నారా లోకేష్ అచ్చం నాన్నలాగే.. ఈ మాట ఎవరన్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే.. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా ప్రజలు కూడా సంపూర్ణ ఆమోదం పలుకుతున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో లోకేష్ జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు.
అయితే లోకేష్ కు ఈ గుర్తింపు అంత తేలికగా ఏమీ రాలేదు. నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని, ఎదుర్కొని, తనను తాను మలచుకున్న లోకేష్ కు తాజాగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది.
ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కర్నూలు విమానాశ్రయం వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి తండ్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ తో కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సందర్భంగా లోకేష్ ను మోడీ ప్రశసంలతో ముంచెత్తారు. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో లోకేష్ ను ఆయన పొగిడారు. ఇంతకు ముందు కంటే బరువు తగ్గారంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. త్వరలోనే నాన్నలా తయారౌతారంటూ కితాబిచ్చారు. ఏడున్నర పదుల వయస్సులో చంద్రబాబు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేటర్ గా నారా లోకేష్ తండ్రికి తగ్గతనయుడిగా కితాబులందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర లోకేష్ ఫిట్ నెస్ ను కూడా తండ్రితో పోల్చి ప్రశంసించడం గమనార్హం.