కొండా సురేఖ పోటీకి సిద్ధమేనా? హుజురాబాద్ లో రేవంత్ వ్యూహమేంటీ?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈటల రాజేందర్ రాజీనామాతో జరగబోతున్న ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే పార్టీలు దూకుడు పెంచాయి. బైపోల్ ను సవాల్ గా తీసుకున్న అధికార పార్టీ తమ బలగాలను అక్కడే మోహరించింది. ముందుగానే అభ్యర్థిని కూడా ప్రకటించేసింది. ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న మంత్రి హరీష్ రావు అక్కడే మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. దళిత బంధు స్కీంతో ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా కైవసం చేసుకునే పనిలో పడింది గులాబీ పార్టీ. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా హరీష్ రావు హజురాబాద్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. ఈటలతో ఉన్న నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కారెక్కేలా ఆయన పావులు కదుపుతున్నారు. తన కంచుకోటగా ఉన్న హుజురాబాద్ లో గెలిచి సీఎం కేసీఆర్ కు షాకివ్వాలని చూస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ కేంద్రంగా తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయాలని కమలదళం ప్లాన్ చేస్తోంది. అందుకే షెడ్యూల్ రాకముందే ఓ రౌండ్ ప్రచారం చేసేసారు ఈటల. పాదయాత్రతో కొన్ని గ్రామాలు తిరిగారు. షెడ్యూల్ రావడంతో బీజేపీ రాష్ట్ర నేతలంతా ప్రచారం చేయబోతున్నారు. ప్రజా సంగ్రామ్ యాత్ర చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... అక్టోబర్ 2న హుజురాబాద్ లో తన తొలి దశ యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా లక్ష మందితో భారీ సభ పెట్టి.. ఆ వేదిక నుంచే ఉప ఎన్నికల ప్రచార శంఖారావం పూరించాలని బీజేపీ భావిస్తోంది. బండి సంజయ్ సభను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటిలను ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ నేతలు కూడా హుజురాబాద్ లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. హుజురాబాద్ లో అధికార టీఆర్ఎస్, బీజేపీలు దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా సైలెంటుగానే ఉంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరుస కార్యక్రమాలతో అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. కాని అత్యంత కీలకమైన ఉప ఎన్నిక జరుగుతున్న హుజురాబాద్ పై మాత్రం ఫోకస్ చేయలేదు. మిగితా పార్టీలు అభ్యర్థులను ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని కూడా తేల్చలేదు. షెడ్యూల్ కూడా రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి హుజురాబాద్ వెళ్లకపోవడంతో... ఉప ఎన్నికపై ఆయన స్టాండ్ ఏంటన్నది తెలియడం లేదు. హుజురాబాద్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంపై కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా రేవంత్ రెడ్డి మాత్రం హుజురాబాద్ గురించి ఎక్కడా మాట్లాడటం లేదు.  ఇప్పుడు  హుజూరాబాద్​ ఉప ఎన్నిక షెడ్యూల్​ రావడంతో కాంగ్రెస్​లో హడావుడి మొదలైంది. ఈనెల 30న భూపాలపల్లిలో జరిగే సభలో అభ్యర్థి ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ నేతృత్యంలోని కమిటీ కొద్ది రోజుల క్రితమే నాలుగు పేర్లను హైకమాండ్ పరిశీలనకు పంపింది. బయోడేటా, బలాబలాల వివరాలతో నివేదిక ఇచ్చింది. కవ్వంపల్లి సత్యనారాయణ (ఎస్సీ-మాదిగ), కొండా సురేఖ (బీసీ -పద్మశాలి), పత్తి కృష్ణారెడ్డి (రెడ్డి), ప్యాట రమేశ్ (బీసీ -మున్నూరు కాపు) పేర్లను పంపినట్లు సమాచారం. భూపాలపల్లిలో పట్టున్న నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్​లో చేరుతున్న సందర్భంగా 30న భారీ సభ జరగనుంది. అభ్యర్థి ప్రకటనకు దాన్ని సరైన వేదికగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం గతంలో జరిగింది. కొండా దంపతుల సామాజిక వర్గాలు నియోజకవర్గంలో బలంగా ఉండటం తమకు లాభిస్తుందని హస్తం నేతలు అంచనా వేశారు. పోటీకి కొండా సురేఖ కూడా అంగీకరించిందని, అయితే కొన్ని కండీషన్లు పెట్టిందనే ప్రచారం జరిగింది. తర్వాత సీన్ మారిపోయింది. కొండా అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు వ్యతిరేకించారని, దామోదర రాజనర్సింహ కమిటి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనే చర్చ బయటికొచ్చింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలో కరీంనగర్​లో జరిగిన సమీక్షలో లోకల్​లీడర్లు కొండా అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. దాంతో అభ్యర్థి ఎంపికకు కమిటీ వేయగా 19 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. దీంతో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది ఆసక్తిగా మారింది. కొండా సురేఖను ఖరారు చేస్తారా లేక లోకల్ లీడర్ ను బరిలోకి దింపుతారా అన్నది ఈనెల 30న తేలనుంది. కొండా సురేఖను ప్రకటిస్తే... కాంగ్రెస్ సీరియస్ గా ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఈటల రాజేందర్ తో కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని, టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఆయనకు కాంగ్రెస్ లోపాయకారిగా మద్దతు ఇవ్వవచ్చనే చర్చ కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అందుకే ఈటలకు లాభించేలా హుజురాబాద్ లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థి నిలపవచ్చని కూడా చెబుతున్నారు. మొత్తంగా రేవంత్​రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక వస్తున్న తొలి ఎన్నిక కావడంతో.. ఆయన ఎలాంటి వైఖరి అవలంభిస్తారని రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.

ఎంపీ భ‌ర‌త్, ఎమ్మెల్యే రాజాల‌కు జ‌గ‌న్ వార్నింగ్‌.. ఓవ‌ర్ చేస్తే యాక్ష‌న్ త‌ప్ప‌దు..

ఎంపీ మార్గాని భ‌ర‌త్ వ‌ర్సెస్ ఎమ్మెల్యే రాజా. కొన్నిరోజులుగా వీరిద్ద‌రి మ‌ధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. అధికార పార్టీ నేత‌లే ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో రాజ‌మండ్రిలో ర‌చ్చ రంభోలా చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల మాట‌ల యుద్ధం స్టేట్ వైడ్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ ప‌రువంతా పోయింది. ఎంపీపై ఎమ్మెల్యే అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. క్రిమిన‌ల్స్‌, రౌడీషీట‌ర్స్‌ను వెంటేసుకుని దందాలు చేస్తున్నారంటూ ఎంపీ భ‌ర‌త్‌ను ఎమ్మెల్యే రాజా విమ‌ర్శించ‌డం.. రాజాపై భ‌ర‌త్ సైతం కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేయ‌డంతో.. వారిద్ద‌రి ర‌గ‌డ తాడేప‌ల్లికి చేరింది.  ఎంపీ, ఎమ్మెల్యేల కుంప‌టిని చ‌ల్లార్చే ప‌నిని తూర్పుగోదావ‌రి జిల్లా ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డికి అప్ప‌గించింది పార్టీ అధిష్టానం. కానీ, వారిని కాంప్ర‌మైజ్ చేయ‌డం సుబ్బారెడ్డి వ‌ల్ల కూడా కాలేదు. వైవీ స‌మ‌క్షంలోనే భ‌ర‌త్‌, రాజాలు నువ్వెంతంటే నువ్వెంతంటూ తిట్టుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. వైవీ సుబ్బారెడ్డి రెండు విడ‌త‌లుగా భ‌ర‌త్‌, రాజాల‌తో మాట్లాడి.. విడివిడిగా వారి నుంచి వివ‌ర‌ణ తీసుకున్నారు.  మంగ‌ళ‌వారం రోజంతా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రాజ‌మండ్రి పంచాయితీ కొన‌సాగింది. భ‌ర‌త్‌, రాజాల‌ను కాంప్ర‌మైజ్ చేయ‌డం త‌న వ‌ల్ల కావ‌టం లేద‌ని వైవీ సుబ్బారెడ్డి చేతులెత్తేయ‌డంతో.. ఇక త‌ప్పేలా లేద‌ని సీఎం జ‌గ‌న్ నేరుగా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. సీన్‌.. సీఎం ద‌గ్గ‌రికి షిఫ్ట్ అయింది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై జ‌గ‌న్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే క‌ఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇంకోసారి మీడియా ముందు గొడ‌వ ప‌డితే యాక్ష‌న్ త‌ప్ప‌ద‌ని.. ఏదైనా ప్రాబ్ల‌మ్స్ ఉంటే పార్టీ అంత‌ర్గత వేదిక‌ల్లో మాత్ర‌మే మాట్లాడాల‌ని గ‌ట్టిగా చెప్పార‌ట సీఎం జ‌గ‌న్‌. దీంతో.. రాజ‌మండ్రి వైసీపీ వ‌ర్గ‌పోరు ప్ర‌స్తుతానికి స‌మ‌సిపోయిన‌ట్టే అంటున్నారు.   

పవన్ పై పచ్చి బూతులతో విరుచుకుపడ్డ పోసాని..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన ఆరోపణలు చేశారు. పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన పోసానిపై ఆయన అభిమానులు బెదిరింపులకు పాల్పడ్డారట. దీంతో  పవన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న బెదిరింపులతో మీడియా ముందుకొచ్చిన పోసాని.. జనసేనానిపై తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తనకు  అమ్మనా బూతులు తిడుతూ వేలాది మెసేజ్ లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు అక్రమ సంబంధం అంటగడుతున్నారని అన్నారు. పవన్ ను విమర్శిస్తే ఆయన అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారో.. వైఎస్ జగన్ అభిమానిగా తాను అలానే స్పందించానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఇదే పవన్ విమర్శిస్తే 'తుకడా' చేస్తానని హెచ్చరించారని.. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికెళ్లి ధర్నా చేశారా? లేక ఆయనకు బెదిరింపు మెసేజీలు పంపించారా? అని నిలదీశారు. పవన్ ఫ్యాన్స్ సైకోలుగా వ్యవహరిస్తున్నారని.. బూతులు తిడుతున్నారని.. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని పోసాని మండిపడ్డారు. తన  కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ ప్రెస్ మీట్ పెట్టి తన అభిమానులకు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తాను అతని కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడితే తెలుగుదేవం పార్టీ సీనియర్ నేత లోక్ సభ సభ్యుడు కేశినేని ఆయన కుమార్తెపై వివాదాస్పద కామెంట్స్ చేశారని పోసాని ఆరోపించారు. రాజకీయాలకు కుటుంబ సభ్యులకు ఏం సంబంధం ఉందని చిరంజీవి బాధపడ్డారని అన్నారు. మంత్రి కురసాల కన్నబాబు దీనికి సాక్షి అని పోసాని అన్నారు.కురసాల తన ఎదురుగా చిరంజీవి ఆవేదన చెందడాన్ని తాను తట్టుకోలేకపోయానని అన్నారు.  నేరుగా కేశినేని ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడానని చెప్పారు.  కేశినేని నానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. వారిని ఎవరైనా ఏమైనా అంటే బాధపడరా? అని నిలదీశానని చెప్పారు. దీంతో కేశినేని నాని పశ్చాత్తాప పడ్డారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు కూడా ఒక కుమార్తె ఉన్నదని.. రేపొద్దున ఎవరైనా ఆమెను ఏమైనా అంటే ఆయన బాధపడరా? అని పోసాని ప్రశ్నించారు. తాను బతికే ఉంటానని.. పవన్ కు రక్తకన్నీరు తప్పదని జోస్యం చెప్పారు.  నీ ఇంట్లో ఉండేవాళ్లే ఆడవాళ్లా..? మా ఇంట్లో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని నిలదీశారు.  తన భార్యను బజారుకు ఈడుస్తూ పవన్ సైకో ఫ్యాన్స్ చేస్తోన్న మెసేజీలు వెంటనే ఆగకపోతే తాను కూడా పవన్ ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుకు ఈడ్చేలా తిడతానని పోసాని కృష్ణ మురళీ హెచ్చరించారు.  ఇక ఓ పంజాబీ అమ్మాయిని కడుపు చేసి రూ.5 కోట్లు ఇచ్చి వాళ్ల నోరు మూయించావ్ అని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు ఆమెకు కెరీర్ ఇస్తానంటే ప్రామిస్ చేసి మోసం చేశాడు.. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని  బెదిరించాడు. అందుకు 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడట.. అని పోసాని సంచలన కామెంట్స్ చేశారు. నాకు తెలిసింది చెప్పానని వివరించారు. మానసిక రోగంతో ఆ అమ్మాయి ఎలా డిప్రెషన్ లోకి వెళ్లిందో తెలుసన్నారు. 

