రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్
posted on Jan 3, 2022 8:11AM
తెలంగాణలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు ఎక్కువగా వైరస్ భారీన పడుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘స్వల్ప లక్షణాలతో నేను కోవిడ్ బారిన పడ్డాను. గత కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారు.. తప్పనిసరిగా కావల్సిన జాగ్రత్తలు తీసుకోండి’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇటీవలి కాలంలో రచ్చబండ కార్యక్రమంతో పాటు బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడం వంటివి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే హౌస్ అరెస్ట్‌లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రేవంత్ ఇంటికి రావడం, ఆయనను కలవడం వంటివి జరుగుతున్నాయి. ఇటీవలే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావుకు కొవిడ్ సోకింది. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ బృందంలో చాలా మంది వైరస్ భారీన పడ్డారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరధిలో వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.