4 లక్షల హార్డ్ క్యాష్ తో అడ్డంగా బుక్కయిన ఎమ్మార్వో

ఎన్ని ఏసీబీలు ఉన్నా, ఇంకెన్ని విజిలెన్స్ టీంలు పనిచేస్తున్నా ప్రభుత్వాధికారుల్లో లంచావతారుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు వస్తున్నారు.. పోతున్నారు. కానీ ప్రజారంజకమైన పాలన మాత్రం అందించలేకపోతున్నారు. ప్రజల కష్టార్జితం మీద కన్నేసిన ప్రభుత్వాధికారులకు ధనదాహం తీరడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ నాగభూషణం లంచతంత్రం బయటపడింది. రూ. 4 లక్షల నగదు క్యాష్ పుచ్చుకుంటున్న ఎమ్మార్వోను శ్రీకాకుళం జిల్లా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పలువురు ఆసాములు దక్కించుకున్న షాపులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి జరిగిన బేరసారాల్లో రూ. 4 లక్షలు ఇవ్వడానికి ఆసాములు అంగీకరించారు. అయితే అప్పటికే తమ పని జరగడానికి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది కొర్రీలు వేయడం, తీరా పని జరిగేటప్పుడు కూడా ఎక్కడా కనికరం చూపకపోవడంతో ఆసాములంతా తెలివిగా ఏసీబీని ఆశ్రయించారు.  ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఒకరిద్దరు ఆసాములను రంగ ప్రవేశం చేయించిన ఏసీబీ అధికారులు.. డబ్బు ముట్టజెపుతుండగా నాగభూషణాన్ని చుట్టుముట్టారు. భారీ మొత్తంలో డబ్బు చేతులు మారుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టెక్కలిలోని వెలుగు కార్యాలయం పక్కన గల షాపులను పలువురు ఆసాములకు హ్యాండోవర్ చేసే క్రమంలో ఎమ్మార్వో భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. అసలే కోవిడ్ అవస్థల్లో వ్యాపారమంతా అస్తవ్యస్తమైపోగా షాపులు నడవడమే గగనమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో షాపు నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష దాకా డిమాండ్ చేసినట్టు షాపులు దక్కించుకున్న యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని షాపులు దక్కించుకోవాలంటే డిపాజిట్లు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి. షాపులు నడిచినా, నడవకపోయినా నెలనెలా అద్దెలు, కరెంటు బిల్లులు కట్టి తీరాల్సిందే. వరుసగా 3 నెలలు అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆ షాపులను సీజ్ కూడా చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో షాపులు నడుస్తాయో, నడవవో తెలియని క్రమంలో ఎమ్మార్వో నాగభూషణం షాపు యజమానుల నుంచి భారీ ఎత్తున సొమ్ము గుంజేందుకు పథకం సిద్ధం చేశారు. ఎమ్మార్వో ఒత్తిడితో విసిగిపోయిన పలువురు షాపు ఓనర్లు తెలివిగా ఏసీబీని ఆశ్రయించడంతో నాగభూషణం గుట్టు రట్టయింది.  ఎమ్మార్వో లంచావతారం బయటపడడంతో ఆంధ్రాలో  యావత్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. రెండేళ్ల క్రితం తెలంగాణలో అబ్బుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య జరిగింది. ఆ తరువాత తెలంగాణ ప్రబుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టింది. కొన్ని వైఫల్యాలున్నప్పటికీ పకడ్బందీగా నిర్వహించే కసరత్తు మాత్రం జరుగుతోంది. అయితే ఆంధ్రాలో కూడా అలాంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడం లేదా వ్యవస్థలో  అవినీతిని అంతం చేయడానికి జగన్ సర్కారు పూనుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయిన స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీపీ, జడ్పీటీసీ వంటి కీలక పదవుల్లో ఉన్నవారి జోక్యాన్ని కూడా తగ్గిస్తే తప్ప రెవెన్యూ విభాగంలో అనుకున్న ఫలితాలు రాబట్టలేమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి జగన్ సర్కారు  ఆ దిశగా చర్యలు చేపడుతుందో లేదో చూడాలి.

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్.. వేటు వేస్తారా?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో పీసీసి చీఫ్ రేవంత్ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా రాజుకున్న అసమ్మతి సెగలు, ఇంకా మండుతూనే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా అప్పాయింట్ అయిన మరు క్షణం నుంచే మొదలైన అసమ్మతి, ఆ తర్వాత కొంత సర్ధు మణిగింది. అడపా తడపా కోమటి రెడ్డి సోదరలు ఒకటి ఆరా చురకలు వేస్తున్నా, పార్టీలో అసమ్మతి అంతగా ఫోకస్ లోకి రాలేదు. కానీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సంధించిన అసమ్మతి అస్త్రాలు కాక పుట్టిస్తున్నాయి. అంతే కాదు జగ్గారెడ్డి వదిలిన బాణాలు ఢిల్లీని కూడా తాకాయి అంటున్నారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని, జగ్గారెడ్డిపై చర్యలు తీసుకున్నా తీసుకోవచ్చని పార్టీ వర్గాలా సమాచారం. జగ్గారెడ్డి చేసిన  విమర్శల సారాంశాన్ని, ఆ విమర్శల ప్రధాన ఉద్దేశాలకు సంబదించి రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, కొంతమంది నాయకలను అడిగి తెలుకున్నట్లు తెలుస్తోంది. జగ్గా రెడ్డి మాట్లాడిన వీడియో క్లిపులను కూడా మాణిక్కం ఠాగూర్,  తెప్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో పీసీసీ చీఫ్ టూర్ కు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్ గా , జిల్లా ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు జిల్లాలో జరిగే కార్యక్రమంపై ఎందుకు చెప్పరని  జగ్గా రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ చీఫ్, సర్వం తానే అన్నట్లు ఒంటెద్దు పోకడలు పోతున్నారని, మండి పడ్డారు. రేవంత్ రెడ్డి ఇదే ధోరణి  కొనసాగిస్తే పార్టీ మనగడకే ముప్పు ఏర్పడుతుంది జగ్గారెడ్డి సీరియస్ కామెంట్స్ చేసారు.  అంతే  కాదు తాను పార్టీ వదిలి, తెరాసలో చేరినా తనను ఎవరూ ఏమీ చేయలేరని, సవాలు విసిరారు. ఇంకా ముందుకెళ్ళి  రేవంత్ రెడ్డి ధోరణి వలన పార్టీకి కోలుకోలేని దెబ్బ తప్పదని హెచ్చరించారు. పీసీసీ చీఫ్ టార్గెట్’ గా జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ, పార్టీ వర్గాల్లో అటు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అందుకే జగ్గారెడ్డి అసమ్మతిని చర్చించేందుకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, తక్షణమే  సమావేశం కావాలని చెప్పారు మాణిక్కం ఠాగూర్ రాష్ట్ర నాయకులను కోరారు.  మరోవైపు రేవంత్ తీరుపై గుర్రుగా ఉన్న సీనియర్లు ఆ విషయం కూడా చర్చిచాలని అంటున్నారు.  పీసీసీ చీఫ్ పై  సీనియర్ నాయకులూ మరోమారు హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మాణిక్కం ఠాగూర్ , పీసీసీ చీఫ్ రేవంత్’తో పాటు షబ్బీర్ అలీ, ఇతర నేతలు హాజరవుతారు. జగ్గా రెడ్డి పై ఇప్పటికిప్పుడు వేటు వేయడం వంటి కఠిన నిర్ణయం తీసుకునే సాహసం కాంగ్రెస హై కమాండ్ అయిన చేయకపోవచ్చునని అంటున్నారు. ఏమవుతుందో .. చూడవలసి ఉంది.

ఓటమి భయమా.. కేసీఆర్ పై నమ్మకం పోయిందా? గులాబీ నేతల్లో పెరుగుతున్న అసహనం..

తెలంగాణలో అధికారంలో ఉన్న  టీఆర్ఎస్ పార్టీలో అసహనం దేనికి సంకేతం? నిజానికి అధికార పార్టీ అనే కాదు, ఏ పార్టీ లేదా నాయకుడిలో అసహనం పెరుగుతోందంటే, అందుకు మూల కారణం అశాంతి, భయం. ఆ భయం ఏదైనా కావచ్చును.  ఊరించి నోటిదాకా వచ్చిన పదవి పుటుక్కున చేజారి పోవడం కావచ్చును. కూర్చున్న కుర్చీ నేలలోకి కూరుకు పోవడం కావచ్చును. అంతర్గత కుమ్ములాటలు కావచ్చును. రేపటి ఎన్నికల్లో ఓటమి ముందుగానే ఖరారు కావడం కావచ్చును.. ఈ అన్నింటినీ మించిన భయం అవినీతి అక్రమాస్తుల కేసుల భయం. ఈ అన్నీ కూడా కావచ్చును. ఇలా భయం నీడలా వెంటాడుతున్నప్పుడు సహజంగానే నాయకులలో అసహనం పెరుగుతుంది.   కారణాలు ఏవైనా అధికార తెరాస నాయకుల్లో, మరీ ముఖ్యంగా ముఖ్య నేతల్లో అలాంటి అసహనం పెరుగుతోందా,అంటే, పార్టీ శ్రేణులు, క్రిందిస్థాయి నాయుకులు అవుననే అంటున్నారు.ముఖ్యంగా, పెద్ద సారుల రుసరుసలు ఎక్కువయ్యయీని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహరాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న, మంత్రి కేటీఅర్ సహా అందరినీ ఓటమి భయం చాలా చాలా వత్తిడికి గురిచేస్తోందని, నాయకుల మాటలో, నడకలో ఆ తేడా కనిపిస్తోందని అంటున్నారు.  రాష్ట్రంలో ప్రతిపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. సొంతపార్టీలో నేతల మధ్య కలహాలు, నిరసన ధ్వనులు ఎక్కువయ్యాయి. పార్టీ  సంస్థాగత కమిటీ ఏర్పాటులో మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన కుమారుడు, మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి మధ్య సాగిన బాహాబాహీ యుద్ధం వంటి సంఘటనలు సహజంగానే నాయకులను కలతకు గురుచేస్తున్నాయి. చివరకు జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుంటేనే గానీ,పరిస్థితి చక్కబడలే దంటే పరిస్థితి ఎంతగా విషమించిందో వేరే చెప్పనక్కర లేదు.   కేంద్ర ప్రభుత్వం బొక్కలు వెతికే పనిలో పడిందని, పాత చిట్టాలను తిరగతోడి, కొత్త కేసుల చిట్టా సిద్డంచేస్తోందని వస్తున్న వార్తలువెన్నులో చలి పుట్టిస్తున్నాయో ఏమో, ఆ ఆందోళన కూడా నేతల పోకడలలో కనిపిస్తోందని అంటున్నారు. ఇంత కాలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు, అరెస్ట్ తప్పదంటూ చేస్తూ వచ్చిన హెచ్చరికలను అంతగా పట్టించుకోక పోయినా తాజా సమాచారం ప్రకారం ఉచ్చు బిగుసుకుంటున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని అంటున్నారు. ఇలా అన్ని దిక్కుల నుంచి వత్తిళ్ళు పెరగడం వల్లనే, తెరాస నాయకుల్లో అసహనం బుసలు కొడుతోందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వ విప్‌‌లు విఫల మయ్యారని వారిపై మండిపడినట్లు సమాచారం.  శుక్రవారం శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపధ్యంలో కేటీఆర్ విప్‌‌లతో జరిపిన సమవేశంలో వారిపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌‌పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నా విప్‌‌లు నోరు విప్పడం లేదని ఇంతమంది విప్‌‌లు ఉండి ఏం లాభమని ప్రశ్నించారని సమాచారం. ప్రతిపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే పదవుల్లో ఉన్నవాళ్లు చూస్తూ ఊరుకోవద్దని, వారు ఏ భాషలో మాట్లాడుతున్నారో అదే విధంగా తిరిగి సమాధానం ఇవ్వాలని అన్నట్లు తెలిసింది. నిజానికి, ఒక్క విప్’లనే కాదు పార్టీ నాయకులు అందరూ ప్రతిపక్షాలపై మాటల దాడి  చేయాలని కేటీఆర్ ఎప్పుడోనే చెప్పారు. అదలా ఉంటే,  అధికార పార్టీలో ఇంతలా అసహనం పెరిగిపోవడం వలన పార్టీకే నష్టమని విజ్ఞులు సూచిస్తున్నారు.

టీడీపీతో జనసేన పొత్తు ఖాయమేనా? పరిషత్ ఎన్నికలతో క్లారిటీ వచ్చినట్టేనా? 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలో టీడీపీతో కలిసి పోటీ చేశాయి. 2019 ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీలు విడివిడిగానే బరిలో నిలిచాయి. ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన మధ్య సయోధ్య కుదిరింది. అయితే బీజేపీతో పొత్తు విషయంలో జనసేన హ్యాపీగా లేదనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. బీజేపీతో కటీఫ్ చెప్పడానికి జనసేనాని సిద్ధమవుతున్నారనే చర్చ కూడా ఉంది. తాజాగా అందుకు బలాన్నిచ్చేలా రాజకీయ సమీకరణలు ఏపీలో జరుగుతున్నాయి. బీజేపీతో కటీఫ్ చెప్పి టీడీపీతో కలిసి పనిచేసేందుకు పవన్ కల్యాణ్ పార్టీ పావులు కదుపుతున్నట్లు స్పష్టమైంది.   ఏపీలో జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన మధ్య స్థానికంగా పొత్తులు కుదిరాయి. గోదావరి జిల్లాలో ఇవి మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఇది మరింత బలపడింది. రెండు పార్టీలు కలిసి పలు మండలాల్లో అధికార పార్టీకి షాకిచ్చాయి. గుంటూరు జిల్లా ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి నియోజ‌కవ‌ర్గంలోని దుగ్గిరాల మండ‌లంలో అధికార వైసీపీకి టీడీపీ చుక్క‌లు చూపిస్తుండ‌గా.. తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క‌డియం మండలంలో ఏకంగా ఎంపీపీ ప‌ద‌వినే కైవ‌సం చేసుకుంది. ఇక్క‌డ కేవలం నాలుగు స్థానాల‌ను ద‌క్కించుకున్న టీడీపీకి.. 8 స్థానాలు గెలుచుకున్న జ‌న‌సేన మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో పాటుగా ఎంపీపీ ప‌ద‌విని టీడీపీకి క‌ట్ట‌బెట్టింది జనసేన.   క‌డియం మండ‌లంలో మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నామినేష‌న్ల స‌మ‌యంలోనే వైసీపీ, జ‌న‌సేన ఒక్కో స్థానాన్ని ఏక‌గ్రీవంగా ద‌క్కించుకున్నాయి. మిగిలిన 20 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా.. వైసీపీ, జ‌న‌సేన 8 స్థానాల చొప్పున గెలుచుకోగా.. టీడీపీకి 4 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. ఈ క్రమంలో ఎంపీపీ స్థానం వైసీపీకి ద‌క్కకుండా టీడీపీ, జ‌న‌సేన‌లు ఎన్నిక‌ల‌కు ముందు నుంచే వ్యూహాత్మ‌కంగా క‌లిసి సాగాయి. జ‌న‌సేన బ‌రిలో నిలిచిన స్థానాల్లో టీడీపీ మ‌ద్ద‌తు ప‌లికితే.. టీడీపీ బ‌రిలో నిలిచిన చోట జ‌న‌సేన మ‌ద్ద‌తు ప‌లికింది. రెండు పార్టీలు క‌లిసి వైసీపీకి చుక్క‌లు చూపాయి. అయితే ఎంపీపీ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు వైసీపీ ర‌చించిన వ్యూహాన్ని జ‌న‌సేన తిప్పికొట్టింది. తాను టీడీపీతోనే సాగుతాన‌ని తేల్చి చెప్పింది. క‌డియం జ‌డ్పీటీసీని తాను గెలిచేలా సాయం చేసిన టీడీపీకే క‌డియం ఎంపీపీని ఇచ్చేస్తున్న‌ట్లుగా జ‌న‌సేన సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.  జ‌న‌సేన ప్ర‌స్తుతం బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా సాగుతున్నా తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల నాటి నుంచి ఇరు పార్టీల మ‌ధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదనే అభిప్రాయంతో ఉన్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చడంపై గుర్రుగా ఉన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇరు పార్టీల మధ్య మరింత గ్యాప్ పెచ్చింది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తానని ప్రకటించారు పవన్ కల్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేయడమంటే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే. ఈ లెక్కన బీజేపీతో తెగతెంపులకు పవర్ స్టార్ దాదాపుగా సిద్దమైపోయారని చెబుతున్నారు. అందులో భాగంగానే పరిషత్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు సాగారన అంటున్నారు.  జ‌న‌సేనాని ప్రస్తుతానికి బ‌య‌ట‌కు చెప్ప‌కున్నా.. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల మాదిరిగా.. 2024లోనూ టీడీపీతోనే జ‌ట్టు క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగానే జ‌న‌సేన‌కు బ‌ల‌మున్న చోట‌ల్లా బీజేపీతో కాకుండా టీడీపీతోపొత్తు పెట్టుకునే ఆ పార్టీ ముందుకు సాగుతోంది. కడియంలో టీడీపీ కంటే త‌న బలం రెట్టింపుగా ఉన్నా కూడా టీడీపీకే ఎంపీపీ పీఠాన్ని వ‌దిలేసిన వైనం కూడా టీడీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య బ‌లం మ‌రింత‌గా బ‌లోపేతాన్ని సూచిస్తున్న‌దేన‌ని చెప్పాలి. టీడీపీ వెంట జ‌న‌సేన సాగితే.. 2024లో వైసీపీకి చుక్కలు ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. 