TOP NEWS @ 7pm

1. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు కలిశారు. రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్‌ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. 2. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కులపిచ్చి బాగా ముదిరిపోయిందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. రాష్ట్రంలో కేవలం 4 శాతమున్న తన వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ఓట్లతోనే సీఎం అయ్యారనే వాస్తవాన్ని జగన్ విస్మరిస్తున్నారన్నారు.  3. టీజేఎస్ చైర్మన్ కోదండరామ్‌పై పోలీసుల అనుచిత వైఖరిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు రేవంత్‌రెడ్డి హెచ్చ‌రించారు.  4. వరి వేస్తే ఉరి అని చెబుతున్న కేసీఆర్‌కు వరి కొనమని ఎవరు చెప్పారు? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. పండించిన ప్రతి గింజ కొంటమన్న కేసీఆర్.. ఇప్పుడు నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. నా భాషకు గురువు కేసీఆరే.. కేసీఆర్‌ను గద్దె దించేదాక భాష మార్చుకోనని చెప్పారు బండి సంజ‌య్‌. 5. సోమవారం రాత్రి నుంచి తనను ఫోన్లు, మెసేజ్‌లతో పీకే ఫ్యాన్స్ తిడుతున్నారంటూ పోసాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘‘ఫ్యాన్స్‌తో గ్రూపును పెట్టుకున్నాడు. ఫంక్షన్లకు తన ఫాన్స్‌ను పంపిస్తున్నాడు. నువ్వు సద్దాం హుస్సేన్ లా నియంతవా? పవన్ కల్యాణ్ ఒక సైకో‘‘.. అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు పోసాని.  6. పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరికునేది లేదని పీకే ఫ్యాన్స్ హెచ్చ‌రించారు. పవన్ కల్యాణ్ సైకో కాదని, పోసానినే సైకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పోసాని ప్రెస్‌మీట్ పెట్టిన ప్రెస్‌క్లబ్ ద‌గ్గ‌ర పీకే ఫ్యాన్స్ భారీగా చేరుకొని పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పవన్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.  7. నీరు చెట్టు పనుల బిల్లుల మంజూరు జాప్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు 2017-18లో చేపట్టిన పనులకు ఇప్ప‌టి వరకు బిల్లులు మంజూరు చేయలేదంటూ హైకోర్టులో 100 మంది పిటిషన్లు వేశారు. విచారణ పేరుతో బిల్లులు ఇవ్వకపోవడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.  8. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూసీ వరద ఉధృతితో మూసారాం బాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ చేశారు. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీలో వరద ఉధృతి పెరిగింది.   9. సీపీఐ నేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధినేత కన్హయ్య కుమార్, గుజరాత్‌లోని వడగావ్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమ నాయకుడు జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ దేశంలోని సంస్కృతిని చరిత్రను భవ్యిష్యత్‌ను నాశనం చేయడానికి ఒక భావజాలం చాలా ప్రయత్నిస్తోంది. అందుకే త‌న‌కు కాంగ్రెస్ భావజాలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని క‌న్హ‌య్య అన్నారు.  10. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయ‌డం ఆ పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని సిద్ధూ అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఓ దళితుడు చేపట్టడాన్ని కాంగ్రెస్ నేత సిద్ధూ సహించలేకపోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ విమ‌ర్శించింది.   

హద్దులు దాటిన పోసాని, పీకే వార్.. దాడులతో హై టెన్షన్..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ మధ్య సాగుతున్న వివాదం హద్దులు దాటేసింది. వ్యక్తిగత విమర్శలు దాటి కుటుంబ సభ్యులకు వరకు వచ్చింది. పచ్చి బూతులు నాట్యం చేస్తున్నాయి. చివరకు దాడుల వరకు వచ్చింది.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణ మురళీపై దాడికి జనసైనికులు ప్రయత్నించడం హై టెన్షన్ పుట్టించింది.  తెలంగాణ పోలీసులు స‌రైన స‌మ‌యంలో స్పందించడంతో పోసాని క్షేమంగా బయటపడ్డారు. లేదంటే పీకే ఫ్యాన్స్ చేతిలో పోసాని భౌతిక దాడికి కూడా గుర‌య్యేవారే. పోసాని ప్రెస్ మీట్ కు ముందే ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌చ్చి హంగామా చేసినా.. పోలీసులు వారిని నిరోధించారు. ఆ త‌ర్వాత పోసాని అక్క‌డి నుంచచి బ‌య‌లుదేరుతున్న స‌మ‌యంలో ఎక్క‌డున్నారో గానీ.. ఒక్క‌సారిగా ప‌లువురు ప‌వ‌న్ ఫ్యాన్స్ పోసానిపై దాడికి య‌త్నించారు. అయితే అప్ప‌టికే భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఈ దాడిని నివారించారు. పవన్ కల్యాణ్ వైసీపీపై ఆరోపణలు చేయడంతో వివాదం మొదలైంది.వైసీపీ స‌ర్కారుపై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఓ వైపు ఏపీ మంత్రులు వ‌రుస‌బెట్టి కౌంట‌ర్లు ఇస్తుండగానే.. సోమ‌వారం  మీడియా ముందుకు వ‌చ్చి  కౌంటర్ ఇచ్చారు పోసాని. ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆ వ్యాఖ్య‌ల్లో వ్య‌క్తిగ‌త అంశాలు అంత‌గా లేకున్నా.. ఓ యువ‌తిని ప‌వ‌న్ గ‌ర్భ‌వ‌తిని చేశారంటూ పోసాని నోరు జారారు. ఈ కామెంట్లు విన్నంత‌నే.. ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోసానిని బండ బూతులు తిట్ట‌డం మొద‌లెట్టార‌ట. అంతేకాకుండా నేరుగా పోసానికే ఫోన్ చేసి బెదిరింపుల‌కు దిగార‌ట‌. ఈ సంద‌ర్భంగా పోసాని ఫ్యామిలీ మెంబ‌ర్ల ప్ర‌స్తావ‌న‌ను తీసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ అస‌భ్య‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేశార‌ట‌.  వీరి మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్ధం మంగ‌ళ‌వారం నాడు హ‌ద్దులు దాటేసింది. మీడియా ముందుకు వ‌చ్చిన పోసాని.. ప‌వ‌న్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ రాయ‌డానికి వీల్లేని ప‌ద‌జాలంతో దూషించారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా జ‌రుగుతున్న పోసాని ప్రెస్ మీట్ ను లైవ్‌లో చూసిన జ‌న‌సైనికులు, ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్క‌రొక్క‌రుగానే అక్క‌డికి చేరుకున్నారు. ప‌రిస్థితిని ముందుగానే అంచ‌నా వేసిన పోలీసు అధికారులు అప్ప‌టికే అక్క‌డికి భారీ ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఈ క్ర‌మంలో ఒక‌రిద్ద‌రు జ‌న‌సైనికుల‌ను పోలీసులు అప్ప‌టికే అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించినా.. స‌రిగ్గా పోసాని బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఆయ‌న‌పైకి దూకారు. అయితే అప్ప‌టికే అక్క‌డ మోహ‌రించిన పోలీసులు వారిని అదుపు చేసి వారి దాడి నుంచి పోసానిని కాపాడారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి పీకే ఫ్యాన్స్‌, జ‌న‌సైనికుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించిన పోలీసులు.. పోసానిని పోలీసు ఎస్కార్ట్ తో అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఈ సందర్భంగా పీకే ఫ్యాన్స్ దాడితో పోసాని పోలీసు వ్యాన్‌లో చ‌ప్పుడు చేయ‌కుండా కూర్చుండిపోయారు. ఆ త‌ర్వాత మీడియాతో మ‌రోమారు మాట్లాడిన పోసాని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిమానుల‌ను త‌న‌పైకి దాడికి ప్రోత్స‌హించార‌ని ఆరోపించారు. త‌న‌కు ఏం జ‌రిగినా దానికి ప‌వ‌నే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని కూడా వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తాను పోలీసు కేసు పెట్ట‌నున్న‌ట్లుగా కూడా పోసాని సంచ‌ల‌న కామెంట్ చేశారు. దీంతో పీకే వర్సెస్ పోసాని వివాదం పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్క‌నుంద‌న్న మాట‌. మ‌రి ఈ వివాదం ఏ మేర ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను సృష్టిస్తుందో చూడాలి..

జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి ఉందా? పోసాని స‌వాల్‌కు స‌మాధానం ఇదేనా!

