రాజధాని రైతుల పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు!

రాజధాని అమరావతి మహా పాదయాత్ర 2.0కు.. ఆ ప్రాంత రైతులు సోమవారం(సెప్టెంబర్ 12) శ్రీకారం చుట్టారు. వెంకటాయపాలెంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వెలుపల ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపారు. ఆ క్రమంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రైతులు ఈ పాదయాత్రను ప్రారంభించారు.  అయితే ఈ పాదయాత్రలో పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో వైపు కొంతమంది అధికార వైసీపీ కార్యకర్తలు సైతం అమరావతి మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించారు. ఆ క్రమంలో రథం నడిపే బాధ్యతను  వైసీపీ కార్యకర్తలకు రైతులు స్వయంగా అప్పగించారు. వెంకటాయపాలెం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర .. కృష్ణాయపాలెం, యర్రబాలెం మీదగా  15 కిలోమీటర్లు సాగి మంగళగిరి చేరుకుంటుంది.  ఈ రోజు రాత్రికి రైతులు అక్కడే బస చేస్తారు. రైతుల మహాపాదయాత్రలో  శ్రీవెంకటేశ్వరుడి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారు.   అయితే రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు.. జగన్ ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకించారు. ఆ క్రమంలో రైతులు ప్రారంభించిన ఉద్యమం 2022 సెప్టెంబర్ 12(సోమవారం)తో వెయ్యి రోజూలు పూర్తి చేకుంది. ఈ నేపథ్యంలో అమరావతి టు అరసెవెల్లి పాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పాదయాత్రలో అమరావతి అభివృద్ధి చెందితేనే ఆ ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని..  రైతులు  ప్రజలకు వివరించనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలుతోపాటు అన్ని వర్గాల వారు విడతలవారీగా ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. నేడు వెంకటాయపాలెంలో  ప్రారంభమైన ఈ పాదయాత్ర... వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబర్ 11వ తేదీన శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో కొలువైన  ప్రత్యక్ష నారాయణుడు సూర్య భాగవానుడి చెంతకు చేరనుంది.  ఇక ఈ పాదయాత్రకు అధికార వైసీపీ వినా  మిగిలిన రాజకీయ పక్షాలన్నీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

చెవిలో  పాము పిల్ల‌!

ఆమ‌ధ్య ఒక మ‌హిళ చెవిలోంచి సాలీడు వ‌స్తేనే అమ్మో ఇది ఎలా జ‌రిగింది అని తెగ ఆశ్చ‌ర్య‌ప‌డ్డారు. ఇపుడు ఏకంగా ఒక మ‌హిళ చెవిలో చిన్న పాము ఉండ‌డం నెటిజ‌న్ల‌ను మ‌రింత ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది, భ‌య పెడుతోంది కూడా. ఎందుకంటే అది పాము. దానికి ఇబ్బంది అనిపిస్తే కాటూ వేస్తుంది. ప‌చ్చ‌ని రంగులో ఉన్న పాము ఆమె చెవిలోంచి బ‌య‌టికి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌టంలేద‌ట‌! డాక్ట‌ర్లు ఎంతో ప్ర‌య‌త్నించారు.  చంద‌న్ సింగ్‌ త‌న ఫేస్బుక్ దానికి సంబంధించిన వీడియో పెట్టాడు. చాలామందికి భ‌య‌మేసింది. అస‌లు పాము పిల్ల‌యినా చెవిలోకి ఎలా వెళ్లిందా అని! దానికి స‌మాధానం లేదు. కానీ ఆమె చెవిలో ఉండ‌డంమాత్రం చూపించింది. చాలామంది అదంతా ఫేక్ అనీ అంటున్నారు. డాక్ట‌ర్ దాన్ని చెవి లోంచి బ‌య‌టికి తీస్తుండడం ఫేక్ ఎలా అవుతుంది? అయితే పాము పిల్ల‌లు ఇళ్ల‌లోకి వ‌చ్చి చాలా రోజులు మ‌నుషుల‌కు క‌నిపించ కుండా ఉంటూనే ఉంటాయి.  నిద్ర‌పోతున్న స‌మ‌యంలో ఇలా జ‌ర‌గ‌డానికీ ఆస్కారం ఉంటుంద‌ని  అంటు న్నారు. అందువ‌ల్ల తోట‌లు, అట‌వీప్రాంతాల్లో ఉండేవారు రాత్రిపూట చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆరోగ్య శాఖ కూడా చాలా ప‌ర్యాయాలు హెచ్చ‌రిస్తూనే ఉంది. ఏదేమైన‌ప్ప‌టికీ ఈ పాము స్నేహంతో ఆమె ప్రాణం పోయేలోపే ఆమెను ర‌క్షించ‌మ‌ని ఆమె బంధువులు వేడుకుంటున్నార‌ట‌

