టీ-20 ప్రపంచకప్.. బవుమా నాయకత్వంలో దక్షిణాఫ్రికా
posted on Sep 6, 2022 @ 4:26PM
ఆస్ట్రేలియాలో అక్టోబర్,నవంబర్ మాసాల్లో జరిగే టి-20 ప్రపంచకప్ పోటీలకు దక్షిణాఫ్రికా జట్టును ప్రక టించారు. ఎడమ మోచేతి గాయం నుంచి తేరుకున్న బవుమా కి దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు నాయ కత్వం బాధ్యతలు అప్పగించారు. జట్టులోకి ఆన్‌రిక్ నోర్జీ, కగీసో రబాడ, లుంగీ ఎన్‌గిడి వంటి హేమా హేమీలు బౌలింగ్ విభాగాన్ని నిర్వహిస్తారు. కాగా జట్టుకు కేశవ్ మహరాజ్, తబ్రెజ్‌షాంసీ స్పిన్నర్లుగా ఉన్నారు. జట్టులోకి ట్రిస్టియన్ స్టబ్స్ అనే యువ స్టార్‌ను కూడా తీసుకుని సెలక్టర్లు అందర్నీ ఆశ్చర్య పరిచారు.
జట్టు మిడిల్ ఆర్డర్ స్టార్ రస్సీ వాన్‌డర్ డూసెన్ మాత్రం ఈ టోర్నీకి దూరమయ్యాడు. అతని చూపుడు వేలు గాయం కారణంగా జట్టులోకి ఎంపిక కాలేదు. ఇటీవల ఇంగ్లండ్‌తో తలపడిన టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్‌లో అతనికి గాయమయింది. చూపుడువేలికి శస్త్రచికిత్స చేయనున్నట్టు, ఆరురు మాసాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో అతన్ని జట్టులోకి ఎంపిక చేయలేదు. అయితే జట్టులోకి పేసర్ వేన్ పార్నల్ తిరిగి వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్ పై 2-1 తేడాతో సిరీస్ గెలిచిన నేపథ్యంలో ఈ ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా అద్బుత ప్రదర్శన ఇవ్వగలదని అభిమానులు ఆశిస్తున్నారు. టీ-20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత్‌తో ఒక సిరీస్‌లో తలపడనున్నది.
బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్ డీకాక్, రీజా హెండ్రిక్స్,క్లాసెన్,మహారాజ్,మార్క రమ్, డేవిడ్ మిల్లర్,లుంగీ ఎన్‌గిడి, ఆన్‌రిక్‌నోర్జీ, వేన్ పార్నెల్, ప్రిటోరియస్, రబాడ, రిలీ రోసో, తబ్రి యాజ్ షింసీ,త్రిస్టాన్ స్టబ్స్ ఉన్నారు. కాగా, జోర్న్ ఫోర్టియమ్, మార్కో, ఫెహ్లుక్వాయోలు రిజర్వుగా ఉన్నారు.