పోసాని కృష్ణ‌ముర‌ళి.. జనసేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కార్న‌ర్ చేసే ప్ర‌య‌త్నంలో సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ముఖ్య‌మంత్రి చాలా మంచోడంటూ భ‌జ‌న చేసే కార్య‌క్ర‌మంలో.. జ‌గ‌న్‌కు కుల పిచ్చి ఉందని నిరూపిస్తారా? అంటూ ప్ర‌శ్నించారు. పోసాని ప్ర‌శ్న విన్న వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఎవ‌రిని పట్టుకొని ఏమ‌ని ప్ర‌శ్నిస్తున్నారంటూ అవాక్క‌య్యారు. జ‌గ‌న్‌కు కుల పిచ్చి లేదా? ఆ విష‌యం ఆయ‌న వీరాభిమాని పోసానికి తెలియ‌దా?  లేక‌, తెలీన‌ట్టు న‌టిస్తున్నారా? అంటూ నిల‌దీస్తున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి ఉందా? లేదా? అనే అంశంపై ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.  చంద్ర‌బాబు-క‌మ్మ‌.. జ‌గ‌న్ నోటి నుంచి ప‌దే ప‌దే వ‌చ్చే మాట‌. జ‌గ‌న్‌-రెడ్డి.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దే ప‌దే విమ‌ర్శించే డైలాగ్‌. చంద్ర‌బాబుకు నిమ్మ‌గ‌డ్డ‌కు.. చంద్ర‌బాబుకు రామోజీరావుకు.. చంద్ర‌బాబుకు ఆంధ్ర‌జ్యోతి మీడియాకు.. చంద్ర‌బాబుకు కొవాగ్జిన్‌కు.. క‌మ్మ బంధంతో ధృడ‌మైన సంబంధం అంట‌గ‌ట్టి.. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున ఘ‌నుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనే విమర్శ ఉంది. ఇక త‌న‌కు మ‌రో ప్ర‌త్య‌ర్థి అయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను.. కాపు కులంతో ఫెవికాల్ బంధంతో అతికించిందీ జ‌గ‌నే. ఇలా, ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి నిస్సిగ్గుగా, నిర్ల‌జ్జ‌గా.. క‌మ్మ-కాపు రాజ‌కీయం చేస్తున్న పాల‌కుడు జగన్ అంటారు. అలాంటి జ‌గ‌న్‌కు.. రెడ్ల‌పై కుల‌పిచ్చి ఉందా? అని పోసాని అమాయ‌కంగా ప్ర‌శ్నించడం విచిత్రంగా ఉందనే టాక్ వస్తోంది. దీనికి ప‌వ‌న్‌క‌ల్యాణే స‌రైన స‌మాధానం చెప్ప‌గ‌ల స‌మ‌ర్థుడని, జ‌గ‌న్ పేరును జ‌గ‌న్‌రెడ్డి అని ఫిక్స్ చేసిన పోటుగాడు ప‌వ‌ర్‌స్టార్‌ అంటున్నారు.  ఇక‌, జ‌గ‌న్‌కు రెడ్ల‌పై కుల‌పిచ్చి ఉందా లేదా అనేది అస‌లు క్వ‌శ్చ‌న్‌. జ‌గ‌న్‌కు కుడి-ఎడ‌మ భుజాల్లా ఉంటున్న విజ‌య‌సాయి, స‌జ్జ‌ల ఇద్ద‌రూ రెడ్లే. ఆర్థిక‌మంత్రి బుగ్గ‌నా రెడ్డే. ఇక పెద్దిరెడ్డి నుంచి రోజారెడ్డి వ‌ర‌కూ అనేక మందికి కీల‌క‌ మంత్రిప‌ద‌వులు, కార్పొరేష‌న్ ప‌దవులు క‌ట్ట‌బెట్టింది జ‌గ‌న్‌రెడ్డీనే. ఏపీవ్యాప్తంగా ఇసుక మైనింగ్ అంతా అయోధ్య‌రామిరెడ్డికే. ఇక మెఘా కృష్ణారెడ్డితో ఆయ‌న బంధం చెప్ప‌నవ‌స‌ర‌మే లేదు. ప్రాజెక్టులు, ప‌నులు, కాంట్రాక్టులు.. ఆఖ‌రికి ఏపీలో మాత్ర‌మే ల‌భ్య‌మ‌య్యే లిక్క‌ర్ బ్రాండ్ల స‌ర‌ఫ‌రాలో రెడ్ల‌దే అధిప‌త్యం. ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న అధికారులు, ప‌వ‌ర్‌సెంట‌ర్‌లు.. ఇలా అంత‌టా రెడ్డి..రెడ్డి..రెడ్డినే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షులు ప్రొ.కొలిక‌పుడి శ్రీనివాస‌రావు లెక్క‌ల ప్ర‌కారం.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంలో 950 మంది రెడ్ల‌కు ప‌ద‌వులు ద‌క్కాయంటే న‌మ్మాల్సిందే.  మ‌రి, రెడ్ల‌పై ఇంత‌టి స్వాభిమాన‌మున్న జ‌గ‌న్‌రెడ్డికి.. చంద్ర‌బాబు-క‌మ్మ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-కాపు అంటూ కుల‌ రాజకీయం చేయ‌డం గురివింద గింజ త‌న‌కింద ఉన్న న‌లుపు ఎర‌గ‌ద‌నే సామెత‌లా ఉందంటున్నారు. అంద‌రికీ తెలిసిన ఈ విష‌యం పోసాని కృష్ణ‌ముర‌ళికి మాత్రం తెలీద‌ను కోవాలా?  లేక‌, త‌న స‌హ‌చ‌ర క‌మెడియ‌న్ పృథ్వీరాజ్‌కు గ‌తంలో ఇచ్చిన‌ట్టు త‌న‌కూ ఏ ఎస్వీబీసీ ఛైర్మ‌న్ పోస్టో.. మ‌రేదైనా ప‌ద‌వో ఇవ్వాల‌నే తాప‌త్ర‌యంతోనే జ‌గ‌న్‌కు కుల‌పిచ్చి ఉందని నిరూపిస్తారా? అంటూ పోసాని కావాల‌నే ఇలా జ‌గ‌న్‌రెడ్డికి వంత పాడుతున్నారని అంటున్నారు.

జోరు వాన‌లో.. పెరుగు కోసం వెళ్లి.. చావు కొనితెచ్చుకొన్న టెక్కీ..

అధికారుల అల‌స‌త్వం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిర్ల‌క్ష్యం.. రెండూ క‌లిసి మ‌ణికొండ‌లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో ప‌డి గ‌ల్లంతైన ర‌జ‌నీకాంత్ ఉదంతం విషాదాంత‌మైంది.  42 గంట‌ల సుదీర్ఘ సెర్చ్ ఆప‌రేష‌న్ త‌ర్వాత అత‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ర‌జ‌నీకాంత్ డ్రైనేజీలో ప‌డుతున్న వీడియో వైర‌ల్ కావ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. శనివారం రాత్రి గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపిశెట్టి రజనీకాంత్ (42) మృతదేహం.. సోమవారం నెక్నాంపూర్‌ చెరువులో దొరికింది. భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లున్న ఆ కుటుంబంలో విషాదం నింపింది. జోరు వాన‌లో ఇంటి నుంచి ఎందుకు బ‌య‌ట‌కు వెళ్లాడు?  చావు నోట్లో ఎలా చిక్కుకున్నాడు? అనే డీటైల్స్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  పాపం.. రాత్రిపూట పెరుగు కోసం బయటకు వచ్చాడ‌ట రజనీకాంత్. వాన ప‌డితే హైద‌రాబాద్ య‌మ డేంజ‌ర్ అని తెలిసి కూడా ఆ సాఫ్ట్‌వేర్ పెరుగు కోసం అంత సాహ‌సం ఎందుకు చేశాడో మ‌రి. హైద‌రాబాద్ గురించి గొప్ప‌లు చెప్పుకునే టీఆర్ఎస్ పాల‌న‌లో డ్రైనేజీలు అలా తెరిచి ఉంటాయ‌ని మ‌రిచిపోయిన‌ట్టున్నాడు. 9 గంటల సమయంలో పెరుగు కోసం బయటకు వచ్చిన ర‌జ‌నీకాంత్‌... పెరుగు ప్యాకెట్‌ తీసుకుని రాత్రి 9.14 గంటల సమయంలో గోల్డెన్‌టెంపుల్‌ ఎదురుగా ఉన్న డ్రైనేజీ మీద ఉన్న దారి మీదుగా ఇంటికి వెళ్తూ మురుగుకాల్వలో పడిపోయాడు. అప్పటికే భారీగా వరద ప్ర‌వాహం ఉండ‌టంతో వెంట‌నే కొట్టుకుపోయాడు. సమీపంలోని ఓ వ్యక్తి వరదను తన సెల్‌ఫోన్లో వీడియో తీస్తుండగా రజనీకాంత్ డ్రైనేజీలో ప‌డటం,  కొట్టుకుపోవడం రికార్డయింది. ఆ వెంట‌నే అత‌ను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. డ్రోన్ కెమెరాల‌తోనూ సెర్చ్ చేశారు. ఆ నాలా కలిసే నెక్నాంపూర్‌ చెరువులో ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. మూడోరోజు సోమవారం మధ్యాహ్నం నెక్నెంపూర్‌ చెరువులో గుర్రపుడెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. దుస్తుల ఆధారంగా మృతుడిని గుర్తించారు. 42 గంటల పాటు నీటిలోనే ఉండటంతో ముఖం, శ‌రీరం గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోయింది. పెరుగు కోసం బయటకు వెళ్లకుండా ఉన్నా ర‌జ‌నీకాంత్ తమకు దక్కేవాడని కుటుంబ‌స‌భ్యులు విల‌పిస్తున్నారు. 

పీసీసీకి సిద్దూ రాజీనామా.. పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో? 

పంజాబ్ రాజకీయం మరో మలుపు తిరిగింది. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ  రాజీనామా చేశారు. కొట్లాడి మరీ తెచ్చుకున్న పదవికి రెండున్నర నెలల్లోనే రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సిద్దూ షాక్ ఇచ్చారు. మరో వంక సిద్ధూ రాజీనామా చేయడంపై స్పందించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూకు నిలకడ లేదని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాదని కెప్టెన్ మరోసారి పునరుద్ఘాటించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వి నందుకు అన్నట్లుగా తయారైంది.  అమరీందర్ సింగ్ బీజేపీ పెద్దలను ఢిల్లీలో కలవబోతున్నారని ప్రచారం జరిగింది. అమరీందర్ బీజేపీలో చేరతారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతలోనే సిద్ధూ పంజాబ్ పీసీసీకి రాజీనామా చేయడం కలకలం రేపింది.రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిన సిద్ధూ. తమ రాజీనామాకు కారణం ఏమిటన్నది మాత్రం  స్పష్టం చేయలేదు. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిద్ధూ దేశానికి ప్రమాదకారి అని అమరీందర్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన నొచ్చుకున్నట్లు సమాచారం. అమరీందర్ సింగ్ చేసిన, ‘దేశ ద్రోహి’ వ్యాఖ్యలు ఆయన్ని కలిచి వేశాయని అందుకే ఆయన రాజీనామా చేశారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే సోనియా గాంధీకి రాసిన లేఖలో సిద్ధూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పంజాబ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో రాజీపడబోనని పేర్కొన్నారు.కానీ, ఆయన కాంగ్రెస్’లో కొనసాగేది అనుమానమే అంటున్నారు. ఆప్’లో చేరే అవకాశాలు లేక పోలేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినవస్తోంది.   సిద్ధూ రాజీనామా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పెద్ద  షాక్’గానే భావించవలసి ఉంటుందని, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్దూల మద్య చాలా కాలంగా సాగుతున్న అంతర్గత ,ముఠా తగవుల పర్యవసానంగా కాంగ్రెస్ అధిష్టానం సిద్దూను పీసీసీ చీఫ్’గా నియమించింది.ఆయినా, ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదరక చివరకు ముఖ్యమంత్రి అమరీందర్ రాజీనామా చేయడం అయన స్థానంలో, చరణ్జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం చకచకా జరిగి పోయాయి.ఇంతలోనే, సిద్దూ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మళ్ళీ తిరిగొచ్చింది.దీంతో, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా,చేసిన  ‘యువ నాయకత్వం’ ప్రయోగానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలినట్లు అయిందని అంటున్నారు.

