కోహ్లీ డక్.. మళ్లీ ఓడిన భారత్
posted on Sep 7, 2022 6:06AM
మంగళవారం (సెప్టెంబర్ 06) జరిగిన ఆసియా కప్ 2022 ఎడిషన్‌లో కీలకమైన సూపర్ ఫోర్ పోరులో పాకిస్థాన్‌తో జరిగిన ఓటమి తర్వాత, భారత్ శ్రీలంకతో తలపడింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 72 పరుగులు చేయడంతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఆర్ అశ్విన్‌ల సహకారంతో వారు 173-8తో పోటాపోటీగా నిలిచారు, అయితే లంక ప్లేయర్లు మాత్రం పోటీ అంతటా ఆకట్టుకున్నారనే అనాలి. పరుగుల వేటలో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించారు. , దిల్షాన్ మధు శంక, కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, కెప్టెన్ దసున్ షనక నాయకత్వం వహించారు.
శ్రీలంక టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌కు దురదృష్టం ఆరంభంలోనే వెన్నాడింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కె.ఎల్. రాహుల్, తర్వాత కోహ్లీ బౌల్డ్ కావడం అందర్నీ ఎంతో నిరాశపరిచింది. మళ్లీ మంచి ఫామ్‌లోకి వచ్చాడనుకున్న కింగ్ కాస్తా, దురదృష్టవశాత్తూ పరుగులు చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. మరో వంక కెప్టెన్ శర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కొనసాగిస్తూ మంచి షాట్స్‌తో స్కోరును ముందుకు తీసికెళ్లాడు. ఐదోఓవర్లో సిక్స్ కొట్టడంతో జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానకి 44కి చరింది. ఎనిమిదో ఓవర్లో 50 పరుగులకు చేరుకుంది. కొంత పరిస్థితులకు పరిశీలిస్తూ ఆచీతూచీ ఆడుతూనే సిక్స్ బాదడంతో పదో ఓవర్లో రోహిత్ శర్మ 50 పరుగులు పూర్తిచేశాడు. భారత్ పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. శర్మ సూర్యకుమార్ 44 బంతుల్లో 66 పరుగులు చేశారు. 12వ ఓవర్ హసరంగ ఓవర్లో రోహిత్ మరో సిక్స్ కొట్టడంతో భారత్ స్కోర్ 100కి చేరుకుంది. జట్టు స్కోర్ 110 వద్ద కరుణరత్నకి శర్మ దొరికాడు. రోహిత్ శర్మ 41 బంతుల్లో 71 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సూర్య కూడా అవుటవడంతో భారత్ భారీ స్కోర్ ఆశలు దెబ్బతినాయి. రిషబ్ పంత్ మెరుపు ఆట ప్రదర్శించి ఫోర్లు కొట్టి కొంత ఫరవాలేదనిపించాడు. కాగా 18వ ఓవర్లో మాత్రం భారత్ 17 పరుగులు సాధించింది. 19వ ఓరవర్లో మొదటి బంతికే హుడా వెనుదిరిగాడు. మధుశంక చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మధుశంక 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. జట్టు స్కోరు 158 వద్ద పంత్ కూడా వెనుదిరిగాడు. అతను వేగవగా 17 పరుగులు చేయగలిగాడు. తర్వాత వచ్చిన అశ్విన్ ఒక భారీ సిక్స్ కొట్టడంతో జట్టు స్కోర్ గౌరవప్రదస్థాయికి చేరిది. భారత్ 20 ఓవర్లలో 173 పరుగులు చేయగలిగింది.
174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక మొదటి నుంచే ధాటిగా బ్యాట్ చేసింది. భారత్ పేసర్ భువనేశ్వర్ మొదట ఓవర్లో కేవలం 1 పరుగు ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. ఇదే స్థాయిలో బౌలర్లు విజృలంభిస్తారని అనుకున్నారు. కానీ రెండో ఓవర్ నుంచే లంకేయులు బాదుడు మొదలెట్టారు. అర్షద్ వేసిన రెండో ఓవర్లో 9 పరుగుల చేశార. పాండ్య వేసిన 4 ఓవర్లో నిస్సం క భారీ సిక్స్ బాదాడు. అలా మొదటి 6 ఓవర్లలోనే శ్రీలంక 50 పరుగులు దాటేసింది. సింగ్,భువనేశ్వర్, పాండ్యాలు లంక బ్యాటర్ల పై ప్రభావం చూపలేకపోయారు. 7వ ఓవర్‌కి లంక 63 పరుగులు చేసింది. 8వ ఓవర్లో వచ్చిన అనుభవజ్ఞుడైన స్పిన్నర్ అశ్విన్ రెండో బంతికే భారీ సిక్సర్ సమర్పించుకున్నాడు. లంక 10వ ఓవర్‌కి నిస్సంక అర్ధసెంచరీ (33బంతుల్లో) పూర్తి చేశాడు. 13వ ఓవర్లలో లంక 100 పరుగులు దాటింది. కుశౄల్ మెంఇస్ మెరుపువేగంతో బ్యాట్ చేసి బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. కాగా 14వ ఓవర్లో లంక గుణతిలక వికెట్ కోల్పోయింది. చాహల్ రెండు వికెట్లు తీసి కొంత ఆశ కల్పించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ లంక బ్యాటర్లు పుంజుకుని నిలకడగానే ఆడారు.
18వ ఓవర్లో పాండ్యా ఏకంగా 13 పరుగులిచ్చి భారత్ ఆశలు పూర్తిగా దెబ్బతీశాడు. అంతకంటే ఘోరం 19వ ఓవర్‌లో భువనేశ్వర్ రెండు వైడ్‌లు వేసి పరిస్థితులు దిగజార్చాడు. చివరి ఓవర్ సింగ్ బాగానే చేశాడు. 7 పరుగులు కావాల్సిన లంకకు బ్యాటర్లు కాస్తంత ఖంగారుపడ్డారు. చిట్టచివరి రెండుబంతుల్లో రన్ అవుట్ ఛాన్స్ భారత్ చేజార్చు కుని ఆటను సమర్పించింది.