రాజధాని లేని రాష్ట్రం..జగన్ రెడ్డి నిర్వాకం

మొండివాడు రాజుకంటే బలవంతుడు, ఇక రాజే మొండివాడయితే, ఆ రాజ్యం, నేటి ఏపీ  అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ముక్కలై, నవ్యాంధ్ర  ప్రదేశ్ రాష్టం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలైంది, అయినా ఇంతవరకు,రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ  మిగిలిపోయింది. నిజానికి, రాష్ట్ర విభజన జరిగిన వెంటనే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా దివ్యభవ్య రాజధాని నిర్మాణానికి, శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే  బాలారిష్టాలను దాటుకుని, రాజధానికి ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో, ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపే అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన,మాట తప్పారు, మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి, అదే సభలో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే,అధికార వికేద్రీకరణ వంకన మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడి మూడు రాజధానుల ప్రకటన చేశారు.ముఖ్యమంత్రి ప్రకటనతో రాజధాని రైతులలో ఆందోళన మొదలైంది. ముఖ్యమంత్రి మొండి నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఉద్యమం   సోమవారం (సెప్టెంబర్ 12) నాటికి  వెయ్యి రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబరు ఒకటి నుంచి డిసెంబరు 15 వరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించిన రైతులు,  సోమవారం (సెప్టెంబర్ 12) రెండో విడత పాదయాత్ర ప్రారంభించారు. రాజధానిలోని వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి ఈ పాదయాత్ర సాగుతుంది. సుదీర్ఘంగా సాగుతున్నఈ పోరాటంలో అమరావతి ప్రాంతంలో వందల మంది అన్నదాతలు అశువులు బాశారు. అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 214 మంది మరణించారు. ఈ మూడేళ్లలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 82 మంది చనిపోగా, 42 మంది రైతు కూలీలు కన్ను మూశారు వీరితో పాటు కౌలుదారులు, అనుబంధ వృత్తులవారూ అనేక మంది బలైపోయారు. రాజధాని కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమన్న ప్రభుత్వ వాదన సరికాదని రైతుల మరణాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు  అంటున్నారు. ఇందుకు సంబంధించి  రైతుల పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు ఈ ఏడాది మార్చి 3న సిఆర్‌డిఎ చట్టం రద్దు చేయాలనే నిర్ణయం చెల్లదని   తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఉన్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. మరో వంక గత ఏడాది నవంబరు 22న సిఎం జగన్‌ అసెంబ్లీలో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అడ్వకేట్‌ జనరల్‌ ఈ అంశాన్ని హైకోర్టుకు తెలిపారు. అయితే, మళ్లీ న్యాయనిపుణుల సలహాతో మెరుగైన పద్ధతిలో మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని ప్రభుత్వం ఆ తర్వాత చేసిన ప్రకటన రైతుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించింది. రైతులు రెండవ విడత  పాదయాత్రతో ఆందోళన ఉదృతం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్నవిధంగా, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులదే నేరం, రైతులదే పాపం అన్నట్లుగా విమర్శలకు, దాడులకు దిగుతున్నారు. రైతులు చేస్తోంది ఉన్మాద యాత్ర అని వైసీపీ నేతలు అంటున్నారు.  రైతులు పాదయాత్ర చేస్తే దాడులు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే, రైతులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అంతే కాదు, ఒక్క వైసేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజాసంఘాలు అమరావతి రైతులు చేస్తున్న ధర్మ  పోరాటానికి మద్దతు ఇస్తున్నాయి. మరో వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత, తొందరపాటు నిర్ణయాల వల్లనే నవ్యాంధ్ర రాజధాని లేని రాష్ట్రంగా మిగిలి పోయిందని ప్రజలు ఆవేదన, ఆగ్రహం వ్యకపరుస్తున్నారని, ఈ ఆవేదన, ఆగ్రహం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎందుకీ మౌనం.. షర్మిల విమర్శలపై తెరాస సైలెన్స్ కు కారణమేమిటి?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కుమార్తె, అవశేష ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్  టీపీ పార్టీ స్థాపించి సంవత్సరం దాటింది. గత సంవత్సరం (2021) జులై 8 న, ఆమె పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు, ఆమె రాజకీయాల్లో కొంత క్రియాశీలంగానే  ఉన్నారు. అయినా ఇంకా పార్టీకి ఒక స్వరూపం, స్వభావం అంటూ ఏదీ ఏర్పడలేదు. నిజానికి, ఆమె పార్టీలో ఇతర నాయకులు ఎవరన్నా ఉన్నారో లేదో కూడా తెలియదు. ఒక విధంగా షర్మిల సింగిల్ విమెన్ ఆర్మీగానే పార్టీని నడుపుతున్నారు.  షర్మిలకు రాజకీయాలు కొత్త కాదు. రాజశేఖర రెడ్డి కుమార్తేగానే కాదు, జగన్ రెడ్డి సోదరిగానూ, ఆమె రాజకీయ ఆటు పోట్లను రుచి చూశారు. రాజశేఖర రెడ్డి ఉన్నంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించక పోయినా, ఆయన మరణం తర్వాత, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ, స్థాపించిన తర్వాత షర్మిల పార్టీ వ్యవహరాల్లో చురుకైన పాత్రను పోషించారు. నిజానికి ఈ రోజు ఏపీలో వైసీపీ అధికారంలో ఉందంటే అందుకు కొంతవరకు షర్మిల కుడా కారణం. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్ళిన సందర్భంలో అంతవరకు ఆయన సాగిస్తున్న పాదయాత్రను షర్మిల కొనసాగించారు. జగనన్న వదిలిన బాణం అంటూ దూసుకు పోయారు. ఒక విధంగా జగన్ రెడ్డి జైల్లో ఉన్న 16 నెలల కాలంలో వైసీపీని విజయమ్మ చేదోడుగా షర్మిల బతికించారు.  అయితే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏమైందో ఏమో కానీ, అన్నా చెల్లీ మధ్య దూరం పెరిగింది. నిజానికి అన్నాచెల్లీ మధ్యనే కాదు, తల్లీ కొడుకు మధ్య కూడా దూరం పెరిగింది. ఈ నేపధ్యంలోనే షర్మిల నిరీక్షించినంత కాలం నిరీక్షించి, ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో కానీ, చివరకు జగన్ రెడ్డితో రక్త బంధాన్ని కాకపోయినా, రాజకీయ బంధాన్ని తెంచుకున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి చేరి, తెలంగాణలో, వైఎస్సార్ టీపీ ( వైఎస్సార్ తెలంగాణ పార్టీ) స్థాపించారు.  అయితే ఆమె ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారు ? అన్న జగన్ రెడ్డితో ఆస్తి  తగవో, రాజకీయ వివాదమో ఏదైనా ఉంటే,ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే, ఆమె పార్టీ పెట్ట వలసింది, అన్నతో పోరాడ వలసింది, ఏపీలో కదా? తెలంగాణ రాజకీయాలకు  పూర్తిగా గుడ్ బై చెప్పిన తెలంగాణలో పార్టీ పెట్టడంలో ఆమె ఉద్దేశం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అప్పుడూ ఇప్పుడు కూడా అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం వెనక,ఎ వరెవరిదో ప్రమేయం, ఏవేవో వ్యూహాలు ఉన్నాయని అనేక కథనాలు కూడా మీడియాలో వినిపించాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఆమె పార్టీ వెనక అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు మొదలు తెరాస, బీజేపీ పార్టీల వరకు ఎవరి హస్తమో  ఉందని, అసలు జగన్ రెడ్డే, ఆమె వెనక ఉన్నారనే ప్రచారం కూడా  జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది.   సరే, అదంతా  ఒకెత్తు అయితే, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ బయలు దేరిన షర్మిల రాష్ట్రంలో అంచెలంచెలుగా  పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె అలా మూడు విడతల్లో కలిపి 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఇంకా కొనసాగిస్తున్నారు.  అయితే, ఆమె పాద యాత్ర చేయడం ఒకెత్తు అయితే, పాద యాత్ర పొడుగునా ఆమె తెరాస ప్రభుత్వం పై కత్తులు దూస్తున్నారు. శూలాల్లా గుచ్చుకునే పదునైన బాణాలు సంధిస్తున్నారు. ముఖ్యమత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ వీళ్ళు వాళ్ళని కాదు, మంత్రులు తెరాస నాయకులు ఎవరినీ వదిలి పెట్ట కుండా, అందరినీ టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తీ గత విమర్శలూ గుప్పిస్తున్నారు.  అయితే చిత్రం ఏమిటంటే, దేశ ప్రధాని, రాష్ట్ర గవర్నర్ సహా తమకు ప్రత్యర్ధులు అనుకున్న ప్రతి ఒక్కరినీ, పొట్టు పొట్టున ఎండగట్టే  తెరాస నాయకులు, ఆమె ఎవరని ఎంత  దూషించినా దుర్భాషలాడినా పెదవి విప్పడం లేదు. చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ ని దూషించినా తెరాస నాయకులు ఎవరూ ఆమె విమర్శలకు సమాధానం కూడా ఇవ్వడం లేదు. కొద్ది రోజుల క్రితం మంత్రి నిరంజన రెడ్డి నియోజకవర్గం వనపర్తికి వెళ్లి మరీ, మత్రిని, ముఖ్యమంత్రిని కలిపి, చాలా తీవ్రమైన విమర్శలు చేశారు.ఆ ఇద్దరిదీ మందు బంధమని, ఒకరు పోసే వారు ఒకరు తాగేవారు, అంటూ తీవ్ర ఆరోపణ చేశారు.గతంలో మంత్రి తనను  ఉద్దేశించి ‘మంగళవారం మరదలు’ అంటూ చేసిన వ్యాఖ్యలకు, అప్పుడే ఆయన క్షమాపణలు చెప్పినా, వదలకుండా ‘ఎవడ్రా మరదలు, చెప్పు దెబ్బలు తింటావ్’ అంటూ ఘాటుగా మండిపడ్డారు.అయినా, మంత్రి సహా తెరాస నాయకులు ఆ స్థాయిలో రీయాక్ట్ కాలేదు. అందుకే అందరినీ ఎండగట్టే కేసీఆర్, కీటీఆర్ సహా తెరాస నాయకులు ఒక్క షర్మిల విషయంలో మాత్రమే ఎందుకు, ‘మర్యాద’ పాటిస్తున్నారు? అంటే, షర్మిల వలన తెరాసకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఆమెకు ఓట్లే తప్ప సీట్లు వచ్చే అవకాశం లేదు. ఒక వేళ ఒకటో రెండో సీట్లు వచ్చినా, గతంలో జగనన్న పార్టీ వైసీపీ టికెట్ పై ఖమ్మం జిల్లానుంచి గెలిచిన ఒక ఎంపీ,  ఒకరో, ఇద్దరో ఎమ్మెల్ల్యేలకు గులాబీ కండువా కప్పినట్లే ఆ ఒకరిద్దరిని కుడా తమ గూటికి తెచ్చుకోగాలమనే ధైర్యం కావచ్చును, ఆమె విమర్శలను అంతగా పట్టిచుకోవడం లేదని అంటున్నారు. అలాగే, ఆమెకు వచ్చే ఓట్లు కూడా, తెరాస వ్యతిరేక ఓట్లే. అంటే  ప్రతిపక్ష ఓటును షర్మిల చీల్చి పరోక్షంగా తెరాసకే మేలు చేస్తారు. అందుకే., ఆమె తిట్లను, విమర్శలను తెరాస నాయకులు  దీవెనలుగా తీసుకుంటున్నారని, అంటున్నారు. ఎంతవరకు నిజమో ఏమో కానీ, ఆమె పాదయాత్రకు స్పాన్సర్లను స్పాన్సర్ చేసింది కూడా .. తెరాస నాయకులే అని,అంటున్నారు.

దా..తిను..అమ్మరాదులే..! 

పక్షులు,జంతువుల‌కు మ‌నిషితో చిత్ర‌మైన సంబంధం ఉంద‌న్న‌ది పురాణ‌కాలం నుంచి వింటున్నాం. మ‌చ్చిక చేసుకోవాలేగాని జింక‌పిల్ల‌, కుక్క‌పిల్ల మాత్ర‌మే కాదు  పులి పిల్ల‌నీ పెంచుకోవ‌చ్చ‌ని  జంతు ప్రేమికుల మాట‌. ఈ పాప ఎవ‌రోగాని జింక‌పిల్ల‌కు ఏదో తినిపిస్తోంది. చూస్తే అచ్చం డిస్నీ సీరియ‌ల్‌లో సీన్ గుర్తు చేస్తోందిక‌దా!  ఆమ‌ధ్య‌నే ఓ రోజు మ‌ధ్యాన్నం ఆ పాప ఆరుబ‌య‌ట ఆడుకుంటూంటే, ఈ బుజ్జి జింక పిల్ల చెంగు చెంగు నా ఎగురుకుంటూ వ‌చ్చింది. ముందు భ‌యం భ‌యంగా చుట్టూ చూసింది. ఈ చిన్నారి ఆడ‌టం చూసి ఏమ‌ను కుందో తెలీదు క‌ద‌ల‌కుండా అలానే చూస్తుండిపోయింది. క్ష‌ణం త‌ర్వాత పాప దాన్ని ద‌గ్గ‌ర‌కు పిలిచింది. గ‌తంలో మంచి స్నేహితురాలు పిలిచిన‌ట్టు మెల్ల‌గా ద‌గ్గ‌రికి వెళ్లింది జింక పిల్ల‌. మామూలుగా దాని ఫ్రెండ్ పింకీ అయితే .. ఇవాళ స్కూలుకి వెళ్లావా, హోంవ‌ర్క్ ఏమిచ్చార‌నే అడిగేదేమో!  కానీ, జింక పిల్ల పెద్ద క‌ళ్ల‌తో చూసిన‌పుడు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన‌పుడు దాని త‌ల‌మీద నిమిరి అవేమీ అడ‌గ‌లేదు. రెండు ఆకులు తెంపి పెట్టింది. అది భ‌యం భ‌యంగా అటూ ఇటూ చూసి పాప వెళ్ల‌ని ముద్దాడి ఆకులు తీసుకుంది. ఫ‌ర‌వాలేదులే.. అమ్మ ఇంట్లో లేదు.. ధైర్యంగా తిను అన్న‌ట్టు పాప జింక పిల్ల‌ను ప్రేమ‌తో ముద్దాడి పంపింది. ఇది గ‌దా మాన‌వ‌త్వం అంటే  అన్నారు నెటిజ‌న్లు. వీళ్ల స్నేహం కొన‌సాగాల‌ని ఆశిద్దాం!