క‌రోనా మందుపై పాల‌కులే కుట్ర చేశారా? ఆనంద‌య్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

గుర్తున్నారుగా ఆనంద‌య్య‌. ఒక‌ప్పుడు తెలుగుస్టేట్స్‌లో ఫుల్ ఫేమ‌స్‌. క‌రోనాకు స‌మ‌ర్థ‌వంత‌మైన ఆయుర్వేద మందును అందించిన వాడిగా ఎన‌లేని పాపులారిటీ. ఆయ‌న మందు కోసం వేల‌ల్లో ప్ర‌జ‌లు క్యూ క‌ట్టారు. రెండు చుక్క‌లు కంట్లో వేస్తే చాలు.. క‌రోనా హుష్‌కాకి. కాసింత మందు నోట్లో వేస్తే పావుగంట‌లో లేచి కూర్చొనేవారు పేషెంట్లు. ఆక్సిజ‌న్ లెవెల్స్ పాద‌ర‌సంలా స‌ర్రున ఎగ‌బాకేవి. త‌న మందుతో కొన్ని వారాల్లోనే మెరాకిల్స్ చేసి చూపించారు ఆనంద‌య్య‌. నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య మందుపై ప్ర‌భుత్వ‌మే కుట్ర చేసింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న్ను హైజాక్ చేసి.. ఆ మందును ఎవ‌రికీ అంద‌కుండా క‌ట్ట‌డి చేసి.. క్ర‌మంగా తెర‌మ‌రుగు చేశారు. వైపీసీ పెద్ద‌లు, అధికారులు త‌మ‌కు కావ‌ల‌సిన వారికి బ‌కెట్ల‌కు బ‌కెట్లు ఆనంద‌య్య మందును స‌ర‌ఫ‌రా చేయించుకుని.. ప్ర‌జ‌ల‌కు మాత్రం మొండిచేయి చూపించారు. ఆ వ‌న‌మూలిక‌ల‌తో చేసే ఆ మందుకు ఆయుష్ ఓకే చేసినా.. హైకోర్టు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినా.. ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచుతామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా.. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో గానీ ఆనంద‌య్య పేరు గానీ, ఆ ఆయుర్వేద మందు ఊసుగానీ లేకుండా చేశారు. తాజాగా, ఆ అంశంపై ఆనంద‌య్య షాకింగ్‌ విష‌యాలు వెల్ల‌డించారు.  మా కరోనా మందు ప్రజల్లోకి రానివ్వలేదంటూ ప‌రోక్షంగా వైసీపీ పాల‌కుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆనందయ్య. కరోనా చికిత్స కోసం తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా చాలా అడ్డంకులు సృష్టించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ్రామస్థులంతా ఆ సమయంలో అండగా నిలవడం వల్లే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారని వాపోయారు. ఆనంద‌య్య మాట‌ల‌తో ప్ర‌భుత్వ‌మే కుట్ర చేసిన‌ట్టు సుస్ప‌ష్టంగా తెలిసిపోతోంది. ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికీ పోలీసులు ప్ర‌య‌త్నించారంటే పాల‌కులే ద‌గ్గ‌రుండి ఆ మందును ప్ర‌జ‌ల‌కు ద‌క్క‌కుండా మాయం చేశార‌ని తెలిసిపోతోంది. జ‌స్ట్‌.. కాసింత క‌రెంట్‌, కొన్ని వంట‌పాత్ర‌లు అందిస్తే చాలు.. ఎంత‌మందికంటే అంత మందికి మందు త‌యారు చేసిస్తాన‌ని ఆనంద‌య్య అనేక‌సార్లు స‌ర్కారుకు మొర‌పెట్టుకున్నా.. ప్ర‌భుత్వ‌ పెద్ద‌ల చెవికి అది వినిపించ‌లేదు. వినిపించ‌లేదు అని చెప్ప‌లేం కానీ, వినిపించీ ప‌ట్టించుకోలేద‌ని.. డ్ర‌గ్స్ మాఫియా ఒత్తిడితో పాల‌కులే ఆనంద‌య్య మందును క‌నుమ‌రుగు చేశారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కృష్ణ‌ప‌ట్నంకు ప్ర‌జ‌లెవ్వ‌రూ రాకుండా ఆంక్ష‌లు విధించి.. ఆనంద‌య్య‌ను వారాల త‌ర‌బ‌డి హైజాక్ చేసి.. క్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు ఆ మందును దూరం చేశారు. తాజాగా ఆనంద‌య్య చేసిన కామెంట్ల‌తో ఆ పాప‌మంతా ప్ర‌భుత్వానిదేన‌ని.. దోషులంతా పాల‌కుల‌నే విష‌యం మ‌రోసారి వెల్ల‌డైందని అంటున్నారు.   

కేసీఆర్ సారూ.. వీటికి జవాబు ఇవ్వండి సారూ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, “కేసీఆర్ సారూ ... వీటికి జవాబు చెప్పడి” అంటూ కొని ప్రశ్నలు సంధించారు. నిజానికి బండి సంజయ్,ఈ బహిరంగ ప్రశ్న పత్రంలో కీసీఆర్ సారును అడిగిన ప్రశ్నలలో కొత్తదనమేమీ లేదు. ముఖ్యమంత్రి సారును ... పెద్దగా చికాకు పెట్టే ప్రశ్నలు కొద ఏమీ లేవు. అలాగే, జగమెరిగిన బ్రాహ్మణుడికి ఎవరో వచ్చి ధన్జ్యం వేసి నట్లు, ‘కేసీఆర్ జమానా – అవినీతి ఖాజానా’ అని బండి సంజయ్ టం ప్రశ్న పత్రానికి ఒక మకుటం కూడా చేర్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభత్వం అవినీతి గురించి, ఈరోజు కొత్తగా చెప్పుకోవలసింది లేదు. తెలంగాణలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏదైనా ఉందంటే, అది కల్వకుట్ల ఫ్యామిలీ అవినీతే. ఇది అందరి మాటగా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో రోజూ ఎదో ఒక రూపంలో వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు రోజూ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎవరిదాకానో ఎందుకు స్వయంగా బండి సంజయ్, తమ ప్రశ్న పత్రంలో వేసిన  ప్రశ్నలు, చేసిన ఆరోపణలను గతంలోనూ అనేక సంధర్భాలలో వేసిన ప్రశ్నలే, చేసిన ఆరోపణలే.  ఒక్క బండి సంజయ్ మాత్రమే కాదు  సెప్టెంబర్ 17 న కేంద్ర హోమ్ మంత్రి  అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హోమ్ మంత్రి సమయమిస్తే కేసీఆర్ అవినీతికి సంబంధించిన ఆధారాలను అందచేస్తానని చెప్పారు. అలాగే అసెంబ్లీ లోపలా వెలుపలా కూడా ప్రభుత్వ అవినీతికి సంబందించి అనేక సందర్భాలలో అనేక ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి  ఫిర్యాదులు అందాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మొదలు, రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు అందరూ కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ అవినీతి గూర్చి మాట్లాడుతూనే ఉన్నారు. అయినా చర్యలు లేవు ... అందుకే, బీజేపీ చేసే ఆరోపణలకు విలువలేకుండా పోయిందని పరిశీలకులు భావిస్తున్నారు., బీజేపీ ప్రత్యర్ధి  పార్టీలు కూడా. గల్లీలో కుస్త్తే  ఢిల్లీలో దోస్తీ’ అని ఎద్దేవా చేస్తున్నాయి.  బండి సంజయ్ తాజాగా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో మొత్తం పది ప్రశ్నలు సంధించారు. అయితే అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు, ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు, అలాగే కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి సంబంధించి, కూడా లోతుల్లోకి పోనవసరం లేదని రాజాకీయ విశ్లేషకులు అంటున్నారు. 2001లో తెరాస ఆవిర్భావం నాటికి, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత? 2014లో కేసీఆర్ ముఖ్యమంతి అయ్యేనాటికి అయన, అయన, అయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత? ఇప్పుడు (2021) నాటికీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ ఎంత? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం రాబట్టగలిగితే, బండి సంజయ్ లేవనెత్తిన, పది ప్రశ్నలకు సమాధానం చ్గిక్కేస్తుంది. కేసీఆర్ కుటుంబ ఆస్తులు లక్ష రెట్లు పెరిగాయా, లేక ఇంకా ఎక్కువ పెరిగాయా అనే ప్రశ్నతో పాటుగా  అన్ని ప్రశ్నలకు సమాధానం చిక్కేస్తుందని, అంటున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరిట అంచనా వ్యయాన్ని పెంచి ప్రజాధనాన్ని కొల్లగొట్టారా లేదా అని  అడిగితే కేసీఆర్ నిజం చెపుతారా? ఇనవరకు అడిగిన ననూటొక్క మందిలో ఏ ఒక్కరికైనా ఆయన సమాధానం చెప్పరా? ఇదే విషయంగా కదా, కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది, దానికి సమాధానంగా ముఖ్యమంత్రి ఏకంగా సభలోనే పవర్  పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అంటే కాని, అవినేతిని ఒప్పెసుకున్నారా? కేసీఆర్  అంత అమాయకుడా, అలాగే, మిషన్, కాకతీయ, మిషన్ భగీరథ, పాలమూరు – రంగ రెడ్డి ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు,  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఇలా  వివిధ ప్రాజెక్టులలో అవినీతి జరిగింది .. ఇందుకు సంబందించిన ఫైల్స్, పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి చర్చకు వస్తారా, అంటే, కేసీఆర్ వస్తారా .. అయినా, రాజకీయ నాయకుల సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఫలితం ఉంటుందా? ఉండదనే కదా చరిత్ర చెపుతోంది.  నిజానికి కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఆర్థిక అవినీతి మాత్రమే కాదు, దానికి తోడుగా అనుబంధంగా రాజకీయ అవినీతి కూడా పెరిగి పోయింది . బండి సంజయ్ తమ లేఖలో ప్రస్తావించిన విధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను, చివరకు సొంత పార్టీ  సహా, అన్నిపార్టీల స్థానిక ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది నిజం ..  రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగు దేశం, కాంగ్రెస్ శాసనసభ పక్షాలను టం పార్టీలో విలీనం చేస్కున్నారు. ఇతర పార్టీలో గ్లిచిన అరిని మంత్రివర్గంలోకి తీసుకునంరు.. ఇలా అనేక విధాల తెరాస రాజకీయ అవినీతికి పాల్పడింది నిజం. ప్రజాస్వామ్య వ్యవస్థలను, చివరకు సమాజాన్ని అవినీతిమయం చేసింది నిజం. కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే కాదు, ఆయన బందుమితులు అందరూ అవినీతి సామ్రాజ్యంలో భాగస్వాములే ..లెక్క సరిగా గుర్తులేదు కానీ, ఈ ఏడేళ్ళలో కల్వకుట్ల అండ్ కో పేరున ఎన్నో కంపెనీలు పుట్టు కొచ్చాయని సోషల్ మీడియాలో ఎన్నో కధనాలు వచ్చాయి. సో ... ఇప్పుదు తేలవలసింది, తెలుసుకోవలసింది, కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందా లేదా అనేది కాదు.. అందులో ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు .. అలాగే, కేసీఆర్ దేశంలోనే అత్యంత ధనిక పొలిటీషియన్ అన్నా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇప్పడు చర్చలు అనవసరం, విచారణ జరిగి .. నిజం ఏమిటో బయటకు రావడం అవసరం. పిల్లి మెడలో గంట కట్టేదెవరు.. అదీ ఇప్పుడు తెలవలసింది.. కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందా ... న్యాయ వ్యవస్థ నడుబిగిస్తుందా .. చివరకు ప్రజలే ఉద్యమిస్తారా లేక ... ఇదే వరస కొనసాగుతుందా? ఇవి ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నలు..   

