకులు ఆహ్వానించారు.   సినర్జీ' పేరుతో నిర్వహించే ఈ సదస్సు అక్టోబరు 29, 30 తేదీల్లో లాస్ వేగాస్ లో జరుగుతుంది.  ఈ సదస్సుకు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం వల్ల వచ్చిన ఆహ్వానం కాదు ఇది. ప్రపంచంలో ఎక్కడైనా సరే  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అన్న మాట ఎత్తగానే వినిపించే పేరు సీబీఐ. ఐటీ పరిశ్రమ విస్తరణకు, ప్రపంచ ఐటీ రంగంలో తెలుగు వెలుగుకు, తెలుగు ప్రభకు ఆద్యుడు చంద్రబాబు. అందుకే టెక్నాలజీకి సంబంధించిన ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం అందుతుంది. ఆయన సెంట్రిక్ గానే సదస్సులు జరుగుతాయి.   ఎప్పుడో ఎప్పుడో, పాతికేళ్లకు ముందే కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు  నాటిన ఐటీ విత్తనం, ఇప్పుడు మహావృక్షమై నిలిచింది. ఐటీ అంటే  చంద్రబాబు చంద్రబాబు అంటే ఐటీ అన్నంతగా ఆ రంగంలో ఆయన అనితర సాధ్యమైన ప్రాధాన్యత సంతరించుకున్నారు. అందుకే సినర్జీ సదస్సుకు ముఖ్యఅతిథిగా చంద్రబాబుకు ఆహ్వానం అందించి. ఇక లోకేష్ కు అందిన ఆహ్వానం కూడా ఆయనకు ఐటీ రంగంలో ఉన్న నైపుణ్యత, అనుభవం, ప్రపంచ దేశాల ఐటీ కంపెనీలతో గతంలో మంత్రిగా ఉన్న సమయంలో నవ్యాంధ్రకు ఐటీ పరిశ్రమ తరలి రావడానికి బాటలు పరిచారు.   ఇక ఐటీసర్వ్ అలయెన్స్ సదస్సు ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సదస్సుకు ప్రపంచం నులమూలల నుంచీ పాతిక వందలకు పైగా ఐటీ కంపెనీల ప్రతినిథులు హాజరౌతారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలు, ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీలకు సంబంధించిన అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయి.అందుకే ఐటీసర్వ్ అలయెన్స్ ప్రతినిథులు స్వయంగా కలిసి ఆహ్వాన పత్రం అందించగానే లోకేష్ మరో ఆలోచన లేకుండా తాను సదస్సకు హాజరౌతానని అంగీకారం తెలిపారు.   విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.  సుమారు 2,500 చిన్న, మధ్యతరహా ఐటీ స్టాఫింగ్, సర్వీసెస్ కంపెనీలతో ఏర్పాటైన కన్సార్షియం ఈ ఐటీ సర్వ్. ఈ కన్సార్షియంలోని కంపెనీల  వార్షిక ఆదాయం 1,000 కోట్ల అమెరికా డాలర్లు.  ‘సినర్జీ-2024లో వివిధ రంగాలను ప్రభావితం చేసే గొప్ప నాయకులు, ఇన్నోవేటర్స్, అనేక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు పాల్గొంటారు. విజన్, డెవలప్ మెంట్, ఆవిష్కరణలకు చంద్రబాబు మార్గదర్శి అంటూ సినర్జీ ప్రతినిథులు ఆయనకు ఇచ్చిన ఆహ్వానపత్రికలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఐటీ హబ్, ఆర్థిక పురోభివృద్ధికి కేంద్రంగా మార్చిన చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా విజనరీగా గుర్తింపు ఉంది.  ముఖ్యంగా హైదరాబాద్ ను టెక్నాలజీ పవర్హౌస్ మార్చడంలో చంద్రబాబు చేసిన కృషి ఎనలేనిదనడంలో సందేహం లేదు. అటువంటి దార్శనిక నేత  చంద్రబాబును సినర్జీకి ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం ఆశ్చర్యమేమీ కాదు. 

హంసలదీవి వద్ద 100 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం, భయాందోళనలో ప్రజలు 

హంసలదీవి.  కృష్ణమ్మ ఇక్కడే సముద్రంలోకి కలిసే ప్రాంతం. బంగాళాఖాతంలో కలిసే కృష్ణమ్మ రెండు పాయలు హంసలదీవివద్ద కలుస్తాయి. సముద్ర అలలతో పెద్ద శబ్దాలు వినిపించే హంసలదీవి బీచ్ లో నిశ్శబ్దం ఆవహించింది. అలల చప్పుడు లేదు. పాలకాయ థిప్పబీచ్ కు వచ్చే అలలు 100 మీటర్లు వెనక్కి వెళ్లాయి. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు ఉన్నట్టుండి వెనక్కి వెళ్లాయి. దీంతో బయటపడ్డ ఇసుకతో బీచ్  నిండిపోయింది. కెరటాలకు బదులుగా అక్కడ ఇసుక ప్రత్యక్షం కావడం చూపరులను ఆకర్షించింది. బీచ్ మరింత అందాన్ని సంతరించుకుంది. అయితే, ఇలా సముద్రం వెనక్కి వెళ్లడం ఏ విపత్తుకు సంకేతమోనని స్థానికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎపిలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైంది. వరద నీరు భారీగా సముద్రంలో చేరింది. అయితే బీచ్ వద్ద ఎటువంటి సముద్ర కెరటాలు, గాలులు లేకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

అంచనాలు పెంచుకున్న బాబు.. ఇక కత్తిమీద సాము!

