వై నాట్ 175 .. జగన్ మాటే నిజమయ్యేలా ఉంది!

"ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచాం.. ఈసారి 175 కి 175 స్థానాలు గెలుస్తాం" అంటూ "వై నాట్ 175" అనే నినాదంతో 2024 ఎన్నికల బరిలోకి దిగారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అయితే ఇప్పుడు ఆయన మాటే నిజమయ్యేలా ఉంది. కానీ జగన్ పార్టీ కాకుండా.. కూటమి ఆ ఫీట్ ని సాధించేలా ఉంది.

చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే ఏపీలో జగన్ కుర్చీ కదలడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరిందో.. అప్పుడే వైసీపీ పునాదులు కదలనున్నాయని అందరూ బలంగా ఫిక్స్ అయ్యారు. ముందు నుంచి తమ విజయం పట్ల కూటమి ఎంతో నమ్మకంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే స్పష్టం చేశాయి. ఇక ఈరోజు వెలువడుతున్న ఫలితాలు చూస్తుంటే.. "వై నాట్ 175" నిజమైనా ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది.

ఏపీలో పోస్టర్ బ్యాలెట్ నుంచే కూటమి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలకు కనీసం 160 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ 10-15 సీట్లకే పరిమితం కానుందని ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి అర్థమవుతోంది. మొత్తానికి "వై నాట్ 175" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుని ఏపీ ప్రజలు మరోలా అర్థం చేసుకొని.. కూటమికి దాదాపు 170 స్థానాలు ఇచ్చేలా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Teluguone gnews banner