జగన్ రెడ్డికి కులపిచ్చి ముదిరిపోయింది! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఒక వర్గం వారికే పదవులు దక్కుతున్నాయనే ప్రచారం మొదటి నుంచి సాగుతోంది. కీలక పదవులన్ని ఒక వర్గం వారికే కట్టబెట్టారని విపక్షాలు లెక్కలు కట్టీ మరీ చెబుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్జి తీరు మాత్రం మారడం లేదంటున్నారు. తాజాగా ఎన్నికలు జరిగిన జడ్పీ చైర్ పర్సన్ ఎన్నికల్లోనూ అదే జరిగిందని అంటున్నారు. పదవులే కాదు ప్రభుత్వ పనుల విషయంలోనూ ఒక వర్గం వారిదే హవా అన్న చర్చ సాగుతోంది. సీఎం దగ్గరుండే గుమస్తా మొదలు ప్రభుత్వ సలహాదారుల వరకు అంతా అదే కథ అన్న విమర్శలు వస్తున్నాయి.  టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కులపిచ్చి బాగా ముదిరిపోయిందని అన్నారు.  రాష్ట్రంలో కేవలం 4 శాతమున్న తన వర్గానికే పదవులన్నీ కట్టబెడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. గతంలో స్పీకర్ తమ్మినేని సీతరాం రెడ్డివారే.. తమకు దొడ్డవారన్న మాటలను.. జగన్‌రెడ్డి తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ఓట్లతోనే సీఎం అయ్యారనే వాస్తవాన్ని జగన్ విస్మరిస్తున్నారన్నారు. రెడ్లను తప్ప.. మరో వర్గాన్ని నమ్మనట్లుగా ముఖ్యమంత్రి ప్రవర్తన ఉందన్నారు బుద్దా. వర్గాలకు దూరంగా ఉండే చంద్రబాబుకు కుల పిచ్చి ఉందని దుష్ప్రచారం చేసి.. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు. 

సమాచార శాఖలో స్కాంల కలకలం.. సీబీఐ విచారణకు విపక్షాల డిమాండ్ 

తెలంగాణ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల శాఖ అవినీతి అడ్డాగా మారిందా? ప్రకటనల పేరుతో ప్రభుత్వ నిధులు దోచెస్తున్నారా? ఐఅండ్ పీఆర్ లో అవినీతి జరుగుతుందంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు నిజమయ్యాయి. సమాచార పౌర సంబంధాల శాఖలో భారీ కుంభకోణాలు వెలుగు చూశాయి. రూ,11.75 కోట్ల స్కాం జరిగిందని తేలింది. 2015-17 మధ్య రెండు ఏండ్లకు సంబంధించి ప్రకటనల పేరుతో ఈ డబ్బులను దిగమింగారు. ఓ అంతర్జాతీయ మార్కెటింగ్‌ అనుబంధ సంస్థ సీఈవో, తెలంగాణ సమాచార శాఖ అధికారులు కలిసి రెండు కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనం రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అవినీతి  గుట్టు బయటపడడంతో లండన్‌ సంస్థ హైదరాబాద్‌లోని అనుబంధ సంస్థను మూసేసి.. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌కు ‘ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీపీ) కింద జరిమానా చెల్లించుకుంటోంది.  డబ్ల్యూపీపీ కంపెనీ 2011 జూలై 6న తన అనుబంధ సంస్థ అయిన జేడబ్ల్యూటీ ఇండియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన మైండ్‌సెట్‌ అడ్వర్టయిజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను టేకోవర్‌ చేసింది. తర్వాత జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌ అడ్వర్టయిజింగ్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌ సంస్ ప్రభుత్వానికి యాడ్స్‌ తయారుచేసేది. అయితే వాటిని తాను నేరుగా మీడియాకు ఇవ్వకుండా.. ఆ బాధ్యతను ‘వెండర్‌ ఏ’ అనే బినామీ సంస్థకు ఇచ్చింది. ఆ సంస్థ .. మీడియా నుంచి యాడ్‌ స్పేస్‌ను కొనుగోలు చేసి యాడ్స్‌ ఇచ్చేది. సదరు యాడ్స్‌కు సంబంధించిన బిల్లులను ‘వెండర్‌ ఏ’ సంస్థ.. ఆయా మీడియా సంస్థల నుంచి తీసుకుని జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌కు ఇచ్చేది. అందులో 10 శాతం కమీషన్‌ వెండర్‌ ఏ సంస్థకు ముడుతుంది. కానీ మీడియా సంస్థలు ఇచ్చే బిల్లులేవీ తీసుకోకుండానే, చూడకుండానే జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌ సంస్థ వెండర్‌ ఏ కంపెనీకి చెల్లింపులు జరిపేసింది. ఇలానే కాదు అసలు వాణిజ్యప్రకటనలే ఇవ్వకుండా డబ్బులు మింగేస్తూ మరో కుంభకోణానికి పాల్పడింది జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌. వెండర్‌ బి’ అనే మరో బినామీ కంపెనీని ఇందుకు వాడుకున్నాయి. 2015 జూన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాలకు సంబంధించి ప్రచారైల కాంట్రాక్టు విలువ 15,88,480 డాలర్లు. అంటే దాదాపుగా రూ.11.75 కోట్లు. అయితే ఒక్క యాడ్‌ కూడా ఇవ్వకుండానే మొత్తం సొమ్ము మింగేశారు. పథకం ప్రకారం.. కాంట్రాక్టు అమలుచేసినట్లుగా ‘వెండర్‌ బి’ సంస్థ బోగస్‌ బిల్లులు సృష్టించింది. అలా మింగేసిన రూ.11.75 కోట్లలో రూ.7.5 కోట్లు డీఐపీఆర్‌ అధికారుల వాటాగా చేరినట్లు జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌  తయారుచేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. మిగిలిన సొమ్మును ‘వెండర్‌ బి’ సంస్థ జేడబ్ల్యూటీ మైండ్‌సెట్‌ సీఈవోకు నగదు రూపంలో ఇచ్చింది.  ఈ కుంభకోణాలకు సంబంధించి డీఐపీఆర్‌లోని అవినీతి అధికారికి, హైదరాబాద్‌లోని డబ్ల్యూపీపీ సీఈవోకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని డెలాయిట్‌ తేల్చినట్టు సమాచారం. డీఐపీఆర్‌ అధికారి పెద్ద లంచగొండి అని పేర్కొన్నట్టు తెలుస్తోంది.   2015-17 కాలంలో  తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పని చేశారు. ఆయన హయంలోనే ఈ అడ్డగోలు అవినీతి జరిగింది. అంతర్జాతీయ సంస్థ ద్వారా రూ. 11.75 లక్షల రూపాయల అవినీతి జరిగిందని తేలినా.. ఇతరత్రా మార్గాల్లో భారీగానే అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. సమాచార శాఖలో గత ఏడేండ్లుగా సాగిన కార్యాకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరిపించే దర్యాప్తులో నిజాలు తేలవని, సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ కుమార్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ , టీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందని వాళ్లు ఆరోపిస్తున్నారు.  సమాచార పౌరసంబంధాల శాఖలో వెలుగుచూసిన స్కాంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ఓ పత్రికలో వచ్చిన  కథనాన్ని జతచేస్తూ సోషల్ మీడియాలో ఆమె సంచలన పోస్ట్ పెట్టారు. ‘‘ఏ దోపిడీ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ఎంత పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో... ఆ పోరాటయోధులు, అమరవీరుల త్యాగాలు, ఆత్మార్పణలకు ఏ మాత్రం విలువ లేకుండా ఉమ్మడిరాష్ట్ర కాలపు అక్రమాల పరంపరను నేటి తెలంగాణ పాలకులు జంకూ గొంకూ లేకుండా కొనసాగించారనడానికి మరో తిరుగులేని సాక్ష్యాన్ని మీడియా బయటపెట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా గడవకముందే 2015 నుంచి రెండేళ్ళ పాటు I&PR (సమాచార ప్రజా సంబంధాల) విభాగంలో కొనసాగిన అవినీతి వారసత్వం బట్టబయలైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల పేరు చెప్పి... విదేశీ అడ్వర్టయిజింగ్ కంపెనీ WPP భారతీయ విభాగాల (JWT Mindset Advt.)తో కుమ్మక్కై వీసమెత్తు ప్రచారం కూడా చెయ్యకుండా అందరూ కలసి మొత్తంగా సుమారు రూ.12 కోట్లు... పత్రికల్లో యాడ్స్ అంటూ మరి కొన్ని కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు ఈ కథనం ఆధారాలతో సహా వివరాలిచ్చింది. ఈ సొమ్ములో రూ.7.5 కోట్లు డీఐపీఆర్ అధికారుల వాటాగా ఇచ్చినట్లు JWT Mindset నివేదిక ద్వారా తెలిసింది. కలకలం రేపుతున్న మరో విషయం ఏమిటంటే, ఈ డబ్ల్యూపీపీ సంస్థ పలు దేశాల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడినప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రధానంగా తెలంగాణలోనే అవినీతికి పాల్పడినట్లు ఆ వార్తా కథనం స్పష్టం చేసింది. దీన్ని బట్టి ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్థమవుతూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ పాలకులకు సంబంధం లేదంటే పసిపిల్లలు కూడా నమ్మరు. తెలంగాణలో పాలనా పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ అధికార పార్టీ వారి అవినీతి, అక్రమాల చిట్టా పెరుగుతూ పోయిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఇలా ఏర్పడిందో లేదో... ఆ మరు క్షణం నుంచే అవినీతి మెట్లెక్కుతూ... అక్రమాల పుట్టలు కడుతూ ప్రజల్ని మోసగించిన వైనం చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.’’ అంటూ విజయశాంతి తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. 

గ‌న్‌తో హ‌ల్‌చ‌ల్‌.. బైక్‌తో ఫీట్స్‌.. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై ఓవ‌రాక్ష‌న్‌..