చంద్రబాబు పాలనా దక్షత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన రాష్ట్ర రూపురేకలనే మార్చేశారు. జంటనగరాలకు అదనంగా మరో మహానగరాన్ని నిర్మించి, ఐటీ హబ్ గా మార్చారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు తప్ప మరేమీ మిగలని రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నాలుగేళ్ల పాటు దేశంలోనే నంబర్ వన్ గా నిలిపారు. ప్రపంచం నలుమూలల నుంచీ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పరిశ్రమలు తరలి వచ్చాయి. ఐటీలో హైదరాబాద్, బెంగళూరులకు దీటుగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. కారణాలేమైతేనేం.. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం ఎక్కారు. అక్కడ నుంచి రాష్ట్రం అన్ని రంగాలలో పతనం కావడం మొదలైంది. పరిశ్రమలు తరలిపోయాయి. పెట్టుబడులు వెనక్కుపోయాయి. అభివృద్ధి పడకేసింది. రోజువారీ ఖర్చులకు కూడా అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తోడు జగన్ కక్ష సాధింపు రాజకీయాలతో జనం విసిగి వేసారిపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే జైళ్లు నోర్లు తెరిచే పరిస్థితి ఏర్పడింది. ప్రజల బాధలు కష్టాలు పట్టని జగన్ సర్కార్ వారిని వేధింపులకు గురి చేయడంలో మాత్రం అన్ని రికార్డులను అధిగమించేసింది.  జగన్ పాలనలో  బాధలకు గురి కాని వర్గం లేదు. అన్ని వర్గాల ప్రజలూ జగన్ సర్కార్ అరాచక పాలనకు బాధితులుగా మారారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు పాలనను, ఆ తరువాత ఐదేళ్లు జగన్ పాలననూ చూసిన జనం 2024 ఎన్నికలకు చాలా ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేశారు. వారి నిర్ణయం ఏమిటన్నది ఫలితాలు విస్పష్టంగా తేల్చేశాయి.  అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమ లు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటి వ్యయం,  సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొన్న జనం జగన్ పాలనకు చరమగీతం పాడారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఖండ విజయం సాధించింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రతిసారీ తన పని తీరుతో, తన పాలనతో తనపై ప్రజలలో అంచనాలను విపరీతంగా పెంచేశారు.   ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టి పూర్తిగా మూడు నెలలు కాలేదు.  అప్పుడే జనం గత ఐదేళ్ల జగన్ అధ్వాన పాలన తాలూకు బాధలను మరిచిపోయి.. బంగారు భవిష్యత్ కోసం ఆశగా చంద్రబాబువైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు అన్ని రంగాలలోనూ అవ్యవస్థ, అస్తవ్యస్థ పరిస్థితులను చక్కదిద్దిగాడిలో పెడుతున్నారు. ఆ సమయంలో అనూహ్యంగా భారీ వరదలు వచ్చాయి. బెజవాడ నగరం సగం మునిగిపోయింది. ఆ విపత్కర పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంది. బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. సాధారణంగా ఒక విపత్తు సంభవించినప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కొన్ని విమర్శలను ఎదుర్కోకతప్పదు. ముంపు బాధితుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. కానీ చంద్రబాబు సర్కార్ పై బాధితుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు చంద్రబాబు బాధితులకు కల్పించిన భరోసా, ఆపత్స మయంలో అండగా ఉండి ఇచ్చిన ధైర్యమే కారణమనడంలో సందేహం లేదు. ముంపు ప్రాంతాల్లో మోకాలు లోతు నీటిలో ప్రయాణించి మరీ ఆయన బాధితులను చేరుకున్నారు. తానున్నానన్న భరోసా ఇచ్చారు.  చంద్రబాబు వరద బాధితుల సహాయ పునరావాస చర్యలతో సరిపెట్టలేదు. వరద తగ్గిన తరువాత కూడా వారికి అండగా దండగా నిలవాలనుకున్నారు. నిలిచారు. ముంపునకు గురైన గృహాలను ఫైరింజన్ల ద్వారా శుభ్రం చేయించారు. ముంపు ప్రాంతాలలో పాడైపోయిన వాహనాలు, టీవీలు, ఫ్రిజ్లు వంటి వాటి మరమ్మతులకు ఆయా కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి అవసరమైన సాయం సత్వరమే అందేలా చేశారు.  చేస్తున్నారు. ముంపు గృహాలలో పాడైపోయిన ఆయా కంపెనీల ఉత్పత్తులకు ఉచితంగా మరమ్మతులు చేసేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయంటే అందుకు చంద్రబాబు చొరవే కారణం. ఆయన ఒక్క పిలుపుతో తొలుత ఎల్జీ కంపెనీ, ఆ తరువాత ఇతర కంపెనీలు ఉచిత మరమ్మతులకు ముందుకు వచ్చాయి. చంద్రబాబు చొరవే. ఆ మేరకు అది ముంపు బాధితులకు అనూహ్యమైన ఊరటే. వెసులుబాటే. ఇక పలువురు కార్లు, బైక్ మెకానిక్ లు ముంపు ప్రాంతాలలో పాడైపోయిన వాహనాలకు ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో మరమ్మతులు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాను పని చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగం చేత  పని చేయిం చడమే కాదు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ, పునరావాస కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా వారిలో స్ఫూర్తి నింపింది చంద్రబాబు నాయకత్వం. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారపొట్టాలు అందించడంతో ప్రభుత్వం బాధ్యత తీరిపోయినట్లు కాదని చంద్రబాబు తన చేతలతో నిరూపించారు. ఇప్పుడు జనాలకు ఆయనపై అంచనాలు ఆకాశం ఎత్తుకు పెరిగిపోయాయి. రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, వ్యవస్థలలో పేరుకుపోయిన అవ్యవస్థ ఇవేమీ జనాలకు పట్టదు. వారి అంచనాలను అందుకునేలా ప్రభుత్వం పని చేయాలి. అందుకే ఇక ప్రజల అంచనాల మేరకు పని చేయడం బాబు సర్కార్ కు ఒక సవాలే.  జగన్ పాలనతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉందికదా అని చెప్పి జనాలను ఒప్పించే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజల దృష్టిలో  చంద్రబాబు కేవలం రాజకీయనాయకుడు కాదు.. సూపర్ లీడర్. ప్రజా సమస్యలను చిటికెలో పరిష్కరించగలిగిన హీ మ్యాన్. జనం అంచనాలను అందుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న బిగ్ టాస్క్.! 

చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ ఎత్తివేత 

 గత వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో జోక్యం ఎక్కువై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పుడు చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుంది. ఇందులో భాగంగా గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఉన్న విచారణను సైతం ఆపేశారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పీఎస్ గా 15 ఏళ్లకు పైగా పెండ్యాల పని చేశారు. వైసీపీ హయాంలో 4 సార్లు ఆయన సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు.  గత సంవత్సరం సెప్టెంబర్ 29న జగన్  ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్ సస్పెండ్ చేసింది.  ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయనను తిరిగి డ్యూటీలో  తీసుకుంటున్నట్టు జీవోలో పేర్కొంది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఆయనను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆ బోట్లపై అనుమానాలెందుకంటే..?

కృష్ణమ్మ వరద పోటెత్తి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఐదు బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లు ఢీకొన్న సంఘటనను తేలిగ్గా తీసుకోరాదనీ, ఆ బొటు యజమానులను తక్షణమే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అనవసరంగా విచారణ పేరిట కాలయాపన చేయకుండా బోటు యజమానులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అసలు భారీ వరద సమయంలో బోట్లు కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొనడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగింది కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అసలు ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అనుమానాలు రేకెత్తడానికి ప్రధాన కారణం ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ అసాధారణ పరిస్థితులు ఉండటమే. ఏమిటా అసాధారణ పరిస్థితులు అంటే వరదలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న ఐదు బోట్లలో మూడు ఒకదానికి ఒకటి కట్టేసి ఉన్నాయి. ఈ విధంగా బోట్లను కట్టేయడం జరగదు. ఎందుకంటే వరదల సమయంలో ఏ బోటుకు ఆబోటును వేర్వేరుగానే లంగరు వేస్తారు. ఒక వేళ కొట్టుకుపోతే ఒక బోటు కొట్టుకుపోతుంది. మిగిలినవైనా మిగులుతాయి. ఇలా కట్టివేయడం వల్ల ఒకబోటు కొట్టుకుపోతే మిగిలిన బోట్లు కూడా దానితో పాటే కొట్టుకుపోతాయి. ఇలా అసాధారణంగా మూడు బోట్లను ఒకదానికి ఒకటి కట్టివేయడంతో మూడూ కలిసి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లకు నష్టం చేకూర్చాయి. ఇక బోట్ల విషయంలో అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి మరో కారణమేంటంటే.. ఆ బోట్లను బల హీనమై ప్లాస్టిక్ తాడుతో లంగర్ వేయడం. సాధారణంగా వరదల సమయంలో  అలాంటి బలమైన ప్లాస్టిక్ తాడుతో బోట్లను ఎవరూ కట్టేయరు. అంతే కాకుండా భారీ వరదకు సంబంధించి స్థానికంగా జారీ చేసిన హెచ్చరికలను కూడా బోటు యజమానులు పట్టించుకోకపోవడాన్ని బట్టి చూస్తే కావాలనే వాటిని ప్రవాహంలో కొట్టుకుపోయి బ్యారేజీ గేట్లను ఢీకొట్టాలన్న కుట్ర ఉందని అనిపించక మానదు. వాస్తవానికి ఆ బోట్లను గొల్లప్రోలు గ్రేవ్ యార్డ్ వద్ద కట్టేశారు.దీంతో అవి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొన్నాయి. ఆ బోట్ల యజమానులకు వైసీపీతో దగ్గర సంబంధాలు ఉండటం, ఆ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటం చూస్తుంటే వైసీపీ నేతలు లేదా వారి అనుచరులకు ఈ ఘటనతో ప్రమేయం ఉందని భావించాల్సి వస్తున్నది. ప్రజా భద్రతకు, బ్యారేజీకి నష్ఠం వాటిల్లే విధంగా జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే బోటు యజమానులను వెంటనే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ జోరందుకుంది. ఒక పక్క బుడమేరు ముంపు, మరో పక్క కృష్ణానదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం, ఇంకో పక్క భారీ వర్షంతో బెజవాడ గజగజా వణుకుతుంటే.. ఎలాంటి భద్రతా లేకుండా, అత్యంత నిర్లక్ష్యంగా బోట్లను నదిలో ఉంచిన బోటు యజమానుల నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించరాదని అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి శిక్ష పడాల్సిందేనంటున్నారు. అలా కాకుండా ఈ ఘటన వెనుక నిర్లక్ష్యం కాకుండా కుట్ర ఉంటే వాళ్లను ఉరి తీసినా పాపంలేదంటున్నారు. ఆ బోట్ల ధాటికి బ్యారేజీ గేట్ల కౌంటర్ వెయిట్లు మాత్రమే దెబ్బతిన్నాయి కనుక సరిపోయింది కానీ, అదే బ్యారేజీ దిమ్మలు ధ్వంసమై ఉంటే ఎంత ప్రమాదం జరిగేదన్నది ఊహకే అందనంత భయంకరంగా ఉండేదని అంటున్నారు.  

భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ భారత్ లోకి ఎంటర్ అయ్యింది. భారత్ లో మంకీ పాక్స్ తొలి కేసు నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ధృవీకరించింది.   ఇటీవలే ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని వెల్లడించింది.  ఆ వ్యక్తి పేరు వివరాలు వెల్లడించలేదు. అయితే దేశంలో మంకీపాక్స్ విస్తరణ నిరోధానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే దేశంలో దేశంలో మంకీపాక్స్‌ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ పని చేస్తోందని  పేర్కొంది.  ఎయిర్‌ పోర్టుల్లో మంకీపాక్స్‌ స్క్రీనింగ్‌ మరింత వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుమానిత కేసులను పరీక్షించేందుకు వీలుగా ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో  పరిశోధనాశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు తెలపింది. రాష్ట్రాలు చర్మ, ఎస్‌టీడీ లాంటి రోగాలకు చికిత్స చేసే క్లినిక్స్ పై దృష్టి పెట్టాలని తెలిపింది. వ్యాధి లక్షణాలు కనిపించిన పేషెంట్ల విషయంలో అలర్ట్ గా ఉండాలనీ, మంకీపాక్స్  వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, ప్రజల్లో అనవసర భయాలు పొగేట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ తన ప్రకటనలో తెలిపింది. మంకీపాక్స విస్తరణను నిరోధించేందుకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 