తెరాసలో అసమ్మతి ఆరున్కొక్కరాగం.. కారు పార్టీలో కలహాల కాపురం

తెలంగాణలో అధికార పార్టీయే రెండు పాత్రలు పోషిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అవును నిజమే రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ అనే పరిస్థితి ఉంది.  ఆశ్చర్యం లేదు.. ప్రస్తుతం తెలంగాణలో అధికారపార్టీ  నాయకులే ప్రతిపక్షం పాత్ర కూడా పోషిస్తున్నారు. గులాబీ దళంలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ తార స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాయకులకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచ్ లకు, సీనియర్లకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని తెరాస శ్రేణులే చెబుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గల్లో టిఆర్ఎస్ కు సొంతపార్టీ నేతలే ప్రతిపక్ష నేతలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.  దీంతో అధికారిక, పార్టీ కార్యక్రమాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాండూరులో మొదలైన ఈ కుమ్ములాటలు ఆ జిల్లా అంతటా పాకాయి. రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ శ్రేణులు బహిరంగంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇటీవల తాండూరులో నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ర్టమంత్రి హరీశ్ రావు, అక్కడి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలపై అసహనం వ్యక్తంచేయడం స్థానిక పరిస్థితులకు అద్దం పట్టింది. జిల్లాలోనూ ఇదే సీన్ కొనసాగుతోంది. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్, కొల్లాపూర్, మహేశ్వరం, మేడ్చెల్, ఉప్పల్, భువనగిరి, నకిరేకల్, మునుగోడు ఇలా ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గ పోరు పతాక స్థాయిలో సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు వైరి వర్గాలు విడివిడిగా హాజరుకావడం.. వ్యక్తిగత దూషణలకు దిగడం  పరిపాటిగా మారింది. మరో వైపు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా ఎక్కడైనా పాలక, ప్రతిపక్షాలు గొడవలు పడుతుంటాయి. అధికార పక్షం అవునంటే.. ప్రతిపక్షం కాదంటుంది. ప్రతిపక్షం ఇదంటే అధికార పక్షం అదంటుంది కానీ పలు జిల్లాలోని టిఆర్ఎస్  నాయకుల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య  భారీగానే ఉన్నది. అధికార పార్టీ ప్రస్తుత ప్రజాప్రతినిధులతో సొంత పార్టీకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు నాదంటే.. నాదేనంటూ బహిరంగ ప్రకటనలకు చేస్తున్నారు. పార్టీ కూడా రెండు గ్రూపులుగా విడిపోతుంది.  రానున్న ఎన్నికల్లో అధికార పక్షాన్ని సొంత పార్టీలో టిక్కెట్టు ఆశావాహులే ఓడించే పరిస్థితి పలు నియోజకవర్గాలలో నెలకొన ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్టు రానివారంతా పార్టీలు మారి టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రత్యర్థులుగా నిలబడే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ టీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. వికారాబాద్ లో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు పట్నం వర్గంతో జత కట్టడంతో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు వర్గ పోరు మొదలైంది. ఇక ఎమ్మెల్యే వర్గీయులు ఇటీవల జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకోవడంతో పార్టీ కేడర్ మధ్య విభేదాలు రోడ్డెక్కాయి.  పరిగి నియోజకవర్గంలోనూ  డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా అధికార పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి వారే వేరువేరుగా పార్టీ  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్థన్ రెడ్డిల మధ్య విభేధాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. నకిరేకల్ నియోజకవర్గంలో చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశంకు మధ్య వార్, అలాగే భువనగిరి నియోజకవర్గంలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిల మధ్య టిక్కెట్టు పోరు,  మహేశ్వరంలో తీగల క్రిష్ణారెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డిల మధ్య విభేదాలు ఇలా ఎక్కడ చూసినా తెరాసలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు పార్టీకి తలనొప్పులుగా మారాయి. త్వరలోనే ఉప ఎన్నిక జరుగబోతున్న మునుగోడులోనూ రెండు వర్గాలు టిక్కెట్టు విషయంలో తీవ్ర స్థాయిలో పోటీ పడుతుండటంతో అక్కడ ఇంకా ఎవరికీ టికెట్ ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి పార్టీ ప్రతిష్టను ప్రజలలో పలుచన చేస్తున్నది. 

జ‌గ‌న్ కి  జైలే...మాజీ న్యాయ‌మూర్తి  జ‌స్టిస్ గోపాల గౌడ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విష‌యంలో అమీతుమీ తేల్చుకోవ‌డానికి రైతాంగం ఉద్య‌మ‌బాట చేప‌ట్టారు. అది ఇప్ప‌టికి వెయ్యిరోజులు పూర్తిచేసుకుంది. రాజ‌ధాని విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును జ‌గ‌న్ ప్ర‌భు త్వం కావాల‌నే ఉల్లంఘించి, మూడు రాజ‌ధానుల ఆలోచ‌న‌ను తెర‌మీద‌కి తెచ్చింది. దీని పై ప్ర‌జ‌లు, రైతాంగం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు హైకోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత సుప్రీంకోర్టుకీ వెళ్ల‌కుండా ఊరుకున్న జ‌గ‌న్ స‌ర్కార్ హైకోర్టు తీర్పును కాద‌న‌డంలో  ప్ర‌జ‌ల్ని, రైతాంగాన‌ని మోసం చేస్తోంద‌న్న భావ‌న స‌ర్వ‌త్రా ఏర్ప‌డింది.  తాజాగా మాజీ న్యాయ‌మూర్తి, మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా జ‌గ‌న్ స‌ర్కార్ తిక్క ఆలోచ‌న‌లు, వ్య‌వ హార‌శైలికి విసిగెత్తి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై మండిప‌డ్డారు.  మూడు రాజ‌ధానుల‌పై చ‌ట్టం చేసే హ‌క్కు రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేదని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. కానీ  ఆ తీర్పును ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తో పాటు, సంబంధిత మంత్రి ని, సీఎస్‌ల‌కు  జైలు శిక్ష విధించాలని విశ్రాంత న్యాయ‌మూర్తి వి.గోపాల గౌడ అన్నారు. తానే గ‌నుక ఆ కేసును విచారిస్తుంటే సీఎం జ‌గ‌న్‌ను జైలుకు పంపేవాడిన‌ని గోపాల గౌడ అన్నారు.  ఎవ‌రికి న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా అమ‌రావ‌తే ఏపీ రాజ‌ధాని అని, ఈ విష‌య‌మై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమ‌లు చేయ‌డం త‌ప్ప ఏపీ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యామ్నాయం లేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్యద‌ర్శి ఎల్.వి. సుబ్ర‌హ్మ‌ణ్యం అన్నారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంను ఆశ్ర‌ యించ‌లేదు గ‌నుక హైకోర్టు తీర్పే శిరోధార్య‌మ‌వుతుంద‌న్నారు. మూడు రాజ‌ధానుల‌ని సీఎం, మంత్రులు అంటున్నారు గాని దానికి చ‌ట్ట బ‌ద్ధ‌త‌ ఉండ‌ద‌ని సుబ్ర‌హ్మ‌ణ్యం అన్నారు.  రాజ‌ధాని నిర్మాణానికి భూస‌మీక‌ర‌ణ నుంచీ ప్ర‌ణాళిక రూప క‌ల్ప న వ‌ర‌కూ సుబ్ర‌హ్మ‌ణ్యం ప‌రిశీలించారు. అలాంటి  సుబ్ర‌హ్మ‌ణ్యం  జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.  ప్ర‌భుత్వ వాద‌న ల‌న్నీ విన్న త‌ర్వాతే కోర్టు తీర్పు ఇచ్చింది.  తీర్పు అర్ధంకాద‌ని అన‌డం దాన్ని  క్షుణ్ణంగా ప‌రిశీలించ లేద‌నే అర్ధాన్ని సూచిస్తుంద‌న్నారు. సీఎం, మంత్రులు తాము చెప్పిందే అమ‌లు చేస్తామ‌న‌డం హేయ మ‌న్నారు. 

ఫేక్ లోన్ యాప్స్ జాబితా ఇది.. బీకేర్ ఫుల్!

లోన్ యాప్స్ మోసానికి గురై ఎందరో బలవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే, ఇంకొందరు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. మొత్తం మీద లోన్ యాప్స్ రుణాలు తీసుకున్న వారి జీవితాలను ఛిన్నా భిన్నం చేస్తున్నాయి. లోన్ యాప్ ల అరాచకాలు, అకృత్యాలు పెచ్చుమీరుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వాటిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫేక్ లోన్ యాప్ ల జాబితాను విడుదల చేసింది. ఈ ఫేక్ లోన్ యాప్ ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నది. ప్రభుత్వం విడుదల చేసిన ఫేక్ లోన్ యాప్ ల జాబితా ఇలా ఉంది. UPA Loan Mi Rupe Rupee Loan Cash Park Loan Rupee Box Asan Loan Cash Pocket Cash Advance Loan Home Small Lend Mall Easy Loan UPO Loan.com My Cash Loan Minute Cash Hand Cash  Friendly Loan Early Credit App rich cash SUN CASH onstream Insta money money stand pro Forpay app cashpal Loanzone ATD lone Cash curry 66 cash Daily Lone Handy loan Express Loan Rupee Star First Cash Rich Fast Rupee Apna Paisa Loan Cube Wen Credit Bharat Cash Smart Coin Cash Mine Cash Machine Loan Goldman Payback One Loan Cash Any Time Flash Loan Mobile Hoo Cash Small Loan Live Cash Insta Loan Cash Papa | Credit Silver Pocket Warn Rupee Buddy Loan Simple Loan Fast Paisa Bellono Loan Eagle cash loan App fresh loan Minute cash Kash loan Slice pay Pokemoney Rupeeplus fortune now Fast coin tree lone cash machine koko loan Rupiya bus More Cash Koko Loan Cash Carry App Betwinner betting Bus rupee Small Loan loan cube Quality Cash Dream loan credit wallet star loan Balance lone cash pocket live Cash Loan Resource(disi) Rupeeking Loan Dream Wow Rupee Clear Loan Loan Go Loan Fortune Coin Rupee Hand Cash Samay Rupee Money Master Lucky Wallet Tyto Cash For Pay Cash Book Reliable Rupee Cash Cash park Rupee mall ob cash loan Rupiya bus I karza loan loji cash star miniso rupee pocket bank Easy Credit cash bowl Cash Cola Orange Loan Gold Cash Angel Loan Loan Sathi Sharp Loan Sky Loan Jo Cash Best Paisa Hello Rupee Holiday Mobile Loan Phone Pay Plump Wallet Cashcarry Loan App Crazy Cash Quick Loan App Rocket Loan Rupee Magic Rush Loan Bellono Loan App Agile Loan app Income Cash advance 1 Easy Borrow Cash loan IND loan Wallet Payee Cash Guru App Cash Hole Mo Cash

