jagan cabinet ministers trailing

జగన్ కేబినెట్ లో మంత్రులందరూ ఓటమి బాటలోనే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ తెలుగుదేశం కూటమి ప్రభంజనం కనిపిస్తోంది. దాదాపు 165 స్థానాలలో తెలుగుదేశం కూటమి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుండగా, వైసీపీ ఆధిక్యత కేవలం 10 స్ధానాలకే పరిమితమైంది. జగన్ కేబినెట్ లో మంత్రులు, మాజీ మంత్రులూ దాదాపుగా ఓటమి బాటలో పయనిస్తున్నారు. మంత్రులు బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంధ్రనాథ్, అంజాద్ బాష, ఉషశ్రీ చరణ్, పిడికరాజన్నదొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్థన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజని, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున ఓటమి బాటలో ఉన్నారు.  

tdp alliance clean sweep in konaseema

కోనసీమ తెలుగుదేశం క్లీన్ స్వీప్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కూటమి మెజారిటీ మార్కు దాటేసింది. కూటమి అభ్యర్థులు 143 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతుంటే.. వైసీపీ అభ్యర్థులు కేవలం 15 స్థానాలలో మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు.   కోనసీమ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెడుతోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.  ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఆ పార్టీ సీనియర్లు, మంత్రులు  ఓటమి బాటలో పయనిస్తున్నారు. ధర్మాన, బుగ్గన, రోజా, పెద్దిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, బొత్స తదితర మంత్రులందరూ వెనుకబడ్డారు.  వైసీపీ నేతలు, మంత్రులుపలువురు తొలి రౌండ్  ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.  

వై నాట్ 175 .. జగన్ మాటే నిజమయ్యేలా ఉంది!

"ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచాం.. ఈసారి 175 కి 175 స్థానాలు గెలుస్తాం" అంటూ "వై నాట్ 175" అనే నినాదంతో 2024 ఎన్నికల బరిలోకి దిగారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అయితే ఇప్పుడు ఆయన మాటే నిజమయ్యేలా ఉంది. కానీ జగన్ పార్టీ కాకుండా.. కూటమి ఆ ఫీట్ ని సాధించేలా ఉంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే ఏపీలో జగన్ కుర్చీ కదలడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందో.. అప్పుడే వైసీపీ పునాదులు కదలనున్నాయని అందరూ బలంగా ఫిక్స్ అయ్యారు. ముందు నుంచి తమ విజయం పట్ల కూటమి ఎంతో నమ్మకంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే స్పష్టం చేశాయి. ఇక ఈరోజు వెలువడుతున్న ఫలితాలు చూస్తుంటే.. "వై నాట్ 175" నిజమైనా ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది. ఏపీలో పోస్టర్ బ్యాలెట్ నుంచే కూటమి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలకు కనీసం 160 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ 10-15 సీట్లకే పరిమితం కానుందని ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి అర్థమవుతోంది. మొత్తానికి "వై నాట్ 175" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుని ఏపీ ప్రజలు మరోలా అర్థం చేసుకొని.. కూటమికి దాదాపు 170 స్థానాలు ఇచ్చేలా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.