బెజ‌వాడ‌లో బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి ముఠాలే కాదు.. తుపాకీ వీరులూ చెల‌రేగిపోతున్నారు. ఏపీలో పోలీసింగ్ సిస్ట‌మ్ అట్ట‌ర్‌ఫ్లాప్ అవ‌డంతో కుర్ర‌కారుకి ప‌గ్గాలు లేకుండా పోతోంది. త‌మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే ధీమానో.. పోలీసుల చేత‌గానిత‌నంపై న‌మ్మ‌క‌మో.. రీజ‌న్ ఏదైనా.. యూత్ య‌మ డేంజ‌ర‌స్‌గా ప్ర‌వ‌ర్తిస్తోంది. విజ‌య‌వాడ‌, గుంటూరు త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్మాదులు రెచ్చిపోతుండ‌టం, మ‌హిళ‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతూనే ఉంది. పోలీసుల వైఫ‌ల్యం ఆవారా గాళ్ల‌కు, అరాచ‌క శ‌క్తుల‌కు అనుకూలంగా మారుతోంది. ఖాకీల నిఘా లేక‌పోవ‌డంతో.. కుర్ర‌కారు తెగ రెచ్చిపోతున్నారు. తాజాగా, జ‌రిగిన ఓ ఘ‌ట‌న విజ‌య‌వాడవాసుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తోంది.   బెజ‌వాడ‌ దుర్గగుడి ఫ్లైఓవర్‌పై కొంద‌రు యువ‌కులు రెచ్చిపోయారు. బైక్‌తో భ‌యంక‌ర స్టంట్స్ చేస్తూ చెల‌రేగిపోయారు. న‌డుస్తున్న బైక్‌పైకి ఎక్కి నిలుచొని ర‌క‌ర‌కాల విన్యాసాలు చేశారు. ఓ యువ‌కుడు బైక్‌పై నిలుచుని.. గాల్లో తుపాకీ చూపిస్తూ.. హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఆ ఫీట్‌ను వీడియో తీయించుకొని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  ఆ బైక‌ర్ త‌న బండిని ఎవరూ గుర్తించకుండా నెంబర్‌ ప్లేట్ తీసేసి ఫ్లైఓవ‌ర్‌పై ఫీట్లు చేశాడు. ఆ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో న‌గ‌ర‌వాసుల‌తో పాటూ పోలీసులూ ఉలిక్కిప‌డ్డారు. ఇంత‌కీ అత‌నికి గ‌న్‌ ఎలా వ‌చ్చింది? అది నిజ‌మైన తుపాకీనేనా? దుర్గ‌గుడి ఫ్లైఓవ‌ర్‌పై యూత్ ఇలా బైక్స్‌తో ఫీట్స్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్న‌ట్టు? ఇలా ఖాకీల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తున్నారు నెటిజ‌న్లు.    

ప‌వ‌న్‌ను వైసీపీ కావాల‌నే రెచ్చ‌గొడుతోందా? టీడీపీని సైడ్ చేసే వ్యూహ‌మా?

బ‌ల‌మైన శ‌త్రువును దెబ్బ‌కొట్ట‌డం అంత ఈజీ కాదు. మ‌న‌కు అంత బ‌లం లేన‌ప్పుడు.. ప్ర‌త్య‌ర్థి బ‌లాన్ని త‌గ్గించ‌డం ఓ ఎత్తుగ‌డ‌. రాజ‌కీయాల్లో ఇది బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది. ప్ర‌స్తుం వైసీపీ ఇదే పొలిటిక‌ల్ స్ట్రాల‌జీని అప్లై చేస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఇప్ప‌టికీ అత్యంత బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఉంది. నిజాయితీగా ఎలాంటి బెదిరింపులు, కుట్ర‌లు లేకుండా ఎన్నిక‌లు జ‌రిపితే తెలుగుదేశం స‌త్తా ఏంటో తెలుస్తుంది. ఈ విష‌యం అంద‌రికంటే అధికార‌పార్టీకే బాగా తెలుసు. అందుకే, బ‌ల‌మైన టీడీపీని రాజ‌కీయంగా సైడ్ చేసేందుకు.. వైసీపీ ద్విముఖ వ్యూహం అమ‌లు చేస్తోంది. వివిధ అంశాల్లో బీజేపీని, జ‌న‌సేన‌ని క‌వ్వించి, రెచ్చ‌గొట్టి.. ఆ రెండు పార్టీలు నిత్యం వార్త‌ల్లో ఉండేలా చేయ‌డమే ఆ ఎత్తుగ‌డ‌. అలా ఆ రెండు పార్టీలను యాక్టివ్ పాలిటిక్స్‌లో లైమ్‌లైట్‌లో ఉంచి.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీని సైడ్‌వేస్‌లోకి పంపించేయాల‌నేది వైసీపీ స్కెచ్ అంటున్నారు. అందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు.  ఇటీవ‌ల టిప్పు సుల్తాన్ విగ్ర‌హం విష‌యంలో బీజేపీ నానార‌చ్చ చేసింది. ఎక్క‌డో ఓ ప‌ట్ట‌ణస్థాయి ఇష్యూని స్టేట్‌వైడ్ ప్రాబ్ల‌మ్‌గా క్రియేట్ చేసి.. బీజేపీ ర్యాలీల‌తో హోరెత్తించి.. ప్ర‌భుత్వంపై పోరాడేందుకు తామే క‌రెక్ట్ అనేలా సీన్ క్రియేట్ చేశారు. అంత‌కుముందు, ఆల‌యాలపై దాడులు, మ‌త‌మార్పిడిలు, టీటీడీలో అన్య‌మ‌త‌స్తుల అంశంలోనూ బీజేపీ యాక్టివ్ పాలిటిక్స్ చేసి.. టీడీపీని డ‌మ్మీ చేసే ప్ర‌య‌త్నం చేసింది. సేమ్ ఇలాంటి స్ట్రాట‌జీనే జ‌న‌సేన విష‌యంలోనూ ప్ర‌యోగిస్తోంది వైసీపీ. గిల్లితే గిల్లించుకోకుండా.. గూబ ప‌గ‌ల‌గొట్టేలా మాట్లాడే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను క‌వ్వించ‌డం చాలా సింపుల్‌. జ‌స్ట్ ఒక్క మాటంటే చాలు.. మాట‌ల తూటాల‌తో ఎదురుదాడి చేయ‌డం పీకే నైజం. ఆ వీక్‌నెస్‌ను వైసీపీ ఫుల్‌గా క్యాష్ చేసుకుంటోంద‌ని అంటున్నారు. కావాల‌నే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను రెచ్చ‌గొట్టేందుకే.. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల టైమ్‌లో వ‌కీల్‌సాబ్‌ను టార్గెట్ చేశార‌ని.. అద‌లా కంటిన్యూ చేస్తూ.. ఆన్‌లైన్ టికెటింగ్ తీసుకురావ‌డం.. ఇలా మొత్తం మేట‌ర్‌ను పీకే చుట్టూ తిప్పేసింది ప్ర‌భుత్వం. వైసీపీ ట్రాప్‌లో ప‌వర్‌స్టార్ ఈజీగా ప‌డిపోయారు. స్వ‌త‌హాగా అస‌మ‌నం, ఆవేశం ఫుల్లుగా ఉండే ప‌వ‌న్‌క‌ల్యాన్‌.. ఓపిక ప‌ట్టీ ప‌ట్టీ.. రిప‌బ్లిక్ వేదిక‌గా బ్లాస్ట్ అయ్యారు. ఏపీ పాల‌కుల‌ను ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. దానికి మ‌రింత మ‌సాలా ద‌ట్టిస్తూ.. పేర్ని నాని, పోసాని, స‌జ్జ‌ల లాంటి వాళ్లు ఆ అగ్నిగుండం ఆర‌కుండా.. మ‌రింత ఆజ్యం పోస్తున్నారు. ప‌వ‌న్ సైతం ట్విట‌ర్‌లో ర‌చ్చ కంటిన్యూ చేస్తున్నారు. ఈ టోట‌ల్ ఎపిసోడ్‌లో ఎక్క‌డా టీడీపీ ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డం.. జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ వార్ ర‌క్తిక‌ట్ట‌డం ఆస‌క్తిక‌ర‌మే కాదు వ్యూహాత్మ‌క‌మూ అంటున్నారు.  వైసీపీకీ కావ‌ల‌సింది ఇదే. ప్ర‌భుత్వంపై బాగా పోరాడుతున్నారంటూ ప్ర‌జ‌ల అటెన్ష‌న్ జ‌న‌సేన వైపో, బీజేపీ వైపో షిఫ్ట్ చేయ‌డం అధికార‌పార్టీ టార్గెట్ అంటున్నారు. ఎందుకంటే, ఎంత ఎగిరెగిరి ప‌డినా జ‌న‌సేన కానీ, బీజేపీ కానీ ఇప్ప‌ట్లో ఏపీలో ప‌వ‌ర్‌లోకి వ‌చ్చే ఛాన్సే లేదు. సంస్థాగ‌తంగా ఆ రెండు పార్టీలు బాగా బ‌లహీనం. టీడీపీ అలా కాదు.. ఏమాత్రం అవ‌కాశం క‌లిసొచ్చినా.. మునుప‌టి వైభ‌వం ఖాయం. అందుకే, ఆ పార్టీకి ఆ అవ‌కాశం చిక్క‌కుండా చేసేందుకే.. బీజేపీ, జ‌న‌సేన‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడూ రెచ్చ‌గొడుతూ వైసీపీ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటోంద‌ని అనుమానిస్తున్నారు. ఇలా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త టీడీపీ, బీజేపీ. జ‌న‌సేన‌ల మ‌ధ్య చీలిపోయి.. ఆ మేర‌కు వైసీపీ లాభం పొంద‌ట‌మే ఆ పార్టీ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీగా క‌నిపిస్తోందని అంటున్నారు.