టాప్ న్యూస్ @ 1PM

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను గుర్తు చేసుకున్నారు. బాలు లేరన్న విషయాన్ని నమ్మాలనిపించడం లేదని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు ----- ఏపీలో వైద్య విధాన పరిషత్, విద్యా వ్యవస్థలు పూర్తిగా నాశనమవుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల రద్దుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయని చెప్పారు. ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పిన 12 కాలేజీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ 12 కాలేజీల లెక్చరర్లకు రఘురామకృష్ణరాజుకు ఇచ్చినట్టు కౌన్సిలింగ్ ఇవ్వడం దారుణమని అన్నారు. ----- అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను జియో సంస్థ సబ్ డొమైన్ లో విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సేవాభావంతోనే జియో సంస్థ ఈ సేవలను అందించడానికి ముందుకొచ్చిందని.. జియో క్లౌడ్ ద్వారా గంటన్నర వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు.ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. ----- కర్నూలు జిల్లా లద్దగిరిలో కేంద్ర మాజీమంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు. సూర్యప్రకాశ్ రెడ్డిని చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. ఈ ఘటనపై సూర్యప్రకాశ్ రెడ్డి వెంటనే  పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు లద్దగిరిలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  ----- కృష్ణాజిల్లా పెడనలో జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్లపల్లి రామ్ సుధీర్ కారును దుండగులు ధ్వంసం చేశారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పెడన పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న హోటల్‌లో రాత్రి రామ్ సుధీర్ బస చేశారు. అయితే బయట నిలిపి ఉంచిన కారు అద్దాలను రాళ్లతో పగలకొట్టారు ఆగంతకులు.  ----- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు. ఇన్‌చార్జి సెక్రటరీ బోసురాజుతో మాణిక్కం ఠాగూర్ సమాచారం తెప్పించుకున్నారు. శనివారం గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ తీరును సమావేశంలో నిలదీసేందుకు జగ్గారెడ్డి రెడీ అయ్యారు. ------- ముఖ్యమంత్రి కేసీఆర్‌, కౌశిక్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్’’ అని వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్న వారికి దళిత బందు ఇవ్వరా అని  ప్రశ్నించారు. ఏం పదవి ఏం హోదా ఉందని కౌశిక్ రెడ్డి తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్‌లో ఎంట్రీ దొరికిందన్నారు. పదవి కూడా రాబోతుందని... ఈ విషయం ప్రజలకు తెలుసని ఈటెల అన్నారు ------- టీఆర్ఎస్ సీనియర్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు మళ్లీ అదృశ్యమయ్యారు. గత రెండు రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఎవరికీ అందుబాటులో లేరు. కుటుంబ సభ్యులకు ఆయన ఎక్కడున్నారన్న వివరాలు చెప్పలేదు. ఆయన వినియోగించే వ్యక్తిగత వాహనాలను సైతం ఇంటిదగ్గరే వదిలిపెట్టారు. గతంలోనూ ఆయన ఇలాగే కనిపించకుండా పోతే పోలీసులే ఆయనను ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చారు. ---- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది రూ.3.07 కోట్లకు పెరిగింది. ప్రధాని వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంచారు. -------- రాజస్థాన్ లోని జైపూర్ లో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయారు. అందులో ఐదుగురు విద్యార్థులు కాగా.. ఒకరు కారు డ్రైవర్. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. జైపూర్– ఢిల్లీ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించింది. ----

మళ్లీ మిస్సైన పుట్టమధు? కుటుంబ సభ్యుల్లో కలవరం..

గతంలో వారం రోజుల పాటు మిస్సైన టీఆర్ఎస్ సీనియర్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు మళ్లీ అదృశ్యమయ్యారు. గత రెండు రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఎవరికీ అందుబాటులో లేరు. కుటుంబ సభ్యులకు ఆయన ఎక్కడున్నారన్న వివరాలు చెప్పలేదు. ఆయన వినియోగించే వ్యక్తిగత వాహనాలను సైతం ఇంటిదగ్గరే వదిలిపెట్టారు. గతంలోనూ ఆయన ఇలాగే కనిపించకుండా పోతే పోలీసులే ఆయనను ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చారు. తాజాగా మరోసారి ఆయన కనిపించకుండా పోయారు. తెలంగాణలో  పెను సంచలనం స్పష్టించిన పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు విషయంలో పుట్ట మధును పోలీసు ఉన్నతాధికారులు విచారించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సన్నిహితుడైన పుట్ట మధు ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన రోజే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో పుట్ట మధు అదృశ్యం అప్పట్లో రాజకీయ రచ్చగా కూడా మారింది.  ఆయన వారం రోజుల పాటు కనిపించకుండా పోయారు. చివరికి పోలీసులు అతడిని ఆంధ్రప్రదేశ్ లో ట్రేస్ చేసి తీసుకుచ్చారు. తర్వాత పోలీసుల విచారణకు హాజరయ్యారు పుట్ట మధు.  మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వేల కోట్ల రూపాయలను అక్రమంగా అర్జించారని, అక్రమాస్తులు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని బయట్టబయలు చేయడానికి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, ఆయన సతీమణి నాగమణి ప్రయత్నాలు చేశారు. హైకోర్టులోనూ పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. కానీ  వీరిని పట్టపగలే నడిరోడ్డుపై హతమార్చారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి పుట్ట మధు అనే ఆరోపణలున్నాయి. వీటిని ఆయన ఖండించారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో ఇప్పటికీ పుట్ట మధు నిందితుడిగా ఉన్నారు. ఈ హత్యపై స్పందించిన హైకోర్టు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేసింది.

కరోనా ముప్పు ఇంకా ఉందా? థర్డ్ వేవ్ వస్తుందా.. రాదా? 

దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులో ఉంది. తాజాగా కొత్త కేసులు మరోసారి 30 వేల దిగువన నమోదయ్యాయి. మరణాలు 300 దిగువకు చేరాయి. అలాగే, కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం  (సెప్టెంబర్ 25) న విడుదల చేసిన తాజా గణాంకాలను గమనిస్తే, రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది. అయినా దేశంలో రికవరీ రేటు 97 శాతానికి పైగా (97.78 శాతం) ఉంది కాబట్టి, అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారాలు అంటున్నారు.  అయితే కరోనా ముప్పు తొలిగి పోయిందని అధికారులే గట్టిగా చెప్పలేక పోతున్నారు. అంట  బాగుందని అంటూనే, మనం ఇంకా సెకండ్ వేవ్ ఉచ్చులోనే ఉన్నామని అంటున్నారు. అలాగే, వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతునన్ నేపధ్యంలో, సెకండ్ వేవ్’తోనే కరోనా దేశం వదిలి పోతుందా? అంటే అధికారులు, నిపుణులు ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ నేపధ్యంలో, థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందా? ఉండదా? ఇప్పుడు దేశంలోని చాలా మందిని వేధిస్తున్న  ప్రశ్నలు ఇవి. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలు కావచ్చని గతంలో కొందరు నిపుణులు అంచనావేశారు.  థర్డ్ వేవ్ ముప్పు అవకాశాలపై కౌన్సిల్ ఆఫ్ సైన్టిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) నిపుణులు థర్డ్ వేవ్ రాదని చెప్పకుండానే, వచ్చినా. దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని తేల్చారు. తమ అంచనాల వెనుక బలమైన కారణాలను కూడా విశ్లేషించారు. ఇప్పటికే దేశంలో చాలా మంది ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందున.. థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండదని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మాండే పేర్కొన్నారు.దేశంలో గణనీయ సంఖ్యలో జనాభా మొదటి డోస్, రెండో డోస్ వ్యాక్సిన్లు తీసుకోవడం వలన వైరస్ వ్యాప్తిని  వ్యాక్సిన్ అడ్డుకుంటుందని అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ సోకినా.. దాని తీవ్రత పెద్దగా ఉండదన్నారు శేఖర్ సీ మాండే.  మరోవైపు  దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కొత్త స్ట్రెయిన్, వ్యాక్సినేషన్ మీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు. కొత్త స్ట్రెయిన్ వ్యాపించే తీవ్రతను బట్టి థర్డ్ వేవ్ ఆధారపడి ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫసర్ మణింద్ర అగర్వాల్ పేర్కొన్నారు. అయితే, ముప్పు పూర్తిగా తొలిగిపోకపోయినా, ప్రమాదం స్థాయి తగ్గిందని అదే సమయంలో సెకండ్ వేవ్ స్థాయి ప్రమాదం నుంచి బయట పడిందని ... అంటున్నారు. అయితే జాగ్రత్తలు పాటించకపోతే, ఎప్పుడైనా కరోనా మళ్ళీ విరుచుకు పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