చంద్ర‌బాబు మారారు.. ఇవిగో ఆధారాలు

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో టీడీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొంద‌రు ప్రాణాలు కోల్పోగా.. మ‌రికొంద‌రు అక్ర‌మ కేసుల‌తో జైళ్ల‌కు పోయారు.. మ‌రి కొంద‌రు వైసీపీ మూక‌ల దాడుల్లో గాయ‌ప‌డ్డారు. అలాగే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తిన ప్ర‌జ‌లు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో పలు సంద‌ర్భాల్లో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు. తెలుగుదేశం శ్రేణులపై దాడుల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌ల‌ను, అధికారుల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని గట్టిగా చెప్పారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కొత్త చంద్ర‌బాబును చూస్తార‌ని.. ఈసారి జ‌గ‌న్, వైసీపీ బ్యాచ్ ను వ‌దిలేది లేద‌ని అప్పట్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సరే ఎన్నికలు జరిగాయి. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై విసిగిపోయిన ప్ర‌జ‌లు టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వానికి భారీ మెజార్టీతో ప‌ట్టం క‌ట్టారు. సీఎంగా నాలుగవ సారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబులో ఊహించ‌ని మార్పులు ఉంటాయ‌ని, అధికారంలో ఉన్న స‌మ‌యంలో రెచ్చిపోయిన వైసీపీ నేత‌లు జైళ్ల‌కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. కానీ  చంద్ర‌బాబు నాయుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో అప్పుల‌మ‌యంగా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో అధికార ప‌గ్గాలు చేప‌ట్టి మూడు నెల‌ల‌వుతున్నా వైసీపీ హ‌యాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నేత‌ల‌పై చ‌ర్య‌ల‌పై చంద్ర‌బాబు  ఏ మాత్రం దృష్టి పెట్ట‌లేద‌ని, చంద్ర‌బాబులో ఎలాంటి మార్పురాలేద‌ని కొంద‌రు తెలుగుదేశం నేతలు నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, నిజంగా చెప్పాలంటే చంద్ర‌బాబు మారిపోయారు. ఆ విష‌యం కొందరు తెలుగుదేశం నాయకులకు, వైసీపీ హయాంలో వేధింపులకు గురైన క్యాడర్ కు అర్థం కాలేదు కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మాత్రం స్ప‌ష్టంగా అర్థ‌మైంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న అందరికీ కూడా చంద్రబాబులో వచ్చిన మార్పు అవగతమౌతుంది. చంద్ర‌బాబు నాయుడు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి జగన్  అరాచకపాలన కారణంగా అధ్వానంగా మారిన  రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  రాజ‌ధాని అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించ‌డంతోపాటు.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకొచ్చి నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేలా దృష్టిసారించారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో తెలుగుదేశం, జ‌న‌సేన శ్రేణులను, ప్ర‌జ‌లు ఇబ్బందులు పెట్టిన ఆ పార్టీ నేత‌లు, అధికారుల‌పైనా కొర‌డా ఝుళిపిస్తున్నారు. పైకి ఇవ‌న్నీ క‌నిపించ‌క‌పోయినా.. చంద్ర‌బాబు వ్యూహాత్మంగా వేస్తున్న అడుగులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో ఆందోళ‌న‌ పెంచుతున్నాయి‌. అందుకే ఎక్కువగా బెంగ‌ళూరులో ఉండేందుకే జ‌గ‌న్ మెగ్గుచూపుతున్నారు. అధికారం కోల్పోయిన త‌రువాత తాడేపల్లి ప్యాలెస్ లో కంటే జ‌గ‌న్ ఎక్కువ‌గా బెంగ‌ళూరులోనే ఉన్నారు. ఏదైనా శ‌వ రాజ‌కీయాలు చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఏపీకి వ‌చ్చి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రెండు మూడు రోజులు ఏపీలో ఉండి మ‌ళ్లీ బెంగ‌ళూరు ప్యాలెస్ కు వెళ్లిపోతున్నారు. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన స‌మ‌యంలోనూ జ‌గ‌న్ బెంగ‌ళూరులోనే ఉన్నాడు. అక్క‌డి నుంచి వ‌చ్చి రెండు ద‌ఫాలుగా ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసి వెళ్లిపోయారు. ఏపీలో ఉంటే ఏ క్ష‌ణ‌మైనా పోలీసులు త‌న‌ను అరెస్టు చేయ‌వ‌చ్చున‌న్న భ‌యం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వెంటాడుతుంద‌న్న టాక్ వైసీపీ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  ఇవ‌న్నీ తెలియ‌ని తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు మారలేదు అనుకుంటున్నారు కానీ, చంద్ర‌బాబులో వ‌చ్చిన మార్పు ప్ర‌జ‌ల కంటే జగన్ మోహ‌న్ రెడ్డికే బాగా అర్థమైంది. కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు జ‌గ‌న్, వైసీపీ గ్యాంగ్ చేస్తున్న ప్ర‌తీ కుట్ర‌ను చంద్ర‌బాబు స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పికొడుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే పెన్ష‌న్ల పంపిణీపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ చేశారు. ప్ర‌భుత్వ ఖ‌జానాలో డ‌బ్బులు లేవు.. చంద్ర‌బాబు పెన్ష‌న్లు ఇవ్వ‌లేరని త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వంపై రెచ్చ‌గొట్ట‌వ‌చ్చున‌ని అనుకున్నారు. కానీ, చంద్ర‌బాబు త‌న పాల‌నా అనుభ‌వంతో ప్ర‌తీ నెలా ఠంచనుగా ఒకటవ తేదీనే అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికి పెన్ష‌న్లు అందిస్తుండ‌టంతో జ‌గ‌న్ కుట్ర‌ల‌కు చెక్ ప‌డింది. ఆ త‌రువాత త‌ల్లికి వంద‌నం ఏమైంది అంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు. ప్రత్యేక హోదాను హైలెట్ చేయాలని చూశారు, బడ్జెట్ లో టార్గెట్ చేయాలని చూశారు. ఎమ్మెల్యే వీడియో  వ్యవహారం ర‌చ్చ చేయాల‌ని పెద్ద‌ ప్లాన్ చేశారు. గుడ్లవల్లేరు కాలేజి వ్యవహారంలో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.  ప్ర‌తీ అంశంలోనూ జ‌గ‌న్ కుట్ర‌ల‌ను చంద్ర‌బాబు బ‌లంగా తిప్ప‌ికొడుతున్నారు. చివ‌రికి వరద విషయంలోనూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేశారు. బాధితులతో మాట్లాడితే వాళ్ళు చంద్రబాబుని తిడతారని చూశాడు.. కానీ, 74ఏళ్ల వ‌య‌స్సులోనూ రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా చంద్రబాబు నాయుడు వ‌ర‌ద నీటిలో ప‌ర్య‌టిస్తూ బాధితుల‌కు అండ‌గా నిలిచాడు.వారిలో భరోసా నింపారు. ధైర్చం చెప్పారు. ప్ర‌తీఒ క్క‌రికి ఆహారం అందించి వ‌ర‌ద బాధితుల నుంచి కూడా చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు పొందాడు. దీంతో జ‌గ‌న్ వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇలాలాభం లేద‌ని సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేశారు.. అమ‌రావ‌తి మునిగిపోయింద‌ని.. ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ఎలాంటి స‌హాయం అందించ‌డం లేద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. ప్ర‌జ‌లే స్వ‌యంగా రంగంలోకి దిగి వైసీపీ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారాల‌ను తిప్పికొట్టారు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావ‌డంలో చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యారని ప్ర‌చారం చేసేందుకు వైసీపీ నేత‌లు వేసిన ప్లాన్ కూడా బెడిసి కొట్టింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కేంద్రం ఏపీలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌పై రెస్పాండ్ అయింది. అయినా, వైసీపీ నేత‌ల‌కు బుద్ది రాలేదు. మాజీ మంత్రులు రోజా, అంబ‌టి రాంబాబును రంగంలోకి దింపి వ‌ర‌ద‌ల‌కు చంద్ర‌బాబే  కార‌ణం అంటూ విమ‌ర్శ‌లు చేయించారు జ‌గ‌న్‌.. కానీ, అవి రివ‌ర్స్ అయ్యి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే చుట్టుకున్నాయి. గ‌త ఐదేళ్ల కాలంలో బుడ‌మేరు మ‌ర‌మ్మ‌తుల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌టం వ‌ల్ల‌నే ప్ర‌స్తుతం వ‌ర‌ద‌ల‌కు కాణ‌మ‌ని ప్ర‌జ‌ల‌కు నిర్ధార‌ణ‌కు వ‌చ్చేశారు. ప్ర‌కాశం బ్యారేజ్ కు వ‌ర‌ద ఉధృతి పెర‌గ‌డంతో బ్యారేజ్ గేట్ల‌ను ప‌డ‌గేట్టేలా జ‌గ‌న్ అండ్‌కో ప్లాన్ చేసింది. మూడు ఇనుప బోట్లు వ‌చ్చి ప్ర‌కాశం బ్యారేజ్ ను ఢీకొన‌డంతో బ్యారేజ్ గేటు భాగంలో స్వ‌ల్పంగా డ్యామేజ్ అయింది. అస‌లు బోట్లు ఎలా వ‌చ్చాయ‌నే విష‌యంపై ఆరా తీయ‌గా.. అంద‌తా వైసీపీ నేత‌ల కుట్ర‌లో భాగ‌మేన‌ని తేలింది. మ‌రోప‌క్క టీడీపీ  ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడి కేసులో నందిగం సురేష్‌, అప్పిరెడ్డిలను పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేయ‌గా.. కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత‌ల‌ కోసం పోలీసులు వేట కొన‌సాగిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌భుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా జ‌గ‌న్, వైసీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను చంద్ర‌బాబు నాయుడు స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పికొడుతున్నాడు. మ‌రో వైపు వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిసారించి అక్ర‌మార్కుల‌పై కొర‌డా ఝుళిపిస్తోంది. దీంతో ఏపీలో ఉంటే ఎప్పుడైనా   అరెస్టు చేయ‌వ‌చ్చు అనే భ‌యం జ‌గ‌న్ ను వెంటాడుతుంది‌.  అందుకే జ‌గ‌న్ బెంగ‌ళూరుకు  మ‌కాం మార్చేశారు. ఏపీకి వ‌చ్చినా ప‌ట్టుమ‌ని వారం రోజులుకూడా ఉండ‌టం లేద‌ు‌. బాబులో వచ్చిన మార్పు జగన్ లో పెంచిన ఆందోళనే అందుకు కారణం. తనలా అడ్డగోలుగా అరెస్టులూ నిర్బంధాలతో కూటమి ప్రభుత్వం రెచ్చిపోతే సానుభూతి పొందే అవకాశం ఉంటుందని భావించిన జగన్ కు చంద్రబాబు పకడ్బందీగా అన్ని ఆధారాలతో తన హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, భూదందాలను వెలికి తీస్తుండటంతో జగన్ వణికిపోతున్నారు. బాబులో వచ్చిన ఈ మార్పు ముందుముందు వైసీపీలోని అక్రమార్కుల భరతం పట్టడం ఖాయమని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. 

అరెస్టు చంద్రకాంతిని ఆపలేదు!