యుఎస్ ఓపెన్ విజేత అల్క‌రాజ్‌

స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఒపెన్ 2022లో పురుషుల టెన్నిస్ విభాగంలో తొలి గ్రాండ్ స్లామ్  కిరీటాన్ని అతి పిన్న వయస్కుడైన కార్లోస్ అల్క‌రాజ్  దక్కించుకున్నాడు. 19 ఏళ్ల కార్లోస్ అల్క రాజ్ న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్‌లో కాస్పర్ రూడ్‌ను 4 సెట్లలో ఓడించాడు.  ర్యాంకింగ్స్ చరిత్రలో నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి యువకుడిగా నిలిచాడు.  యూఎస్ ఓపెన్ విజయంతో కార్లోస్ అల్కరాజ్ 2005లో రాఫెల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచారు.అల్కరాజ్ కంటే ముందు 2001లో 20 సంవత్సరాల 9 నెలల వయస్సులో లేటన్ హెవిట్ అతి పిన్న వయస్కుడైన ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. స్పెయిన్‌ యువ సంచలనం అల్కరాజ్, 23 ఏళ్ల నార్వే ఆటగాడు రూడ్ ఫైనల్లో తలపడ్డారు. తొలి సెట్ ను అల్కరాజ్  6-4 నెగ్గి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. రెండోసెట్‌లో నార్వే ప్లేయర్ రూడ్‌ విజృంభించి, 4-2తో అధిక్యంలో నిలిచాడు. 6-2 తేడాతో ఆ సెట్‌ను నెగ్గి సమం చేశాడు. మరో ఛాన్స్ ఇవ్వకూడదని భావించిన రూడ్ ఆధిక్యం ప్రదర్శించగా.. అల్కరాజ్ 6-6 తో స్కోర్ సమం చేయడంతో ఈ సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. చివరగా 7-1 (7-6) తేడాతో అల్కరాజ్‌ మూడో సెట్ నెగ్గాడు. కీలకమైన నాలుగో సెట్‌లో రూడ్‌కు అల్కరాజ్ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. 6-3 తేడాతో నాలుగో సెట్ నెగ్గి కెరీర్‌లో తొలిసారి యూఎస్‌ ఓపెన్ టైటిల్ సాధిం చాడు. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ నెగ్గిన అల్కరాజ్‌ను టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో నెంబర్ వన్ ర్యాంకు వరించింది. 

దారి మళ్లించిన  నిధుల మాటేమిటి జ‌గ‌న్?

తండ్రి ఇస్తున్నాడ‌ని పెద్ద‌వాడు ఖ‌ర్చుచేసేస్తుంటే చిన్న‌వాడికి అందేదెలా? త‌మ్ముడికీ కోపం వ‌స్తుంది. పెద్ద‌వాడు లెక్క‌ప‌త్తా లేకుండా ఖ‌ర్చుచేసేయ‌డం గురించి తండ్రి అడ‌గ‌కూడ‌దు, త‌మ్ముళ్లూ అడ‌గ‌వ‌ద్దం టే ఎలా కుదురుతుంది. ఏదో రోజు తండ్రికి లెక్క‌జెప్పాలి, బంధువుల ప్ర‌శ్న‌ల‌కీ స‌మాధానం చెప్పాలి గ‌దా. కోట్ల‌లో దారి మ‌ళ్లించేస్తే,  త‌ర్వాత ఇస్తాడులే అనుకున్నాకుద‌ర‌దు. ఇపుడు ఏపీ ప్ర‌భు త్వం విష‌ యంలో ఇదే చిత్రం న‌డుస్తోంది. ప్రాయోజితపథకాల కోసం రాష్ట్రానికి వచ్చిన రూ.3,824  కోట్లు దారి మళ్లాయి. ఇంతవరకూ ఆ మొత్తాన్నిపథకాలు అమలు ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. దీనికితోడు, కేంద్రపథకాలకు అనుగుణంగా రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులనూ విడుదల చేయ ట్లేదు. ఫలితంగా కేంద్రం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు రాష్ట్ర ప్రజలకు దక్కడం లేదు.  కేంద్రసాయంతో, కేంద్రం అందించే రుణంతో చేపట్టే ప్రాజెక్టులూ రాష్ట్రంలో పట్టాలెక్కడం 2021-22 ఏడా ది మొత్తంలోనూ, 2022-23 ఆర్థికసంవత్సరం తొలి ఐదు నెలల్లోనూ కేంద్రం రూ.3,824 కోట్లను రాష్ట్రానికి ఇచ్చింది.  ఆ నిధులను ఇప్పటి వరకూ సంబంధిత పథకాల అమలు ఏజెన్సీలకు ఇవ్వలేద ని స్వయం గా కేంద్ర ఆర్థికశాఖ కార్య దర్శి సోమనాథన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల కేంద్ర పథకాలేవీ స‌క్ర‌మంగా అమ‌లు కావట్లేదని ఆయన రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ ద్వారా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమూ తన వాటా నిధులను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలతో క్షేత్ర కేంద్ర పథకాలను అనుసంధానించగలిగిన వాటి పైనే ప్రస్తు తం రాష్ట్రం ఆసక్తి చూపుతోంది.  2022-23 బడ్జెట్ సిద్ధం చేసేటప్పుడే రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఈ విషయాన్నిఅన్ని ప్రభు త్వశాఖల అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర పథకాలతో అనుసంధానం కాకుండాఉన్న కేంద్ర పథకాలను అమలుచేయాలంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి స్థాయిలో అనుమతి తీసుకోవాలన్న నిర్ణ యం గ‌తంలోనే జరిగింది. అప్పటినుంచి కేంద్ర పథకాల అమలు, రాష్ట్రంవాటా నిధులిచ్చే అంశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, జైకా సాయంతో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, ప్రపంచ బ్యాంకు సాయంతో చేపట్టే ప్రాజెక్టులకూ రాష్ట్రం తన వాటా నిధులు ఇవ్వకపోవ డంతో అనేక కీలక ప్రాజెక్టులూ పట్టాలకు ఎక్కట్లేదు.  రాష్ట్రంలో చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల్లో కేంద్రంకొన్నింటిలో 90%, మరికొన్నింటిలో 75%, 60% వరకూ తన వాటా నిధులిస్తోంది. వీటికిరాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వాటా భరించాలి. ఏటా కేంద్రం నుంచి ఇలాంటి నిధులు సుమారు రూ.20వేల కోట్లు వస్తాయని అంచనా. రాష్ట్ర వాటా రూ.12వేల కోట్ల వరకు ఇవ్వాలని చెబుతు న్నారు

వైసీపీ అసంతృప్తుల చూపు జనసేన వైపు!?

వైసీపీలో అసంతృప్తి నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎంత సేపూ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే కారణమని చెబుతూ ఉండటం, వచ్చే ఎన్నికలలో ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు పార్టీ టికెట్లు ఇచ్చేది లేదని ప్రకటనలు చేస్తుండటంతో ఎమ్మెల్యేలు, నాయకులలో అసంతృప్తి గూడు కట్టుకుంటున్నది. ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించకుండా ఎంత సేపూ తమనే ప్రజల ముందు పని చేయని నేతలుగా నిలబెట్టడం పట్ల వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే వారు పక్క చూపులు చూస్తున్నారని పార్టీ శ్రేణులే బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్న పరిస్థితి ఏదో ఒకటి రెండు నియోజకవర్గాలకే పరిమితం కాలేదనీ, రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉందనీ చెబుతున్నారు. తాజాగా కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ నేత, గత రెండు ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బొంతు రాజేశ్వరరావు జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యుఎస్ మాజీ సలహాదారు అయిన బొంతు రాజేశ్వరరావు హైదరాబాద్ లో జనసేన కార్యాలయానికి వెళ్లి మరీ పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయమని వైసీపీ, జనసేన వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఒక్క బొంతు రాజేశ్వరరావు అనే కాకుండా వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు పలువురు జనసేన వైపు చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  ఈ పరిస్థితి దాదాపు ఏపీ వ్యాప్తంగా ఉందంటున్నారు. అసలు వైసీపీ అసంతృప్తులు మొదటిగా తెలుగుదేశం వైపే చూడాల్సి ఉన్నప్పటికీ, ఇంత కాలం ఆ పార్టీపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆ పార్టీలో తమకు సముచిత స్థానం లభిస్తుందా అన్న అనుమానం వారిలో ఉండటంతోనే జనసేన వైపు చూస్తున్నరని కూడా అంటున్నారు. అదీ కాక తెలుగుదేశం పార్టీలో  చేరినా, ఆ పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్న నాయకులను కాదని తమకు చాన్స్ రాదన్న అనుమానం కూడా వారిని జనసేన వైపు చూసేలా చేస్తోందని అంటున్నారు.  ఇటీవలి కాలంలో జనసేనలోకి  చేరికలు ఎక్కువగా వైసీపీ నుంచే ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  గుడివాడ నుంచి కొడాలి నాని సన్నిహితులుగా పేరు పడిన పాలంకి బ్రదర్స్ ,. తాజాగా రాజోలు నియోజకవర్గం నుంచి గత రెండు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు జనసేన గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఇటీవల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామిరెడ్డి అనే వైసీపీ నేత కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు.  వైసీపీకి చెందిన మరి కొందరు నేతలకు కూడా జనసేనతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. 

