జగన్ కేబినెట్ లో మంత్రులందరూ ఓటమి బాటలోనే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ తెలుగుదేశం కూటమి ప్రభంజనం కనిపిస్తోంది. దాదాపు 165 స్థానాలలో తెలుగుదేశం కూటమి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుండగా, వైసీపీ ఆధిక్యత కేవలం 10 స్ధానాలకే పరిమితమైంది.

జగన్ కేబినెట్ లో మంత్రులు, మాజీ మంత్రులూ దాదాపుగా ఓటమి బాటలో పయనిస్తున్నారు. మంత్రులు బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంధ్రనాథ్, అంజాద్ బాష, ఉషశ్రీ చరణ్, పిడికరాజన్నదొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్థన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజని, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున ఓటమి బాటలో ఉన్నారు.  

Teluguone gnews banner