కోనసీమ తెలుగుదేశం క్లీన్ స్వీప్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కూటమి మెజారిటీ మార్కు దాటేసింది. కూటమి అభ్యర్థులు 143 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతుంటే.. వైసీపీ అభ్యర్థులు కేవలం 15 స్థానాలలో మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు.  

కోనసీమ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెడుతోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఆ పార్టీ సీనియర్లు, మంత్రులు  ఓటమి బాటలో పయనిస్తున్నారు. ధర్మాన, బుగ్గన, రోజా, పెద్దిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, బొత్స తదితర మంత్రులందరూ వెనుకబడ్డారు.  వైసీపీ నేతలు, మంత్రులుపలువురు తొలి రౌండ్  ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోయారు.  

Teluguone gnews banner