చంద్రబాబు అరెస్టు అయిన రోజు...  ఇక తెలుగు ప్రజల్లో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుంది... పైగా ఈ రోజు చంద్రబాబు నాయుడు భువనేశ్వరి ల పెళ్లి రోజు కూడా... సంవత్సరం క్రిందట...ఇదే రోజు నంద్యాల పర్యటనలో ఉండగా చంద్రబాబును అర్ధరాత్రి బస్సులో నిద్రిస్తూ ఉండగా... ఒక్కసారిగా సీఐడీ బృందాలు కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో అక్కడికి చేరుకొని అరెస్టు చేసిన సందర్భం బహుశా తెలుగు ప్రజల్లో నుండి ఇప్పుడప్పుడే చేరిగిపోదేమో... ఎందుకు అరెస్టు చేస్తున్నారో... తెల్లారే వరకూ మీడియాకి కూడా తెలియలేదు... తెల్లారిన తర్వాత గానీ ఒక క్లారిటీ రాలేదు... స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారని... ఒక్కసారిగా జనం నివ్వెరపోయారు...ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో అరెస్టు అనే మాట వినిపించని చంద్రబాబు అరెస్టు అయ్యాడు అనే మాట నిస్సందేహంగా ప్రజలకు ఆశ్చర్యంగా అనిపించింది... ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు అరెస్టు అయిన సందర్భాలు రెండే రెండు... మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్రీ ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని అక్కడికి వెళ్లి నిరసనలు తెలిపిన నేపథ్యంలో చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం మొదటిది అయితే... రెండవది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డేవేలప్మెంట్ కేసులో నంద్యాలలో అరెస్టు చేయడం... ఇక ఈ రోజును చంద్రబాబు అరెస్టు అయిన రోజు అనేకంటే...జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా తనగొయ్యి తాను 9 అడుగుల వెడల్పు 9 అడుగుల పొడవుతో లెక్కలేసుకోని మరీ తవ్వుకున్న రోజు అని చెప్పక తప్పదేమో...! బహుశా ఈ విషయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు...!  చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందన , ఆలోచన, ప్రపంచ దేశాల్లో నిరసనలు...ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులతో పాటూ ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కడెక్కడో స్థిరపడిన వివిధ రంగాల ఉద్యోగులు అంతా కలిసి తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ మార్గ నిర్దేశకత్వంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన  చంద్రబాబు కృతజ్ఞత సభ యావద్దేశాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది... ఒక్క మాటలో చెప్పాలంటే... "ఎవరినైనా అరెస్టు చేస్తే వారు చేసిన అక్రమాలు బయటికి వస్తాయి...కానీ చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటికి వచ్చాయంటూ" చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన ట్వీట్ మొత్తం అరెస్టు పర్యవసానాలనే మార్చేసింది. చేసింది చెప్పుకోవడంలో వెనుకబడింది అనే పదే పదే అనిపించుకునే టీడీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా ఇక మనం చెప్పాల్సింది ఏమీలేదు అనుకునేంతలా ప్రజలు స్వచ్చందంగా బయటికి వచ్చి ఒక్కో విషయాన్ని చర్చిస్తుంటే...చంద్రబాబు గురించి తెలియని తరాలకు కూడా ఇదీ చంద్రబాబు అంటే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేని పరిస్థితి రాష్ట్రంలో అనివార్యంగా జగన్ కల్పించినట్టే అయింది. తప్పు చేసిన ఎవ్వరైనా శిక్షార్హులే... కానీ చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోవడం ...370 కోట్ల అవినీతి అని చెప్పి చివరికి ఎలెక్టోరల్ బాండ్లను చూపించి 27 కోట్లుగా చెప్పడం...ఒక్క రూపాయి కూడా లావాదేవీలు జరిగినట్టు నిరూపించలేక ...ఇన్నర్ రింగ్ రోడ్ అనీ...ఫైబర్ నెట్ అనీ...రోజుకో కేసు పెట్టుకుంటూ వెళ్ళిన జగన్ ప్రభుత్వం చివరికి ప్రజల్లో నవ్వులపాలు కాక తప్పలేదు. కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు కూడా ఇలాంటి చర్య పార్టీకి కచ్చితంగా నష్టం చేస్తుంది అని సన్నిహితుల దగ్గర మాట్లాడినప్పటికీ...జగన్ నిర్ణయానికి ఎదురుచెప్పే సాహసం చెయ్యలేక మిన్నకుండిపోయారనేది వైసీపీలో అంతర్గత చర్చ. కేవలం... చంద్రబాబును జైలుకు పంపించాలన్న దుగ్ధతోనే... చంద్రబాబు కూడా బైలుపై బయట ఉన్న వ్యక్తే అని చెప్పడం కోసమే జగన్ ఇలాంటి దుస్సాహాసానికి ఒడిగట్టాడు అనే భావన ప్రజల్లో నాటుకుపోయింది... కానీ ఆశ్చర్యం ఏంటంటే...  చంద్రబాబు అరెస్టు అయితే ప్రపంచ దేశాల్లో నిరసనలు వెల్లువెత్తితే... ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రజలు బయటికి రావడానికి అంతలా సాహసించలేదు... కానీ మరో 8 నెలల్లో జరిగిన ఎన్నికల్లోగానీ ప్రజలు ఎందుకు బయటికి రాలేదో అర్ధం కాలేదు. జగన్ బహుశా కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు 151 స్థానాల నుండి కేవలం 11 స్థానాలకు పరిమితమవుతామని...ప్రజలు కొట్టిన చావు దెబ్బకి జగన్ కనీసం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటివరకు సరిగ్గా వారం రోజులు కూడా నిలకడగా ఉండలేని పరిస్థితి నెలకొంది.మరోవైపు ఆంధ్రప్రదేశ్ కంటే ముందే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏ స్థాయిలో కనిపించిందో బహుశా కేటీఆర్ కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఇక్కడ చంద్రబాబు అరెస్టులో ప్రత్యేకమైన మరో అంశం...17ఏ.. ఈ 17ఏ అంటే ఎంటో కూడా చంద్రబాబు అరెస్టుతో అందరికీ తెలసిపోయింది. ఇక చంద్రబాబు అరెస్టు విషయంలో ఈ విషయాన్ని సీఐడీ పరిగణనలోకి తీసుకోకపోవడం కరెక్ట్ కాదు తీసుకోవాల్సిందేనని నిన్న మొన్నటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేసుల్లో విచారణ సందర్భంగా తేటతెల్లమైంది. అంటే చంద్రబాబుకు 17ఏ  వర్తిస్తుంది... కానీ వైసీపీ ప్రభుత్వం గవర్నర్ అనుమతి లేకుండానే అరెస్టు చేసి ఇక్కడ కూడా అధికారులు జగన్ భక్తులుగా నిరూపించుకొని ఇప్పుడు అనుభవిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమకు ఎలాంటి వారు నాయకులుగా కావాలో వారే తమ ఓటు ద్వారా ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే,  ప్రస్తుతం విజయవాడ వరద విలయంలో చిక్కి అల్లాడుతుంటే... వారం రోజులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మిగతా మంత్రులు...ఎమ్మెల్యేలు అధికారులు శ్రమిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం... కానీ...ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు ఇవ్వడంతో పాటూ... వారి ఇళ్లను కూడా శుభ్రం చేసి బాధితులకు అప్పగించడం చంద్రబాబు మార్క్ పరిపాలన అనక తప్పదు... ఇక్కడే కీలక విషయం...ఏంటంటే...  ఈ ఇళ్లను శుభ్రం చేసే పనులు మాత్రమే కాక డ్రైనేజీ...కరెంటు...పాడైపోయిన తలుపులు కిటి కీలు...టీవీలు ఫ్రీడ్జిలు... ఇవన్నీ యుద్ధప్రాతిపదికన బాగు చేసి బాధితులకు అందించడానికి ఒక ప్రయి వేటు కంపనీతో భాగస్వామ్యం చేసుకుంది ప్రభుత్వం... ఆ కంపెనీ నుండి విజయవాడ వరదల్లో పని చేస్తున్న దాదాపు 500 మంది  స్కిల్ల్డ్ వర్కర్లు...టెక్నిషియన్లు... చంద్రబాబు స్థాపించిన , చంద్రబాబు అరెస్టుకు వైసీపీ ప్రభుత్వం కారణం చూపిన స్కిల్ డేవేలప్మెంట్ ప్రోగ్రాం నుండి ట్రైనింగ్ అయిన వారే కావడం కొసమెరుపు.

