గులాబి పార్టీలో అసమ్మతి భగ్గు..వలసలకు సిద్ధం.. సిట్టింగులకే సీట్లు ప్రకటనే కారణమా?

తెలంగాణలో అధికార తెరాసలో ఏం జరుగుతోంది? కేసీఆర్ తీరు దేనికి సంకేతం. పార్టీలో విభేదాలను పరిష్కరించి నేతలంతా సమన్వయంతో పని చేసేలా దిశా నిర్దేశం చేయాల్సిన కేసీఆర్ తన తీరుతో, ప్రకటనలతో పార్టీలో లుకలుకలు పెచ్చరిల్లేలా, అసమ్మతి జ్వాలలో అజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ కావడంతో సహజంగానే యాంటీ ఇంకంబన్సీని తెరాస ఎదుర్కొంటోంది. ప్రజా వ్యతిరేకతకు తోడు.. 2014 ఎన్నికల అనంతరం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చి తెరాస గూటికి చేరిన ఎమ్మెల్యేల కారణంగా పార్టీలో అసమ్మతి పెరిగింది. ఈ మూడేళ్ల కాలంగా అది నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ  నివురు తొలగి నిప్పు బయటకు వస్తున్న పరిస్థితి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ దాదాపుగా పార్టీ నేతలలో విభేదాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా పెద్దదిగానే ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీలో విభేదాలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావలసిన పార్టీ అధినేత అందుకు భిన్నంగా సిట్టింగులందరికీ పార్టీ టికెట్లు అంటూ ప్రకటించేసి విభేదాలకు అజ్యం పోసారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అసలే ఇప్పటికే పార్టీలోని పలు నియోజకవర్గాలలో భగ్గుమంటున్న అసమ్మతి, పార్టీ టికెట్ల కోసం ఇప్పటి నుంచే పోటాపోటీ ఈ నేపథ్యంలో సిట్టింగులకే టికెట్లు అంటూ కేసీఆర్ ప్రకటించి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ వ్యూహం సత్ఫలితాలను ఇచ్చి ఉండేదేమో కానీ.. ప్రస్తతం రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ప్రకటన పార్టీలో వలసలను పెంచేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని పరిశీలకులు అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో అయితే అధినత వైఖరి పట్ల అసమ్మతి ఉన్నా ప్రత్యామ్నాయం లేక అసమ్మతి వాదులు మిన్నకున్నారు. పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టినా తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని పంటి బిగువుల అదిమిపెట్టి మౌనం వహించారు. అయితే ఇప్పుడు పరిస్ధితి గతానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అసమ్మతులకు, అసంతృప్తులకు ఇప్పుడు ఆప్షన్లు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో గట్టిగా పుంజుకున్నాయన్న అంచనాల నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలలోకి వలసలు పెరిగే అవకాశాలూ ఉన్నాయి. ఆయా పార్టీలు తెరాస అసంతృప్తులకు గాలం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తెరాసలో ఇప్పటికే ఆసంతృప్తి, అసమ్మతి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ వర్గపోరు పీక్స్ లో ఉంది. వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. పలు నియోజకవర్గాలలో పార్టీలోని ముఖ్య నేతల మధ్యే మాటల యుద్ధం జరుగుతోంది. ఇక వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రంలో బలపడుతున్నాయి. బీజేపీ తరఫున ఏకంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి రాష్ట్రంలో వరుస పర్యటనతో, కేసీఆర్ పై విమర్శలతో రాజకీయ హీట్ పెంచేస్తున్న పరిస్థితి. అదే సమయంలో క్షేత్ర స్థాయి నుంచీ పార్టీలో సమస్యలను పరిష్కరించుకుని పుంజుకున్న కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో తెరాస అధినేత పార్టీలో సమస్యలను, నేతల మధ్య విభేదాలను పరిష్కరించుకుని పార్టీని ఏకతాటిపై నడిపించాల్సి ఉండగా అందుకు భిన్నంగా సిట్టింగ్ లకు టికెట్లు, అదే పార్టీ సంప్రదాయం అని ప్రకటించేయడం ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దీంతో వారు అనివార్యంగా పక్క చూపులు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా కాంగ్రెస్, బీజేపీలు అదికార పార్టీలోని అసంతృప్తులు, అసమ్మతీయులకు గాలం వేస్తున్నాయి. మరో వైపు   తెరాసకు చెందిన నేతల కంపెనీలు, ఆస్తులపై ఐటీ, ఈడీ దాడులు. ఇవి సరిపోవన్నట్లు కొత్తగా బీజేపీ తెరపైకి తెచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం వంటి వాటితో తెరాస డీలా పడిందన్నది ఖాయం. ఈ సమయంలో తెరాస అధినేత సిట్టింగులకే సీట్లు అన్న ప్రకటన కచ్చితంగా పార్టీపై ప్రతి కూల ప్రభావం చూపుతుంది. కాగా సిట్టింగులకే టికెట్లు అన్న ప్రకటన ద్వారా కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం చేశారని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులు కూడా అంటున్నాయి  తెలంగాణలో అధికారం కోసం అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్న కాంగ్రెస్-బీజేపీలకు ఆయనే   ఆయుధాలు అందించారని అంటున్నారు.  ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలున్న నియోజకవర్గాల సంఖ్య, 40 వరకూ ఉంది.  ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతితోపాటు.. అక్కడ వారి స్థానంలో సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఆ క్రమంలో.. సిట్టింగులకు వ్యతిరేకంగా ఇప్పటినుంచే ముఠాలు కట్టి, రోడ్డెక్కుతున్న ఘటనలు పార్టీ పరువు తీస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరిల విషయమే ఇందుకు ఉదాహరణ. ఇరువురూ కూడా  ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ   నర్సయ్యగౌడ్ మంత్రి జగదీష్‌రెడ్డి తనను, కర్నె ప్రభాకర్‌ను తొక్కేయాలని చూస్తున్నారంటూ సంచలన విమర్శలు చేశారు. ముందు ముందు ఇటువంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి-మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాండూర్‌లో మహేందర్‌రెడ్డి-రోహిత్‌రెడ్డి, వికారాబాద్‌లో మెతుకు ఆనంద్-సంజీవరావు, నకిరేకల్‌లో లింగయ్య-వీరేశం, ఆలేరులో సునీతా మహేందర్‌రెడ్డి-సందీప్‌రెడ్డి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఇక వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్‌కు వ్యతిరేక వర్గం ఇప్పటికే చురుకుగా వ్యవహరిస్తోంది. పాలేరు, కొత్తగూడెం, సత్తుపల్లి, డోర్నకల్, రామగుండం, మంథని, చొప్పదండి, వేములవాడ, జగిత్యాల, ముథోల్, బోధ్, నారాయణఖేడ్, కొడంగల్, నాగర్ కర్నూల్, దేవరకద్ర ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక పటన్‌చెరు, ఉప్పల్, ఎల్బీనగర్, హుస్సాబాద్, ఉప్పల్, జహీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో సీట్ల కోసం సీనియర్లు సిట్టింగులకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ, ఆయా నియోజకవర్గాల్లో సొంత సైన్యం తయారుచేసుకునే పనిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో తప్ప, మిగిలిన జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఇక ఈటల రాజేందర్ గెలిచిన హుజూరాబాద్‌లో అయితే అరడజను మంది నేతలు సీట్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో  సిట్టింగులకే మళ్లీ సీట్లు  అంటూ కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే సిట్టింగులకు పోటీగా, నియోజకవర్గానికి ముగ్గురు-నలుగురు నేతలు సిద్ధమైన పరిస్థితి ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. 

గణేష్ నిమజ్జన శోభాయాత్రపై రాజకీయమా?

రాజకీయ ప్రయోజనమే ఏకైక లక్ష్యం. అందు కోసం సమాజానికి హాని జరిగే పరిస్థితులు ఏర్పడినా పట్టించుకోకపోవడమే నేటి పార్టీల వైఖరిగా మారిపోయింది. కుల మతాలకు అతీతంగా ఒక సామాజిక ఉత్సవంలా ఏటా హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవానికి రాజకీయ మకిలి అంటించేందుకు కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వెరవడం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ అవకాశాన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలన్న ఆత్రం, తాపత్రయంతో పార్టీలు మంచి చెడుల విచక్షణ కోల్పోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, తెరాసల ఈ విషయంలో  ముందు వెనుకలు ఆలోచించకుండా ఎన్నికల లబ్ధి కోసం వెంపర్లాడుతున్నాయి.  గణేష్ మండపాల నుంచి నిమజ్జనాల వరకూ పార్టీలు తమతమ రాజకీయ లబ్ధి కోసం వివాదాలు సృష్టిస్తున్నాయి. సామరస్య వాతావరణం దెబ్బతినే పరిస్థితి వచ్చినా వెనుకాడటం లేదు. ఇప్పుడు వినాయక నిమజ్జనం విషయంలో కూడా బీజేపీ, తెరాసలు ప్రమాదకరమైన రాజకీయ క్రీడకు తెర లేపాయి. వినాయక నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేయడం లేదంటూ బీజేపీ తీవ్ర పదజాలంతో విమర్శలకు తెరలేపింది.  ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా చేయకున్నా ట్యాంక్ బండ్ పైకి నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తామనీ, హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తామనీ బీజేపీ ప్రకటించింది.   హుస్సేసాగర్ జలాలు కలుషితం కాకూడదన్న ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారెస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో  అధికారికంగా హుసేన్ సాగర్ ఒడ్డున గణేష్ నిమజ్జనానికి  ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. ఎందుకంటే గణేష్ మండపాలలో ప్రతిష్టించిన విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసినవే.  అయితే గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడాన్ని బీజేపీ విమర్శిస్తున్నది. కేవలం  హిందూ పండుగలపైనే ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు విధిస్తున్నారంటూ సున్నిత అంశాలను తెరపైకి తీసుకువచ్చి రచ్చ చేస్తున్నది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సజావుగా సాగనివ్వకుండా అడ్డుకోవాల ప్రభుత్వం చూస్తోందనీ, వచ్చే ఏన్నికలలో ఒక వర్గం మద్దతు కొసం ఆ వర్గం మెప్పు కోసమే సర్కార్ ఇలా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతే కాకుండా ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని అడ్డుకుంటే వాటిని   ప్రగతి భవన్ కు తీసుకొస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సాగర్ లో కాదు ప్రగతి భవన్ లో   గణేష్ నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ ప్రకటించడంతో వివాదం మరో లెవెల్ కు వెళ్లింది. ఓ వైపు గణేష్ ఉత్సవ కమిటీ మరో వైపు బీజేపీ   కేసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే నిరశన దీక్షకూ దిగాయి.  హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఉన్న ప్రాధాన్యత తెలిసి కూడా ఏర్పాట్ల విషయంలో కేసీఆర్ సర్కార్ పట్టనట్టు వ్యవహరించడం వెనుక కూడా రాజకీయమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ పరస్పర విమర్శలకు దిగడమే కాకుండా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సమయం సమీపిస్తున్నా అందుకు సంబంధించిన ఏర్పాట్ల ఊసే లేకపోవడంతో నిమజ్జనం రోజున ఏ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం, అనంతరం గణేష్ శోభాయాత్రా ఒక సామాజిక కార్యక్రమంలా జనంలో సామరస్యం వెల్లివిరిసేలా నిర్వహించుకోవడం ఒక సంప్రదాయంగా వస్తున్న తరుణంలో రాజకీయం కోసం ఇటువంటి వాతావరణం ఏర్పడేలా రాజకీయ పార్టీలు వ్యవహరించడం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాలుష్యం కారణంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం హుస్సేన్ సాగర్ లో నిర్వహించరాదంటూ గత చాలా కాలంగా పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేస్తున్న సంగతి విదితమే. అదే సమయంలో కోర్టు కూడా కొన్ని ఆంక్షలతో సూచనలూ చేసింది. అయితే గణేష్ నవరాత్రులకు ముందు నుంచే పర్యావరణ హిత ఉత్సవాల కోసం ప్రజలలో అవగాహన పెంచేలా భారీ ఎత్తున ప్రచారం చేయాల్సిన ప్రభుత్వం ఆ సమయంలో మౌనంగా ఉండి, ఇప్పుడు గణేష్ నిమజ్జన విషయంలో ఆంక్షలున్నాయంటూ ఏర్పాట్లు చేయకపోవడాన్నీ పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా పరిస్థితి మరింత విషమించక ముందే ప్రభుత్వం నడుంబిగించి.. నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