వైసిపి ఎమ్మెల్యే ల్లో తీసివేత‌ కలవరం

పిల్ల‌డు స‌రిగా చ‌ద‌వ‌క‌పోయినా, క్లాసులో బాగా అల్ల‌రిచేస్తున్నా భ‌రించ‌లేక‌పోతే క్లాసులోంచి బ‌య‌ట‌కి పంపుతారు. టీచ‌ర్లు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే హెడ్‌మాస్ట‌ర్ హెచ్చ‌రిస్తాడు. ప‌నివాడు స‌రిగా రాకుంటే య‌జ మాని తీసేస్తాడు. ఏపీలో సీఎం జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యేల విష‌యంలో ఈ తీసివేత సిద్ధాంతాన్ని అమ‌లు చేయ‌డానికి పూనుకున్నారు. మూడేళ్లు దాటినా ఇంకా విప‌క్షాల‌ను తిడుతూ శ‌భాష్ అనిపించుకోవ‌డం కాకుండా నిజం గా ప‌నిచేస్తున్న‌ది ఎవ‌రు, ఎవ‌రు మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తార‌న్న బేరీజు వేసుకుంటే లెక్క‌లు తిక‌మ‌క పెట్టి గుణ‌కారం కంటే తీసివేతే బాగా న‌చ్చింది. అందువ‌ల్ల వైసీపీ ఎమ్మెల్యేల‌కు నిద్రా భంగం క‌లిగింది. ఇక మంద‌లింపులు, బుజ్జ‌గించ‌డాల మాట అటుంచితే పార్టీ టికెట్ ద‌క్కే అవ‌కాశ‌మే చేజా రేట్టుగా మారిం ది. ప‌నితీరు స‌రిగాలేద‌న్న మిష‌తో సీఎం జ‌గ‌న్  చాలామందిని వ‌దిలించేసుకుందా మ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.  మంత్రివర్గం నుంచి ముగ్గురిని తొలగిస్తానని సాక్షాత్తూ సీఎం చేసిన ప్రకటనతోమంత్రుల్లో ఆందోళన మొద లైంది. అది మరువకముందే పనితీరు సరిగా లేని 75కుపైగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పుపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. ఆర్నెళ్లలోపు శాసనసభ్యుల పనితీరు మెరుగుపడక పోతే మార్పు తథ్య మనే సంకేతాలను సీఎం జగన్ ఇప్పటికే ఇచ్చారు. 2024ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ ఒంటెత్తు పోకడ తో ముందుకు పోతున్నారు. సామాజిక న్యాయం, సంక్షేమని నాదంపైనే జగన్ ఎక్కువగా ఆశలు పెట్టు కు న్నారు. ఓట్ల కోసం ఇప్పటికే చట్టసభల్లో ఆయా అణగారినవర్గాలకు సీట్లు ఇచ్చారనే ప్రచారముంది.   ఏపీలోవైసీపీ మినహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకివస్తున్న తరుణంలో జగన్ సర్కారులో హడా వుడి, ఆందోళన మొదలైంది.  టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే జగన్ కు గడ్డు పరిస్థితులు వస్తాయనేది ఆ మూడు పార్టీల భావనగా కనిపిస్తోంది.  ఇప్పటికే ఒకట్రెండు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకుఅదనపు బాధ్యతల్ని అప్పగించారు. తాడికొండలో వైసీ పీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా,అక్కడ అదనపు సమన్వయ కర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమిం చ డం, దీనిపై అక్కడపెద్దరచ్చ జరగడం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈరచ్చ మరింత పెరిగే అవకాశం ఉంది. జ‌గ‌న్ పాల‌నావ్య‌వ‌హారాలు ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిక‌రంగానే మారింద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి. అందుకు ఉదాహ‌ర‌ణే ఎమ్మెల్యేల‌కు సీఎం అపాయింట్‌మెంట్ ల‌భించ‌క‌పోవ‌డం. మూడేళ్ల నుంచి ఆయ‌న్ను క‌లిసి స‌మ‌స్య‌లు చ‌ర్చించే అవ‌కాశం ఇవ్వకపోవడంపై శాసనసభ్యులు జగన్ పై అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు.  ఆయా నియోజకవర్గాల అభివృద్ధి పనులు, సమస్యల్ని అధి నేతకు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో రాబోయే ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలనేదీ వారికి దిక్కుతోచడం లేదు. గత ఎన్నికల సమయంలో స్థానికంగా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు పరిష్కారానికి నోచుకోనందున, వారంతా అసంతృప్తిగా ఉన్నారు. జిల్లాల్లో మంత్రు లు, ఎంపీల ఆధిపత్యపోరుతో అభివృద్ధి కుంటు పడింది. దీని పరిష్కారంలో సమన్వయ కర్తలు విఫలమయ్యారు. సీఎంను నేరుగాకలిసేస్థాయి పట్టుమని పది మందికి కూడా లేదనే విమర్శలు న్నాయి.  ఈ క్రమంలో వైసీపీలో ఎలా స‌ర్దుకుపోవాల‌న్న‌ది ఎమ్మెల్యేలకు అర్ధం కావడం లేదు. అటు నియోజకవర్గా ల్లోనూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్యసమన్వయం కొరవడింది. ఎంపీలు, మంత్రులకూవిభేదాలు పొడ చూపుతున్నాయి. మధ్యలో ప్రజలు నలిగి పోతున్నారు. అభివృద్ధిపై జగన్ సర్కారు నిర్లక్ష్యంజగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక, ఈ మూడేళ్లలో కేవలం సంక్షేమం పైనే దృష్టి సారించి, అభివృద్ధిని విస్మ రించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణంపైచిన్నచూపు ప్రద ర్శించారు. మరోవైపు, సంక్షేమం అందిస్తున్నామని చెబుతూనే ప్రజలపై విపరీతంగా పన్నుల భారాలు మోపారు. దీనికి తోడు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అంటూ ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు వెళ్లి త‌మ పాల‌న గురించి ప‌థ‌కాల గురించి చెబుతూ ప్ర‌జ‌ల అభిప్రాయాలు, ఆద‌ర‌ణ పొందాల‌న్న ప్ర‌య‌త్నం ఘోరంగా విఫ‌ల‌మ‌యింది. మంత్రు లు, ఎమ్మెల్య‌లేలు ఎటు వెళ్లినా ప్ర‌జ‌లు తిర‌స్క‌రించి వెన‌క్కి పంప‌డం జ‌గ‌న్ సర్కార్‌ప‌ట్ల ప్ర‌జ‌ల విముఖ‌త‌నే తెలియ‌జేసింది.  కేంద్రప్రయోజనాల కోసం చట్టసభల్లో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ వైసీపీఎంపీలు మద్దతిచ్చారు. అయినా కేంద్రంనుంచి అదనంగా చిల్లిగవ్వ రాలడం లేదు. ఈ విధానాలతో వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారు. ఆ ప్రాజెక్టు పరిధిలోని బాధితులకు కేంద్రంనుంచి పునరా వాస ప్యాకేజీ సాధనలోనూ జగన్ సర్కారువిఫలమైంది. ఇవన్నీ జగన్కు ప్రతికూలంగా మారాయి. ప్రభు త్వం పై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే క్రమంలో, వ్యూహాత్మ కంగా ఎమ్మెల్యే సీట్ల మార్పిడి ప్రచారాన్ని వైసీపీ తెరపైకి తీసుకొస్తూ ప్రజల్లో గందరగోళం నింపుతుం దన్న విమర్శలున్నాయి. 

టీఆర్ఎస్ సమస్యేమిటి?..మునుగోడు అభ్యర్థిపై ఎందుకీ సస్పెన్స్?

మునుగోడు టీఆర్ఎస్ కోరుకోని ఉప ఎన్నిక నిజమే. అంత మాత్రాన గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఇంత మల్లగుల్లాలు పడటమేమిటి? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోనికి దిగినా అసమ్మతి చల్లారకపోవడమేమిటి? దేశ రాజకీయాలలోనే చక్రం తిప్పడానికి సిద్ధపడిన నాయకుడు.. సొంత రాష్ట్రంలో, సొంత పార్టీ అభ్యర్థిని అదీ ఒక ఉప ఎన్నికలో పార్టీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇంత సమయం తీసుకోవడమేమిటి? పార్టీలో పరిస్థితి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా లేదనడానికి మునుగోడు అభ్యర్థి ఎన్నికలో తెరాస పడుతున్న ఇబ్బందులు, బుజ్జగింపులకు లొంగని అసమ్మతులే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి అందులో సందేహం లేదు. అంతర్గత కుమ్ములాటలతో నిత్యం సతమతమయ్యే కాంగ్రెస్ కూడా ఏమంత కష్టపడకుండానే, అసమ్మతి భగ్గుమనకుండానే తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేసింది. అయితే  అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. మునుగోడులో గెలిచి తీరుతామంటున్న టీఆర్ఎస్‌కు అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి రాలేకపోతుండటమే ఆ పార్టీ దయనీయ స్థితికి నిలువెత్తు నిదర్శనమని చెబుతున్నారు. . కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీ గతంలో నిర్ణయించింది. మునుగోడులో జరిగిన బహిరంగసభలో ఈ విషయాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటించాలని కూడా భావించారు. కానీ పార్టీలో అసమ్మతి భగ్గుమనడంతో వెనుకంజ వేశారు.  అసలు అభ్యర్థి ప్రస్తావనే లేకుండా ప్రసంగం ముగించేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై పై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవ్వడంతో కేసీఆర్ అభ్యర్థి ప్రకటన విషయంలో వెనుకడుగు వేశారని పరిశీలకులు చెబుతున్నారు.  మునుగోడులో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నుంచి  కర్నె ప్రభాకర్ తో పాటు మాజీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మొత్తం మీద మునుగోడులో బీసీ అభ్యర్థినే నిలబెట్టాలన్న డిమాండ్ టీఆర్ఎస్ లో రోజు రోజుకూ బలపడుతోంది.  అయితే  కేసీఆర్ మాత్రం  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంవైపే మొగ్గు చూపుతున్నారనీ,  కూసుకుంట్ల అభ్యర్థిత్వం విషయంలో  పార్టీ నేతలను బుజ్జగించేందుకు ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  

నేడు రెబల్ స్టార్ కృష్ణం రాజు అంత్యక్రియలు..ఎక్కడంటే?