చంద్రబాబు అరెస్టుకు ఏడాది.. అదే జగన్ సర్కార్ కు సమాధి!

ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపు,   ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపుగా ఉంటే ఉండొచ్చు.. కానీ నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తారు. కురిపిస్తూనే ఉంటారు. జనం చంద్రబాబుపై తమ నమ్మకాన్ని చాటుకుంటూనే ఉన్నారు. చాటుతూనే ఉంటారు. అటువంటి దార్శనికుడిని, అటువంటి ప్రజా నేతను కేవలం రాజకీయ కక్ష సాధింపుతో జగన్ సర్కార్ సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు అంటే సెప్టెంబర్ 9న  అరెస్టు చేసింది.  రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడి అరెస్టు అది.. దేశాన్ని నివ్వెరపరిచిన అరెస్టు అది.  ప్రభుత్వ టెర్రరిజాన్ని పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది.  దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది.  ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలిపేలా చేసిన  అరెస్టు అది.    భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకు వచ్చిన అరెస్టు అది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గం అన్న తేడా లేకుండా తెలుగు జాతి మొత్తం గళమెత్తి నిరసన తెలిపేలా చేసిన అరెస్టు అది. ప్రజాస్వామ్యం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు అది.. విధ్వంస ప్రభుత్వం పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్టు అది.. చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగు పడిన అరెస్టు అది.. అదే  తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడి అరెస్టు.  జగన్ ప్ర‌భుత్వం చంద్ర‌బాబును అక్ర‌మంగా అరెస్టు చేసి ఈ రోజుకు సెప్టెబర్ 9 (సోమవారం) సరిగ్గా ఏడాది.   ఏపీలో అరాచ‌క పాల‌న సాగిస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం ప‌త‌నానికి బీజం ప‌డింది కూడా ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు. చంద్ర‌బాబు అరెస్టు త‌రువాత ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం పూర్తిగా మారిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో గొంతెత్తేందుకు భయపడిన జనం.. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై  రోడ్లపైకొచ్చి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  గళం విప్పి పోరాటానికి నడుం బిగించారు. ఆ నాడు మొదలైన ప్రజా పోరాటం ఎన్నికల్లో జగన్ పతనం చూసే వరకు కొనసాగింది.  వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఒక లెక్క.. చంద్రబాబు అరెస్టు తరువాత ఒక లెక్క అని చెప్పొచ్చు. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ  జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన సాగింది. జగన్ ప్రభుత్వానికి కొమ్ము కాసిన కొందరు పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. అక్రమంగా అరెస్టు చేసి జైళ్లకు పంపించారు. అభివృద్ధి లేదు.. గుంతలు పడిన రోడ్లను బాగుచేసే పరిస్థితి లేదు. ఇదేమని ప్రశ్నించిన సామాన్య ప్రజలపైనా దాడులు, కేసులు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది.  దీంతో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు భయపడ్డారు.  పార్టీ జెండాలను కట్టేందుకు సైతం ప్రతిపక్ష పార్టీల నేతలు వణికిపోయారు. అంతటి  స్థాయిలో జగన్ హయాంలో అరాచక, విధ్వంస, వికృత  పాలన జరిగింది. ఇదే క్రమంలో అధికార మదంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా అక్రమ కేసులుపెట్టి జైలుకు పంపించేందుకు జగన్ పూనుకున్నారు. ఏపీ సీఐడీ ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో అక్రమంగా ఇరికించి అరెస్టు చేయించింది.  2023 సెప్టెంబర్ 8న నంద్యాలలో జరిగిన ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ సభలో చంద్రబాబును పాల్గొన్నారు. ఆ రాత్రి అక్కడే బస్సులో బస చేశారు. తెల్లవారుజామున డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి వందల మంది పోలీసులతో చంద్రబాబు బస్సును చుట్టుముట్టారు. బలవంతంగా చంద్రబాబును అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండు విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబును తరలించారు.  చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర మొత్తం భగ్గుమంది. ఉవ్వెత్తున ఆందోళనలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబుకు సంఘీభావం తెలియజేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమానంలో రాకుండా అడ్డుకున్నారు. రోడ్డు మార్గాన వస్తుండగా పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. ఈ సమయంలో పవన్ రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపాడు. నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉంటూ.. మూడు దఫాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై ఒక్క అవినీతి మరక లేదు. కానీ, జగన్ మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టారు. దీనిని  తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కులాలు, మతాలు అనే తేడా లేకుండా   ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్లుపైకి వచ్చి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడుతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా సహా సుమారు 70 దేశాల్లో ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ర్యాలీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనేకాదు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో.. ఇతర దేశాల్లోని తెలుగు వారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 53రోజులుపాటు నిరసన తెలిపారు. చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయంలో ఏ స్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టుకున్నారో ఆ సమయంలో దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశం అయింది. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీకి అధినేత కాదు.. ప్రజల మనిషి అని మరోసారి రుజువైంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నభూతో అన్న రీతిలో సీబీఎన్ గ్యాటిట్యూడ్ సభ జరిగింది. ఐటీ ప్రొఫెషనల్స్ స్వచ్ఛందంగా చంద్రబాబుకు కృతజ్ణత తెలిపేందుకు నిర్వహించిన ఈ సభ నభూతో.  సాధారణంగా ఏ నాయకుడైనా అరెస్టైతే జనం ఆ నేత అవినీతి, అక్రమాలపై చర్చించుకుంటారు. కానీ సీబీఎన్ అరెస్టు సమయంలో మాత్రం రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ దేశాలలో చంద్రబాబు గొప్పతనం గురించిన చర్చ జరిగింది. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకువచ్చిన ఆయన సమర్థత గురించి జనం చర్చించుకున్నారు. భాగ్యనగరానికి  ఐండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరలి వచ్చేలా చేసిన ఆయన గొప్పతనం గురించి  ప్రజలు చర్చించుకున్నారు.  అటువంటి నేతను జగన్ మోహన్ రెడ్డి అరెస్టు చేయించడమే కాకుండా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా  సైకోయిజాన్ని   చూపించారు. జైల్లో చంద్రబాబుకు కనీస సౌకర్యాలుకూడా కల్పించకుండా ఇబ్బందులకు గురిచేశారు. బాబుతో ములాఖత్ అయ్యి బయటకు వచ్చిన సమయంలో ఆయన సతీమణి భువనేశ్వరి కన్నీరు  పెట్టుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే పవన్ కల్యాణ్ కలిశారు. జైల్లో ఆయన పరిస్థితిని చూసి ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలోనే జనసేన, పొత్తు  పొడిచింది. జైల్లో చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన పవన్.. మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయని.. జగన్ పతనం ఖాయమైందని  ప్రకటించారు.  2023 సెప్టెంబర్ 8న చంద్రబాబు అరెస్టు కాగా..  53 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఏపీ హైకోర్టు  మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యారు. తమ అభిమాన నేత జైలు నుంచి బయటకు రావడంతో జైలు వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకొని ఘన స్వాగతం పలికారు. జైలు వద్ద నుంచి విజయవాడ వరకు దారిపొడవునా ప్రజలు నీరాజనం పలికారు. మహిళలు రోడ్లుపైకి వచ్చి చంద్రబాబుకు హారతులు పట్టారు. యువత, ముసలి.. ఆడ, మగ అనే తేడాలేకుండా చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేదు.. జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే ప్రజల్లోకి వచ్చారు.. అప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజల మధ్యలోనే ఉంటూ జగన్ ప్రభుత్వ అంతానికి ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగారు. ప్రజలు సైతం చంద్రబాబు అడుగులో అడుగు వేస్తూ ఓటు ద్వారా జగన్ ప్రభుత్వాన్ని నేలకూల్చారు. కేవలం 11 నియోజకవర్గాలకే జగన్ పార్టీని పరిమితం చేసి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్టు చేసి ఉండకపోతే ఇంత భారీ స్థాయిలో  ఓటమి ఉండేది కాదని వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రబాబు విషయంలో జగన్ చేసిన అతిపెద్ద తప్పుతో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబును టచ్ చేస్తే ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలు ఓటు ద్వారా జగన్ మోహన్ రెడ్డికి మహ బాగా రుచిచూపించారు.

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ తీసుకున్నాయి. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలా నిర్ణయం తీసుకోని పక్షంలో ఈ కేసును సుమోటోగా విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. అసెంబ్లీకి సంబంధించినంత వరకు స్పీకర్ నిర్ణయమే సుప్రీం అని, ఆయన అధికారాల్లోకి కోర్టులు సాధ్యమైనంత వరకు ప్రవేశించవనే అభిప్రాయాలు వున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ని హైకోర్టు ఇలా ఆదేశించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన అంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్‌ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టులో కేసులు వేశారు. దీని మీద స్పందించిన హైకోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది. పదేళ్ళ క్రితం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇతర పార్టీల్లో ఎమ్మెల్యేలు, నాయకులు ఉండకూడదనే పట్టుదలతో చాలామందిని ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ ఆహ్వానించి తన పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ పార్టీలో మిగలకుండా చేశారు. అప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌కి ఫిర్యాదు చేశాయి. అయితే స్పీకర్ అధికారం పూర్తయ్యే వరకు వేచి చూసి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అదే కేసీఆర్ పార్టీ నాయకులు ఇప్పుడు మాత్రం తమ పార్టీలోంచి ఎమ్మెల్యేలు జారిపోయారు కాబట్టి స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ హైకోర్టు ఆదేశాలను పాటిస్తారా? తనకున్న విశేష అధికారాలను హైకోర్టుకు తెలియజేస్తారా అనేది సస్పెన్స్.గా మారింది.