భారత్ 2029 నాటికి మూడ‌వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ : ఎస్‌బిఐ నివేదిక

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రచించిన నివేదిక ప్రకారం, 2029 నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని, దీనికి కారణం 2014 నుండి వచ్చిన నిర్మాణాత్మక మార్పులని తెలుస్తోంది. నివేదిక ప్రకారం, ప్రస్తుత వృద్ధి రేటును కొనసాగిస్తే 2027లో జర్మనీని, 2029లో జపాన్‌ను భారత్ అధిగమిం చి పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకుతుందని అధ్యయనం పేర్కొంది. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు భారత్ 10వ స్థానంలో ఉంది. నివేదిక అంచనా వాస్తవ రూపం దాల్చగలిగితే, 15 ఏళ్లలోపు ఏడు స్థానాలు ఎగబాకడం మోదీ ప్రభుత్వ వారస త్వం మాత్రమే కావచ్చు. నివేదిక ఆర్ధిక సంవ‌త్స‌రం2023 కోసం భారతదేశ జీడీపీ అంచనాను కొలిచింది, 6 శాతం నుండి 6.5 శాతం కొత్త సాధారణం అని జోడించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆర్ధిక సంవ‌త్స‌రం2023  కోసం భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తు త 6.7 శాతం నుండి 7.7 శాతం వరకు ఉన్నప్పటికీ, అది అసంపూర్ణమని గట్టిగా నమ్ముతున్నామని బ్యాంకు నివేదిక పేర్కొన్న‌ది. అనిశ్చితితో నాశనమైన ప్రపంచంలో,  6 శాతం నుండి 6.5 శాతంగా విశ్వ సిస్తున్నామ ని,  వృద్ధి కొత్త సాధారణమ‌నీ నివేదిక పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ ఎస్ ఓ) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ జీడీపీ ఒక సంవత్సరంలో దాని వేగవంతమైన రేటుతో విస్తరించిందని చూపించే డేటాను వెల్లడించింది. జూన్ 30, 2022తో ముగిసిన మూడు నెలల కాలంలో భారతదేశ జీడీపీ 13.5 శాతం పెరిగింది. చైనాలో వృద్ధి మాంద్యం నుండి భారతదేశం ఎలా ప్రయోజనం పొందుతుందనే  దాని గురించి  మాట్లాడుతూ, భారత దేశం లో తన సరికొత్త ఐఫోన్ 14 తయారీని ప్రారంభించాలని ఆపిల్ యొక్క ఇటీవలి నిర్ణయం ఆశాజనక దశ అని నివేదిక తెలిపింది. గ్లోబల్ టెక్ మేజర్ ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 ఉత్పత్తిలో కొంత భాగాన్ని భారతదేశం నుండి ప్రపంచ వ్యాప్తంగా షిప్పింగ్ కోసం మార్చాలని నిర్ణయించుకుంది, అటువంటి ఆశావాదానికి సాక్ష్యంగా  ఉంది. అయితే, భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 ను తయారు చేయడానికి, కొత్త  స్మార్ట్‌ఫోన్ తయారీ సమ యాన్ని తగ్గించడానికి ఉత్పత్తి వేగాన్ని వేగవంతం చేయడానికి ఆపిల్ ఇప్పటికే భారతదేశంలోని దాని స్థానిక సరఫరాదారులతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. నివేదిక ప్రకారం, ఐ ఫోన్‌ 13 భారతదేశంలో తయారీని ప్రారంభించింది, ఇది గత సంవత్సరం సెప్టెం బర్ లో ప్రారంభించబడిన ఆరు-ఏడు నెలల తర్వాత. యాపిల్ గ్యాప్ తగ్గించి చైనాతో సమానంగా తీసు కురావడానికి ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన జీడీపీ గణాంకాల నేప థ్యంలో భారతదేశం యునైటెడ్ కింగ్‌డమ్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవత రించిన నేపథ్యంలో ఎస్‌బీఐ నివేదిక వచ్చింది. నామమాత్రపు' నగదుకు సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం మార్చి నుండి త్రైమాసికంలో సర్దు బాటు ప్రాతిపదికన మరియు సంబంధిత త్రైమాసికం చివరి రోజున డాలర్ మారకపు రేటును ఉపయో గించి 854.7 బిలియన్ డాల‌ర్లుగా ఉంది. దీనికి విరుద్ధంగా, యుకె  814 బిలియన్ డాల‌ర్ల‌  వద్ద ఉంది. అంతేకాకుండా, ఈ సంవత్సరం వార్షిక ప్రాతిపదికన డాలర్ పరంగా భారతదేశం యుకేని అధిగమించ గలదని ఐఎంఎఫ్‌ అంచనాలు చూపుతున్నాయి, ఆసియా పవర్‌హౌస్‌ను యుఎస్‌, చైనా, జపాన్, జర్మనీ ల వెనుక ఉంచింది.

ఐటి సంస్థ‌ల‌తో క‌ర్ణాట‌క మంత్రుల భేటీ

బెంగుళూరులో భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌గ‌రం స్థంభించిపోయింది. దీంతో బెంగుళూరులోని ఐటి సంస్థ‌ల వారు ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తోంది. ఉద్యోగులు ఎక్క‌డికక్క‌డ నిలిచిపోవ‌డంతో ఆయా ప‌రి శ్ర‌మ‌ల కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఇన్‌ఫోసిస్‌,విప్రో, టిసిఎస్‌, ఇంటెల్ ఇత‌ర దిగ్గ‌జ ఐటి సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో రాష్ట్ర మంత్రి సిఎన్‌. అశ్వ‌ర్థ‌నారాయ‌ణ స‌మావేశ‌మై  ఒక ప‌రిష్కార మార్గాన్ని సూచించ‌వ‌చ్చున‌ని అంతా ఆశిస్తున్నారు.  ప్ర‌భుత్వ ప్ర‌ధానకార్య‌ద‌ర్శి, బృహ‌త్ బెంగుళూరు మ‌హాన‌గ‌ర్ పాలిక (బిబిఎంపి) ఛీఫ్ క‌మిష‌న‌ర్‌, బెంగు ళూరు నీటిపారుద‌ల‌శాఖ అధికారులు, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌లు కూడా రాష్ట్ర అసెంబ్లీ హాలులో జ‌రిగే స‌మావేశంలో పాల్గొంటారు. ఈ స‌మావేశంలో పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ స‌మ‌స్య‌ల గురించి స్వేచ్ఛ‌ గా మాట్లాడవ‌చ్చున‌ని మంత్రి అశ్వ‌ర్థ‌నారాయ‌ణ ఐటి సంస్థ‌ల అధికారులు, ప్ర‌తినిధుల‌కు పిలుపు నిచ్చారు.  బిబిఎంపి ఛీఫ్ క‌మీష‌న‌ర్ ఈ చ‌ర్చా స‌మావేశంలో న‌గ‌రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్లు,లోత‌ట్టు ప్రాంతాల్లో, కాల‌నీల్లోకి వ‌ర్షం నీరు చేరుకోవ‌డం, రోడ్లు మీదా నీరు నిలిచి వాహ‌నాలు క‌ద‌ల‌లేని ప‌రిస్థి తుల గురించిన స్లైడ్ షో ప్ర‌ద‌ర్శించి వివ‌రిస్తారు. సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగుళూరులో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ఉన్న ఐటి సంస్థ‌ల‌కు ఉద్యోగులు వెళ్ల‌లేక ఆఖ‌రికి ట్రాక్ట‌ర్‌ను ఆశ్ర‌యించే స్థితి ఏర్ప‌డింది. ముఖ్యంగా సోమ‌వారం భారీ వ‌ర్షం నీరు రోడ్ల‌మీద నిలిచి ఎవ్వ‌రినీ క‌ద‌ల‌నీయ‌లేదు.  ఇదిలా ఉండ‌గా, ముఖ్య‌మంత్రి బొమ్మై ప్ర‌స్తుత రాష్ట్ర‌,  బెంగుళూరు ప‌రిస్థితికి గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న ఆనాలోచిత నిర్ణ‌యాలే కార‌ణ‌మ‌ని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ ఎటాక్స్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు 40 ప్రాంతాలలో ఈడీ దాడులు నిర్వహించింది. ఒక వైపు సీబీఐ, మరో వైపు ఈడీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో స్పీడ్ పెంచేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రాజకీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్రం తాన రాజకీయప్రత్యర్థులను వేధించడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ1గా నమోదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఒక వైపు సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ రంగంలోకి దిగడం,  ఢిల్లీ, లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌లలో ఏకంగా ముఫ్పై చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈడీల సోదాలతో  ఒక్క సారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక హైదరాబాద్ లో అయితే సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉన్న రామచంద్ర పిళ్లై తో పాటు  అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్రప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఒక ప్రముఖ రాజకీయ నేత పీఏ నివాసంపై కూడా ఈడీ దాడులు చేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో అంతటా ఈడీ సోదాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ కుంభ కోణంలో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తనపై ఆరోపణలు చేయకుండా ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అలాగే  ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి పేరు కూడా ఉందని టీడీపీ  ఆరోపిస్తున్నది. దీనిపై రాజకీయదుమారం కొనసాగుతోంది. సీబీఐ ఈడీ విచారణలతో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం అనివార్యంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే ఈ కేసులో మద్యం లిక్కర్ సిండికేట్ల తరపున డిపాజిట్ కట్టిన విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిపై ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. ఎంపిక చేసిన వ్యక్తులు లక్ష్యంగానే ఈడీ, సీబీఐ దర్యాప్తు జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ విధానాలను విమర్శించే, వ్యతిరేకించే వారి దూకుడు తగ్గించేందుకే కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందన్న విమర్శలకు ఈడీ దాడులు నిర్వహిస్తున్న తీరు అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.  ఈ కుంభ కోణంలో చాలా మంది ‘పెద్దల’ పేర్లు బయటకు వచ్చినప్పటికీ దాడులు ‘చిన్న’లపైనే జరగడం అనుమానాలకు తావిస్తోందనీ, కేంద్రంపై కేంద్ర దర్యాప్తు సంస్థలను అనుచితంగా ఉపయోగిస్తోందన్న విమర్శలకు బలం చేకూర్చేదిగా ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వారసత్వ రాజకీయాల విషయంలో గురివింద సామెత చందంగా మోడీ తీరు!