టీ కాంగ్రెస్ లో మరో తుపాను.. జగ్గారెడ్డి దారెటు? 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడిగా  రేవంత్ రెడ్డి  బాధ్యతలు చేపట్టిన తర్వాత  రాష్రంలో పార్టీని అధికార తెరాసకు ప్రత్యాన్మాయంగా నిలిపేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి ఇంకా రెండు నెలలు అయినా పూర్తి కాలేదు. అయినా ఇంతలోనే దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం పెంచారు. క్యాడర్ లో జోష్ పెరిగింది. ప్రజల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయనే భావన ఏర్పడింది. అయితే అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందా, అంటే. లేదు. రేవంత్ రెడ్డి దూకుడుకు, సేనియర్ల రూపంలో స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్నాయి. పార్టీ సేనియర్ల నుంచి ఆయన సమస్యలు, సవాళ్ళు ఎదుర్కుంటున్నారు. దీంతో, కాంగ్రెస్ కథ మళ్ళీ మొదటికి వస్తోందా, అనే అనుమానాలు కూడా ఇంతలోనే మొదలయ్యాయి.    ఇది కాంగ్రెస్ సంస్కృతిలో భాగమే. పీతల సంఘం , కప్పేల తక్కెడ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదనే అభిప్రాయం కూడా ఉంది. రేవంత్ రెడ్డి పార్టీకి కొత్తే అయినా,కాంగ్రెస్ సంస్కృతి తెలియంది కాదు. అయినా పార్టీ హైకమాండ్, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇచ్చిన భరోసాతో సీయర్లకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్లు సహకరించిన, సహకరించక పోయినా, అయన తన పంధాలో తాను ముందుకు సాగుతున్నారు.  ఈ నేపద్యంలోనే  కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు పదే పదే పైకొస్తున్నాయి. ఓ వంక కోమటిరెడ్డి సోదరలు ఓపెన్ గా ఫైర్ అవుతుంటే, ఇతర సేనియర్ నాయకులు మౌనంగా ఉంటూనే, రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.  తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  భగ్గుమన్నారు.రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే, పార్టీ మనుగడ కష్టమని అన్నారు. అలాగే, జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుల  మీద కూడా, ‘ చెంచాగాళ్లు’ అంటూ విరుచుకు పడ్డారు.  కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక్కడే హీరో.. మిగతావాళ్లంతా కోవర్టులు అన్నట్లుగా రేవంత్ చెంచాగాళ్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే అయిన  తనకు తెలియకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జహీరాబాద్;లో పర్యటించడం కూడా జగ్గారెడ్డికి కోపం తెప్పించింది.  అదే సమయంలో జగ్గ్గారెడ్డి తాను తెరాసలోకి పొతే అడ్డుకునేది ఎవరని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిజానికి  ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినా 19మందిలో 12 మంది పార్టీ ఫిరాయించడం పార్టీ ప్రతిష్టను గట్టిగా దెబ్బ తీసింది. ఇలాంటి పరిస్థిలో ముఖ్యంగా  మరో ముఖ్య నేత కూడా అదే బాటలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో, పీసీసీ పదవికి పోటీపడి, వర్కింగ్ ప్రెసిడెంట్’గా బాధ్యతలు నిర్వహిస్తున్న జగ్గారెడ్డి  తెరాస తీర్ధం పుచ్చుకుంటే, కాంగ్రెస్ పార్టీని మరింతగ డెబ్బ తీస్తుందని అంటున్నారు. అయితే జగ్గా రెడ్డి తానూ కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని, ప్రతిలో కొనసాగుతూనే పోరాటం సాగిస్తానని అన్నారు. అయినా  జాతీయ స్థాయిలో ముఖ్యంగా పంజాబ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో పాట నీరు కొట్టుకుపోయియా కొత్త నీరు వచ్చి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోనూ అదే జరుగుతుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, రేవంత్ రెడ్డి సారధ్యంలోనే పార్టీ ముందుకు సాగుతుందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

చంపేస్తానంటూ ఇంటికొచ్చి కేకలు.. ఏపీలో కేంద్ర మాజీ మంత్రికే రక్షణ లేదా? 

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. శాంతి భద్రతలు దారుణంగా తయారయ్యాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరిపై ఎవరూ దాడి చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతిపక్ష నేతలు రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా కేంద్ర మాజీ మంత్రి ఇంటి దగ్గరికి ఓ వ్యక్తి హల్ చల్ చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా కేంద్ర మాజీ మంత్రిని చంపేస్తానని కేకేలు వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.  కర్నూలు జిల్లా లద్దగిరిలో కేంద్ర మాజీమంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు. సూర్యప్రకాశ్ రెడ్డిని చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. ఈ ఘటనపై సూర్యప్రకాశ్ రెడ్డి వెంటనే  పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు లద్దగిరిలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  కేకలు వేసిన వ్యక్తి లద్దగిరి పక్కనే ఉన్న అల్లినగరం గ్రామానికి చెందిన లక్ష్మన్నగా గుర్తించారు పోలీసులు. మద్యం మత్తులోనే అలా ప్రవర్తించినట్లు నిర్ధారించారు. అతని కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఈ ఘటనపై సూర్యప్రకాశ్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అల్లినగరం గ్రామానికి చెందిన లక్ష్మన్న తప్పతాగి తన ఇంటి వద్దకు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశాడని అన్నారు. తనను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని అన్నారు. ఓ తాగుబోతు తన ఇంటికి వచ్చి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు అంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి? అని సూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో క్రైమ్ పెరిగిపోతోందని, తాగుబోతులు చెలరేగిపోతున్నారని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

జనసేన నాయకుడిపై దాడి.. కృష్ణా జిల్లాలో టెన్షన్ టెన్షన్ 

ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలపై దాడులకు అంతే లేకుండా పోతోంది. తాజాగా  కృష్ణాజిల్లా పెడనలో జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్లపల్లి రామ్ సుధీర్ కారును దుండగులు ధ్వంసం చేశారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పెడన పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న హోటల్‌లో రాత్రి రామ్ సుధీర్ బస చేశారు. అయితే బయట నిలిపి ఉంచిన కారు అద్దాలను రాళ్లతో పగలకొట్టారు ఆగంతకులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త సమీకరణలు తెరపైకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య అవగాహన కుదిరింది. దీంతో ఆచంట, వీరవాసరం MPPలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. చంటలో MPPని తెలుగుదేశం గెల్చుకుంది. ఇక్కడ టీడీపీ-7, జనసేన- 4, వైసీపీ 6 చోట్ల విజయం సాధించాయి. జనసేన మద్దతుతో MPP టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. జనసేనకు వైస్ ఎంపీపీ, కోఆప్షన్‌ పదవులు దక్కాయి. వీరవాసరంలో ఆసక్తికర రాజకీయం జరిగింది. అతి తక్కువ సీట్లు గెలిచిన TDPకి MPP దక్కింది. ఇక్కడ జనసేన-8, టీడీపీ-4 చోట్ల గెలుపొందాయి. వైసీపీ 7 చోట్ల విజయం సాధించింది. అయితే ఇక్కడ కూడా జనసేన మద్దతుతో టీడీపీకి చెందిన వీరవల్లి దుర్గాభవాని పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. 