నటుడు, రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు  అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం(సెప్టెంబర్11) ఉదయం మరణించిన సంగతి విదితమే. ఆయన మరణం టాలీవుడ్ లో తీవ్ర విషాదం మిగిల్చింది.  సినీ, రాజకీయ ప్రముఖులంతా తరలివచ్చి కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కృష్ణంరాజు  పార్థివదేహం జూబ్లీహిల్స్,రోడ్ నెంబర్ 28లోని ఆయన  నివాసం వద్దే  సోమవారం(సెప్టెంబర్12) మధ్యాహ్నం వరకు ఉంచుతారు. ఆ తరువాత హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలోని అయన ఫామ్ హౌస్ లో అధికార లాంఛనాలతో జరుగుతాయి.  మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణం రాజు ఇంటి వద్ద నుంచి ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్రగా మొయినాబాద్ కి తరలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు కనకమామిడిలోని ఆయన ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు  అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.    మధుమేహం, పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూ తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన ఏజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె కొట్టుకునే వేగం విషయంలో చాలా కాలంగా ఆయన సమస్య ఎదుర్కొంటున్నారు. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అలాగే, దీర్ఘ కాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలతో కృష్ణంరాజు ఆసుపత్రిలో చేరారు. కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్‌పై ఉంచినట్టు చెప్పారు. ఆదివారం తెల్లవారు జామున   తీవ్రమైన గుండెపోట రావడంతో ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  1940, జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్న‌త కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.1966లో ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీరంగ ప్రవేశంచేశారు. హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్పటికీ ప్రతినాయకుడిగా కూడా అలరించారు. ఆయ‌న సినీ రంగంలో హీరోగా న‌ట‌జీవితం ఆరంభించినా, త‌ర్వాత విల‌న్‌గానూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన గొప్ప న‌టుడు. అవేక‌ళ్లు చిత్రంలో విల‌న్‌గా త‌నలో ప్ర‌త్యేక‌త‌ను చాటారు.  చిలాకా గోరింక హీరోయేనా ఇంత అద్భు తంగా విల‌నీ పండించింది అనుకున్నారు ఆ రోజుల్లో. తన విలక్షణమైన నటనతో కొంతకాలంపాటు టాలీవుడ్‌ను ఏలిన రెబల్‌ స్టార్‌ 183కుపైగా చిత్రాల్లో నటించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, మనవూరి పాండవులు చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నిర్మాతగా గోపీకృష్ణ బ్యానర్‌లో పలు చిత్రాలు రూపొందించారు.  ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో వెండితెరపై కృష్ణంరాజు చివ‌రిసారిగా కనిపించారు. సినిమాల్లో నటిస్తూనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు.  1998 ఎన్నికల ముందు బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు.   1999లో మధ్యంతర ఎన్నికలలో ఆయన నర్సాపురం నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.  ప్రముఖ సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు  సంతాపం తెలి పారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు  అన్నారు. కేవలం నటునిగానే కాకుండా కేంద్రం మంత్రిగా కృష్ణంరాజు చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకు న్నారు. 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం..తెలుగు వెండితెరకి తీరని లోటని అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆసియాక‌ప్ విజేత శ్రీ‌లంక‌

పాకిస్థాన్‌కు శ్రీ‌లంక చుక్క‌లు చూపించింది. ఫైన‌ల్‌కు ముందు జ‌రిగిన గ్రూప్ చివ‌రి మ్యాచ్‌లో స‌ర‌దాగా ఆడిన‌ట్టు క‌నిపించినా శ్రీ‌లంక జ‌ట్టు చాలా తెలివిగా వ్యూహాత్మ‌కంగా ఆడి ఫైన‌ల్‌కు సిద్ధ‌ప‌డింది. ఫైన‌ల్లో పాక్‌కి తాము గెలిచే అవ‌కాశాలు లేన‌ట్టే క‌న‌ప‌డి శ్రీ‌లంక విజేత‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైన‌ల్‌లో పాకిస్థాన్‌ 23 పరుగుల తేడాతో చిత్తయింది.  ఆసియాకప్‌ ఫైనల్లో ఏడేళ్ల తర్వాత గెలిచిన లంకకిది ఆరో టైటిల్‌. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాట్ చేసిన‌ శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. హసరంగ (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) బ్యాటింగ్‌లోనూ అండగా నిలిచాడు. రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్‌ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్‌ (55), ఇఫ్తికార్‌ (32) మాత్రమే రాణించారు. కరుణరత్నెకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాజపక్స, మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్‌గా హసరంగ నిలిచారు. విజేత లంకకు రూ. కోటి 20 లక్షలు, రన్నర్‌పగా నిలిచిన పాక్‌కు రూ60 లక్షలు దక్కాయి. ఇది పాక్ ఊహించ‌ని మ‌లుపుల‌తో సాగిన ఉత్కంఠ‌భ‌రిత ఫైన‌ల్‌గా చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే కేవ‌లం 58 ప‌రుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీ‌లంక మ్యాచ్ స‌మ‌ర్పించుకుంది అనుకున్నారంతా. పాక్ విజ‌యోత్స‌వాలు చేసుకోవ‌డం ఆరంభించింది. అప్పు డు అస‌లు ఆట మొద‌ల‌యింది. మ‌హా అయితే 120 ప‌రుగులు చేస్తుంద‌నే అనుకున్నారంతా. కానీ ఒత్తిడి లో పాక్ వంటి ప్ర‌త్య‌ర్థుల‌ను ఎలా దీటుగా ఎదుర్కొనాలో చూపించింది శ్రీ‌లంక‌. రాజ‌పాక్సా, హ‌స‌రంగ హీరోలుగ నిలిచారు. 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసి పాకిస్థాన్‌కు స‌వాలు విసిరి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.  171 ప‌రుగుల ల‌క్ష్యం  ఇప్ప‌టివ‌ర‌కూ టోర్నీలో ఎంతో ధాటిగా ఆడుతున్న పాకిస్థాన్‌కు మ‌రీ అధిగ‌మించ‌లేనంత‌ చాలా పెద్ద ల‌క్ష్యం కాదు.  కానీ పాకిస్థాన్‌కు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ల నుండి మంచి ప్రారంభం కావాలి. లంక తొలి ఓవ‌ర్లోనే చిత్రం గా 11 ప‌రుగులు ఇచ్చుకుంది. ఇది పాక్‌కు శుభారంభంగా మారింది. కానీ మూడ‌వ‌ ఓవ‌ర్లోనే స్పిన్న‌ర్ తీక్ష‌ణ వ‌చ్చాడు. వ‌చ్చీ రాగానే బాబ‌ర్‌ను పెవిలియ‌న్ చేర్చాడు. ఆ త‌ర్వాతి బంతికే ఫ‌క‌ర్ జ‌మాన్ కూడా కెప్టెన్‌నే అనుస‌రించాడు. అప్ప‌టికి పాక్ స్కోర్ 22 ప‌రుగులే. ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి కేవ‌లం 37 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. రిజ్వాన్ 16 ఇఫ్తిక‌ర్ 1 ప‌రుగుల‌తో ఉన్నారు. బాబ‌ర్ మ‌ళ్లీ త్వ‌ర‌గానే అవుట‌వ‌డంతో జ‌ట్టు భారం మ‌ళ్లీ రిజ్వాన్ పైనే ప‌డింది. అత‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా ఆడుతూ జ‌ట్టు స్కోర్‌ని ముందుకు తీసికెళ్లాడు. ప‌ది ఓవ‌ర్ల‌లో పాక్ 68 ప‌రుగులు చేసింది. 12వ ఓవ‌ర్లో హ‌స‌రంగా ఏకంగా 13 ప‌రుగులు ఇవ్వ‌డం పాక్‌కి ఎంతో ఆనందం క‌లిగించింది. దీంతో జ‌ట్టు స్కోర్ 88 ప‌రుగుల‌కు చేరు కుంది. రిజ్వాన్ 64 ప‌రుగులు చేశాడు. 13వ ఓవ‌ర్లో మ‌ధుశ‌న్ మూడో బంతికే ఇఫ్తిక‌ర్ దొరికాడు. అత‌ను 31 బంతుల్లో 32 ప‌రుగులు చేశాడు. జ‌ట్టు స్కోర్ 93 ప‌రుగులు చేరుకుంది. పాక్ వంద‌ప‌రుగులు 14.2 ఓవ‌ర్ల‌లో పూర్త‌యింది. ఆ త‌ర్వాత క‌రుణ‌ర‌త్నేకు న‌వాజ్ దొరికాడు. పాక్ స్కోర్ 101 ప‌రుగుల వ‌ద్ద న‌వాజ్ అవుట‌య్యాడు. అప్పుడే రిజ్వాన్ ఒక భారీ సిక్స్ కొట్టి అభిమానుల‌ను ఆనంద‌ప‌రిచాడు.  17వ ఓవ‌ర్లో హ‌స‌రంగ రిజ్వాన్‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించ‌డంతో శ్రీ‌లంక అభిమానుల్లో విజ‌యోత్స‌వం క‌న‌ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కూ ఎంతో ధాటిగా ఆడిన రిజ్వాన్ అవుట‌వ‌డంతో పాక్ ఆశ‌లు కూడా దెబ్బ‌తిన్నాయి. కానీ మహేశ్ తీక్షణతో కలిసి వనిందు హసరంగా బంతితో అద్భుతంగా రాణించాడు.అత‌ను ఉంటే ఆట ముగించేసేవాడే. అత‌ని త‌ర్వాత ఆసిఫ్ కూడా వెనుదిరగ‌డంతో పాక్ 111 ప‌రుగుల‌కు 6 వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత ఓవ‌ర్లో షాదాబ్ కూడా వెనుదిరిగాడు. దీంతో పాక్ ఆశ‌లు గ‌ల్లంత‌ య్యాయి. పాక్ గెల‌వ‌డానికి చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో 51 ప‌రుగులు కావాల్సివ‌చ్చింది. ఇది అసాధ్య‌మ‌ని ప్రేక్ష‌కుల‌కు తెలిసి పోయింది. శ్రీ‌లంక ఆరో ప‌ర్యాయం ఆసియాక‌ప్ గెలిచింది