ఈసారి మ‌నోడ్ని తెర‌మీదికి తేవాలి.. ఈ మాట ప్ర‌తీ రాజ‌కీయ‌నాయ‌కుడు, ప్ర‌తీ పారిశ్రామిక‌వేత్త అనుకుం టారు. వ్యాపార‌, రాజ‌కీయ‌సంబంధాలు, అభివృద్ధిని ఆశించ‌డం ఒక ఎత్త‌యితే, దాన్ని వీల‌యినంత కాలం కాపాడుకోవ‌డానికి, త‌మ‌కు అనుకూలం చేసుకోవ‌డానికి త‌మ‌వారిని రంగ‌ప్ర‌వేశం చేయించ‌డం ఆన వాయితీగా వ‌స్తోంది. రాజ‌కీయాల్లో ఇది చాలాకాలం నుంచే ఉంది. అయితే దీని వ‌ల్ల యువ‌త‌, రాజ‌కీయా ల్లోకి వ‌చ్చి దేశాభివృద్ధికి పాటుప‌డేవారి క‌ల‌లు క‌ల్ల‌లుగా మిగిలిపోతాయ‌న్న అభిప్రాయం ప్ర‌ధాని మోదీతో పాటు చాలామంది వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులోనూ నిజం లేక‌పోలేదు. కానీ మారుతున్న కాల‌మాన ప‌రిస్థి తులు, వాణిజ్య‌,రాజ‌కీయావ‌స‌రాల‌కు అనుగుణంగా త‌మ‌ను సుస్థిర‌ప‌ర‌చుకోవ‌డానికి వెనుకాడ‌టం లేదు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  భారతదేశం ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సవాళ్లలో వారసత్వ రాజకీయాలు,  బంధుప్రీతి గురించి ప్రస్తావించారు. బంధుప్రీతి అనేది భారతదేశ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది , వారసత్వ రాజకీయాలు కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే, దేశానికి కాదని ప్రధాన మంత్రి   అన్నారు.   స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగ సారాంశమిదే. మోడీ తన ప్రసంగం ముగించిన వెంటనే, ఆయన సన్నిహితుడు,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  కుమారుడు  జై షా ను నెటిజన్లు సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేశారు.  బిసిసిఐ కార్యదర్శిగా  జై షా ను అర్హతను ప్రశ్నించారు.  ప్రధాని విమర్శించిన వారసత్వ రాజకీయాలకు బిజెపి ఎంత మాత్రం అతీతం కాదంటూ విమర్శకులు విశ్లేషణలు చేశారు.  నాయకులను ఎన్నుకునేది ప్రజలేనని.. వారసత్వంగా పదవులు రావనీ విపక్షం మోడీ వ్యాఖ్యలకు బదులిచ్చింది.   వారసత్వ రాజకీయాల గురించి మోడీ ఎంత సేపూ విపక్షాలపై విమర్శలు గుప్పిస్తారే తప్ప గురివింద సమెతలా   పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ అలాగే ఇతర పార్టీల నుంచి బీజేపీ గూటికి చేరిన సువేందు  అధి కారి వంటి వారి గురించి ఎందుకు మాట్లాడరని కాంగ్రెస్  అధికార ప్రతినిధి షామా మహమ్మద్ నిలదీస్తున్నారు.  మోడీ తీరు అంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ధరల పెరుగుదల, నిరుద్యోగం,   వాగ్దానాల అమలులో తన వైఫల్యం, దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంలో తన వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చడానికే మోడీ పదే పదే వారసత్వ రాజకీయాలను తెరపైకి తీసుకువచ్చి విపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  హర్యానాలో కాంగ్రెస్ మాజీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమా రుడు కుల్దీప్ బిష్ణోయ్, ఈ నెల ప్రారంభంలో బిజెపిలో చేరిన కుల్దీప్ భార్య  మాజీ శాసనసభ్యు రాలు రేణుకా బిష్ణోయ్ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. బిజెపిలో చేరడానికి ఒక రోజు ముందు, బిష్ణోయ్ తన నియోజకవర్గ ప్రజలు తన కుమారుడు భవ్యను తాను ఖాళీ చేస్తున్న అడంపూర్ అసెంబ్లీ స్థానం నుండి  బిజెపి అభ్యర్థిగా పోటీ చేయించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు, నోయిడా   ఎమ్మెల్యేయే కాకుండాయూపీ బిజెపి ఉపాధ్యక్షుడు కూడా. అలాగే, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. బిజెపి వారసత్వ నేతల జాబితా చాలా పెద్దది.   కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పంజాబ్ నాయకుడు సునీల్ జాఖర్, కేంద్ర మాజీ హోం మంత్రి ఆర్.పి.ఎన్. సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది.  కాగా బసవరాజు తండ్రి ఎస్.ఆర్. బొమ్మై, 1988-89లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు.  ఈ ఏడాది మేలో బిజెపిలో చేరిన జాఖర్ - 1980 , 1989 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేసిన కాంగ్రెస్ క్రియాశీల సభ్యుడు బలరామ్ జాఖర్ కుమారుడు.  కాగా, ఆర్.పి.ఎన్. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీలో చేరిన సింగ్, ఖుషీనగర్‌లోని పద్రౌనాకు చెందిన పూర్వపు సైంథ్వార్ రాజ కుటుంబానికి చెందినవారు. అతని తండ్రి, కున్వర్ చంద్ర ప్రతాప్ నారాయణ్ సింగ్, 1980లో ఇందిరా గాంధీ మంత్రివర్గంలో రక్షణ శాఖ సహా య మంత్రిగా పని చేశారు. వంశ పారంపర్య రాజకీయాల పట్ల పీఎం  మోడీకి  ఉన్న అయిష్టత అటువంటి నాయకులను బిజెపిలో లేదా ఆయన కేబినెట్ లో చేర్చుకోవడానికి అడ్డంకి కానప్పుడు ఇతర పార్టీలలో వారసత్వ రాజకీయ నేతల గురించి ఎలా మాట్లాడతారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.  మోడీ కేబినెట్ లో పలువురు ప్రముఖులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, కిరెన్ రిజిజు , జ్యోతిరాదిత్య సింధియా వారసత్వ రాజకీయాల కారణంగా వచ్చిన వారేనని గుర్తు చేస్తున్నారు. గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, సువేందు అధికారి, ఆయన తండ్రి,  కేంద్ర మాజీ మంత్రి సిసిర్ అధికారి బీజేపీలో చేరిన విషయాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని యోగి క్యాబినెట్‌లో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర ప్రసాద కుమారుడు జితిన్ ప్రసాదను కూడా బిజెపి చేర్చుకుని మంత్రిని చేసింది.  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర శాసన మండలి మాజీ సభ్యుడు గంగాధరపంత్ ఫడ్నవీస్ కుమారుడు. దేవేంద్ర అత్త శోభా ఫడ్నవీస్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. వారసత్వ రాజకీయాలను తమ పార్టీలో స్వయంగా ప్రోత్సహిస్తూ కూడా వంశపారంపర్య రాజకీయాలకు కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలే కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాయనే ప్రచారాన్ని మోడీ విస్తృతంగా చేస్తున్నారని  సెంట‌ర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌కి చెందిన సంజయ్ కుమార్ అన్నారు . ఇంకా చెప్పాలంటే   జననాయక్ జనతా పార్టీ నాయకుడు, హర్యా నా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, దేవీ లాల్-ఓం ప్రకాష్ చౌతాలా కుటుంబాలకు చెందిన నాల్గవ తరం నాయకుడు. యుపి , కేంద్రంలో బిజెపి కూటమి భాగస్వామి అనుప్రియా పటేల్ అప్నా దళ్ వ్యవస్థాపకుడు సోన్ లాల్ పటేల్ కుమార్తె.  బీహార్ సిఎం నితీష్ కుమార్ కోరిక మేరకు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ ఎన్‌డిఎ నుండి బయ టకు వచ్చిన తరువాత, మోడీ పాశ్వాన్ మామ పశుపతి పరాస్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకున్నారు. శిరోమణి అకాలీదళ్, శివసేన  వంటి అనేక ఇతర పార్టీలలో కీలక పాత్రపోషిస్తున్న పలువురు నాయకులు వారసత్వం కారణంగా తెరమీదకు వచ్చిన వారే. ఆయా పార్టీలతో కేంద్రంలోని మోడీ సర్కార్, బీజేపీ  ఏదో ఒక సమయంలో  పొత్తు పెట్టుకున్నాయి.   

మునుగోడు ఉప ఎన్నిక వెరీ కాస్ల్టీ గురూ! ఓటుకు పది వేలు..పార్టీలు రెడీ

గత ఏడాది (2021)  అక్టోబర్ మాసంలో  జరిగిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక చరిత్రను సృష్టింది. అలాగే, ఈ సంవత్సరం చివర్లో  జరిగే మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికకు రంగం  సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో హుజురాబాద్ చరిత్రను మునుగోడు తిరగ రాస్తుందా? మరో చరిత్రను సృష్టిస్తుందా? ఇప్పుదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.    నో ... నో... మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది ఎన్నికల ఫలితాల గురించి కాదు. హుజూరాబాద్ ఫలితం మునుగోడులో పునరావృతం అవుతుందా, కాదా అని అసలే కాదు.  ఓటర్ల చైతన్యం గురించి అంతకంటే కాదు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరక గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయింది.   హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాల ఇన్ని కోట్లని చెప్పలేము. తక్కువలో తక్కువ ఒక వెయ్యి కోట్ల పైమాటగానే, చెప్పుకుంటున్నారు. కానీ, శ్రీ సర్కార్ వారు ఆ మూడు నాలుగు నెలలో  నియోజకవర్గంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసమే, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేశారని, అధికారిక గణాంకాలే సూచిస్తున్నాయని అంటున్నారు.  ఇక అధికార పార్టీ ఖర్చుచేసిన కోట్ల విషయం అయితే చెప్పనక్కరలేదు. అవును అధికార పార్టీకి సమతూకంగా కాకపోయినా, అందుకు దీటుగానే బీజేపీ (ఈటల) కూడా కోట్లు ఖర్చు చేశారు. అలా ఓ వంక ప్రభుత్వం, మరో వంక అధికార, ప్రత్యర్ధి పార్టీలు కోట్లలో కుమ్మరించారు, ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం జరిగింది.  కాబట్టే, హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే, ‘అత్యంత’ఖరీదైన ఉప ఎన్నికగా చరిత్ర  సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన, కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు తెరాస నాయకులను బహిరంగంగా నిల దీశారు. ధర్నాలు చేశారు. ఇది కూడా, హుజురాబాద్ ఉప ఎన్నిక సృష్టించిన మరో  ‘చరిత్ర’.  నిజానికి హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత, రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన  భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు కోరుకున్నారు. నిజానికి, ఒక హుజూరాబాద్ అనే కాదు, హుజూరాబాద్   మోతాదు లో కాకున్నా, ఉప ఎన్నికలు జరిగిన అన్ని నియోజక వర్గాల్లోనూ తెరాస ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు తీయించింది. తెరాస  రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు నియోజక వర్గాల్లోనూ  ప్రభుత్వం, అధికార పార్టీ  ఆకాశమే హద్దు అన్న విధంగా నిధులను ఖర్చు చేయడం జరిగింది. అఫ్కోర్స్, హుజూరాబాద్ ను ముఖ్యమంత్రి ఇజ్జత్ కి సవాల్ గా  తీసుకున్నారు కాబట్టి  అక్కడ మోతాదు మరింతగా పెరిగింది. ఫ్యామిలీకి పదిలక్షలు ఇచ్చే దళిత బంధు పథకం అనివార్యంగా బయటకు వచ్చింది.  సరే, అదలా ఉంచి మళ్ళీ మనం, మన మునుగోడు... విషయానికి వస్తే,హుజూరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం, అధికార పార్టీ కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. అయితే, కొత్త పథకాల జోలికి వెళ్లకుండా పాత పెండింగ్ లో ఉన్న పెన్షన్లు, మండలాల ఏర్పాటు, ఇప్పటికే నిధులు మంజూరై పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను కానిచ్చేయడం, అవసరమనుకున్న చోటే అభివృద్ధి పనులను చేయడం మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానంగా హుజూరాబాద్ లో ఎదురైన పరాభవం ఒక కారణం అయితే, మూడేళ్ళుగా అభివృద్ధికి నోచుకోని నియోజక వర్గంలో ఎంతో కొంత అభివృద్ధి సాధించేందుకే రాజీనామా చేస్తున్నానని, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి చేస్తున్న చేస్తున్న ప్రచారానికి భయపడి, అధికార తెరాస ప్రస్తుతానికి అయితే కొంత ముందు చూపుతో, మెల్ల మెల్లగా అడుగులు వేస్తోందని అంటున్నారు.  అయితే, మునుగోడు ఓటర్లు మాత్రం, ఉప ఎన్నికపై  చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల విషయం ఎలా ఉన్నా, తెరాస, బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా పోటీలో ఉన్న నేపధ్యంలో ఓటు రేటు భారీగా పెరుగుతున్నదని, ఓటర్లు లెక్కలు వేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల దాకా ఇస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకు అందుతాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.  దీంతో ఈ నియోజకవర్గానికి చెందిన, ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారందరి దృష్టి ఇప్పుడు మునుగోడుపై పడింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వారంతా మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారు కూడా తమ ఓటును బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఇప్పటిదాకా ఓటు హక్కు రానివారు కూడా పెద్ద సంఖ్యలో ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆగస్టు 2 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి 13 వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.  మరో వంక నియోజక వర్గం పరిధిలో, మద్యం ఘుమఘుమలు ఇప్పటికే మొదలయ్యాయి నియోజకవర్గానికి సమీప మండలాల్లోనూ మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆగస్టు 1 నుంచి 29వ తేదీ వరకు చండూరు, నాంపల్లి, రామన్నపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో 1,11,279 పెట్టెల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రభుత్వానికి రూ.43.19 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫంక్షన్‌ హాళ్లను తీసుకుని సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ గ్రామాల్లో పార్టీల ఫిరాయింపు బేరసారాలతో రాత్రివేళ అధిక సంఖ్యలో మద్యం సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. దీంతో మద్యం విక్రయాలు మరింత పెరుగుతున్నాయి. అయితే, హుజురాబాద్ తో మునుగోడు పోటీ పడుతుందా? హుజూరాబాద్ మలిన చరిత్రను మునుగోడు చెరిపేస్తుందా? ఇంకా ఎక్కువ చేస్తుందా, అంటే, పరిశీలకులు  చూడాలి మరి ..అంటున్నారు.