ఆ రాష్ట్రంలో గజదొంగను పట్టించిన ఈ రాష్ట్రం పోలీసు

ఒక ఐడియా జీవితాన్ని నిజంగా మారుస్తుందో లేదో తెలీదు కానీ.. ఒక చిన్న షేరింగ్ మాత్రం భారీ నేరస్తుల గుట్టు  బయట  పెట్టి తీరుతుంది. అందుకే విలువైన సమాచారం, ఎమర్జెన్సీ సమాచారాన్ని మాత్రమే సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. భారీ నేరాలు చేసి తప్పించుకుంటూ తిరుగుతున్న పేరుమోసిన నేరగాళ్లు సైతం వణికిపోతున్నారంటే అందుక్కారణం సోషల్ మీడియానే.  ఇక వివరాల్లోకి వెళ్దాం. గత జులై 9వ తేదీన తమిళనాడులోని తిరువరక్కడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనలో పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ చోరీకి పాల్పడిన నేరస్తుణ్ని గుర్తించేందుకు స్థానికంగా వున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ను తిరువరక్కడు పోలీసులు పరిశీలించారు. విజువల్స్ అయితే ఉన్నాయి గానీ ఆ దొొంగ తాలూకు వివరాలు మాత్రం వారిదగ్గర లేవు. ఆ దొంగ ఎక్కడివాడు, పాత నేరాలేమైనా అతనిపై ఉన్నాయా.. అసలు ఆ దొంగను పట్టుకోవాలంటే ఎక్కణ్నుంచి విచారణ మొదలు పెట్టాలన్న కనీస సమాచారం కూడా ఆ సమయంలో వారికి అందుబాటులో లేదు. దీంతో  చెన్నై పోలీసాఫీసర్ కులశేఖరన్ బుర్రలో ఓ ఐడియా తట్టింది. వెంటనే ఆ రోజు జరిగిన నేరం తాలూకు వివరాలతో కలిపి నేరస్తుడి విజువల్స్ ను జాతీయ క్రైం విభాగానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. అదే వాట్సాప్ గ్రూపులో వరంగల్ కమిషనరేట్లో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మీర్ మహమ్మద్ ఆలీ  ఆ విజువల్స్ తీసుకొని అప్పటికే తను సేకరించి పెట్టిన ఆ దొంగ తాలూకు వివరాల పూర్తి సమాచారాన్ని తిరువరక్కడు పోలీస్ స్టేషన్ పంపించారు. చోరీకి పాల్పడిన నిందితుడు, ఆలీ పంపించిన సమాచారం ఒక్కటే కావడంతో తిరువరక్కడు పోలీసులు నిందితుణ్ని సులభంగా గుర్తించి అరెస్టు చేశారు.  అంతేకాదు.. నిందితుడి నుంచి సుమారు 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ని అరెస్టు చేయడంలో ఆలీ ఇచ్చిన సమాచారం కీలకం కావడంతో చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జైవాల్.. మీర్ మహమ్మద్ ఆలీని  అభినందిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి క్యాష్ రివార్డు పంపించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ చేతుల మీదుగా ఆలీ క్యాష్ రివార్డు అందుకొని సాటి కానిస్టేబుల్స్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆలీ గతంలోనూ కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలతో పాటు పక్క జిల్లాల్లో జరిగిన చోరీల్లో నిందితులను పట్టిచ్చారు. అలా ఇప్పటికే పలుమార్లు ఆలీని పలు విభాగాల పోలీస్ అధికారులు ఘనంగా సన్మానించారు. అలాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన నేరాల్లోని నిందితులను గుర్తించడంలో ఆలీ చాలా కీలక పాత్ర పోషించారు. ఇలా ఆలీలాగా ప్రతిఒక్కరూ తమకు అప్పగించిన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తే క్రైమ్ రేట్ అతి తొందరగానే తగ్గిపోతుందని, శ్రేయోదాయకమైన సమాజం ఆవిర్భవిస్తుందని పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

TOP NEWS @ 1pm

1. హుజురాబాద్‌, బ‌ద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబ‌ర్ 1న నోటిషికేష‌న్ రానుంది. అక్టోబ‌ర్ 30న పోలింగ్. న‌వంబ‌ర్ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫ‌లితాలు ప్ర‌క‌టించనున్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 8, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 13 చివ‌రి తేదీలు.  2. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అంటూ ట్వీట్ చేసి మ‌రింత‌ ర‌చ్చ రాజేశారు. పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ సైతం పోస్ట్ చేశారు పేర్ని నాని.  3. సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 10 ప్ర‌శ్న‌ల‌తో లేఖ రాశారు. కేసీఆర్ జమానా-అవినీతి ఖజానా..అని సకల జనులు ఘోషిస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్‌.. అవినీతి భవన్‌గా మారిందన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?.. దీనిపై చర్చకు సిద్ధమా? అంటూ బండి సంజ‌య్‌ సవాల్ చేశారు.  4. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేత‌ల కోల్డ్‌వార్ తాడేప‌ల్లికి చేరింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడం, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే ఒకరితో ఒక‌రు వాగ్వివాదానికి దిగడంతో సీఎం జ‌గ‌న్‌ మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఆ ఇష్యూను సీఎం జ‌గ‌నే స్వ‌యంగా డీల్ చేయ‌నున్నారు. 5. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 112వ రోజు కొనసాగుతోంది. ఇవాళ‌ సీబీఐ విచారణకు వేముల జడ్పీటిసీ బయపురెడ్డి హాజరయ్యారు. వైఎస్ భాస్కర్‌రెడ్డికి బయపురెడ్డి  అనుచరుడు.  6. ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి మ‌రీ మదనపల్లిలో ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. భార్య, మరదలు, అత్త  వేధిస్తున్నారని ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో గమనించిన స్నేహితులు, కుటుంబసభ్యులు పోలీసులకు స‌మాచారం అందించారు.  7. మేడ్చల్‌లో అక్రమంగా రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో దాడి చేసి ఎస్‌ఓటీ పోలీసులు ప‌ట్టుకున్నారు. 47 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  ఐదుగురు గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు.  8. భారీ వర్షానికి సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టరేట్‌లోనే చిక్కుకుపోయారు. రాత్రి కలెక్టరేట్‌లోనే అనురాగ్ జయంతి బస చేశారు. కాగా ఉదయం మరింత వరద నీరు వచ్చి చేరడంతో చివరకు ట్రాక్టర్ సహాయంతో కలెక్టర్‌ను అధికారులు బయటకు తీసుకువచ్చారు.  9. గులాబ్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా ఉంది. విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో చెదురు ముదురు జల్లులు పడుతున్నాయి. గులాబ్‌ ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు త‌డిసి ముద్ద‌వుతున్నాయి. మ‌రో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల వర్షాలు పడతాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.  10. ప్రధాని మోదీ అధ్యక్షతను కేంద్రమంత్రివర్గం మధ్యాహ్నం 3.45 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. జూలై 7న కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ అనంతరం కేంద్ర మంత్రివర్గంతో మోదీ సమావేశం కానుండటం ఇది నాలుగోసారి కావ‌డం ఆస‌క్తిక‌రం. 

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ లేనట్టేనా? హుజురాబాద్ లో ఏం జరగబోతోంది? 

ఇలా పార్టీలో చేరి .. అలా ఎమ్మెల్సీగా నామినేట్ అయిన కౌశిక్ రెడ్డి, అదృష్టమే అదృష్టం. ఏళ్ల తరబడి క్యూలో నిలబడిన వారిని కనికరించని కేసీఆర్, కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని పట్టుమని పక్షం రోజులు తిరక్కుండానే ఎమ్మెల్సీ చేశారు. అది కూడా చుక్క చెమట, రూపాయి ఖర్చులేకుండా ఉచిత (గవర్నర్) కోటాలో  కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయారు... అనుకున్నారు. అదృష్టం అంటే అది కదా, అంటూ చాలా మంది చాలా విధాలుగా ఆశ్చర్యానికి గురయ్యారు.  నిజం చెప్పాలంటే చాలా మంది కౌశిక్ రెడ్డి అదృష్టాన్ని చూసి ఈర్షకు కూడా గురయ్యే ఉంటారు. అందులో ఎవరు ఎలాంటి శాపనార్ధాలు పెట్టారో ఏమో గానీ, అడక్కుండానే వచ్చి పడిన అదృష్టం, ఇప్పడు చెప్పా పెట్టకుండా చెట్టెక్కి కూర్చుంది. అంతే కాదు,అది ఇప్పట్లో చెట్టు దిగే దారి కూడా కనిపించడం లేదు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని సిఫార్సు చేస్తూ, రాష్ట్ర మంత్రివర్గం పంపిన తీర్మానం ఫైలును గవర్నర్ భద్రంగా పెండింగ్ లో పెట్టారు. అంతే కాదు, ఇప్పట్లో ఆ ఫైల్ కు మోక్షం లేదని, రాదని గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో  వచ్చినట్లే వచ్చిన ఎమ్మెల్ల్సీ పదవి, ఓ జీవిత కాలం లేటైనా కావచ్చని, ఇప్పట్లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ముచ్చట తీరక పోవచ్చని, అంతర్గత వర్గాల సమాచారం.  గతంలో ఒక సారి, కౌశిక్ రెడ్డి ఫైల్ పరిశీలనలో ఉందని, అయన అర్హతలను పరిశీలించేందుకు ఇంకొంత సమయం పడుతుందని చెప్పిన గవర్నర్ తమిళి సై మళ్ళీ మరో మారు అదే మాట రిపీట్ చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో,  ఇట్ ఈజ్ స్టిల్ ఇన్ పెండింగ్. ఇంకా పెండింగ్’లోనే  ఉంది, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సిగా అమోదించేందుకు మరింత సమయం కావాలని అమె స్పష్ట చేశారు. అంతే కాదు, అది అంత ఇంపార్టెంట్ విషయం కాదన్నట్లుగా, ఇప్పట్లో తేలే విషయం అసలే కాదన్నట్ల్గు గవర్నర్ మాట్లాడారు. గవర్నర్ ఇలా మళ్ళీ మళ్ళీ వాయిదా వేస్తున్నారంటే, అందుకు అయితే, ఆయన అర్హత, యోగ్యతల విషయంలో గవర్నర్’కు అనుమానాలైనా ఉంది ఉండాలి ... లేదంటే గవర్నర్ అడిగిన వివరాలను ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేయడం అయినా కారణం అయ్యుండాలని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.   రాజకీయ నిర్ణయాల విషయంలో ఆచి తూచి అడుగులు వేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలోనూ  క్యాలిక్యూటెడ్ నిర్ణయమే తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నీ తెలిసే, ముఖ్యమత్రి కౌశిక్ రెడ్డిని రెంటికి చెడ్డ రేవడిని చేశారని అటు కాంగ్రెస్ వర్గాల్లో, ఇటు తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డికి  త్రిశంకు సభలో పెర్మనెంట్ సీటు ఇచ్చేందుకే, ముఖ్యమంత్రి ఆయనకు పెద్దల సభలో సీటును ఎరగా వేశారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం మాత్రం ఇక లేదనే అనికోవచ్చని అంటున్నారు. ఎమ్మెల్సీ విషయంలో సీఎం కేసీఆర్ తీరుపై కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా అసహనానికి లోనవుతున్నారు. ఎమ్మెల్సీ ఆమోదంపై గవర్నర్ తో ముఖ్యమంత్రి మాట్లాడకపోవతంపై వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా విషయాల్లో రాజ్ భవన్ కు వెళ్లి కేసీఆర్ చర్చించారని.. ఎమ్మెల్సీ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డిని నమ్మించి నట్టేట ముంచారనే ఆరోపణలు కొందరు చేస్తున్నారు. దీని ప్రభావం హుజురాబాద్ ఉప ఎన్నికలో ఉంటుందని కూడా చెబుతున్నారు. 