ఢిల్లీ లిక్కర్ స్కాం.. బీజేపీ ఆరోపణలను వైసీపీ ఖండించదేం?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో జగన్ సతీమణి భారతిపై ఆరోపణలు చేసిన తెలుగుదేశం నేతలపై నోరెట్టుకు పడిపోతున్న వైసీపీ నాయకులు.. అవే విమర్శలు చేస్తున్న బీజేపీ విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారు. జగన్ కూడా తెలుగుదేశం నాయకుల విమర్శలపై స్పందించలేదెందుకని మంత్రులపై ఫైర్ అయ్యారు. కౌంటర్ ఇవ్వకపోతే మంత్రి పదవులు ఊడబీకేస్తానని హెచ్చరికలు చేశారు. కానీ బీజేపీ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదెందుకని మంత్రులను ప్రశ్నించడం లేదు. ఒక విషయంపై ఒక పార్టీ చేసిన విమర్శలపై ఒకలా, మరో పార్టీ చేసిన విమర్శలపై మరోలా వైసీపీ స్పందిస్తున్న తీరులో ఎందుకీ ద్వంద్వ వైఖరి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ  ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారని ఏకంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవలి తన ఏపీ పర్యటనలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై ఖండనకు కాదు కదా కనీసం మాట్లాడేందుక కూడా వైసీపీ మంత్రులు నేతలకు నోరు రాలేదు. అదే సమయంలో అదే విమర్శ చేసిన తెలుగుదేశం నాయకుల మీద మాత్రం జగన్ వార్నింగ్ తరువాత వమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇక తెలుంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం లో విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధం ఉందని మీడియా ముందే ప్రకటించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సైతం ఢిల్లీ లిక్కర్ స్కాం లో వైసీపీలో పై స్థాయిలో ఉన్న వారి హస్తం ఉందని ఆరోపణలకు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై నోరెత్తని వైసీపీ తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శలపై మాత్రం రగిలిపోతోంది. ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కౌంటర్లు ఇవ్వకుంటే మంత్రి పదవులు ఊడబెరికేస్తానంటూ తన పార్టీ వారిని హెచ్చరిస్తున్నారు. ఈ తేడా ఏమిటి. ఒకే రకమైన విమర్శ విషయంలో వైసీపీ రెండు రకాలుగా ఎందుకు స్పందిస్తోంది. బీజేపీ విమర్శలపై మౌనం ఎందుకు?బీజేపీ వారి విమర్శలు ఓకే.. కానీ తెలుగుదేం విమర్శంలు నాట్ ఓకే అన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. వైసీపీ వ్యవహరిస్తున్న ఈ తీరే.. తెలుగుదేశం విమర్శలలో వాస్తవం ఉందన్న భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి తెలుగుదేశం ఆరోపణల కంటే బీజేపీ ఆరోపణలనే వైసీపీ సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వారి వద్ద పక్కా సమాచారం ఉంటేనే కేంద్ర మంత్రి ఆరోపణలు చేస్తారు.  వారి ఆరోపణలకు కౌంటర్ ఇస్తే వారు వెంటనే ఆధారాలివిగో అని బయటపెట్టేస్తారు. అందుకే బీజేపీ విమర్శలపై వైసీపీ నోరెత్తేందుకే భయపడుతోంది. జగన్ సైతం స్వయంగా తన సతీమణిపై ఆరోపణలు చేసినా బీజేపీకి ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని ప్రశ్నించడం లేదు.  రాష్ట్రంలో విపక్షంలో ఉన్న తెలుగుదేశం నేతల విమర్శలకు సమాధానం ఇవ్వడం లేదు కానీ బూతులతో, దూషణలతో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అదీ జగన్ వార్నింగ్ ఇచ్చిన తరువాత. దీంతో తెలుగుదేశం నేతలు తమ విమర్శల స్టైల్ మార్చారు. తాము ఆరోపణలు చేయడం కంటే.. వైసీపీ నేతలపై బీజేపీ ఆరోపణల వీడియోలను చూపుతూ స్పందించే  ధైర్యముందా అంటూ సవాళ్లు విసురుతున్నారు. మామూలుగా సామాజిక మాధ్యమంలో దూకుడుగా ఉండే వైసీపీ మాత్రం ఈ విషయంలో సైలెంట్ అయిపోయింది. దీనిని బట్టే వైసీపీకి కేంద్రం అన్నా, బీజేపీ అన్నా భయం అని అవగతమౌతోంది. వైసీపీ ఎన్డీయేలో లేదు. బీజేపీ వైసీపీకి మిత్రపక్షం కూడా కాదు. అయినా బీజేపీ చేసిన విమర్శలపై స్పందించడానికి నోరు రావడం లేదు. హస్తినలో జరిగిన ఒక సమావేశంలో యధాలాపంగా తెలుగుదేశం అదినేత చంద్రబాబు, ప్రధాని మోడీ ఓ రెండు నిముషాలు మాట్లాడుకుంటేనే ఏపీలో వైసీపీ తన కాళ్ల కింద భూమి కదలిపోయిందన్నంత ఖంగారు పడింది. ఏకంగా రెండు పార్టీల మధ్యా పొత్తు కుదిరిందని నిర్ధారించేసి ప్రెస్ మీట్లు పెట్టేసింది. సకల సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే.. ఆ పొత్తు అనైతికమంటూ మీడియా ముందు అక్కసు కూడా వెళ్లగక్కేశారు. మరి అలాంటి వైసీపీ ఇప్పుడు బీజేపీ చేస్తున్న విమర్శలపై నోరెత్తేందుకు ఎందుకు భయపడుతోంది? ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో వరుసగా బయటపడుతున్న వాస్తవాలపై వణుకు, జంకే కారణమా అన్న సందేహాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక అయిన దానికీ కానీ దానికీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడే విజయసాయి రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో స్వయంగా తన అల్లుడి పేరు ఉందని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఇసుమంతైనా స్పందించకుండా మౌనంగా ఎందుకు ఉన్నారు? నోరెత్తితే తన తలకు చుట్టుకుంటుందని భయపడుతున్నారా? అన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమం వేదికగా నెటిజన్లు సంధిస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ కుంభకోణంలో వైసీపీ పెద్దల పాత్ర ఉందా? అన్న అనుమానాలకు బలం చేకూర్చేదిగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇక విజయసాయి వ్యవహార తీరు ఈ స్కాంలో తన అల్లుడి పాత్రను నిర్ధారిస్తున్నట్లే ఉందని కూడా చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన అల్లుడి పాత్రపై ఆరోపణలు వెలుగుతోనికి వచ్చిన నాటి నుంచీ  విజయసాయి రెడ్డి నోరు మూతపడింది. రోజూ తిట్లతో తనదైన ప్రత్యేక శైలి భాషలో ట్విట్లర్లలో పోస్టుల మీద పోస్టులు పెట్టే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఆశ్చర్యకరంగా ట్విట్లర్ లో కనిపించడమే మానేశారు. ఏదో ఒకటో రెండో ట్వీట్లు చేసినా అవి తెలుగులో కాదు హిందీలో చేస్తున్నారు. అవి కూడా ప్రధాని మోడీని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఉంటున్నాయి. ఇటీవలే.. రాష్ట్రాల అప్పులపై కేంద్రం మాట్లాడిన సందర్బంగా  రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ మోడీ సర్కార్ పై విరుచుకుపడుతూ విజయసాయి చేసిన ప్రసంగం గురించి ఆయన పూర్తిగా మర్చిపోయారనిపించేలా మోడీని పొగుడుతూ ఆయన ట్వీట్లు ఉంటున్నాయి. అవి కూడా తెలుగులో అయితే ఉత్తరాది వారికి, ముఖ్యంగా మోడీకి అర్ధం కావేమో అని హిందీలో ట్వీట్ చేస్తున్నారు విజయసాయి. దీనిని బట్టే తన అల్లుడి విషయంలో విజయసాయి ఆందోళనలో ఉన్నారని అనుకోవలసి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పునాదులు ఏపీలో ఉన్నాయన్న ఆరోపణలు మొదలైన తరువాత విజయసాయి హస్తినను వదలడం లేదని సామాజిక మాధ్యమంలో విజయసాయిని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నా ఆయన స్పందించడం లేదు.  

హూ ని లాక్కెళిపోయిన హైడ్రోజ‌న్ బెలూన్‌!