కోహ్లీ డ‌క్‌.. మ‌ళ్లీ ఓడిన భార‌త్‌

మంగళవారం (సెప్టెంబర్ 06) జరిగిన ఆసియా కప్ 2022 ఎడిషన్‌లో కీలకమైన సూపర్ ఫోర్ పోరులో పాకిస్థాన్‌తో జరిగిన ఓటమి తర్వాత, భారత్ శ్రీలంకతో తలపడింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 72 పరుగులు చేయడంతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆర్ అశ్విన్‌ల సహకారంతో వారు 173-8తో పోటాపోటీగా నిలిచారు, అయితే లంక ప్లేయ‌ర్లు మాత్రం పోటీ అంతటా ఆకట్టుకున్నారనే అనాలి. పరుగుల వేటలో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించారు. , దిల్షాన్ మధు శంక, కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, కెప్టెన్ దసున్ షనక నాయకత్వం వహించారు.  శ్రీ‌లంక టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకుంది. భార‌త్‌కు దుర‌దృష్టం ఆరంభంలోనే వెన్నాడింది. ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్లోనే కె.ఎల్‌. రాహుల్, త‌ర్వాత కోహ్లీ బౌల్డ్ కావ‌డం అంద‌ర్నీ ఎంతో నిరాశ‌ప‌రిచింది. మ‌ళ్లీ మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడ‌నుకున్న కింగ్ కాస్తా, దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప‌రుగులు చేయ‌కుండానే పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. మ‌రో వంక కెప్టెన్ శ‌ర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కొన‌సాగిస్తూ మంచి షాట్స్‌తో స్కోరును ముందుకు తీసికెళ్లాడు. ఐదోఓవ‌ర్లో సిక్స్ కొట్ట‌డంతో జ‌ట్టు స్కోరు 2 వికెట్ల న‌ష్టాన‌కి 44కి చ‌రింది. ఎనిమిదో ఓవ‌ర్లో 50 ప‌రుగుల‌కు చేరుకుంది. కొంత ప‌రిస్థితుల‌కు ప‌రిశీలిస్తూ ఆచీతూచీ ఆడుతూనే సిక్స్ బాద‌డంతో ప‌దో ఓవ‌ర్లో రోహిత్ శ‌ర్మ  50 ప‌రుగులు పూర్తిచేశాడు. భార‌త్ ప‌ది ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది. శ‌ర్మ సూర్య‌కుమార్ 44 బంతుల్లో 66 ప‌రుగులు చేశారు. 12వ ఓవ‌ర్ హ‌స‌రంగ ఓవ‌ర్లో రోహిత్ మ‌రో సిక్స్ కొట్ట‌డంతో భార‌త్ స్కోర్ 100కి చేరుకుంది. జ‌ట్టు స్కోర్ 110 వ‌ద్ద క‌రుణ‌ర‌త్న‌కి శ‌ర్మ దొరికాడు. రోహిత్ శ‌ర్మ 41 బంతుల్లో 71 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత సూర్య కూడా  అవుట‌వ‌డంతో భార‌త్ భారీ స్కోర్ ఆశ‌లు దెబ్బ‌తినాయి. రిష‌బ్ పంత్ మెరుపు ఆట ప్ర‌ద‌ర్శించి ఫోర్లు కొట్టి కొంత ఫ‌ర‌వాలేద‌నిపించాడు. కాగా 18వ ఓవ‌ర్లో మాత్రం భార‌త్ 17 ప‌రుగులు సాధించింది. 19వ ఓర‌వ‌ర్లో మొద‌టి బంతికే హుడా వెనుదిరిగాడు. మ‌ధుశంక చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ‌ధుశంక 24 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. జ‌ట్టు స్కోరు 158 వ‌ద్ద పంత్ కూడా వెనుదిరిగాడు. అత‌ను వేగ‌వ‌గా 17 ప‌రుగులు చేయ‌గ‌లిగాడు. త‌ర్వాత వ‌చ్చిన అశ్విన్ ఒక భారీ సిక్స్ కొట్ట‌డంతో జ‌ట్టు స్కోర్ గౌర‌వ‌ప్ర‌ద‌స్థాయికి చేరిది. భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 173 ప‌రుగులు చేయ‌గ‌లిగింది.  174 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన లంక మొద‌టి నుంచే ధాటిగా బ్యాట్ చేసింది. భార‌త్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ మొద‌ట ఓవ‌ర్లో కేవ‌లం 1 ప‌రుగు ఇచ్చి శ‌భాష్ అనిపించుకున్నాడు. ఇదే స్థాయిలో బౌల‌ర్లు విజృలంభిస్తార‌ని అనుకున్నారు. కానీ రెండో ఓవ‌ర్ నుంచే లంకేయులు బాదుడు మొద‌లెట్టారు. అర్ష‌ద్ వేసిన రెండో ఓవ‌ర్లో 9 ప‌రుగుల చేశార‌. పాండ్య వేసిన 4 ఓవ‌ర్లో నిస్సం క భారీ సిక్స్ బాదాడు.  అలా మొద‌టి 6 ఓవ‌ర్ల‌లోనే శ్రీ‌లంక 50 ప‌రుగులు దాటేసింది. సింగ్‌,భువ‌నేశ్వ‌ర్‌, పాండ్యాలు లంక బ్యాట‌ర్ల పై ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. 7వ ఓవ‌ర్‌కి లంక 63 ప‌రుగులు చేసింది. 8వ ఓవ‌ర్లో వ‌చ్చిన‌ అనుభ‌వ‌జ్ఞుడైన స్పిన్న‌ర్ అశ్విన్ రెండో బంతికే భారీ సిక్స‌ర్ స‌మ‌ర్పించుకున్నాడు.  లంక 10వ ఓవ‌ర్‌కి నిస్సంక అర్ధ‌సెంచ‌రీ (33బంతుల్లో) పూర్తి చేశాడు. 13వ ఓవ‌ర్ల‌లో లంక 100 ప‌రుగులు దాటింది. కుశౄల్ మెంఇస్ మెరుపువేగంతో బ్యాట్ చేసి బౌల‌ర్ల‌ను ఇబ్బంది పెట్టాడు. కాగా 14వ ఓవ‌ర్లో లంక గుణ‌తిల‌క వికెట్ కోల్పోయింది. చాహ‌ల్ రెండు వికెట్లు తీసి కొంత ఆశ క‌ల్పించిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ లంక బ్యాట‌ర్లు పుంజుకుని నిల‌క‌డ‌గానే ఆడారు. 18వ ఓవ‌ర్లో పాండ్యా ఏకంగా 13 ప‌రుగులిచ్చి భార‌త్ ఆశ‌లు పూర్తిగా దెబ్బ‌తీశాడు. అంత‌కంటే ఘోరం 19వ ఓవ‌ర్‌లో భువ‌నేశ్వ‌ర్ రెండు వైడ్‌లు వేసి ప‌రిస్థితులు దిగ‌జార్చాడు. చివ‌రి ఓవ‌ర్ సింగ్ బాగానే చేశాడు. 7 ప‌రుగులు కావాల్సిన లంకకు బ్యాట‌ర్లు కాస్తంత ఖంగారుప‌డ్డారు. చిట్ట‌చివ‌రి రెండుబంతుల్లో ర‌న్ అవుట్ ఛాన్స్ భార‌త్ చేజార్చు కుని ఆట‌ను స‌మ‌ర్పించింది. 

కాంగ్రెస్ పంచన చేరడమే కేసీఆర్ కు మిగిలిన ఆప్షన్?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ఒకటే మాట మాట్లాడుతున్నారు. ‘బీజేపీ ముక్త్ భారత్’ ఒక్కటే ఆయన నినాదంగా ఉంటోంది. ఇందు కోసమే ఆయన ప్రత్యేక విమానంలో దేశమంతా చక్కర్లు కొడుతున్నారు. అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారు. రాష్ట్రంలో అయినా, పరాయి రాష్ట్రంలో అయినా  సందర్భం ఏదైనా, ఇంకో ముచ్చట లేకుండా,అందరం కలిసి కొట్లాడి మోడీ ని ఓడిద్దామనే పిలుపు నిస్తున్నారు. నిజానికి, అందరూ ఓకటై మోడీని ఓడించాలని ఒక్క కేసేఆర్ మాత్రమే కాదు, బీజేపీ  ప్రత్యర్ధి పార్టీలు, పవార్ వంటి ‘పెద్ద’  నాయకులు  అందరూ కోరు కుంటున్నారు. 2024లో ఏదో ఒక విధంగా మోడీని గద్దెదించాలనే విషయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సంపూర్ణ ఏకాభిప్రాయం వుంది . అందులో ఎవరికీ ఎలాంటి  సందేహం లేదు.   అయితే కొత్తగా యాంటీ మోడీ బ్రిగేడ్లో చేరిన నితీష్ కుమార్ సహా మెజారిటీ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్ ను అంటరాని పార్టీగా చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీతో  కలిసి బీజేపీని ఓడించాలనే ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. నిజానికి, బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత వివిధ పార్టీల జాతీయ నాయకులని కలిసేందుకు ఢిల్లీ వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధినేత నితీష్ కుమార్, వస్తూ వస్తూనే ముందుగా కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అంతే కాదు, ప్రధాని పదవి పై తనకు పెద్దగా అశలు లేవని చెప్పడం ద్వారా, పరోక్షంగానే అయినా రాహుల్ గాంధీ నాయకత్వానికి జై కొట్టారు. ఆయన వెంట నడిచేందుకు సంసిద్దతను వ్యక్త పరిచారు.నిజానికి, ఇప్పటికే బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీగా వుంది. అంతే కాదు, జేడీ(యు),ఆర్జేడీలను రాహుల్ గాంధీనే పీటల మీదకు చేర్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అదెలా ఉన్నా, ఇంతవరకు కేసీఆర్, మోడీని ఓడించే లక్ష్యంతో కలసిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాతీయ పార్టీల నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ లేకుండా, బీజేపీని ఓడించడం కాదు, ఓడించగలమనే ఆలోచన కూడా చేయడం లేదు. అప్పుడు స్టాలిన్ అదే చెప్పారు, ఇప్పడు నితీష్ కుమార్ కుడా అదే స్పష్టం చేశారు. ఈ రోజు సిపిఎం నేత సీతారామ్ ఏచూరిని కలసిన తర్వాత నితీష్ కుమార్, వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు, వామ పక్ష పార్టీలు, కాంగ్రెస్ తో కలిసి వస్తేనే, 2024 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలమని, అదొక విశేషంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.  నిజానికి ఒక స్టాలిన్, ఒక నితీష్ కుమార్ మాత్రమే కాదు, ఎన్సీపీ, శివసేన, జేడీఎస్,జేఎంఎం సహా మెజారిటీ ప్రాతీయ పార్టీలు కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి.  నిజానికి ఝార్ఖండ్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలలో, (నిన్న మొన్నటి వరకు మహారాష్ట్రలో ) అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కూటములలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీగా వుంది. ఇక  తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రత్యేక పంధాలో ముందుకు సాగుతున్నారు. అలాగే వామ పక్ష పార్టీల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు ... బెంగాల్ లో కాంగ్రెస్ తో దోస్తీ, కేరళలో కుస్తీ అన్నట్లు ఎక్కడికక్కడ ‘త్రికాల’ పంధాలో ముందుకు పోతున్నారు. తెలంగాణలో మునుగోడు వరకు తెరాసతో కాపురం ఆ తర్వాత ఇంకొకరితో ... ఇలా ఎక్కడిక్కడ గిట్టు బాటు బేరం చూసుకుంటున్నారు.   ఈ నేపధ్యంలో,  జాతీయ రాజకీయాల్లో దూకేందుకు రెడీ అవుతున్న కేసేఆర్ ... ఏ పంథా  అనుసరిస్తారు? ఎవరితో పోతారు?జాతీయ రాజకీయాల విషయం ఏమో కానీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇదే హాట్ టాపిక్ గా పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది.నిజానికి, జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే కేసీఆర్ ముందు, కాంగ్రెస్ పంచన చేరడం మినహా మరో ‘ఆప్షన్స్’ ఏదీ లేదని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి. తెరాస నాయకులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా   బీజేపీ ఎత్తుగడలను ఎదిరించి నిలిచేందుకు, కాంగ్రెస్ తో జట్టు కట్టడం తప్ప మరోమార్గం లేదని, అదే ఉభయ తారకంగా ఉంటుందని అంటున్నారని తెలుస్తోంది. నిజానికి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అదే జరిగింది.  ఛీ..ఛీ ..కాంగ్రెస్ ఉన్న కూటమికి మద్దతు ఇచ్చేది లేదని  ప్రకటించిన తెరాస, చివరకు కాంగ్రెస్ బలపరిచిన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది. అంతే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కేటీఆర్ మందీ మార్బలంతో ఢిల్లీ వెళ్లి, సిన్హా నామినేషన్’ దాఖలు చేసే కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నారు. పనిలో పనిగా రాహుల్ గాంధీ పక్కన చేరి ‘దోస్తానా’ కు శ్రీకారం చుట్టారు. సిగ్నల్స్ పంపారు.  నిజమే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెరాసతో చేతులు కలిపేందుకు ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించరు. అందులో సందేహం లేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేందుకు వీలు లేదని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానాన్ని మేనేజ్ చేయడం, కేసీఆర్ కు పెద్ద విషయం కాదని అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీలోనే తెరాస కోవర్టులు ఉన్నరనేది బహిరంగ రహస్యం. నిజానికి,  సోమవారం(సెప్టెంబర్ 5)  నిజామాబాద్’లో జరిగిన బహిరంగ సభలో కానీ, అంతకు  ముందు  నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభల్లో కానీ, కేసీఆర్ కాంగ్రెస్ ప్రస్తావనే తీసుకురాలేదు. సున్నితంగానే అయినా ఓ చిన్న చురకైనా వేయలేదు. మరో వంక మునుగోడులో ప్రచారం సాగిస్తున్న  కాంగ్రెస్ నాయకులు,  కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డిని , బీజేపీ, మోడీని టార్గెట్  చేసినంతగా కేసీఆర్ ను టార్గెట్ చేయడం లేదు. సో.. రేపటి పొత్తుల ముఖచిత్రం ఎంతో కొంత ఇప్పటికే స్పష్టం అవుతోందని అంటున్నారు.  అయితే,ఇప్పటి కిప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరాణాలు, పొత్తులు మారి  పోతాయని కాదు కానీ, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఏదైనా జరగవచ్చని. పరిశీలకులు భావిస్తున్నారు.

ఇక చ‌ర్చ‌ల‌కు నో..ఏపీ సీపీఎస్ యు  నేత‌లు

ప్ర‌స్తుతానికి ప‌రిస్థితుల‌ను అర్ధంచేసుకుని జీపీఎస్‌ను అంగీక‌రించాల‌ని ఏపీ మంత్రులు  బొగ్గ‌న‌, బొత్స సీపీఎస్ నాయ‌కుల‌ను కోరారు. కానీ ఎట్టిప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌మ‌ని వారు తెగేసి చెప్పారు. జీపీఎస్ సంబంధించి చాలారోజులుగా న‌లుగుతున్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు మంగ‌ళ వారం ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో ఏపీ మంత్రులు చ‌ర్చ‌కు మ‌రోసారి ఆహ్వానించారు. కానీ వారి చ‌ర్చ లు విఫ‌ల‌ మ‌య్యాయి.  ఈ సందర్భంగా ఏపీసీపీఎస్‌యూఎస్ అధ్యక్షులు సీఎం దాసు  మాట్లాడుతూ పాత పెన్షన్‌పై  చర్చిద్దాం అన్న మీదటే చర్చలకు వచ్చామని తెలిపారు. సీపీఎస్‌లో గవర్నమెంట్ షేర్ ఈ రోజుకు ఇవ్వడం లేద న్నారు. పిలిచి మరలా జీపీఎస్ గురించే మాట్లాడుతున్నారని.. ఇకపై అసలు చర్చలకు పిలవవద్దు అని చెప్పామని అన్నారు. వేలాది మంది ఏపీసీపీఎస్‌యూఎస్ నాయకులు, టీచర్‌లపై కేసులు నమోదు చేశా రని మండిపడ్డారు. అక్రమ కేసులను రద్దు చేయాలని కోరామన్నారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తి వేయా లని కోరనున్నట్లు చెప్పారు. అక్రమ కేసులు పెట్టినందున మంత్రులు బొత్స, బుగ్గనలకు వినతి పత్రం ఇచ్చామని దాసు తెలిపారు.  ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు మాట్లాడుతూ మరో మిలియన్ మార్చ్ ద్వారా సీపీఎస్ మహమ్మారిని తరిమి కొట్టాలని బావించామన్నారు. గత  ఏడేళ్ల‌లో పోలీసుల అనుమతి లేకపోతే  ఏ కార్య క్రమం చేయలేదని తెలిపారు. సీఎం ఇల్లు ముట్టడి నెప్పాన్ని చూపి తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ప్రెసిడెంట్‌ను తీసుకు వెళ్లి కేసులు పెట్టారన్నారు. నిజానికి ఆరోజు స్కూల్‌లో ఉన్న నాపై సీఎం ఇంటిని ముట్టడికి కుట్రచేశానంటూ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ కేసులను వెంటనే తొలగించాలని బొత్సను కోరామన్నారు. సెప్టెంబర్ 11న మిలియన్ మార్చ్, చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి ఇస్తే చేస్తాము లేకపోతే మరల వాయిదా వేస్తామని అప్పలరాజు వెల్లడించారు. 

టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌.. బ‌వుమా నాయ‌క‌త్వంలో  ద‌క్షిణాఫ్రికా 

ఆస్ట్రేలియాలో అక్టోబ‌ర్‌,న‌వంబ‌ర్ మాసాల్లో జ‌రిగే టి-20 ప్ర‌పంచ‌క‌ప్ పోటీల‌కు దక్షిణాఫ్రికా జ‌ట్టును ప్ర‌క టించారు. ఎడ‌మ మోచేతి గాయం నుంచి తేరుకున్న బ‌వుమా కి ద‌క్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు నాయ క‌త్వం బాధ్య‌త‌లు అప్ప‌గించారు.  జ‌ట్టులోకి ఆన్‌రిక్ నోర్జీ, క‌గీసో ర‌బాడ‌, లుంగీ ఎన్‌గిడి వంటి హేమా హేమీలు బౌలింగ్ విభాగాన్ని నిర్వ‌హిస్తారు. కాగా జ‌ట్టుకు కేశ‌వ్ మ‌హ‌రాజ్‌, త‌బ్రెజ్‌షాంసీ స్పిన్న‌ర్లుగా ఉన్నారు. జ‌ట్టులోకి ట్రిస్టియ‌న్ స్ట‌బ్స్ అనే యువ స్టార్‌ను కూడా తీసుకుని సెల‌క్ట‌ర్లు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ ప‌రిచారు.  జ‌ట్టు మిడిల్ ఆర్డ‌ర్ స్టార్ ర‌స్సీ వాన్‌డ‌ర్ డూసెన్ మాత్రం ఈ టోర్నీకి దూర‌మ‌య్యాడు. అత‌ని చూపుడు వేలు గాయం కార‌ణంగా జ‌ట్టులోకి ఎంపిక కాలేదు. ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డిన టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్‌లో అత‌నికి గాయ‌మ‌యింది. చూపుడువేలికి శ‌స్త్ర‌చికిత్స చేయ‌నున్న‌ట్టు, ఆరురు మాసాలు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో అత‌న్ని జ‌ట్టులోకి ఎంపిక చేయ‌లేదు. అయితే జ‌ట్టులోకి పేస‌ర్ వేన్ పార్న‌ల్ తిరిగి వ‌చ్చాడు. ఇటీవ‌ల ఇంగ్లండ్ పై 2-1 తేడాతో సిరీస్ గెలిచిన నేప‌థ్యంలో ఈ ప్ర‌పంచ‌క‌ప్ లో ద‌క్షిణాఫ్రికా అద్బుత ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌గ‌ల‌ద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభానికి ముందు భార‌త్‌తో ఒక సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నున్న‌ది.  బ‌వుమా నాయ‌క‌త్వంలోని ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో క్వింట‌న్ డీకాక్‌, రీజా హెండ్రిక్స్‌,క్లాసెన్‌,మ‌హారాజ్‌,మార్క ర‌మ్‌, డేవిడ్ మిల్ల‌ర్‌,లుంగీ ఎన్‌గిడి, ఆన్‌రిక్‌నోర్జీ, వేన్ పార్నెల్‌, ప్రిటోరియ‌స్‌, ర‌బాడ‌, రిలీ రోసో, త‌బ్రి యాజ్ షింసీ,త్రిస్టాన్ స్ట‌బ్స్ ఉన్నారు. కాగా, జోర్న్ ఫోర్టియ‌మ్‌, మార్కో, ఫెహ్లుక్వాయోలు రిజ‌ర్వుగా ఉన్నారు. 

సినిమాలో అక్రమ ఇన్వెస్ట్ మెంట్.. ఎమ్మెల్సీ కవితపై ఈడీకి ఫిర్యాదు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరుసగా ఒకదాని వెంట ఒకటిగా వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై  తాజాగా ఒక సినిమా లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారన్న ఫిర్యాదు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అందింది. ఒక కాంగ్రెస్ నేత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. కవితపై ఒక కాంగ్రెస్ నాయకుడు నేరుగా ఈడీకి ఫిర్యాదు చేయడం రాజకీయంగా హీట్ పెంచింది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఈడీకి మరో ఫిర్యాదు అందడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే విడుదలై డిజాస్టర్ గా నిలిచిన లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమంగా పెట్టుబడులు పెట్టారంటూ కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఈడీకి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకే కవిత,  దేవరకొండ విజయ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమాలో భారీగా ఇన్వెస్ట్ చేశారని కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ ఈడీకి  ఫిర్యాదు చేశారు. సినిమాలో కవిత అక్రమ పెట్టుబడిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయనా ఫిర్యాదులో కోరారు.  ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించి తనపై ఎవరూ ఆరోపణలు చేయకుండా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్న జడ్సన్.. కవిత అక్రమ పెట్టుబడులపై, అలాగే ఇతర ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశారు.  

వ‌ర‌ద‌నీటిలో బెంగుళూరు.. పీఎం కు నెటిజ‌న్ల స‌వాళ్లు!

దేశంలోనే అత్యంత ప్రశాంత నగరంగా, ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు భూతల నరకంగా మారిపోయింది. రహదారులు చెరువులయ్యాయి. భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికింది. దారీ తెన్నూ కానరాక జనం నానా అవస్థలూ పడుతున్నారు. నగరంలో ఏ దారి చూసినా గోదారే అన్నట్లుగా తయారైంది. భారీ వర్షాలకు ర‌హ‌దారులు, హైవేలు మునిగాయి. అయితే వీలువెంట‌నే ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకువ‌స్తామ‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ రాజ్ బొమ్మై ప్ర‌జ‌ల‌కు హామీనిచ్చారు.  అయితే, నెటిజ‌న్లు మాత్రం బీజేపీ పాలిత రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌రం వ‌ర్షంలో మునిగిందంటూ ఏకంగా ప్ర‌ధాని మోదీకే ట్వీట్లు చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పి స్తున్నారు.  ఇదిలా ఉండ‌గా, గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న ఆనాలోచిత విధానాల వ‌ల్ల‌నే సైబ‌ర్ సిటీ బెంగు ళూరు ఇవాళ వ‌ర‌ద ప‌రి స్థితుల‌కు చిక్కుకుంద‌ని  ముఖ్య‌మంత్రి  బొమ్మై మంగ‌ళ‌వారం మీడియా తో అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భు త్వ‌మే కాలువ‌లు, బ‌ఫ‌ర్ జోన్‌కి అనుమ‌తి ఇచ్చింద‌ని ఆయ‌న ఆరోపిం చారు. గ‌త 90 ఏళ్ల‌లో ఎప్పుడూ ఇంతగా వ‌రద‌ల‌కు క‌ర్ణాట‌క‌, ముఖ్యంగా బెంగుళూరు ఇంత‌గా వ‌ర‌ద‌ల తాకిడికి గురి కాలేద‌న్నారు. రోజూ రాత్రీ ప‌గ‌లు ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల వ‌ల్ల చెరువుల‌న్నీ నిండుకున్నాయ‌న్నారు. అయితే బెంగుళూరు న‌గ‌రం వ‌ర‌ద నీటిలో మునిగిపోయింద‌న్న వార్త‌ల‌ను, ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, అందులో నిజం లేదన్నారు. వ‌ర‌ద‌ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు రూ.300 కోట్లు విడుద‌ల చేస్తున్న‌ట్టు ముఖ్య‌మంత్రి బొమ్మై ప్ర‌క‌టించారు.  సైబ‌ర్ సిటీగా ఎంతో ప్ర‌సిద్ధిపొందిన మ‌హాన‌గ‌రం బెంగుళూరులో దాదాపు అన్ని ప్రాంతాలూ  భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద నీటిలో చికుక్కున్నాయి. ప్ర‌భుత్వం మాత్రం గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వాకం వ‌ల్ల‌నే సిటీ ఇలాం టి ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని ఆరోపించ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల‌తో దాడి చేస్తున్నారు. ప్ర‌తీ మాట‌కీ బీజేపీ పాలిత రాష్ట్రాలు బ్ర‌హ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయంటూ గొప్ప‌లు చెప్పుకోవ‌డం త‌ప్ప వాస్త‌వానికి అలాంటిదేమీ లేద‌ని నెటిజ‌న్లు బెంగుళూరు ప‌రిస్థితిని ఉదాహ‌ర‌ణ‌గా చూపుతూ ఎద్దేవా చేస్తున్నారు. 

కథ అడ్డం తిరిగింది.. ఒక హీరోని కలవబోయి మరో హీరోని కలిసిన నడ్డా!

ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు తెలుగు హీరోలను కలుస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు ముగ్దుడైన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటన సమయంలో హైదరాబాద్ లో తారక్ ని కలిసి ప్రశంసించారు. ఇక రీసెంట్ గా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా యంగ్ హీరో నితిన్ ని కలిశారు. అయితే నితిన్ ఇంతవరకు పాన్ ఇండియా ఫిల్మ్ చేయలేదు. నార్త్ ఆడియన్స్ ని మెప్పించే సినిమా సంగతి అటుంచితే, ఇటీవల ఆయన చేసిన 'మాచర్ల నియోజకవర్గం' చిత్రం తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించలేకపోయింది. దీంతో అసలు నితిన్ ని నడ్డా ఎందుకు కలిశారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నిజానికి నడ్డా కలవాలనుకున్నది నితిన్ ని కాదట. ఆయన నిఖిల్ ని కలవాలనుకుంటే తెలంగాణ బీజేపీ నాయకులు నితిన్ ని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టారని ప్రచారం జరుగుతోంది.   నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ-2' ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలై నార్త్ లోనూ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులో పురాణాలు మన చరిత్ర అని చెబుతూ శ్రీ కృష్ణ తత్వం గురించి వివరించిన తీరు ఆకట్టుకుంది. అందుకే హీరో నిఖిల్ ని నడ్డా ప్రత్యేకంగా కలిసి ప్రశంసించాలి అనుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన తన టీమ్ కి చెప్పగా.. వారు తెలంగాణ బీజేపీ లీడర్స్ ని కాంటాక్ట్ అయ్యారట. అయితే పేర్లు ఒకేలా ఉండటంతో కన్ఫ్యూజ్ అయ్యి.. నిఖిల్ కి బదులుగా నితిన్ ని కలిపించారని టాక్.   అయితే తాను కలిసింది 'కార్తికేయ-2' హీరోనే అనుకొని.. నితిన్ తో నడ్డా ఏం మాట్లాడి ఉంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  మాటల మధ్యలో మీరు నటించిన 'కార్తికేయ-2' బాగుందని నడ్డా అనగానే నితిన్ ఒక్కసారిగా ఉలిక్కిపడినంత పనై ఉంటుందని అంటున్నారు. తాను ఆ సినిమాలో నటించలేదు, పోనీ తాను నటించిన 'మాచర్ల' గురించి చెప్దామా అంటే అందులో విషయం లేదు. దీంతో అసలు విషయం బయటపడిపోయిందట. వెంటనే నడ్డా 'మీరు కన్ఫ్యూజ్ అయ్యి అనవసరంగా ఇతన్ని ఇబ్బందిపడేలా చేశారుగా' అంటూ దీనికి కారణమైన టీమ్ కి, లీడర్స్ కి చివాట్లు పెట్టారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. దీంతో నెటిజన్లు ఓ వైపు 'నిఖిల్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు' అంటూనే మరోవైపు నితిన్ ని ఉద్దేశించి 'నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఢిల్లీమోడ‌ల్ స్కూల్ బీజేపీయేత‌ర కూట‌మికి బాట‌!

కాలేజీ చ‌దువుకు వెళ్లే పేద‌పిల్ల‌ల‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నెల‌కు వెయ్యిరూపాయ‌లు  ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డింది. ఇది వాస్త‌వానికి ఢిల్లీ మోడ‌ల్ స్కూల్ అనుస‌రిస్తున్న ప‌థ‌కం. దీన్ని విజ‌య‌వంతంగా, ఎంతో ఆమోద‌యోగ్యంగా అమ‌లుచేస్తున్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ను త‌మిళ ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఎంతో అభినందించారు. సోమ‌వారం (సెప్టెంబ‌ర్ 5)న ఈ ప‌థ‌కాన్ని కేజ్రీవాల్ స‌మ‌క్షంలోనే త‌మిళ‌ నాడు లో సీఎం స్టాలిన్ ఆరంభించారు.  అయితే, ఇటీవ‌ల దేశంలో త‌లెత్తిన రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా, స్టాలిన్ కేజ్రీవాల్ స్నేహం మున్ముం దు మ‌రింత గ‌ట్టిప‌డి బీజేపీని ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. పంజాబ్‌లో ఆప్ విజ యం త‌ర్వాత, ఆయ‌న ప‌ట్ల త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఎంతో ఆక‌ర్షితుల‌య్యారు. ఇపుడు ఏకంగా ఢిల్లీ లో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాన్ని త‌మ రాష్ట్రంలోనూ అమ‌లు చేయ‌డానికీ సిద్ధ‌ప‌డ్డారు.  రాష్ట్రాల మ‌ధ్య సుహృద్ వాతావ‌ర‌ణం ఉండాల‌ని, స‌హాయ‌స‌హ‌కారాలతో ముంద‌డుగు వేయ‌డం ద్వారా నే కేంద్రం, రాష్ట్రా ల‌మ‌ధ్య కూడా స‌త్సంబంధాలకు అవ‌కాశం ఉంటుంద‌ని కేజ్రీవాల్  ఈ  సందర్భంగా అన్నారు. ఢిల్లీ పాఠ‌శాల మోడ‌ల్‌ను త‌మిళ‌నాట అమ‌లు చేయ‌డానికి స్టాలిన్ ఉత్సాహం  ప్ర‌ద‌ర్శించ‌డం ప‌ట్ల కేజ్రీవాల్ ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. అలాగే కేజ్రీవాల్‌ను ఫైట‌ర్ అంటూ స్టాలిన్  పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. కేజ్రీవాల్  ఐఆర్ ఎస్ వ‌దిలి రాజ‌కీయాల్లోకి రావ‌డం నిజంగా అభినంద‌నీయ‌మ‌ని స్టాలిన్ అన్నారు. రాజ‌కీయాల్లోకి  వ‌చ్చిన అన‌తికాలంలోనే ఢిల్లీ ముఖ్య‌మంత్రి కావ‌డం, ఇటీవ‌లే పంజాబ్‌లోనూ త‌న పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించ‌గ‌ల‌గ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.  ఎంఆర్ ఏ మెమోరియ‌ల్ పుత్తుమాయిపెన్‌(ఆధునిక మ‌హిళ‌) ప‌థ‌కాన్ని స్టాలిన్ ఆరంభించారు. ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో 6 ఉంచి10వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దివిన ఆడ‌పిల్ల‌ల‌కు  ఉన్న‌త‌విద్యకి వెళ్లేవారికి  ప్ర‌తీ నెలా వెయ్యిరూపాయ‌లు అంద‌జే స్తారు. తొలివిడ‌త‌గా సుమారు 67 వేల‌మంది కాలేజీ విద్యార్థుల‌కు అంద‌ జేయ‌నున్నారు.  దేశంలో పాఠ‌శాల విద్యారంగంలో అభ్యున్న‌తి సాధించాలంటే కేంద్రం, రాష్ట్రాల మ‌ద్య స‌త్సంబంధాలు మ‌రింత మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేజ్రీవాల్ అన్నారు. అనాదిగా పాఠ‌శాల విద్యావిదానం, బోధ‌నా విధానంలో మార్ప‌లు కాల‌నుగుణంగా తీసుకురావాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఆయ‌న ప్ర‌స్థావించారు. ఒక‌రాష్ట్రం నుంచి మ‌రొక‌టి మంచి ప‌థ‌కాల‌ను, విధానాల‌ను అనుస‌రించ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని కేజ్రీ వాల్ ఢిల్లీ, త‌మిళ‌నాడు మ‌ధ్య స్నేహ‌సంబంధాలు మ‌రింత మెరుగుప‌డి ముంద‌డుగు వేయాల‌న్న అభి ప్రాయం వ్య‌క్తం చేశారు.