నాన్సెన్స్.. డోంటాక్.. ఎమ్మెల్సీపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ నేతలు దిగజారిపోతున్నారు. ప్రజా ప్రతినిధులమన్న సంగతి మరిచి బరి తెగిస్తున్నారు.బహిరంగంగానే రెచ్చిపోతున్నారు. తమను ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. సామాన్యులనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు వైసీపీ నేతలు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అయితే మరింతగా బరి తెగించాడు. బహిరంగ సభా వేదికపై శాసనమండలి సభ్యుడిని బండ బూతులు తిట్టాడు. ఎమ్మెల్సీని మల్లాది విష్ణు తిట్టిన వీడియో వైరల్ గా మారింది.  విజయవాడలో ఈ నెల 22న ఏపీ ప్రభుత్వ ఐఐటీలు.. డీఎల్ టీలకు సంబంధించిన అప్ గ్రేడ్ విధానంపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. వెంకటేశ్వరావు సహాపలువురు ప్రజాప్రతి నిధులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో మొదట  ప్రసంగించిన ఎమ్మెల్సీ వెంకటేశ్వరావు ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడారు. సీపీఎస్ విధానంపై మాట్లాడారు. జగన్ పాదయాత్రలో సీపీఎస్ పింఛన్ రద్దుపై హామీలు ఇచ్చారని..అయితే ఇప్పటి వరకు అమలు కాలేదని చెప్పారు. సీపీఎస్ పింఛన్ విధానంపై వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్సీ వెంకటేశ్వరావు.  ఎమ్మెల్సీ మాట్లాడిన తర్వాత మైక్ అందుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెచ్చిపోయాడు. తానో అధికార పార్టీ ఎమ్మెల్యేనని తనతోపాటు వేదిక పంచుకున్న నాయకుడు.. తోటి ప్రజాప్రతినిధి అనే స్పృహకూడా కోల్పోయారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేశారు. అసలు విషయం వదిలేసి..   ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. నాన్సెన్స్.. డోంటాక్.. నువ్వేం చేస్తావ్.. అంటూ.. విరుచుకుపడ్డారు. మీరు మీ ఉపాధ్యాయులు ఏం చేస్తారు..? ఏం చేయగలరు? అంటూ.. ప్రశ్నించారు. మీరేదైనా మాట్లాడుకోవాలంటే.. ప్రత్యేకంగా మైకు పెట్టుకుని మాట్లాడుకోవాలని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.  మల్లాది విష్ణు వ్యాఖ్యలతో సభకు హాజరైన వారంతా షాకయ్యారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అయితే నివ్వెర పోయారు. క దశలో గుర్రుగా చూస్తూ వెంకటేశ్వరరావును బెదిరించే ప్రయత్నం చేశారు మల్లాడి విష్ణు. వేదికపై ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు వారించడంతో ఆయన కాస్త కూలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమ్మెల్యే  విష్ణుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తోటి ప్రజాప్రతినిధిపై ఇలాగేనా ప్రవర్తించేదంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఇంత జరిగినా ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ ఘటనపై స్పందించ లేదు. ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్సీని అధికార పార్టీ ఎమ్మెల్యే అవమానించినా ఉధాద్యాయ సంఘాలు కూడా సైలెంటుగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. 

తిరుమల వెళ్తున్నారా... ఆ ఒక్కటి లేకపోతే దర్శనం నాస్తి

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి ఓ కొత్త నిబంధన విధించింది. ఆ నిబంధన కొంతవరకు రిలీఫ్ ఇస్తుండగా.. మరోవైపు కఠినమైన నిబంధనగా మారింది. కొద్దిరోజుల క్రితం వరకు శ్రీవారి దర్శనాన్ని చిత్తూరు జిల్లా భక్తులకే పరిమితం చేయగా.. తాజాగా సర్వదర్శనం కోటాను గణనీయంగా పెంచింది. కోవిడ్ వ్యాప్తి, థర్డ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో వేంకటేశ్వరుడి దర్శనాన్ని కేవలం చిత్తూరు వాసులకే పరిమితం చేయడంతో వివిధ దూర ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వామివారి మీద ఎంతో భక్తితో ఎన్నో కష్ట-నష్టాలకోర్చి వచ్చిన పలువురు భక్తులైతే తమకు దర్శనం దక్కనందుకు బాధపడుతూ బస్టాండ్ పక్కన క్యూ లైన్లలో, రోడ్ల మీద ఏడుస్తూ కనిపించారు. ఆ దృశ్యాలతో డ్యూటీ పోలీసులు, టీటీడీ సిబ్బంది సైతం ఎంతో సానుభూతి కనబరచారు. అలాంటి పరిస్థితుల్లో తాజాగా సర్వదర్శనం కోటా పెంచుతూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించేదే అయినా.. దర్శనానికి వచ్చే భక్తులకు విధించిన తాజా నిబంధన మాత్రం వారికి మరో అగ్నిపరీక్షలా మారింది.  కోవిడ్ థర్డ్ వేవ్ ను అరికట్టే క్రమంలో రెండు దఫాల వ్యాక్సిన్ తీసుకున్నట్టు ధ్రువీకరించే సర్టిఫికెట్ గానీ లేదా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ గానీ తమవెంట తప్పకుండా ఉంచుకోవాలంటూ టీటీడీ తాజా నిబంధన విధించింది. దీంతో ఆన్ లైన్ మీద అవగాహన ఉన్న భక్తులు కోవిన్ డాట్ కామ్, ఆరోగ్యసేతు లాంటి యాప్ ద్వారా సర్టిఫికెట్లను డౌన్ లోడ్ చేసుకొని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఆన్ లైన్ మీద అవగాహన లేని, ఈ సమాచారంతో అప్ డేట్ కాని లక్షలాది మంది సామాన్య భక్తుల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. కాబట్టి తిరుమల వెళ్లేవారు తప్పకుండా వీలైనంత ముందస్తుగా ప్రిపేర్ కావాలని లేకపోతే అక్కడికి వెళ్లాక ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.  కొద్దిరోజులుగా కేవలం 2 వేల మందికి, అది కూడా చిత్తూరు జిల్లావాసులకే పరిమితం చేశాక.. 3, 4 రోజుల క్రితమే దర్శనానికి భక్తుల సంఖ్యను పెంచడంతో తిరుమలకు మళ్లీ తాకిడి పెరిగింది. తాజాగా (శుక్రవారం) భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుపతి శ్రీనివాసం వద్దకు చేరుకున్నారు. ఫలితంగా క్యూలైన్ రోడ్డుపైకి వచ్చింది. ఒకదశలో భక్తులను అదుపు చేయలేక టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది చేతులెత్తేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బస్టాండు వరకు క్యూలైన్ ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రోడ్డుపైనే కూర్చొని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా కోవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందుతున్న అధికారులు ఈ విధంగా రెండు దఫాల వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ గానీ, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ గానీ తప్పకుండా తమవెంట ఉంచుకోవాలన్న నిబంధన విధించారు. ఈ విధానం అక్టోబర్ ఫస్టు నుండి అమల్లోకి వస్తుంది. 12 సంవత్సరాల లోపు వున్న పిల్లలను నిబంధన నుంచి సడలించారు. అయితే వారికి ఆధార్ కార్డును మాత్రం తప్పనిసరి చేశారు. 12 నుండి 18 సంవత్సరాలు ఉన్నవారికి దర్శనం తేదీ నుండి 72 గంటల ముందు జారీ అయిన కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. 18 సంవత్సరాలు పైబడ్డ వారికి రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికేట్, లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ విధానం  రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు అలాగే ఆన్‌లైన్ సర్వ దర్శనం టోకెన్లు కలిగిన వారికి, వర్చువల్ దర్శనం టికెట్లు కలిగిన వారికి కూడా వర్తిస్తాయి. ఈ నెలాఖరు వరకు మాత్రమే పాత పద్ధతిలో అంటే కేవలం ఆధార్ కార్డు పద్ధతిలో దర్శనం అనుమతిస్తారు. ఆ తరువాత కొత్త రూల్స్ వర్తిస్తాయి.

టాప్ న్యూస్ @ 8PM

పోలవరం ప్రాజెక్ట్‌లో జరుగుతున్న అవకతవకలపై కేంద్రవిజిలెన్స్ కమిషన్‌కు టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఫిర్యాదు చేసారు. నష్టపరిహారం, పునరావాసంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని లోకేష్  పేర్కొన్నారు. అవకతవకలపై ఆధారాలతో సహా కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసారు. సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు, పాస్‌బుక్ నెంబర్లు, చెల్లించిన డబ్బుల వివరాలను ఫిర్యాదులో లోకేష్ పొందుపరిచారు. సాక్ష్యాల ఆధారంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ వెంటనే విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేసారు.  -------- విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్రం మరో ముందుడుగు వేసింది. లీగల్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ల నియామకానికి కేంద్రం చకచకా పావులు కదుపుతున్నది. ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కోసం 5 కంపెనీలు బిడ్లు దాఖలు చేసాయి. ఐదుగురిని కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్ లిస్ట్ చేసింది. ఈనెల 30న ప్రజెంటేషన్ ఇవ్వాలని 10 కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. లీగల్ లీగల్ అడ్వైజర్ కోసం ఢిల్లీకి చెందిన మూడు కంపెనీలతో పాటు గుర్గామ్, ముంబై కంపెనీలు బిడ్లు దాఖలు చేసాయి.  ---- వైద్యారోగ్యశాఖలో సిబ్బంది నియామకాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష ముగిసింది. వెంటనే సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పీహెచ్‌సీల నుంచి వైద్యకళాశాలలు, బోధనాసుపత్రుల వరకు పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీని ప్రారంభించి నవంబర్‌ 15 నాటికి ముగింపు చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. ------- ఉత్కంఠ రాజకీయాల మధ్య విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ-7, వైసీపీ-7 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కొర్రా పద్మ టీడీపీలో చేరారు. దీంతో ఎనిమిది మందితో జి.మాడుగుల ఎంపీపీ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది.  ----- తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. తీవ్ర అల్పపీడనం ఈ రాత్రికి వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించిందని కన్నబాబు తెలిపారు. రాగల 48 గంటల్లో ఆ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు పయనిస్తుందని వివరించారు ---- నూతన రాష్ట్రంగా తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రోటోకాల్ నియమాల ప్రకారం  అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. గొప్ప సంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున సూచించిన అంశాలనే కాకుండా ప్రతిపక్షం చర్చించాలనుకున్న సబ్జెక్టులను కూడా పరిగణలోకి తీసుకుని చర్చించాలన్నారు ------- కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని అన్నారు. ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తామన్నారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని.. అయితే సాగర్ ఉప ఎన్నికలో గెలవడం కష్టమని ఆనాడే చెప్పాన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజం కూడా అంతగా బాగోలేదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -------- నల్లగొండ జిల్లాలోని ముషంపల్లిలో అత్యాచారం, హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎంపీ కోమటిరెడ్డి లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ దుండగులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసారు. ---- విరసం నేత వరవరరావు బెయిల్‌ను బాంబే హైకోర్టు మరోసారి పొడిగించింది. తెలంగాణకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు. వరవరవరరావు పిటిషన్‌ విచారణను అక్టోబర్ 13కు కోర్టు వాయిదా వేసింది. అక్టోబర్ 13 వరకు ఇదే స్థితిని కొనసాగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. వరవరరావు బాంబేలోనే అక్టోబర్‌ 13 వరకు ఉండాలని కోర్టు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ------ మరికొన్నిరోజుల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. సీనియర్ నటుడు బాబూమోహన్ తాజా 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబూమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరుగా ప్రకాశ్ రాజ్ పేరెత్తకుండా మరో ప్యానెల్ ప్రెసిడెంట్ అంటూ విమర్శించారు.

మూడు వేల రైస్ మిల్లులు మూత? కేసీఆర్ హడావుడి ఢిల్లీ టూర్ ఆంతర్యమిదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు లేని వైఖరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడిప్పుడే నిదానంగా తెలిసొస్తోంది. ఆ పరిణామాల పర్యవసానాలు ముందుగా రైస్ మిల్లర్లు ఎదుర్కోబోతున్నట్టు కేసీఆర్ కు, ఆయన వందిమాగధులకు క్రమంగా బోధపడుతోంది. అందువల్లే అలాంటి ప్రమాదమేదీ ముంచుకు రాకముందే ఢిల్లీలో పనులు చక్కబెట్టుకొని రావాలని కేసీఆర్ కు ఆయన ఆంతరంగికులు హితబోధ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దాని ఫలితమే ఈ నెలలోనే కేసీఆర్ రెండోసారి ఢిల్లీ టూర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని అగ్రవర్ణాల్లో రెెడ్ల తరువాత ఇంచుమించుగా బ్రాహ్మలతో సమానంగా జనాభా ఉన్న సెక్షన్ వైశ్యులు. రైస్ మిల్లుల్లో అధిక శాతం వీరి అధీనంలోనే ఉన్నాయి. అయితే వచ్చే సీజన్లో బియ్యం కొనుగోళ్లపై ఇటీవల ఎఫ్.సి.ఐ. పరిమితులు విధించడం తెలంగాణలో సర్కారును ఇరుకున పెట్టింది. ఎఫ్.సి.ఐ కేవలం 60 లక్షల టన్నుల మేలురకం వరి ధాన్యాన్ని మాత్రమే కొంటామని, అంతకుమించి కొనుగోలు చేసే సామర్థ్యం లేదని తేల్చి చెప్పింది. ఈ పరిణామంతో రైస్ మిల్లుల నుంచి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగిందంటున్నారు.  తెలంగాణలో ప్రస్తుతం దాదాపుగా మూడు వేల రైస్ మిల్లులున్నాయి. వీటిలో కార్మికులుగా, కూలీలుగా, రైస్ మిల్ ఉద్యోగులుగా దాదాపు 2 లక్షల మంది నేరుగా ఉపాధి పొందుతున్నారు. అది కాకుండా ఈ రైస్ మిల్లుల ద్వారా మొత్తం దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించాక మిషన్ భగీరథలో భాగంగా సాగునీటి సౌలభ్యత పెంచడం మీదనే కేసీఆర్ అత్యధిక శ్రద్ధ కనబరచారు. మిగతా పనులకు ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే ఇప్పుడు కేసీఆర్ ను పునరాలోచనలో పడేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సాగు విస్తీర్ణాన్ని పెంచిన తరువాత అన్ని రకాల వరి వంగడాల ఉత్పత్తికి తెలంగాణే కేంద్రం అవుతుందని, దేశంలో ఏ రాష్ట్రానికి కావాలన్నా, ప్రపంచంలో ఏ దేశానికి కావాలన్నా అత్యంత నాణ్యమైన వరి వంగడాలు సరఫరా చేసే స్థితిలో తెలంగాణ ఉంటుందని విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ప్రజలంతా అదే నిజమని నమ్మారు. సాగునీరు కూడా ఎప్పుడూ లేనిరీతిలో అందుబాటులోకి వచ్చిన కారణంగా రైతులంతా వరిసాగునే ఆశ్రయించారు. దీంతో వరి రెట్టింపు ఉత్పత్తిని రికార్డు స్థాయిలో నమోదు చేసింది. రైతులకు శ్రమ ఫలితం దక్కుతుందని ఆశించిన కొన్నిరోజులకే కొనుగోళ్లు చేయలేని పరిస్థితి తలెత్తింది. దీనిపై రైతులంతా గతేడాది ఆందోళనబాట పట్టారు. వెంటనే కేసీఆర్ జోక్యం చేసుకొని రైతుల దగ్గర నుంచి ఆఖరు బియ్యపు గింజ కొనుగోలు చేసే పూచీ తనదని హామీ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో గతేడాదే బియ్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అశక్తత స్పష్టంగా బయటపడింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి తలెత్తకముందే సమస్యను పరిష్కరించాలన్న ఒత్తిడిలో కేసీఆర్ పడిపోయారు. అందుకే ఆఘమేఘాల మీద ఢిల్లీకి పయనమై కేంద్రం పెద్దలను ఒప్పించడమే ఎజెండాగా పెట్టుకున్నట్టు సమాచారం.  రాష్ట్రంలో ఇప్పటికే వరిసాగు మీద భయాందోళనలు నెలకొన్నాయి. పెరిగిన సాగుభూమిలో వరికాకుండా ఇతర పంటల్ని ప్రోత్సహించాల్సి వస్తోంది. అయితే నీరు ఎక్కువగా వినియోగించుకునే వరికి బదులు అదే భూముల్లో ఇతర పంటలు సాగవుతాయా.. వరి పంట తగ్గితే ఇప్పుడున్న రైస్ మిల్లులను ఏం చేయాలి.. ఒక్కో రైస్ మిల్లు నిర్మాణానికి దాదాపు 15 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది. వాటి నిర్వహణకు రోజూ దాదాపు రూ. లక్షకు పైగా ఖర్చవుతుంది. ఇంత పెట్టుబడితో ఏర్పాటు చేసిన రైస్ మిల్లులు మూతపడక తప్పదా.. అలాంటి పరిస్థితే ఎదురైతే వాటి మీద ఆధారపడ్డ 10 లక్షల మందికి ఉపాధి ఎలా కల్పించాలి.. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైస్ మిల్లులు ఏర్పాటు చేసిన యజమానులకు ఏమని జవాబు చెప్పుకోవాలి... వారికి ప్రత్యామ్నాయం ఎలా చూపించాలి.. ఇలాంటి ప్రశ్నలన్నీ కేసీఆర్ మెదడును తొలుస్తున్నాయని, ఉన్నపళంగా ఈ సమస్యను గనక పరిష్కరించకోపయినట్లయితే తెలంగాణలో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న వైశ్య సామాజికవర్గం నుంచి పెద్దఎత్తున నిరసన ఎదుర్కోక తప్పదన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే రానున్న ఉపద్రవాన్ని నివారించడానికే కేసీఆర్ కేంద్రం పెద్దల్ని ఎలాగైనా ఒప్పించాలన్న దృఢ నిశ్చయంతో ఢిల్లీ టూర్ ఖరారు  చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది. మరి ఢిల్లీ నుంచి ఎలాంటి హామీతో తిరిగొస్తారో చూడాలి.

కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? తెరాస టెన్షన్.. టెన్షన్ 

హుజూరాబాద్  ఉప ఎన్నికే అయినా మరో ఎన్నికే అయినా, ఆ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది ఆయా పార్టీలు నిర్ణయించు కుంటాయి.., అలాగే పార్టీ అభ్యర్ధి ఎవరనేది కూడా అంతే పార్టీలే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కానీ,  అధికార పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీలు పనిచేయవు. అయితే, తెరాస నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించదేమని చిరాకు పడుతున్నారు.  హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ, వ్యూహం ఏమిటో ఏమో కానీ, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అభ్యర్ధిని ప్రకటించ లేదు. అది ఆ పార్టీకి సంబందించిన అతర్గత వ్యవహారం. ప్రతి పార్టీకి, ఆపార్టీ అవసరాల కనుగుణంగా ఒక  వ్యూహం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి వ్యూహం ఏమిటో ఎందుకు, హుజూరాబాద్’ ఉప ఎన్నికను అంత సీరియస్’గా తీసుకోవడం లేదో  అది ఆ పార్టీకి మాత్రమే సంబందించిన విషయం.  అయితే, కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించకపోవడం విషయంలో కాంగ్రెస్ నాయకుల్లో ఎలాంటి తొందర, ఆతురత  లేదు కానీ,  అధికార తెరాస నాయకులు ఎందుకో తెగ కలవర పడుతున్నారు. నిజమే, హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబందించి అధికార పార్టీ అయిన దానికి కానీ దానికి ఇలాగే కలవర పడుతోంది. తాడును చూసి పామని భయడుతోంది.ఒక విధంగా చూస్తే తెరాస నాయకులు. తమ నీడను చూసి తామే భయపడుతున్నారా, అనిపిస్తోంది. అయితే, తెరాస కలవరపాటుకు కారణం లేక పోలేదు. హుజూరాబాద్ ఉపేన్నికలలో గెలుపు కోసం అధికార పార్టీ చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. మంచి చెడు విచక్షణ లేకుండా, అన్ని అస్త్రాలను సంధించింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ప్రజలను అన్ని విధాలా ప్రలోభాలకు గురిచేసింది. ప్రతి దళిత కుటుంబానికి పదిలక్షల రూపాయల వంతున పందారం చేసే, దళిత బంధు పథకాన్ని ప్రకటించింది. అదికూడా  హుజూరాబాద్’ లో గెలిచేందుకే ఈ పథకం అని చెప్పి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇంతవరకు, దేశంలో ఎప్పుడూ ఎక్కడ ఒక ఉప ఎన్నికలో ఖర్చుచేయనంత నిధులను అధికార పార్టీ ఇప్పటికే ఖర్చు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇంత  చేసినా, అధికార పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. తెరాస ప్రభుత్వం ఎంత చేసినా, ఏమి చేసినా ఈటల పై వేటు వేయడాన్ని,నియోజక వర్గ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ తప్పు ముందు ఇప్పుడు ప్రకటిస్తున్న వరాలు  దిగతుడుపుగానే భావిస్తున్నారు. పార్టీలు, జెండాలతో సంబంధం లేకుండా ఈటల వైపు జనం మొగ్గుచుపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే, నియోజక వర్గంలో  కాంగ్రెస్  పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు అటు వెళ్ళిపోతే, ప్రభుత వ్యతిరేక ఓటు చీలి, తెరాసకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే, కాంగ్రెస్ పోటీకి దిగి, గట్టి అభ్యర్ధిని బరిలో దించడమే కాకుండా ఇప్పటినుంచే ప్రచారంలో దిగితే తెరాస గెలుపు అవకాశాలు మెరుగు అవుతాయని ఆ పార్టీ భావిస్తోంది.  అదుకే  బాల్క సుమాన్ వంటి తెరాస నాయకులు పరోక్షంగానే అయినా కాంగ్రెస్ పార్టీ పోటీ విషయంలో, అభ్యర్ధి విషయంలో ఎటూ తేల్చక పోవడం పట్ల అసహనం ప్రకటిస్తున్నారు. బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ సైలెంట్‌గా ఉంటోంద‌ని, కాంగ్రెస్, బీజేపీల మధ్య అక్రమ అసంబంధాలను అంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే ఎలా ఉండేదో ఏమో కానీ, టీపీసీసీ చేఇఫ్ రేవంత్ రెడ్డి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇది తెరాస నాయకులను మరింత అసహనానికి గురి చేస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

బండి విమర్శలు గీత దాటు తున్నాయా? 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ‘సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్’ ను ఒక మంత్రంలా జపిస్తారు. ప్రభుత్వం, పార్టీ అనిసరించే విధానంగా బీజేపీ నాయకులు చెప్పుకుంటారు. మోడీ, అమిత్ షాలే కాదు, పార్టీ సాధారణ కార్యకర్తలు కూడా అదే మంత్రం జపిస్తారు. అయితే, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం, మోడీ మంత్రానికి అర్థాన్నే మార్చేశారు. రాష్ట్రంలో అయన సాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో అయన చేసిన ప్రసంగంలో  ‘తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని మోడీ, అమిత్ షా తనను పంపినట్లు చెప్పారు. హిందువుల పండగల విషయంలో ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అయినా, ప్రధాని మోడీ తనను హిందూ సమజాన్ని సంఘటితం చేసేందుకు పంపారని చెప్పుకోవడం విమర్శలకు అవకాశం కలిపించేలా ఉందని అంటున్నారు.  నిజానికి  బండి సంజయ్ ఇపంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సరి కాదు, హైదరాబాద్ పాత బస్తీలోని భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభించిన సమయంలోనే ఆయన మాట జారారు. ఇక అప్పటి నుంచి, ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూనే ఉన్నారు. ఒక దశలో బీజేపీ హిందువుల  పార్టీ అనే వరకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఈ రోజు మళ్ళీ ఇంచుమించుగా అదే మాట అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టె వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో పార్టీ పెద్దలలు ఆలోచించాలని, పార్టీలో కొందరు సూచిస్తున్నారు. కాగా,బండి సంజయ్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ ఇమేజిని దెబ్బ తీస్తునాయనే విమర్శలు సైతం వినవస్తున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరితో ఒకరు పోటీ పడి తమ పరవు తామే తీసుకుంటున్నారని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకుల మాటలకు న్యాయస్థానాలు ఆంక్షలు విధించే పరిస్థితి రావడం శోచనీయమని సామాన్య ప్రజలు సైతం విచారం వ్యక్త పరుస్తున్నారు.  అదలా ఉంటే బండి సంజయ్  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చేసిన వ్యాఖ్యలు, అధికారుల పనితీరుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు, అధికార పార్టీ ఇతర పార్టీల నాయకులను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు గురించి చేసిన వ్యాఖ్యలు , విమర్శలు వాస్థవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్నాయని విశ్లేషకులు కితాబు నిస్తున్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు. విమర్శించ వలసిందే. అందులో రెండవ అభిప్రాయానికి తావు లేదు. నిజానికి, తెరాస ప్రభుత్వంలో  సమస్యలకు కొదవ లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉంది.. శాంతి భద్రతల పరిసతి అయితే చెప్పనే అక్కర లేదు. నిరుద్యోగ సమస్య, ఆత్మ హత్యలు ఇలా అనేఅక్ సమస్యలు ఉన్నాయి. సమస్యల ఆధారంగా పోరాటం చేయడం ఎంత అవసరమో .. అసలు సమస్యలు పక్కదారి  పట్టిపోయేలా వ్యక్తీగత విమర్శలు చేయడం, భావోద్వేగాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయడం అంతే హానికరం అంటున్నారు, సామాన్యులు

ఢిల్లీ కోర్టులో కాల్పులు.. నలుగురు మృతి 

దేశ రాజధాని  కాల్పులతో దద్దరిల్లింది. ఢిల్లీలోని రోహిణీ కోర్టు కాల్పులతో  రక్తమోడింది. ఓ కేసులో అరెస్టయిన గ్యాంగ్ స్టర్ జితేంద్ర అలియాస్ గోగిని జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు తీసుకురాగా.. ప్రత్యర్థి ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. లాయర్ల ముసుగులోకి కోర్టులోకి ఎంటరైన దుండగులు.. ఓ మహిళా లాయర్ సహా జితేంద్రపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జితేంద్ర స్పాట్ లోనే చనిపోయాడు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో లాయర్ల వేషంలో వచ్చిన ఇద్దరు దుండగులు చనిపోయారు. మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన మహిళా న్యాయవాదిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.  కోర్టులో కాల్పులు జరిపింది టిల్లూ తాజ్పూరియా గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 40 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాగా, రెండేళ్ల క్రితం ఓ ఘటనకు సంబంధించి జితేంద్రతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ టాపర్ అయిన కుల్దీప్ ఫజ్జాను స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కుల్దీప్ ఫజ్జా పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా జితేంద్ర గ్యాంగ్ లో 50 మందికి పైగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