సినిమా టికెట్లపై సీరియస్.. ప్రజా సమస్యలపై సైలెన్స్! ఇదేందయ్యా పవన్ కల్యాణ్.. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రాజుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం సాగుతోంది. రిప‌బ్లిక్ సినిమా ఈవెంట్ లో  వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలతో రాజుకున్న వేడి.. మరింత తీవ్రమవుతోంది. ఏపీ పాల‌కుల‌ను స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లూ అంటూ మొద‌లుపెట్టి.. సినిమా టికెట్ల‌ ఆన్‌లైన్ అమ్మ‌కాల‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు పవన్. వెంటనే రియాక్ట్ అయిన  మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మంత్రులు, వైసీపీ నేతలు త‌న‌పై అటాక్‌కు దిగ‌డంతో మ‌రోసారి ట్వీట్‌తో పంచ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతల మాటలను గ్రామ సింహాల అరుపులతో పోల్చారు. 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. మొరిగే కుక్క‌ల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌నే అర్థం వ‌చ్చేలా ట్వీట్ చేశారు. పవన్ కౌంటర్ ట్వీట్ కు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్నినాని.  పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య వార్ సాగుతుండగానే మరో అంశంపై జనాల్లో చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు స్పందించారన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సినిమా టికెట్లను ఆన్ లైన్ విక్రయించాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై ఓ రేంజ్ లో ఫైరైన పవన్ కల్యాణ్.. ఏపీ సమస్యల విషయంలో ఎందుకు ఇంతలా స్పందించలేదని కొన్ని వర్గాల నుంచి ప్రశ్న వస్తోంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో పాలనా అస్తవ్యస్థంగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఏపీ ప్రస్తుతం అప్పుల ఊబిలో చిక్కుకుంది. దేశంలోనే అప్పులు ఎక్కువ చేసిన రాష్ట్రాల్లో టాప్ లో ఉంది. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. ప్రతి నెలా అప్పులు తెస్తేనే ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఎందుకు ఈ స్థాయిలో ప్రశ్నించలేదని కొందరు అడుగుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అంతర్జాతీయ రాజధానిగా నిర్మించేందుకు ప్లాన్ చేసిన అమరావతిని జగన్ సర్కార్ మూడు ముక్కలు చేసే ప్రతిపాదన చేసింది. కోర్టు కేసులతో ప్రస్తుతానికి ఆగిపోయినా.. అమరావతిని మాత్రం గాలికొదిలేసింది. రాజధాని రైతులు 20 నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే అమరావతి విషయంలో ఏదో మాట్లాడాలన్నట్లుగా స్పందించారు కాని.. సినిమా టికెట్లపై స్పందించినంత రేంజ్ లో పవన్ ఎందుకు రియాక్ట్ కాలేదనే ప్రశ్న వస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించలేదని కొందరు అడుగుతున్నారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపిన పవన్.. ఆ రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నా సీరియస్ గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి.  సినిమా టికెట్ల ఇష్యూపై మాట్లాడినంత ఘాటుగా అమరావతి విషయంలో మాట్లాడితే  రాజధాని ఉద్యమానికి మరింత ఊపు వచ్చేదని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్... ఆంధ్రుల హక్కుగా సాధించిన కర్మాగారం. విశాఖ ఉక్కును ప్రైవేటుకు అమ్మేస్తోంది మోడీ ప్రభుత్వం. ఆంధ్రుల ఆత్మగౌరవంగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాత్రం సీరియస్ గా రియాక్ట్ కాలేదు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో.. ఆయన ఈ విషయంలో సైలెంటుగానే ఉండిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయవద్దంటూ కొన్ని ప్రకటనలు చేయడం తప్ప... బీజేపీని తీవ్రంగా విమర్శించి లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి కీలకమైన అంశంలో మాట్లాడని పవర్ స్టార్... సినిమా టికెట్ల విషయంలో మాత్రం తీవ్రంగా రియాక్ట్ కావడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీ అధినేతగా ఉంటూ... ప్రజా సమస్యలపై పెద్దగా పట్టింపు లేదన్నట్లుగా వ్యవహరిస్తూ... సినిమాల విషయంలో మాత్రం సీరియస్ గా రియాక్ట్ కావడం చర్చగా మారింది.  ఇవే కాదు.. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆలయాలపై దాడులు జరిగాయి. టీటీడీ నిత్యం వివాదాల్లో ఉంటుంది. ఆస్తి పన్ను పెంచిన ప్రజలపై భారం మోపారు. పెట్రోల్, డీజిల్ ధరలు... దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ. లిక్కర్ పాలసీపై మొదటి నుంచి వివాదమే ఉంది. ఇసుక, మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలోనే గ్యాంగ్ రేప్ జరిగింది.  ఇలాంటి సమస్యలపై పవన్ కల్యాణ్ ఏనాడు సీరియస్ గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. ఇవే ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రజా సమస్యలు చాలా ఉన్నా పెద్దగా స్పందించని పవన్ కల్యాణ్... తన సినిమాకు అడ్డంకులు స్పష్టించారనే కారణంగా ప్రభుత్వంపై రెచ్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి.  పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే... ఆయనకు రాజకీయాలకన్నా సినిమాలే ముఖ్యమన్నట్లుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. జనసేన పార్టీకి  చీఫ్ గా ఉంటూ రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువన్నట్లుగా వ్యవహరించడం ఆయనకు మైనస్ అవుతుందంటున్నారు. ఇలాంటి చర్యలతో రాజకీయాలపై సీరియస్ నెస్ లేదనే ముద్ర ఆయనపై పడుతుందని చెబుతున్నారు. 

బ‌ద్వేల్‌లో హోరాహోరీ ఫైట్‌!.. జ‌గ‌న్‌కు త‌ప్ప‌దా షాక్‌?

ఉప ఎన్నిక అన‌గానే వైసీపీలో ఏ మూల‌నో టెన్ష‌న్ టెన్ష‌న్‌. గెలుస్తామ‌నే న‌మ్మ‌కం ఉన్నా.. ఏదో గెలిచాం చాల‌న్న‌ట్టు.. గెలిచి ఓడినంత ప‌ని అవుతోంది. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక అధికార పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. రెండు ల‌క్ష‌ల మెజార్టీతో గెలిచామ‌ని విర్ర‌వీగే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఎల‌క్ష‌న్‌కు ముందు 6 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుంద‌ని మంత్రులు ఫోజులు కొట్టారు. ప్ర‌చారం మొద‌ల‌య్యేస‌రికి ఆ ఫిగ‌ర్ త‌గ్గుకుంటూ పోయింది. 4 ల‌క్ష‌ల ఆధిక్యం ప‌క్కా అన్నారు. కానీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ రంగంలోకి దిగి.. ర్యాలీలు, స‌భ‌ల‌తో హోరెత్తించ‌డం.. తిరుప‌తి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ‌మంతా ప‌సుపుమ‌యంగా మార‌డం.. టీడీపీ ర్యాలీల‌కు జ‌నం తండోప‌తండాలుగా రావ‌డం చూసి.. ఓ ద‌శ‌లో వైసీపీకి ఓడిపోతామేమోన‌నే వ‌ణుకు మొద‌లైంది. అందుకే కాబోలు.. ఓడితే ప‌రువంతా పోతుంద‌నే భ‌యంతో.. పోలింగ్ నాడు ప‌క్క జిల్లాల నుంచి బ‌స్సుల్లో జ‌నాల‌ను తీసుకొచ్చి మ‌రీ దొంగఓట్ల‌తో గ‌ట్టేక్కారు. ఇక వైసీపీకి ఓటేయ‌క‌పోతే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ద‌క్క‌వ‌నే బెదిరింపులు, వాలంటీర్ల‌తో వార్నింగులు, తాయిలాలు, పందేరాలు.. ఇలా తిరుప‌తిలో గెలుపు కోసం వైసీపీ చేయ‌ని కుట్ర‌, కుతంత్రాలు లేవు. అన్ని చేసినా.. 6 ల‌క్ష‌ల మెజార్టీ అని గొప్ప‌లు చెప్పినా.. చివ‌రాఖ‌రికి 2 ల‌క్ష‌ల మెజార్టీతో బ‌యట‌ప‌డ్డారు. గెలిచి ఓడారు. ఆ ఎన్నిక స‌జావుగా జ‌రిగుంటే టీడీపీనే గెలిచుండేద‌ని అంతా అన్నారు.  తిరుప‌తి జ్ఞాప‌కం మ‌ర‌వ‌క ముందే.. తాజాగా బ‌ద్వేలు ఉప ఎన్నిక‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 30న పోలింగ్‌. న‌వంబ‌ర్ 2న కౌంటింగ్ అండ్ రిజ‌ల్ట్స్‌. బ‌ద్వేలు క‌డ‌ప జిల్లాలో ఉండ‌టంతో సీఎం జ‌గ‌న్‌కు ఈ ఎన్నిక స‌వాలేన‌ని చెప్పాలి. క‌డ‌ప జిల్లాలో వైసీపీకి గ‌ట్టి ప‌ట్టున్న మాట వాస్త‌వ‌మే. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోయార‌నే సానుభూతి అద‌న‌పు బ‌లం. అయినా, ఈజీగా గెలుస్తామ‌నే ధీమా మాత్రం అధికార‌పార్టీలో క‌నిపించ‌డం లేదు. టీడీపీకి ప‌ట్టుంద‌ని కాదు కానీ.. వైసీపీపై వెల్లువెత్తుతున్న ప్ర‌జాగ్ర‌హ‌మే ఆ పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది.  అస‌లే రాయ‌ల‌సీమ. ఉపాధి అంతంత మాత్ర‌మే. ఇసుక పాల‌సీ అంటూ ఇసుక దొర‌క్కుండా చేసి రోజు కూలీల‌కు ఉపాధి లేకుండా చేసిన ఘ‌న‌త జ‌గ‌న్‌దే. ఇక ధ‌ర‌ల పెంపు, చెత్త ప‌న్నులు, అప్పులు, జీతాలు స‌మ‌యానికి రాక‌పోవ‌డం.. ఇలా ప్ర‌తీ ఒక్క వ‌ర్గ‌మూ జ‌గ‌న్ పాల‌న‌పై ఆగ్ర‌హంగానే ఉంది. ఇక మ‌ద్యం తాగే అల‌వాటున్న ప్ర‌తీఒక్క‌రు.. మందు తాగే ప్ర‌తీసారి.. జ‌గ‌న్‌ను తిట్టకుండా ఉండ‌టం లేదు. అడ్డ‌గోలుగా ధ‌ర‌లు పెంచేసి.. అడ్డ‌మైన బ్రాండ్లు తీసుకొచ్చి.. మందుబాబుల పాలిట విల‌న్ అయ్యారు జ‌గ‌న్‌.  ఇలా ప్ర‌జాగ్ని ఉప ఎన్నిక‌ వ‌చ్చిన‌ప్పుడే బ‌య‌ట‌ప‌డుతుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో కంపేర్ చేయ‌లేము. ఎమ్మెల్యే ఎల‌క్ష‌న్ సీఎంతో లింకుంటుంది కాబ‌ట్టి.. ముఖ్య‌మంత్రి ప‌నితీరుకు రెఫ‌రెండంగా భావిస్తుంటారు. గ‌తంలో తెలంగాణ‌లో అదే జ‌రిగింది. దుబ్బాక‌లో టీఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన‌ట్టు.. బ‌ద్వేలులో వైసీపీకి బుద్దిచెప్పి జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, అధికార పార్టీలో టెన్ష‌న్ నెల‌కొంద‌ని అంటున్నారు.  కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అక్కడ అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైసీపీ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఇక‌, టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్‌ పేరును ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌క‌టించింది. అభ్య‌ర్థులు దాదాపు క‌న్ఫామ్ కావ‌డంతో ఇక అస‌లైన పోరు మొద‌లుకానుంది.