విత్త మంత్రిగారూ.. బొమ్మల కొలువుపై మోడీని అడిగారా?

కేంద్ర పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు కచ్చితంగా మోడీ ఫొటోను పెట్టాల్సిందే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను పెంచేశాయి. గతంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోటోలను రేషన్ షాపుల్లో ఉంచాయా అని తెలంగాణ మంత్రులు నిలదీస్తున్నారు. ఒకరి తరువాత ఒకరుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ముప్పేట దాడి చేస్తున్నారు. విమర్శలు చేసేయడం ఆ తరువాత నాలుక కరుచుకుని మౌనం దాల్చడం కేంద్రానికి ఒక అలవాటుగా మారిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి, రైతుల ఆగ్రహ జ్వాలలకు తలవంచి ఉపసంహరించుకున్న సమయంలో మోడీ రైతులకు క్షమాపణ చెప్పిన విషయాన్ని వారీసందర్బంగా గుర్తు చేస్తున్నారు.  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ తెలంగాణ పర్యటన సందర్భంగా రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫొటోపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. తెలంగాణ మంత్రులందరూ కేంద్ర విత్త మంత్రి అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మండిపడుతూ ఆమెపై విమర్శల దాడి చేస్తున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అయితే నిర్మలా సీతారామన్ కు మోడీ బొమ్మల కొలువు కావాలంటే ముందు ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఏం చేశారో తెలుసుకోవాలని హితవు పలికారు. నరేంద్రమోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో  ఆ రాష్ట్రంలోని  రేషన్‌ షాపుల్లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఫొటో పెట్టారా? తెలుసుకుని ఆ తరువాత తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో మోడీ ఫొటో గురించి అడగాలని సూచించారు. కేంద్రం సమాఖ్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. రాష్ట్రానికి వచ్చి మూడు ఆరోపణలు, ఆరు అబద్ధాలతో రాజకీయం చేద్దామంటే నడవదని హెచ్చరించారు.  ప్రజలు టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌ పాలనపై, ప్రభుత్వ పథకాలపై పూర్తి స్పష్టతతో ఉన్నారన్నారు.   తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలుసుననీ, కేంద్ర విత్తమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారనీ విమర్శించారు.  విభజన హామీలు అమలు చేయకపోవడం, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన రూ.7,103 కోట్లు ఇవ్వకపోవడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం, ఐటీఐఆర్‌, నిమ్స్ రద్దు, మెడికల్‌ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు మంజూరు చేయకపోవడం వంటివి వివక్ష కాదా? అని ప్రశ్నించారు. వీధి రౌడీల్లా రేషన్ షాపుల వద్ద గలాటా చేయడం కాదనీ, దమ్ముంటూ అంశాల వారీగా చర్చకు రావాలనీ సవాల్ చేశారు.  పథకాల్లో కేంద్ర నిధులను వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందేనని నిర్మలా సీతారామన్‌ మాట్లాడటం చెప్పేటందుకే  బీజేపీకి నీతులు గుర్తుకువస్తాయన్నట్లుగా ఉందన్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో ఆయన ఫొటో పెట్టారా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలున్న రాష్ట్రాలపై ఇలాంటి ఒత్తిడి తేవడం కేంద్రం ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. మోదీ హయాంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను రద్దు చేశారు. ఉన్న పథకాల్లో కేంద్రం నిధుల వాటా తగ్గించి, రాష్ట్రాల వాటా పెంచారు. ఇందులో కొన్ని పథకాల లక్ష్యాలు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు తగినట్టు లేనేలేవు. అనవసరమైన పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాల వాటా పెంచి   భారం మోపడం వినా కేంద్రం రాష్ట్రాలకు చేసిన మేలు ఏమీ లేదని హరీష్ రావు అన్నారు. పనికి ఆహార పథకం వంటి మంచి పథకాలకూ కొర్రీలు పెట్టి, నిధులు తగ్గించి కొత్త నిబంధనలు పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారని  విమర్శించారు. ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని పునఃసమీక్షించాలన్న 15వ ఆర్థిక సంఘం సిఫారసు గురించి మీడియా ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి నిర్మల సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.  రాజ్యాంగం ప్రకారం రుణాలను నియంత్రించే హకు కేంద్రానికి ఉన్నదని మీరు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పరిధి దాటి ఎలా అప్పులు చేస్తున్నదని ప్రశ్నించారు.  కేంద్రానికి  రాజ్యాంగం ఏమైనా ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చిందా?  అని నిలదీశారు. కార్పొరేట్లకు చెందిన  లక్షల కోట్ల రుణాలను ఎవరి ఆమోదంతో రద్దు చేశారో దేశ ప్రజలకు కేంద్రం, మోడీ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.    ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిర్మలా సీతారామన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ తయారు చేయలేదని చెప్పడాన్ని తప్పుపట్టిన హరీష్ రావు డీపీఆర్‌ సమర్పించకుండానే కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.  

ఏపీలో నేరాలూ, అఘాయిత్యాలు.. మూలాలు అక్కడే..!

వైజాగ్‌లో భారీగా మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం..  నెల్లూరు జిల్లాలో బాలికపై ఘాతుకం.. ఇవి రెండూ మంగళవారం (ఆగస్టు 6) పత్రికలో వచ్చిన రెండు వేర్వేరు వార్తలు. అయితే, కొంచెం లోతుల్లోకి వెళ్లి చూస్తే, ఈ రెండు ఘాతుక వార్తలకు సంబంధం ఉండడమే  కాదు, రెంటి మూలం, ఒకటే, అదే మత్తు. అవును, అది మద్యం అయినా, డ్రగ్స్ అయినా, గంజాయి, ఇప్పడు ఈ టాబ్లెట్స్  ఏదైనా సమాజమలో నేరాలు ఘోరాలు రోజు రోజుకు పెరిగి పోవడానికి, మద్యం, మత్తు మూల కారణంగా అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.   నిజం. మద్యంకానీ,మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే .. ఇక ఆ మత్తులోంచి బయటకు రావడం ఎంతటివారికి అయినా అంట సులభంగా అయ్యే పనికాదు. ఇక యువత విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అందుకే యువత మత్తు మందులకు అలవాటు పడితే,అది వ్యక్తులు కుటుంబాలను పీల్చిపీల్చి పీల్చి పిప్పిచేస్తుంది. అంతేకాదు, సమాజాన్ని నిర్వీర్యం చేస్తుందని, సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. మరో వంక జాతీయ, అంతర్జాతీయ సంఘ వ్యతిరేక శక్తులు సమాజాన్ని  నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా  యువతకు  మత్తు మందులను ఎరగావేస్తున్నాయి. ముంబై లాంటి నగరాలో మత్తు మందులు, మాదక ద్రవ్యాల ద్వారా నేర సామ్రాజ్యాని విస్తరించుకునే కుట్రలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. వస్తున్నాయి. అందుకే, విశాఖ నగరంలో నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు కలిగించే ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ముఠా ఒడిశా, పశ్చిమబెంగాల్‌ వంటి ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో మత్తును కలిగించే ట్యాబ్లెట్లు దిగుమతి చేసుకుంటున్నట్లు వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ యాంటీ నార్కోటెక్‌ విభాగం ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. కంచరపాలెంకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. వీరి నుంచి మూడు కంపెనీలకు చెందిన 8వేల మత్తు కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  మరోవంక దేశంశంలో జరిగే హత్యలు, మానభంగాలు భంగాలు మరెన్నో నేరాలకు మద్యం, మత్తు మందులే కారణం అవుతున్నాయి. ఒక్క నేరాలు ఘోరాలే కాదు, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు మిగిలిస్తున్న విషాద ఘటనలు అన్నిటికీ, మద్యం మత్తుమందులే కారణం అని వేరే చెప్పనక్కరలేదు. ప్రతి నిత్యం జరుగతున్న అలాంటి దుర్మార్గ సంఘటనలు ఎన్నో మన కళ్ళముందే  కనిపిస్తున్నాయి. అవును మత్తు మందుకు బానిసైన బతుకులు ఏ విధంగా తెల్లారుతున్నాయో చస్తూనే ఉన్నాం. విచక్షణా రహితంగా వావి వరసలు లేని అఘాయిత్యాలకు, ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని నేరాలకు ఇంకా ఇతర కారణలు ఉన్నా, మద్యం మత్తు  నేరాలకు ఒక ప్రధాన కారణంగా అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. అందుకే ఈరోజు మనం ముక్కు పచ్చలారని పసి కందులపై అత్యాచారానికి పాల్పడుతున్న మానవ మృగాలను చూస్తున్నాం. ఎక్కడివరకో ఎందుకు నెల్లూరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా  ఆమె నోట్లో, ముఖంపై యాసిడ్‌ పోసి.. ఆపై గొంతు కోసి పరారైన సంఘటనే మత్తు మహమ్మారి ఘాతుక చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది . ఇలాంటి నేరాలు ప్రతి రోజు ఎక్కడో అక్కడ జరుగుతనే ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూరు దుర్ఘటన అనే కాదు, సహజంగా ఇలాంటి నేరాలకు మద్యం మత్తే మూల కారణం అవుతోంది. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి.  ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందనే ఆరోపణలు కాదు వాస్తవ సంఘటనలే వెలుగు చూసాయి.  ఎక్కడో గుజరాత్, పొరుగున ఉన్న తెలంగాణలో పట్టుబడిన గంజాయి అక్రమ వ్యాపారం మూలాలు ఆంధ్ర ప్రదేశ్లో బయట పడ్డాయి. అలాగే, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇలా ఒకటని కాదు, ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన మత్తు టాబ్లెట్స్ దందా వరకు ప్రతి అక్రమ దందాకు ఏపీ అడ్డగా మారింది. ఇక మద్యం సంగతి అయితే  చెప్పనే అక్కరలేదు. అంచెల వారీగా  మధ్య నిషేధం అమలు చేస్తామని, అక్క చెల్లెమ్మలకు, అమ్మలకు, అవ్వలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మధ్యమే ములాధరంగా పరిపాలన సాగిస్తున్నారు. అంతే కాదు  పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని పూచికత్తుగా చూపించి అప్పు కూడా తెచ్చుకున్నారు. అందుకే, ఏపీలో ఇప్పడు సగటున రోజుకు మూడు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగైదేళ్ల కిందట వరకూ అతి తక్కువ నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో కొనసాగిన ఏపీ.. ఇప్పుడు అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల సరసన చేరింది

నేనే రాజు... నువ్వే మంత్రి.. ప్రతి చోటా జగన్ ఇదే కథ!

మళ్లీ అధికారం అందుకోవాలంటే... ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎంత చేయాలో  ఫ్యాన్ పార్టీ శాశ్వత అధినేత, ముఖ్యమంత్రి జగన్   బాగా వంట పట్టించుకొన్నారు. ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలే పదే పదే చెబుతున్నారు.  ఎక్కడికెళ్లినా జగన్ ది ఒక పాట, ఒకే రాగం. ఒకే పాట. ఆయన ఆవు కథ లెక్కడ పదే పదే చెబుతున్న 175కి 175 స్థానాలు అన్న మాట వినలేక, విని జీర్ణించుకోలేక వైసీపీ లీడర్ల నుంచి క్యాడర్ వరకూ తలలు గోడకేసి చేతులను నోటి కేసి తెగ కొట్టేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ వీక్‌గా ఉంటే..ఆ నియోజకవర్గ   పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై.. గెలిస్తే నువ్వే మంత్రి అని సదరు పార్టీ ఇన్ చార్జీతో.. గెలిపిస్తే మీ నాయకుడికి కేబినెట్ లో చోటు అంటూ వారి వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేసేందుకు వైయస్ జగన్ ఏ మాత్రం వెనకాడడం లేదు.   టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి భరత్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే.. ఆయనకు మంత్రిగిరి ఇచ్చేస్తానంటూ  ఇటీవల ప్రకటించేశారు జగన్. అలాగే ఉత్తరాంధ్రలోని రాజాంలో కంబాల జోగులును గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ అంటూ ఆ  నియోజకవర్గంలోని పార్టీ వారిని ఊరించేశారు. ఇలా అయితే జగన్ 175 నియోజక వర్గాలలోనూ ఇదే మాట చెప్పాల్సి ఉంటుందనీ, ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ ఆఖరికి పులివెందులతో సహా పార్టీ వీక్ గానే ఉందని విపక్షాలు జగన్ తీరును ఎద్దేవా చేస్తున్నారు. ఎక్కడికెడితే అక్కడ మీ నాయకుడికి కేబినెట్ లో సీట్ గ్యారంటీ అంటూ జగన్ చెబుతుండటంతో  పార్టీ క్యాడర్ కూడా సీఎం మాటలను సీరియస్ గా తీసుకోని పరిస్థితి ఉంది.  2019 ఎన్నికలకు ముందుకు వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో అయితేనేమీ..  ఎన్నికల ప్రచారంలో అయితేనేమీ.. హామీలు వాగ్దానాలతో ఉదరగొట్టి పడేశారు. ఆ క్రమంలో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్‌పై ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డిని గెలిపిస్తే.. తన ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ మంగళగిరి  ప్రజల సాక్షిగానే కాదు.. అక్కేడ స్థానికంగా కొలువైన పానకాల స్వామి వారి సాక్షిగా కూడా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే  ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలిసిందే.  పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సీనియర్ అయినా.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. అదీ టీడీపీ నుంచి జంప్ కొట్టి.. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన విడదల రజినీకి... జగన్ తన మలి కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్థానం కల్పించారు. ఈ అంశంపై అప్పడే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి.. తన అనుచరుల వద్ద సీఎం జగన్‌ వ్యవహారశైలిపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన అనుచరులే చెబుతున్నారు.  ఆ  కారణంగానే  ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించారని కూడా ఆయన అనుచరులు చెబుతున్నారు. అలాగే గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం నుంచి జంప్ చేసి వైసీపీ గూటికి చేరిన విడదల రజనిని చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిపిస్తే  ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానంటూ నాడు ఆ సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌కు జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆ తరువాత జగన్ విస్మరించిన విషయాన్ని ఇప్పుడు పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.    ఏదీ ఏమైనా... ఎన్నికల ప్రచారం వరకు ఫ్యాన్ పార్టీ అధినేతగా.. నేనే రాజు.. మీరు గెలిపిస్తే.. మీ నాయకుడే మంత్రి అంటూ.. ఉరించి  ఆ తర్వాత  కన్వీనియెంట్ గా విస్మరించడం జగన్ కు అలవాటేనని వైసీపీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. అంతెందుకు తాను  2019 ఎన్నికలలో సీఎం కావడం కోసం  నిర్విరామంగా కృషి చేసిన   చెల్లి,తల్లిని పూర్తిగా పక్కన పెట్టి వారు విసిగి పక్కరాష్ట్రానికి వలస వెళ్లిపోయేలా చేసిన జగన్ ఇప్పుడు గెలిపిస్తే మంత్రి పదవి అంటూ చెప్పిన మాటలను ఎంత సేపు గుర్తుంచుకుంటారులే అని లైట్ గా తీసుకుంటున్నారు.  ఏదీ ఏమైనా.. అధికారమనే అందలం ఎక్క వరకే .. తల్లి అయినా.. చెల్లి అయినా.. ఆ తర్వాత.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని ఫ్యాన్ పార్టీలోని వర్గాలే ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ వ్యవహార శైలిపై ముచ్చటగా ముచ్చటించుకోవడం మహా విశేషం.

అర్ష్‌దీప్ పై విమ‌ర్శ‌లు అవ‌స‌ర‌మా? 

పొర‌పాట్లు జ‌రుగుతాయి. కొన్ని ప‌ట్టించుకోన‌క్క‌ర్లేదు. కొన్ని సీరియ‌స్‌గానే ప‌ట్టించుకుంటారు. అందు లోనూ విజ‌యానికి రెండ‌డుగుల దూరంలో ఉన్న స‌మ‌యంలో ల‌డ్డులాంటి క్యాచ్ చేజారిన‌పుడు. ఆది వారం పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డిన మ్యాచ్‌లో కుర్రాడు అర్ష్‌దీప్ సింగ్ బంగారంలాంటి క్యాచ్ వ‌ద‌ లేసేడు. గోళ్లు కొరికేసుకుంటున్నంత‌టి ఉత్కంఠ‌భ‌రిత సమ‌య‌లో కుర్రాడు ప‌ట్టిన‌ట్టే ప‌ట్టి వ‌ది లేశాడు. అదెలా జ‌రిగిందీ అత‌నికీ అర్ధంకాలేదు.. ఆ క్షణంలో. కానీ ఎదురుగా కోపంతో ర‌గిలిపోతూ లోప‌ల తిట్టు కుంటూ క‌నిపించిన కెప్టెన్ శ‌ర్మ మొహం చూసి సింగ్ భ‌య‌ప‌డ్డాడు. ఆ త‌ర్వాత చూస్తుండగానే కొద్ది సేప‌టికే  పాక్ గెలిచింది. మ్యాచ్ అయిపోయింది.  అత‌ని మీద ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కానీ అంత‌గా కుర్రాడిని మాన‌సికంగా కృంగ‌దీయ డం అవ‌స‌ర‌మా అని క్రికెట్ పండితులూ అంటున్నారు. అత‌ను క్యాచ్ వ‌దిలేయ‌డం త‌ప్పే. కానీ అంత‌కు ముందు భార‌త్ బ్యాటింగ్ చాలా ఘోరంగా సాగింది. దాన్ని గురించి ఎవ్వ‌రూ ఇంత‌గా ట్రాల్ చేయ‌క‌పోవ డ‌మే విడ్డూరం. కుర్రాడిని తిట్ట‌డం సులువు, మ‌రి ఎంతో అనుభ‌వం వున్న పాండ్యా, సూర్య‌కుమార్ యాద‌వ్  చాలా దారుణంగా వెనుదిరిగారు. మ‌రి వారి గురించి ఎవ్వ‌రూ ప‌ల్లెత్తు కామెంట్ చేయ‌క‌పోవ‌డ‌మే విడ్డూరం.  మ్యాచ్ 18వ ఓవ‌ర్లో ర‌వి విష్ణోయ్ ఓవ‌ర్లో ఆ క్యాచ్ పట్టి ఉంటే భార‌త్ కు త‌ప్ప‌కుండా కొంత ఊర‌ట క‌లిగేది. కానీ అన్నీ అన్నిసార్లూ మ‌నం అనుకున్న‌ట్టే జ‌ర‌గ‌దు. ఇదీ అంతే. కానీ ఆ త‌ర్వాత నుంచి అత‌న్ని దూషి స్తూ చాలామంది ట్వీట్ చేశారు, చేస్తూనే ఉన్నార‌ట‌! నెట్‌లో వాటిని చూస్తూ అత‌ని త‌ల్లిదండ్రుల మాత్రం న‌వ్వుకుంటున్నార‌ట‌. ఎందుకంటే ఆట‌లో ఉండి ఆ టెన్ష‌న్ భ‌రిచిన‌వాడికంటే, బ‌య‌టివారు మ‌రీ అతిగా విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్ప‌ద‌మే! మీడియా కూడా అర్ష‌దీప్ వెంట‌ప‌డింది. ఏమాత్రం ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌డం లేదు. విమ‌ర్శ‌లు ఎన్ని వ‌స్తున్నా, వాటిని పాజిటివ్‌గానే తీసుకుంటున్నాన‌ని అత‌ను అన్నాడు. త‌న‌కు యావ‌త్ భార‌త్ జ‌ట్టూ మ‌ద్ద తుగా నిలిచి, కుర్రాడి త‌ప్పులేద‌ని, ఆ స‌మ‌యంలో ఏదో  కోప‌గించుకున్నామేగాని అలాంటివి అంద‌రికీ ఎదుర‌యిన స‌మ‌స్యే అని  త‌న బిడ్డ‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని  అర్ష‌దీప్ త‌ల్లి బ‌ల్జీత్ అన్నా రు. నిజానికి అత‌ని త‌ల్లిదండ్రులు కాస్తంత బాధ‌ప‌డ్డారు. అయితే అర్ష్ ఇంకా 23ఏళ్ల కుర్రాడే అంత‌ర్జా తీయ క్రికెట్‌లోకి ఇపుడే వ‌చ్చాడు.. అత‌ని మీద మ‌రీ ఇంత‌గా విరుచుక‌ప‌డ‌టం అర్ధం లేనిద‌ని అత‌ని తండ్రి ద‌ర్శ‌న్ అన్నారు.  అయితే అంత‌టి క‌ష్టంలోనూ, అర్ష్‌దీప్‌కి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డి, ధైర్యం చెప్పింది మాత్రం కింగ్ కోహ్లీయే. అలాంటివి మామూలే. పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ద్ద‌న్నాడు. అత్యంత ఉత్కంఠ‌భ‌రిత టోర్నీల్లో, మ్యాచ్‌ల్లో ఇలాంటివి జ‌రుగుతూనే ఉంటాయని అన్నాడు. త‌న అనుభ‌వం గురించి చెబుతూ, తాను ఆడిన మొద‌టి ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డిన మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిదీ బౌలింగ్‌లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఆడ‌లేక‌పోయాన‌న్నాడు.