ఏపీ ఉద్యోగుల మీద కక్ష సాధిస్తున్న జగన్ సర్కారు

ఏపీ సర్కారు మరోసారి తన కురుచ బుద్ధిని చాటుకుంది. ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరిని బయటపెట్టుకుంది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులపై ప్రదర్శించిన ఔదార్యం కాస్తా ఇప్పుడు కాఠిన్యంగా మారింది. జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగులు, హెచ్.ఒ.డి లు ఆందోళనకు గురవుతున్నారు. తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటంటే.. హైదరాబాద్ లో స్థిరడ్డ ఏపీ ఉద్యోగుల సేవలు వినియోగించుకునేలా వారిని అమరావతిలోనే ఉండేలా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వసతి, ఉచిత రవాణా సదుపాయాలు కల్పించారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పిస్తూ.. ఆ ఐదు రోజుల వసతిని కూడా ప్రభుత్వమే భరించింది. అది కాస్తా వచ్చే నవంబర్ 1 నుంచి రద్దయిపోతుంది.  అమరావతిలో రాజధాని నిర్మాణం, నూతన సచివాలయం, పరిపాలనా విధులు.. ఇలా అనేక ప్రభుత్వ వ్యవహారాలకు గాను చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఉపశమనం కల్పిస్తూ ఉచిత వసతి, ఉచిత రవాణా ఏర్పాటు చేశారు. వసతి కోసం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఏర్పాట్లు చేశారు. ఇక రవాణా కోసం ప్రత్యేకమైన ప్రభుత్వ బస్సులు, వెహికల్స్ అరేంజ్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎంప్లాయిస్ రైలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అయితే అది తాత్కాలికమేనని బాబు సర్కారు స్పష్టంగా పేర్కొంది. అప్పటి నుంచి ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ప్రభుత్వం మారి జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో కూడా ప్రభుత్వమే వారికి ఉచిత వసతి కొనసాగించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ ఫస్టు నుంచి ఉద్యోగులు, ఉద్యోగినులు ఎవరి వసతి వారే సొంత ఖర్చులతో భరించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇటీవల గత ఆగస్టు నుంచి వచ్చే అక్టోబరు 31 తేదీ వరకు మాత్రమే ఉచిత ట్రాన్సిట్ వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 31 తరువాత ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సదుపాయాలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఉద్యోగులకు ముందస్తు సమాచారాన్ని జారీ చేసింది. వీరిలో సచివాలయం, శాసన పరిషత్, హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న పురుష, మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకూ షేరింగ్ ప్రాతిపదికన ఉచిత వసతి కల్పించిన ప్రభుత్వం ఇక నుంచి వారికే ఆ బాధ్యతలు అప్పగించింది. 2021 నవంబరు 1 నుంచి ఉద్యోగులెవరికీ ఉచిత వసతి వెసులుబాటు ఉండబోదని స్పష్టం చేసింది. అంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎవరి వసతి ఏర్పాట్లు వారే చేసుకోవాలన్నమాట.  కొద్ది రోజుల క్రితం మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా సచివాలయంతో పాటుగా ప్రధాన కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు విశాఖ తరలి వెళ్లాల్సి ఉంటుందని ప్రచారం సాగింది. అయితే, న్యాయపరంగా ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. ఇదే సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి దాదాపు అయిదేళ్ల పాటు ఉచిత వసతి కల్పించా మని, ఇక ఉద్యోగులే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే తమకు కల్పించిన ఉచిత వసతి, ఉచిత రవాణా అనేవి కొద్దికాలంపాటే ఉంటాయని తమకు తెలుసని, అయినప్పటికీ రాజధాని లాంటి కీలక అంశాల్లో కోర్టు నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా రాలేదు కాబట్టి.. తీర్పు వెలువేడాదాకానైనా ప్రభుత్వం ఈ తాత్కాలిక వసతిని కొనసాగిస్తే బాగుంటుందని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉంటుందో పూర్తి నిర్ణయం బయటపడ్డాక తాము కుటుంబాలు సహా ఆయా పట్టణాల్లో పని చేయడానికి సంసిద్ధంగా ఉంటామని, కానీ ఇప్పుడు ఆఫ్ బ్యాచులర్స్ గా ఉంటున్న తమకు కనీస వసతి, రవాణా కూడా కల్పించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తమకు సౌకర్యంగా ఉండడాన్ని పక్కనపెడితే విధి నిర్వహణ సాఫీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వారంటున్నారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు, నేతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారన్నదే ఆసక్తికరంగా మారింది.

ట్వీట్ తో బుక్కైన విజయసాయి.. ఫేక్ రెడ్డి అంటూ నెటిజన్ల ట్రోలింగ్  

విజయసాయి రెడ్డి... వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా జైలుకు వెళ్లారు విజయసాయి రెడ్డి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే నెంబర్ 2 ఆయనే అని టాక్. విశాఖ అడ్డాగా రాజకీయాలు చేస్తున్న సాయి రెడ్డి.. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక పోస్టు పెడుతుంటారు. సీఎం జగన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని పొగుడుతూనే, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూనే ఆ ట్వీట్లు ఉంటాయి. అయితే విజయసాయి చేసే ట్వీట్లలో అన్ని అసత్యాలు, అబద్దాలు ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. చాలా సార్లు తప్పుడు ట్వీట్లు చేసి ఆయన బుక్కయ్యారు. అందుకే విపక్ష నేతలు ఆయన్ను ఫేక్ రెడ్డి అని విమర్శిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఫేక్ ట్వీట్ తో  అడ్డంగా బుక్కైపోయారు విజయసాయి రెడ్డి. కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీలో తెగ వైరల్ అవుతోంది. ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ కావడానికి కారణం ఏంటో తెలుసా... తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించిన ఫోటోలను ఏపీలోనివి చెబుతూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడమే. హెల్త్ వర్కర్లు మారు మూల ప్రాంతాలకు, వ్యవసాయ క్షేత్రాలకు దగ్గరకు వెళ్లి కూలీలకు టీకాలు వేస్తున్న ఫోటలవి. ఇక్కడే మరీ సిల్లీగా బుక్కైపోయారు సాయి రెడ్డి.  సెప్టెంబర్ 21న కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఈ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. విజయనగరం జిల్లా, ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొవిడ్ వ్యాక్సినేషన్ ఫోటోలుగా చెబుతూ.. సీఎం జగన్ ను ఆకాశానికెత్తుతూ ఆయన ట్వీట్ చేశారు. సాయి రెడ్డి ట్వీట్ చూసిన వారు ఇదంతా  నిజమే అనుకున్నారు. ఏపీలో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతుందని భావించారు. కాని అసలు సంగతి తర్వాత బయటపడింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవే ఫోటోలతో గురువారం ట్వీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా హెల్త్ వర్కర్లు బాగా కష్టపడుతున్నారంటూ... నర్సులు మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల దగ్గర కూలీలకు టీకాలు వేస్తున్న ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు. ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన కొవిడ్ వ్యాక్సినేషన్ ఫోటోలంటూ ఆయన కామెంట్ చేశారు.    అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోలు.. రెండు రోజుల ముందు విజయసాయి రెడ్డి చేసిన ఫోటోలు సేమ్. దీంతో ఇంతకు ఈ ఫోటోలు ఎక్కడవన్నది చర్చగా మారింది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోలకు సంబంధించిన వివరాలు లోకల్ పేపర్లలో వచ్చాయి. కాని విజయసాయి రెడ్డి చెబుతున్నట్లు ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో విజయసాయి రెడ్డి ఫేక్ బండారం భయటపడింది. తెలంగాణలో జరిగిన వ్యాక్సినేషన్ కు సంబంధించిన ఫోటోలను విజయసాయి రెడ్డి.. ఏపీలో జరిగినట్లుగా తప్పుడు ట్వీట్ చేశారన్నది స్పష్టమైంది.  విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయనను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. తెలంగాణ జిల్లాలు ఏపీలో ఎప్పుడు కలిపారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. రెడ్డి గారి పక్క రాష్ట్రం ఫోటోలతో భలే ఫోజులు కొడుతున్నారంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఇంత పచ్చిగా అబద్దాలు ప్రచారం చేసుకుంటారా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఫేక్ రెడ్డి బండారం మరోసారి బయటపడిందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. విజయసాయి రెడ్డి బండారం భయటపడటంతో టీడీపీ సహా విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇంకెంత కాలం ఫేక్ బతుకులంటూ మండిపడుతున్నాయి.