ఉచిత ప్ర‌యాణం అంటే దూర ప్రాంతాల‌కు వెళ్లే జ‌నాలు ఉన్నా రు. కొత్త కొత్త ప్రాంతాలు తిరిగి రావ‌చ్చ‌న్న స‌ర‌దావారిది. కొంద‌ రు మ‌తిమ‌రుపు ఆభ‌ర‌ణం వ‌ల్ల బ‌స్సులో వేరే ప్రాంతాల‌కు వెళిపో తుంటారు. మ‌రికొంద‌రు మాట‌ ల్లోప‌డి స్టేష‌న్ వ‌చ్చినా గ‌మ‌నిం చు కోరు. అలా వెళుతూం టారు. ఎవ‌రో చెబితేగాని అలాంటి వారికి స్పృహ రాదు. కానీ ఈ చైనా మ‌నిషి హైడ్రోజ‌న్ బెలూన్‌ లో ఏకంగా త‌న ప్రాంతం నుంచి 320 కి.మీ దూరం వెళిపోయాట్ట‌.  చైనా హిలొంచియాన్ ప్రాంతానికి చెందిన రైతు  హు. అత‌నికి పైన్ తోట ఉంది. పైన్ న‌ట్స్ కోయ‌ డానికి హైడ్రోజ‌న్ బెలూన్ ఉప యోగిస్తుంటాడు. అందులో తిరు గుతూ పెద్ద వృక్షాల ఆకులు, గింజ‌లు కోస్తుంటాడు. ఈమ‌ధ్య‌నే ఒక‌రోజు  అత‌ని స్నేహితుడితో క‌లిసి మామూలుగా వెళ్లిన‌ట్టే వెళ్లాడు. కానీ బెలూన్ అత‌న్నిం చీ అదుపుత‌ప్పి దూరంగా వెళి పోయింది. ఇక దాన్ని త‌న ప‌ట్టు లోకి తెచ్చుకోలేక‌పోయాడు  హు.  అంతే అది అలా ఆకాశంలో అది ఏకంగా 320 కి.మీ తీసుకెళిపోయింది. అయితే అత‌నితో ఉన్న మ‌రొక వ్య‌క్తి మ‌రీ ఎత్తు ఎగ‌ర‌డానికి ముందే భ‌యంతో కింద‌కి దూకేశాడు. ఏవో చిన్న గాయాలతో బ‌య‌ట‌ప‌డ్డాడు. కానీ హూ మాత్రం అలా బెలూన్‌లో ఉండిపోయాడు. బెలూన్‌ని కింద‌కి తీసుకురావ‌డానికి అత‌ని అన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంతో హూ ఏకంగా రెండు రోజులు ఆ బెలూన్‌లోనే తిరిగాడు. ఆక‌లి, దాహంతో నీర‌సం వ‌చ్చేసింది. బ‌తుకుతానా లేదా అన్న అనుమానం వ‌చ్చింది. అత‌ని స్నేహి తుడు పోలీసుల‌కు తెలియ‌జేశాడు. వారు, విమాన‌యాన సిబ్బంది అత‌ని కోసం వెదికారు. వారికీ రెండు రోజులు అయితే గాని బెలూన్ అంతదూరం వెళిపోయింద‌ని తెలియ‌లేదు. అయితే అదృష్ట‌వ‌శాత్తూ హూ సెల్‌ఫోన్ ద్వారా అధికారులు హూ ఎంత దూరంలో ఉన్న‌ది తెలుసుకోగ‌లిగారు. హూకి వారు బెలూన్ నుంచి కింద‌కి రావ‌డానికి కొన్ని సూచ‌న‌లు చేశారు. దాని ప్ర‌కారం హూ మెల్ల‌గా దాని వేగం త‌గ్గించ‌గ‌లిగాడు. అలా దాన్ని త‌న కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు.  కానీ అప్ప‌టికే చాలా దూరంలో కింద‌కి వ‌చ్చి ప‌డింది. హూ భ‌యంతో చుట్టూరా చూశాడు. అత‌ను, బెలూన్‌, ఏకంగా చైనా, ర‌ష్యా స‌రిహ‌ద్దుల్లోని ఫాంగ్‌చెంగ్ ప్రాంతంలో ప‌డ్డారు. రెండురోజుల న‌ర‌క‌యాత‌న నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డానని, అందుకు త‌న స్నేహితుడికి ర‌క్ష‌ణ‌శాఖ అధికారుల‌కు ఎంతో కృత‌జ్ఞుడిన‌ని అన్నాడు హూ. 

ఆప్తుణ్ణి కోల్పోయాను.. మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కృష్ణంరాజు త‌న‌కు అత్యంత ఆత్మీయులని,  అప్ప‌టి ప్ర‌ధాని వాజ్‌ పేయి  హాయాంలో మంత్రిగా పని చేసిన ఆయన త‌న‌ను ఎంతగానో అభిమానించేవార‌ని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమ‌ని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి పట్ల..మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ .తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు. కృష్ణంరాజు మృతి సినీరంగానికి, రాజ కీయ రంగానికి తీరని లోటని అన్నారు. సినిమా రంగానికి, సమాజానికి ఎంతో విలువలతో కూడినటువంటి సేవలందిం చారని కొనియాడారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన..తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్‎సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, రాజకీయ పాలన రంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యు లకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు  సంతాపం తెలి పారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు  అన్నారు. కేవలం నటునిగానే కాకుండా కేంద్రం మంత్రిగా కృష్ణంరాజు చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకు న్నారు. 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం..తెలుగు వెండితెరకి తీరని లోటని అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‎గా ఎదిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి విచారకరమని లోకేష్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 1940, జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్న‌త కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.1966లో ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీరంగ ప్రవేశంచేశారు. హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్పటికీ ప్రతినాయకుడిగా కూడా అలరించారు. భ‌క్త క‌న్న‌ప్ప చిత్రం చూస్తున్నంత‌సేపూ, ఆ త‌ర్వాత కొద్ది రోజుల వ‌ర‌కూ కూడా ప్రేక్ష‌కులు, శివ‌భ‌క్తులూ క‌న్న‌ప్పను ద‌ర్శ‌నం చేసుకున్నభాగ్యం అనుభ‌వించారు. వెండితెర మీద క‌న్న‌ప్ప చ‌రిత్ర‌ను క‌ళ్ల ముందు సాక్షాత్క‌రించిన చిత్ర‌రాజం. క‌న్న‌ప్ప‌గా కృష్ణంరాజు న‌టించార‌నే కంటే క‌న్న‌ప్పే కృష్ణంరాజులో ఇమిడాడు అన‌డం స‌బ‌బు. అంత అద్భుతంగా చేశారు కృష్ణం రాజు. అలాగే బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌న ఊరి పాండ‌వులు చిత్రంలోనూ అంతే అద్భుతం న‌టించి మెప్పించారు. ఆయ‌న సినీరంగంలో హీరోగా న‌ట‌జీవితం ఆరంభించినా, త‌ర్వాత విల‌న్‌గానూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన గొప్ప న‌టుడు. అవేక‌ళ్లు చిత్రంలో విల‌న్‌గా త‌నలో ప్ర‌త్యేక‌త‌ను చాటారు.  చిలాకా గోరింక హీరోయేనా ఇంత అద్భు తంగా విల‌నీ పండించింది అను కున్నారు ఆ రోజుల్లో. తన విలక్షణమైన నటనతో కొంతకాలంపాటు టాలీవుడ్‌ ఏలిన రెబల్‌ స్టార్‌ 183కుపైగా చిత్రాల్లో నటిం చారు. భక్తకన్నప్ప, బొబ్బిలిబ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుతీసుకొచ్చాయి. నిర్మాతగా గోపీకృష్ణ బ్యానర్‌లో పలు చిత్రాలు రూపొందించారు. చివరిసారిగా ఆయన ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో వెండితెరపై  చివ‌రి సారిగా కనిపించారు. సినిమాల్లో నటిస్తూనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1998 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో మరో సారి నర్సాపురం నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదేస్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ అరెస్టు

ఏపీలో పోలీసుల హ‌డావుడి మ‌రీ ఎక్కువ‌యింది. త‌మ పార్టీ అధినేత‌పై, సీనియ‌ర్ నేత‌పైనా అనుచిత వ్యాఖ్య‌లు చేసినం దుకు వారిపై ఫిర్యాదులు చేయ‌ డానికి వెళుతున్న టీడీపీ నాయ‌ కుల‌ను అడుగు ముందుకు వేయ‌కుండా పోలీసులు అడ్డు కుంటున్నారు. విప‌క్షనేత‌ల‌ను పోలీసులు అడ్డుకున్నతీరు వారు ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటిస్తున్న‌ ట్టుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు అం టున్నారు. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో మ‌ద్ద‌తు కోల్పోతున్న అధికార పార్టీ వైసీపీ పోలీసుల సాయంతో విప‌క్షాల‌ను అరిక‌ట్టాల‌ని చూడ టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని విశ్లేష‌కుల మాట‌.  తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌ బాబు, లోకేష్‌ల‌పై మాజీ మంత్రి కోడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై గుడివాడ పోలీసు స్టేషన్‌కి ఫిర్యాదుచేసేందుకు వెళుతున్న టీడీపీ నాయ‌కుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. గుడి వాడ వెళ్లేందుకు అనుమ‌తి లేద‌ని పోలీసులు అన్నారు. కాగా  పామ‌ర్రులోనూ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కంకిపాడు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మో హన్  వాహానాన్ని పోలీసులు అడ్డుకుని అతనిని అరెస్టు చేసి, ఉంగుటూరు పీఎస్‌కు తరలించారు. చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్య‌లుచేస్తే, ఆకాశంపై ఉమ్మేసినట్టేనని, అలాంటి వ్యాఖ్యల ద్వారా చరిత్ర హీనుడిగా నిలిచిపోతావని మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం కోశాధికారి శ్రీరాం తాతయ్య హితవు పలికారు. సంస్కారహీనంగా కుటుంబ స్త్రీలు, మహిళలపట్ల సభ్య సమాజం ఏమాత్రం సహించని వ్యాఖ్యలు చేయటం ఎవరు హర్షించరన్నారు. రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణప్రసాద్‌ మాట్లాడుతు, డిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం జగన్‌ కుటుంబసభ్యుల పేర్లు వినిపిస్తుంటే ప్రజల దృష్టి మరల్చేందుకు కొడాలితో సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు.  నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి మాట్లాడుతూ, కొడాలి నానికి దమ్ముంటే తన రౌడీ అను చరులు, పోలీసులు లేకుండా మహిళల వద్దకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడాలని సవాల్‌ చేశారు. త్వరలోనే తెలుగు మహి ళలు నాని తాట తీస్తారని హెచ్చరించారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కానూరి కిశోర్‌ మాట్లాడుతూ, కొడాలి ప్రెస్‌మీట్‌ అంటే ప్రజలు టీవీలు కట్టేసుకుంటున్నారని, ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు.