కేసీఆర్ చచ్చిన పాము.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్!

కాంగ్రెస్ మేడిగడ్డ సందర్శన, బీఆర్ఎస్ నల్గొండ బహిరంగ సభలు వేదికలుగా అధికార కాంగ్రెస్, విపక్ష  బీఆర్ఎస్ మధ్య ఆరంభమైన మాటల యుద్ధం అసెంబ్లీకి చేరింది. అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరో రేంజ్ కి చేరింది. మేడిగడ్డ ఫిల్లర్ల కుంగుబాటు, కాళేశ్వరం బ్యారేజ్ వైఫల్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతలను చెరిగి పారేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం చేసుకున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు అభ్యంతరం చెబుతున్న కేటీఆర్ నల్గొండ సభ వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై, ఆయన వాడిన భాషపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పద్ధతిగా మాట్లాడారా అని నిలదీశారు.   ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా.. బుద్ధి మారలేదంటూ ఫైర్ అయ్యారు. మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా? అని ప్రశ్నించిన రేవంత్.. బీఆర్ఎస్ హయాంలో నీటి పారుదల శాఖ చూసిన కేసీఆర్, హరీష్ రావులకు పెత్తనం ఇస్తాం మేడిగడ్డలో నీరు నింపి సుంందిళ్ల, అన్నారంలకు ఎత్తిపోస్తారా? అని సవాల్ విసిరారు. అక్కడితో ఆగకుండా మేడిగడ్డ పిల్లర్లు కుంగి ప్రాజెక్టు కుప్పకూలుతుంటే నీరు నింపడం సాధ్యమేనా అని నిలదీశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడం వల్ల 94 వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది వాస్తవం కాదా అన్నారు.  ఈ విషయంపై చర్చకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు రాకుండా పారరయ్యారని రేవంత్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ సభకు వస్తే ఈ అంశంపై చర్చిస్తామన్నారు. అవసరం అనుకుంటే రేపు సాయంత్రం వరకూ కూడా చ ర్చించడానికి సిద్ధమని చెప్పారు.  కేసీఆర్ నల్గొండ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనో చచ్చిన పాము.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలోనే  కేసీఆర్ అనే పాము  చనిపోయిందన్నారు. కేసీఆర్ సభకు వచ్చే ధైర్యం లేదన్న రేవంత్ ఆయన వస్తే కాళేశ్వరంపై చర్చించేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

దొంగ ఓట్లతో అడ్డంగా బుక్కైన సలహాల్రావ్ సజ్జల

వైసీపీ అనగానే జగన్ తరువాత స్ఫురించే పేరు ఏదైనా ఉందంటే అది సజ్జల మాత్రమే. సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా జగన్ సర్కార్ తీసుకునే ప్రతి అడ్డగోలు నిర్ణయాన్నీ మీడియాకు వివరించడానికి ముందుకు వచ్చే సజ్జల.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించడంలో, వాటి తప్పొప్పులను బేరీజు వేయడంలో తగుదునమ్మా అని ముందుంటారు. ఆయన వ్యవహారం  నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదన్నట్లుగా ఉంటుంది.  ఏపీ, తెలంగాణలో ఓట్లు ఉన్నవారంతా తెలుగుదేశం సానుభూతి పరులే అటువంటి వారి ఓట్లు తొలగించాలంటూ గొంతు చించుకున్న సజ్జల దొంగ ఓట్ల విషయంలో అందరి కంటే ముందు ఉంటారని ఇప్పుడు సందేహాలకు అతీతంగా తేలిపోయింది. ఆయన ఒక్కడికే కాదు, ఆయన కుటుంబం మొత్తానికి ఏపీలోనే రెండేసి ఓట్లు ఉన్నాయని తేలిపోయింది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ సలహాల్రావు దొంగ ఓట్ల విషయంలో రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయారు.  సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి భార్య, అలాగే సజ్జల కుమారుడు, వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఇన్ చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, ఆయన సతీమణికి పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలలో ఓట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆధారాలతో సహా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై సజ్జల స్పందన చాలా పేలవంగా, బాధ్యతారహితంగా ఉంది.   తనకుటుంబానికి  మంగళగిరిలో మాత్రమే ఓటు ఉందని చెబుతూ..  పొన్నూరులో ఓట్లు తొలగించే ఉంటారని దాటవేయడం చూస్తుంటే.. ఆయనకు తెలిసే, ఉద్దేశపూర్వకంగానే రెండు చోట్లా ఓట్లు నమోదు చేయించుకున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  మామూలుగా అయితే రాజకీయ నాయకులు ఇటువంటి ఆరోపణలు వస్తే మీడియా ముందకు వచ్చి ఖండించడమే కాకుండా, ఆ ఆరోపణలు వాస్తవ దూరం అని చెప్పేందుకు ఆధారాలను కూడా బయటపెడతారు. కానీ సజ్జల మాత్రం పొన్నూరులో తన కుటుంబం ఓట్లు తొలగించేశారనడానికి ఎటువంటి ఆధారాలూ బయటపెట్టలేదు. అంతే కాకుండా..  ప్రస్తుతం తాను ఉంటున్న  రెయిన్ ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్‌ట్రీ అపార్టుమెంట్లు పొన్నూరు నియోజకవర్గంలో నూ. మరో వైపు  ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గ పరిథిలో ఉన్నాయనీ,  ఓట్ల చేరిక సమయంలో  రెండు నియోజకవర్గాలలోనూ తన కుటుంబం ఓట్లు నమోదై ఉంటాయనీ వివరణ ఇస్తూ, విషయం తెలియగానే   పొన్నూరు నుంచి, ఓట్లు తొలగించాలని గత నెల 31 దరఖాస్తు చేశామనీ, తొలగించేసి ఉంటారనే బావిస్తున్నాననీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే దూళిపాళ్ల నరేంద్ర ఇప్పటికీ సజ్జల కుటుంబానికి రెండు నియోజకవర్గాలలోనూ ఓట్లు ఉన్నాయని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు.   దీంతో రాష్ట్రం లో దొంగ ఓట్ల దందా అంతా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా జరుగుతోందన్న విమర్శలకు బలం చేకూరినట్లైంది. 

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు 

తన కొడుకు ఇచ్చిన అప్పు చెల్లించాలని ఓ తండ్రి కోర్టునాశ్రయించాడు. కొడుకు చనిపోవడంతో తండ్రికి బండ్ల గణేష్ ఇచ్చిన  చెక్ బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఆ తండ్రికి అన్యాయం జరగడంతో కోర్టునాశ్రయించి గెలుపొందారు. .   సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈమేరకు తీర్పిచ్చిన కోర్టు.. ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న అప్పు రూ.95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకీరామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పు తీసుకున్నాడు. జానకీరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షలకు చెక్ ఇచ్చాడు. ఈ చెక్ బౌన్స్ కావడంతో జానకీరామయ్య తండ్రి ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ.. జానకీరామయ్య దగ్గర తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులు కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. చెక్ బౌన్స్ కావడంతో ఏడాది జైలు శిక్ష విధించింది. గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా బండ్ల గణేశ్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ దాఖలు చేసిన ఈ కేసులో జైలు శిక్షతో పాటురూ. 15,86,550 జరిమానా విధించింది. బండ్ల గణేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో అతను మల్కాజ్ గిరి లోకసభ స్థానాన్ని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

హైదరాబాద్ నగరానికి 16న సింగూరు జలాలు బంద్ 

ఈనెల 16న హైదరాబాద్‌ మహానగరానికి సింగూరు జలాలు నిలిచిపోనున్నాయి. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పెద్దాపూర్‌ పంప్‌హౌస్‌ నిర్వహణ పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు గంటల పాటు షేక్‌పేట, బోరబండ రిజర్వాయర్‌, లింగంపల్లి రిజర్వాయర్‌ ప్రాంతాల్లోని ప్రాంతాలకు సింగూరు జలాలు నిలిచిపోనున్నాయి. బంజారాహిల్స్‌, ఎర్రగడ్డ రిజర్వాయర్ ప్రాంతాల్లో అంతరాయం తలెత్తనుంది. సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది.  ఎగువన ఉన్న కర్ణాటకలో ఎడతెరపిలేని వర్షాలకు మంజీరాలోకి  భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఈ నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకున్నది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు.

మ‌హిళా పారిశ్రామిక వేత్తతో మంత్రి విడదల ర‌జినీకి టీడీపీ చెక్!

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.  కమ్మ సామాజికవర్గానికి తప్పతెలుగుదేశం అభ్యర్థిగా  ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుస్తూంటారు. కాంబినేషన్ కుదిరితే చాలు. కాంగ్రెస్, వైసీపీ పదే పదే అభ్యర్థుల్ని మార్చి మార్చి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.  వైసీపీ  చిలుకలూరిపేట నుంచి విడదల రజనీని ఇక్క‌డికి దిగుమతి చేశారు. అక్కడ ప్యాకప్ చేసుకుని గుంటూరులో రెడీ అయిపోయిన రజనీ.. గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు. అయితే  ఆమెకు ఇప్పుడిప్పుడే  పరిస్థితులు అర్థమవుతున్నాయని అంటున్నారు.  2019 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రగిరి ఏసురత్నం నిలబడితే.. తెలుగుదేశం నుంచి మద్దాలి గిరి పోటీ చేశారు. గెలిచిన గిరి తనకు ఉన్న జిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం పార్టీ మారిపోయారు. ఇప్పుడు ఆయనకు  జగన్ టిక్కెట్  ఇవ్వలేదు.  గుంటూరు వెస్ట్ తెలుగుదేశం కంచుకోట కాబట్టి.. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. కానీ గుంటూరు వెస్ట్ లో అన్ని సామాజికవర్గాల జనాభా ఉంటుంది. ఎవరూ లీడ్ కాదు. గెలుపోటములను శాసించే పొజిషన్ లో  ఏ  సామాజిక వర్గమూ లేదు.  అక్కడ ఉన్న సామాజికవర్గాల ప్రకారం చూసినా.. . ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ప్రకారం చూసినా… విడదల రజనీ గెలుపు కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గుంటూరు పశ్చిమలో కమ్మ, కాపు, బీసీ ఓట్ల బలం ఉంటుంది. బీసీల్లో వడ్డెర వర్గానికి బలం ఉంటుంది. విడదల రజనీ ముదిరాజ్ వర్గానికి చెందిన వారు. ఆమె భర్త రజక వర్గానికి చెందిన వారు. ఈ వర్గాల ప్రభావం పశ్చిమలో అంతంతమాత్రం. పైగా గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీకి  కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పాతిక వేల ఓట్ల వరకూ చీల్చినప్పటికీ.. తెలుగుదేశం అభ్యర్థి  ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.  ఈ సారి తెలుగుదేశం, జనసేన పొత్తుతో పోటి చేస్తున్నాయి కనుక పలితం ఏకపక్షంగా ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   విజయంపై ధీమాతో ఉన్న  తెలుగుదేశం కూట‌మి రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసింది. తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో,  ఇరు  పార్టీల అధినేతలు ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. అటు బీజేపీతో కూడా పొత్తు చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు కొత్త నేతలు ఆసక్తి చూపుతున్నారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై తెలుగుదుశం  అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతివ్వడంతో... ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపు దిశగా... తెలుగుదేశం పావులు కదుపుతోంది.  గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జుగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ కొనసాగుతున్నారు. దీంతో ఆమెకు దీటుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని తెలుగుదేశం భావిస్తున్నది. రాజకీయాలకు ఏ మాత్రం పరిచయం లేని ఓ మహిళా పారిశ్రామిక వేత్తను  తెలుగుదేశం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వ్యాపారంలో రాణిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామలను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. వ్యాపార రంగంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెయిరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో  పలు సేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పలు ఆలయాలను పునర్నించారు కూడా. ఆధ్యాత్మిక రంగంలో సైతం శ్రీ లక్ష్మీ శ్యామల విశేష కృషి చేశారు. డెయిరీ వ్యాపారంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల... వివిధ వ్యాపారాల్లో సైతం పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు.  గతేడాది నవంబర్ చంద్రబాబు పెరంబదూర్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటే శ్రీ లక్ష్మి శ్యామల సైతం రామానుజుల వారిని దర్శించుకున్నారు. సౌమ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి శ్యామలతో ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి విడుదల రజినికి చెక్ పెట్టేందుకు వచ్చే ఎన్నికలలో   టీడీపీ తరఫున శ్రీ లక్ష్మీ శ్యామలను అభ్యర్థిగా నిలబెడితే.. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తున్నది. 

బాసరలో వసంత పంచమి వేడుకలు 

 తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. పద్మశాలి సంఘం తరుపున ఆందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. ఇక బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వచ్చారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు కావడంతో దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. దీంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కాగా సరస్వతి అమ్మవారికి వసంత పంచమి చాలా ప్రీతికరమైన రోజు. అక్షరాభ్యాసానికి యోగ్యకరమైనరోజు.. అందుచేత చాలా మంది తమ పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే ఇంటిలో కూడా అక్షరాభ్యాసం చేయించవచ్చునని వేద పండితులు చెబుతున్నారు. అలాగే తెలంగాణలో నిర్మల్ జిల్లాలో  నేడు సరస్వతీ దేవి జన్మించిన వసంత పంచమి కావడంతో  బాసరలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాగా, వసంత పంచమి పర్వదినం సందర్భంగా విద్యా ప్రధాయిని సరస్వతి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేకువజామున సరస్వతి, మహా కాళీ, లక్ష్మీ అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

నగర శివారులో శిలాయుగపు చిత్రకళ!

 యాడారం గుట్టలో క్రీ.పూ. 8500 నాటి ఆదిమానవుల వర్ణ చిత్రాలు   మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లాలో వెలుగు చూసిన శిలాయుగపు చిత్రాలు!  హైదరాబాద్ పరిసరాల్లో ఆదిమానవుని అడుగుజాడలు!!  కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు ఈమని  శివనాగిరెడ్డి నగర శివారులో ఆదిమానవుని అడుగుజాడలు, శిలాయుగపు చిత్రకళ వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా, సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు మహమ్మద్ నసీరుద్దీన్, అహోబిలం కరుణాకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన వారితో కలిసి మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా, షామిర్ పేట మండలం, యాడారం గ్రామంలోని పెద్ద అంతరాల (అంతస్తుల) గుట్ట పైనున్న ఆదిమానవుని కొండచరియ ఆవాసాలను, వాటి గోడలపై ఉన్న ఆనాటి వర్ణ చిత్రాలను పరిశీలించారు.  నాలుగు అంతస్తుల రాతి ఆవాసపు మూడో అంతస్తులో 60 అడుగుల ఎత్తులో పక్కపక్క నున్న రెండు నిలువుబండలపై సూక్ష్మరాతి యుగానికి (క్రీ.పూ.8500) చెందిన మూపురమున్న, మూపురం లేని ఎద్దు బొమ్మలు, శరీరం లోపలి ఎముకలు కనిపించేట్లు(ఎక్స్ రే) చిత్రించిన  మరో ఎద్దు బొమ్మ, మూడు మనుషుల బొమ్మలు, కొత్త రాతి యుగానికి  చెందిన(క్రీ.పూ.4000), ఎద్దు, నెమలి బొమ్మలు, ఇనుపయుగానికి (క్రీ.పూ.1000) చెందిన ముగ్గులను పోలిన రేఖాచిత్రాలు, చారిత్రక తొలి యుగపు (క్రీ. శ. 1-2 శతాబ్దాలు) శృంగార భంగిమలో ఉన్న మూడు జంటలు, ఒకే దానిపై ఒకటి నిలబడి తేనె పట్టును అందుకుంటున్న ఎనిమిది కోతులు, పక్కనున్న మరో బండపై కొత్త రాతియుగపు ఎద్దును లాగుతున్న మనిషి, పక్కనే ఆవు దూడ బొమ్మలు ఉన్నాయని, ఈ రేఖాచిత్రాలన్నీ ఎర్రజాజు రంగు తో వేసినవని, ఇవి సూక్ష్మరాతి యుగం నుంచి చారిత్రక తొలి యుగం వరకు ఈ పెద్ద అంతరాల గుట్ట నివాస స్థావరమని తెలియజేస్తున్నాయని శివనాగిరెడ్డి వివరించారు. గుట్ట కింద సూక్ష్మరాతి యుగపు పనిముట్లు,  కొత్తరాతి యుగంలో రాతిగొడ్డళ్లను అరగదీసిన గుంటలు, ఒక ఇనుప యుగం సమాధి ఆనవాళ్లు, ఈ రేఖాచిత్రాల పురా చరిత్రకు ఆధారాలని, వీటిని కాపాడుకోవాలని, రాజీవ్ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో గల ఈ స్థావరం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రాచీన ఆలయ పునరుద్ధరణ ట్రస్ట్ ఛైర్మన్ ఆర్.కె. జైన్, స్థానిక యువకుడు వేణుమాధవ్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.

 కారు ఢీ కొట్టిన ఘటనలో   సిఐ మృతి

రాంగ్ రూట్ లో వచ్చే కారు బైక్ ను ఢీ కొన్న ఘటనలో హైదరాబాద్ కు చెందిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మరణించగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతిచెందారు. ఎస్సై కాజా వలీ మోహీనుద్దీన్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. సాధిక్‌ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తుండగా, కాజా వలీ నారాయణ గూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు. మలక్‌పేట క్వార్టర్స్‌లో ఉండే వీరిద్దరూ మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు వినుషా శెట్టి అనే పేరుపై రిజిస్ట్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రమాదం జరిగాక కారు ఆపకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

నామినేషన్ వేయడానికి జైపూర్ చేరుకున్న సోనియా 

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోకసభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి బయల్దేరిన సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకాగాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ. 27న ఎన్నికలు జరుగుతాయి.  ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికైన 77 ఏళ్ల సోనియాగాంధీ తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.  నామినేషన్ల దాఖలు సమయంలో సోనియాతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ ఉంటారని తెలుస్తోంది. ఈనెల 27న 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడింట్లో ఒక స్థానంలో కాంగ్రెస్ సునాయాసంగా విజయాన్ని సాధిస్తుంది. అందుకే, సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. లోక్ సభకు మరోసారి పోటీ చేయబోనని 2019లోనే సోనియా ప్రకటించారు.

తెలుగుదేశం గూటికి లావు శ్రీకృష్ణ దేవరాయలు.. ముహూర్తం ఎప్పుడంటే?!

వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముంగిట ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో సిట్టింగులు, కీలక నేతలూ పార్టీని వీడుతున్నారు. అలా వీడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో వైసీపీ శిబిరంలో తీవ్ర నిరాశా నిస్ఫృహలు నెలకొన్నాయి. మరో వైపు పార్టీ అధినేత జగన్ సీతయ్య  తరహాలో  ఎవరి మాటా విననంటూ సిట్టింగుల మార్పు నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు డీలా పడిపోతున్నాయి. అధినేతే ఓటమి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే ఇక చేయగలిగిందేముంది.. ప్రజాభీష్ఠానికి అనుగుణంగా నడుచుకుంటూ తెలుగుదేశం, జనసేన కూటమి కోసం పని చేస్తే పోలా అన్న భావనకు వచ్చేస్తున్నారు. వరుస జంపింగులతో ఎన్నికల నోటిఫికేష్ వెలువడే నాటికి వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. ఇక ఇప్పటికే పార్టీకి దూరమైన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.   నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగుదేశం గూటికి చేరనున్నారన్న సంగతీ విదితమే. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇప్పుడు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఔను ఈ నెల 22న లావు శ్రీకృష్ణ దేవరాయులు తెలుగుదేశం గూటికి చేరనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  

బీఆర్ఎస్ కు కటీఫ్?.. మజ్లిస్ దోస్తీ కాంగ్రెస్ తోనే!

ఆల్ఇండియా మ‌జ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్‌ (ఏఐఎమ్ఐఎమ్) అలియాస్ మజ్లిస్.. హైదరాబాద్ పాత బస్తీలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఈ పార్టీ రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  బీజేపీ వ్యతిరేకతే ఈ పార్టీ విధానం అని చెప్పవచ్చు.  అయితే ఆ ముసుగులో బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు జాతీయ స్థాయిలో విస్తరణ పేరిట ముస్లిం జనాభా అధికంగా ఉండే నియోజకవర్గాలలో అభ్యర్థులను పోటీకి నిలబెడుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే మొత్తంగా ఈ పార్టీ పాత బస్తీలో తన పట్టును నిలుపుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ తెలంగాణలో  ఆ  పార్టీకే మద్దతుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కూడా అప్పట్లో ఎలాంటి దాపరికం లేకుండా మజ్లిస్, బీఆర్ఎస్ లు మిత్రులు అని అప్పట్లో ప్రకటించారు కూడా. కానీ మజ్లిస్ లక్ష్యం వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ కూడా మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీతోనే దోస్తానా చేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ‌లో  అధికారంలో ఉన్న  టీఆర్ఎస్‌(బీఆర్ఎస్) తో మజ్లిస్ పార్టీ దోస్తీ కొనసాగింది.  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఒవైసీ ఆయనతో భాయీ భాయీ బంధం నెరిపారు.   మజ్లిస్ పార్టీ ఏం చేసినా పాత‌బ‌స్తీలో త‌న పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా చేస్తుందన్నది పరిశీలకుల విశ్లేషణ. అవును కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు రేవంత్ చేపట్టిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు స్పీడందుకుంది. అధికారం కారు నుంచి హస్తానికి ట్రాన్స్ ఫర్ అవుతుందన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. దీంతో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ కు దూరం జరిగే  ప్రయత్నాలు ప్రారంభించారని అప్పట్లోనే రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   ఆ ప్రచారం వాస్తవమేనని ఇప్పుడు నిస్సందేహంగా తేలిపోయింది. ఔను రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు ఇచ్చిన పిలుపునకు మజ్లిస్ స్పందించింది. మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు సైతం వెళ్లారు. అయితే రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు రావాల్సిందిగా కోరినా బీఆర్ఎస్, బీజేపీలు స్పందించలేదు.  దీంతో రాష్ట్రంలో ఎవరెవరు ఇప్పుడు మిత్రులు, ఎవరెవరు ఇప్పుడు మిత్రులు కాదు అన్నది విస్పష్టంగా తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి నుంచీ అంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కూడా బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లభించిన, ఇప్పటికీ లభిస్తున్న వెసులు బాట్లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అవినీతికి బ్రాండ్ అన్న ఆరోపణలను సైతం ఎప్పటి నుంచో కాంగ్రెస్ చేస్తోంది. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఈ విషయంలో మజ్లిస్ జోక్యం చే సుకోలేదు. కాళేశ్వరం అవినీతిపై కానీ, మేడిగడ్డ కుంగుబాటుపై కానీ మజ్లిస్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా స్పందించలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో  ఆ వెంటనే మజ్లిస్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్లింది. దీంతోనే మజ్లిస్ ఇప్పుడు ఎవరికి మిత్రపక్షంగా ఉందో తేటతెల్లమైపోయింది. అసలు రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శన కార్యక్రమం పెట్టుకున్నదే  బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు వ్యతిరేకంగా . అలాంటి మేడిగడ్డ సందర్శనకు మజ్లిస్ వెళ్లడం అంటే తాము కాంగ్రెస్ వైపు ఉన్నామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుండబద్దలు కొట్టేసినట్లే. అయితే  మజ్లిస్ బీఆర్ఎస్ కు దూరం జరగడం ఏమీ ఆశ్చర్యకర పరిణామం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నిజానికి మజ్లిస్ కాంగ్రెస్ మిత్రపక్షం గా ఉన్నట్లు మేడిగడ్డ సందర్శనకు హాజరు కావడంతో తేలిపోయినా.. వాస్తవానికి మజ్లిస్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే మిత్రపక్షంగా వ్యవహరిస్తుందని, అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా తన రాజకీయ అవసరాల కోసమే మజ్లిస్ ను చేరదీస్తున్నదని అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పాత బస్తీలో తన పట్టు నిలుపుకోవాలంటే మజ్లిస్ కు రాష్ట్రంలో అధికార పార్టీ అండ అవసరం. అలాగే  అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి  తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే.. జంపింగుల భయం లేకుండా ధీమాగా పాలన సాగాలంటే.. మజ్లిస్ తమకు మద్దతుగా నిలవడం కావాలి. అందుకే పరస్పర ప్రయోజనాల పరిరక్షణలో భాగమే మజ్లిస్, కాంగ్రెస్ దోస్తానా అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి బారులు.. బారులు!

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధికార వైకాపా నాయకుల్లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను పసిగట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సహా సీనియర్ నాయకులు మెల్లమెల్లగా  జగన్ కు ఆయన పార్టీకీ దూరం అవుతున్నారు. తమ దారి తాము చూసుకుంటున్నారు.  ఇప్పటికే వెళ్లిపోయిన వారు పోగా ఇంకా పలువురు తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. వారిలో కొందరు ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు.  దీంతో రానున్న రోజులలో వైసీపీ నుంచి  వలసల వరద ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే సమయంలో  వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకునే విషయంలో  తెలుగు దేశంజాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  కష్ట కాలంలో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.  ఇక విషయానికి వస్తే.. ఏపీలో వైసీపీ పరిస్థితి .. జగన్ తో పాటు సజ్జల, వైవీ, విజయసాయి వంటి వారు తప్ప మిగిలిన అందరూ కూడా చంద్రబాబు తలుపు తెరిస్తే తెలుగుదేశం గూటికి చేరిపోవడానికి రెడీగా ఉన్నారనిపించేలా మారిపోయింది.  ఔను  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యారు.  ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికూడా చంద్రబాబుతో చర్చలు జరిపారు. గత ఎన్నికలకు ముందు… తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చినట్లే ఇప్పుడు వైసీపీకి హ్యాండివ్వడానికి అదాల ప్రభాకర్ రెడ్డి రెడీ అయిపోయారు. ఇలా  ఒకరు, ఇద్దరు, ముగ్గురని కాదు.. దాదాపు  వైసీపీ ముఖ్య నేతలంతా కళ్లేలు తెంచుకుని వైసీపీ నుంచి బయటపడేందుకు తహతహలాడుతున్నారు.   పార్థసారధి , వసంత కృష్ణ ప్రసాద్ ఇలా ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు.   రాజ్యసభ ఎన్నికలు, పొత్తుల విషయంలో అధికారిక ప్రకటన కు సిద్ధమౌతున్న  చంద్రబాబు  అదే సమయంలో చేరికల విషయంలో   ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తున్నారు. అత్యంత బలమైన అభ్యర్థులు,  గెలుపు గుర్రాలు అయితేనే  అయితేనే ప్రాధాన్యత లేకపోతే లేదు అన్నట్లుగా చంద్రబాబు వ్యాహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.  వేమిరెడ్డి  వైసీపీని వీడడమంటే.. ఆ పార్టీ పనైపోయిందనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వేమిరెడ్డి బాబుతో భేటీ అవ్వడంతో వైసీపీ నుంచి వలసలు అనూహ్య స్థాయిలో వెల్లువెత్తే వరదలా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సిట్టింగుల మార్పు అంటూ సీఎం జగన్ ఇప్పటికే అరడజను జాబితాలు విడుదల చేశారు.  ఆయన విడుదల చేసిన జాబితాలలో జరిగిన మార్పులన్నీ దాదాపుగా   రిజర్వుడు  నియోజకవర్గాలకు సంబంధించినవే ఉన్నాయి. అయితే ఆ ఆరడజను జాబితాలలో మార్పుల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు విడుదల కానున్న తదుపరి జాబితాల తరువాత ఇంకెంత మంది సిట్టింగులు, నేతలు జగన్ కు దూరం జరుగుతారన్న దానిపై పార్టీ శ్రేణుల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.  జగన్ టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్నా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయిన వారి సంఖ్య భారీగానే ఉందని వైసీపీ వర్గాల నుంచే  తెలుస్తోంది. అలా పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నవారిలో అత్యధికులు తెలుగుదేశంలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో తమకు టిక్కెట్లు లేకపోయినా ఫరవాలేదన్నట్లు వారు భావిస్తున్నారని కూడా అంటున్నారు.  ప్రజలలో ఉండడానికీ, తమ రాజకీయ భవిష్యత్ అంతమైపోకుండా చూసుకోవడానికీ వైసీపీని వీడడం ఒక్కటే మార్గమని వారంతా భావిస్తున్నారని చెబుతున్నారు.   అందుకే చంద్రబాబు నాయుడు కూడా చేరికల విషయంలో స్పష్టమైన క్లారిటీతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే   పార్టీని నమ్ముకున్న స్థానిక నాయకుల అనుమతి లేకుండా కొత్త వారిని చేర్చుకోరాదని, రాష్ట్ర,  జిల్లా  స్థాయి నాయకులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే,  అనేక జిల్లాల్లో వైసీపీ  కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా, వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించడం లేదని అంటున్నారు.  

సరి కొత్త జగన్నాటకం.. ప్రజల చేతిలో పరాభవం ఖాయం

అమ్మ పెట్టా పెట్ట‌దు.. అడుక్కు తినానివ్వ‌దు అన్న‌ట్లుగా ఉంది ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తీరు. ఉన్న‌వాటిని కూల్చేసి.. కొత్త‌గా అభివృద్ధి ఏంటో మేం చూపిస్తామంటూ గొప్ప‌లు చెప్పుకుని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి ఒక్క చాన్స్ కొట్టేసిన జగన్ నాలుగున్న‌రేళ్ల  పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. ఇప్పుడు తీరా ఎన్నికల సమయం వచ్చేసే సరికి మేము ప్ర‌య‌త్నం చేశాం.. మావ‌ల్ల కాలేదంటూ చేతులెత్తేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చంద్ర‌బాబు ఒక రాజ‌ధానికి శంకుస్థాప‌న చేస్తే.. మేము మూడు రాజ‌ధానులు క‌డ‌తాం.. మూడు ప్రాంతాల్లో అద్భుత పాల‌న సాగిస్తాం అంటూ డప్పాలు కొట్టుకుని..  చివ‌రికి క‌నీసం ఒక్క రాజ‌ధాని క‌దుక‌దా.. ఎక్క‌డా ఒక్క ఇటుక పెట్టి నిర్మాణాలు చేసిన దాఖ‌లాలు జగన్ పాల‌న‌లో ఎక్క‌డా క‌నిపించ‌వు.  మామూలుగా కాదు.. భూతద్దం పెట్టి వెతికినా క‌నిపించ‌వు.  నాలుగున్న‌రేళ్లు మూడు రాజ‌ధానులంటూ  ఉత్తుత్తి  కబుర్లు చెప్పిన జ‌గ‌న్ , ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాజ‌ధానిని నిర్మించుకునేంత స్థోమ‌త లేదు.. హైద‌రాబాద్ ను ఉమ్మ‌డి రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని డిమాండ్ చేద్దాం అంటూ తన చేత‌గానిత‌నాన్ని బ‌య‌ట‌ పెట్టుకున్నారు.  ఏపీలో నాలుగున్నారేళ్ల జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు విసిగివేసారి పోతున్నారు. క‌నీసం ఉపాధి, ఉద్యోగాలులేక హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌కు వ‌లస‌ పోతున్నారు. నాలుగున్న‌రేళ్ల జ‌గ‌న్   హ‌యాంలో చెప్పుకోద‌గ్గ ఏ ఒక్క కంపెనీకూడా ఏపీలో అడుగుపెట్ట‌లేదు. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీలో బ‌డా కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయి. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వాటిలో కొన్నింటిని ఏపీ నుంచి త‌రిమేశారు. ఉన్న రాజ‌ధాని అమ‌రావ‌తిని చిదిమేసి..  మూడు రాజ‌ధానుల పేరుతో  జ‌గ‌న్ నేల విడిచి సాము చేశారు. పాల‌నా అనుభ‌వంలేని జ‌గ‌న్ , మూడు రాజ‌ధానుల హామీని నెర‌వేర్చ‌లేక , అది ప్రాక్టికల్ గా అసాధ్యం అని తెలిశాకా, విశాఖ పల్లవి ఎత్తుకున్నారు. విశాఖ ప‌ట్ట‌ణం ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేస్తున్నాం.. ఇదిగో రేప‌టి నుంచి.. అదిగో ఎల్లుండి నుంచి విశాఖ నుంచి పాలన మొద‌ల‌వుతుంద‌ని చెప్పుకుంటూ వ‌చ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో జ‌గ‌న్  కొత్త‌నాట‌కానికి తెర‌లేపారు. త‌న‌చేత‌కాని త‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు కోర్టుల్లో చిక్కులుకార‌ణంగా విశాఖ‌కు వెళ్ల‌లేక పోతున్నాం అంటూ జ‌గ‌న్ బాబాయి,  వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేత మీడియా ముందు ఒక ప్రకటన చేయించారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత‌.. ఏపీకి రాజ‌ధాని ఉండాల‌ని భావించారు. ప‌లు వ‌ర్గాలు, పార్టీల ప్ర‌తినిధులను సంప్ర‌దించి అంద‌రి ఆమోదంతో అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబుపై ఉన్న న‌మ్మ‌కంతో అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లోని రైతులు సైతం స్వ‌చ్చందంగా ముందుకొచ్చి త‌మ భూముల‌ను అప్ప‌గించారు. రాజ‌ధానిలో హైకోర్టుతోపాటు తాత్కాలికంగా పాల‌న సాగించేందుకు భవనాల‌ను నిర్మించారు. చంద్ర‌బాబు పాల‌న‌ సైతం అమ‌రావ‌తి నుంచే సాగింది. భార‌త‌దేశంలోనేకాక ప్ర‌పంచంలోనే అద్భుత‌మైన రాజ‌ధానిగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దే ల‌క్ష్యంతో చంద్ర‌బాబు ముందుకు సాగారు. అయితే 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. జ‌గ‌న్ సీఎం కుర్చీ ఎక్కిన నాటి నుంచి నిర్మాణాలను మరిచి..  కూల్చివేత ప‌ర్వానికి, విధ్వంసానికి తెర‌ లేపారు.  అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగిస్తే చంద్ర‌బాబుకు ఎక్క‌డ పేరు వ‌స్తుందన్న దుగ్ధతో,  భ‌యంతో రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని తెలిసినా, ప్ర‌భుత్వ  సొమ్ము వృథా అవుతుంద‌ని తెలిసినా.. అమ‌రావ‌తి రాజ‌ధాని కాదు.. మేము మూడు రాజ‌ధానులు చేస్తాం అంటూ జ‌గ‌న్‌ కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చారు. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేసుకొని అక్క‌డినుంచే పాల‌న సాగించేలా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, రాజ‌ధాని ఏర్పాటు అంటే అంత‌ తేలికైన విష‌యం కాదుక‌దా.. అనుభ‌వం లేని జ‌గ‌న్ కు అవేమీ తెలియ‌క మొండి వైఖ‌రితో ఏపీ ప్ర‌జ‌ల జీవితాలో ఆట‌లాడుకుంటూ వ‌చ్చాడు. ఇదిగో రేపు.. అదిగో ఎల్లుండి నుంచే విశాఖ నుంచి పాల‌న సాగిస్తామ‌ని చెప్పుకుంటూ వ‌చ్చిన జ‌గ‌న్‌.. అది సాధ్యంకాక‌పోయే స‌రికి ప్ర‌జ‌ల‌ను మ‌రోమాయా ప్ర‌పంచంలోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కోర్టులో చిక్కుల కారణంగా విశాఖ నుంచి పాల‌న సాగించ‌లేక పోతున్నామ‌ని చెప్పాడు. అంతేకాదు..  హైద‌రాబాద్ ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంటుంద‌ని విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విష‌యం తెలిసిందేన‌ని.. ఆ గ‌డువును మ‌రికొన్నేళ్లు పెంచ‌మ‌ని పోరాటం చేద్దామ‌ని చెప్పుకొచ్చాడు. ఉన్న రాజ‌ధాని అమ‌రావ‌తి  అభివృద్ధి చేయడం చేత‌కాని  జగన్ ప్ర‌భుత్వం ఇప్పుడు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని అంటూ కొత్తపాత పాడుతుండ‌టం ఏపీ ప్ర‌జ‌లను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త రావ‌డంతో.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌లేమ‌ని భావించిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకొనేలా హైద‌రాబాద్ అంటూ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి మ‌రోసారి ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కేందుకు కొత్త  నాట‌కానికి తెర‌లేపాడ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అయితే ఈ సారి జనం జగన్మాయలో పడరని కూడా చెబుతున్నారు. 

అయ్యో పాపం.. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ అస్త్రం!

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ ఎస్ పార్టీల మ‌ధ్య సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో వార్ తార స్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. బీఆర్ ఎస్ హ‌యాంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతిని వెలికితీసేందుకు   రేవంత్‌ ఉపక్ర‌మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్ల‌ర్లు కుంగడంపై సీఎం రేవంత్ స‌హా, కాంగ్రెస్ నేత‌లు బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కమిషన్ల కక్కుర్తి కోసం నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారు.. ఆధారాల‌తో నిరూపిస్తామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ క్ర‌మంలో అసెంబ్లీ స‌మావేశాల్లోనూ అధికార‌, విప‌క్ష పార్టీల స‌భ్యుల మ‌ధ్య ఇదే విష‌యంపై తీవ్ర‌ స్థాయిలో మాట‌ల యుద్ధం సాగింది. కాంగ్రెస్ వాద‌న‌కు కౌంట‌ర్ గా బీఆర్ ఎస్ స‌భ్యులు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నియంత్రణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) కి కాంగ్రెస్ ప్రభుత్వం అప్ప‌గించింద‌ని విమ‌ర్శ‌లు చేశారు. అదంతా కేసీఆర్ పాప‌మ‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల బాధ్య‌తలు అప్ప‌గించేది లేద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తేల్చి చెప్పేసింది.  మ‌రో రెండు నెల‌ల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిని చ‌విచూసిన‌ బీఆర్ ఎస్.. పార్ల‌మెంట్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. ఈ క్ర‌మంలో మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై సుదీర్ఘ చ‌ర్చ‌జ‌రుగుతున్నా హాజ‌రు కాని కేసీఆర్‌.. న‌ల్గొండ జిల్లా వేదిక‌గా బ‌హిరంగ స‌భ‌ నిర్వ‌హించారు. బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగం ఆసాంతం ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ ను ర‌గిల్చే విధంగా సాగింది. ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు ఏమీ లేవు.. ఇది ఎన్నిక‌ల స‌భ కాదంటూనే.. పార్ల‌మెంట్ ఎన్నిక‌లే టార్గెట్ గా కేసీఆర్ ప్ర‌సంగం సాగింది. ఒకానొక ద‌శ‌లో.. కేసీఆర్ కంట్రోల్ త‌ప్పి  మాట్లాడారన్న భావన పరిశీలకులలోనే కాదు, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ వ్యక్తమైంది. న‌ల్గొండ జిల్లాలో అడుగు పెట్ట‌నివ్వ‌రా.. ఎవ‌ర్రా న‌న్ను ఆపేది.. చంపుతారా.. న‌న్ను చంపుతారా.. దా వ‌చ్చి చంపు.. అంటూ ఉద్వేగ‌పూరిత‌మైన ప్ర‌సంగం చేయ‌డం ద్వారా కేసీఆర్‌ ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేశారు. అదే సమయంలో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్న‌మూ కేసీఆర్ ప్ర‌సంగంలో క‌నిపించింది. మీరెవ‌రూ అధైర్య‌ప‌డొద్దు.. అడుగుడునా ప్ర‌భుత్వాన్ని నిల‌దీయండి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.  రెండు నెల‌ల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్‌.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌త్తా చాటాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో వ‌చ్చిన త‌రువాత‌.. ఇన్నాళ్లు బీఆర్ ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య‌ నేత‌లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రికొంద‌రు బీఆర్ ఎస్ ను వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీనికి తోడు   బీఆర్ ఎస్ పార్టీ ప‌ట్టును నిలుపుకోవాలంటే పార్ల‌మెంట్ లో గ‌తంలో కంటే అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే  ప్ర‌జ‌ల్లో మాత్రం బీఆర్ ఎస్ పై వ్య‌తిరేక‌త ఉండ‌టం కేసీఆర్ ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత‌.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జాదర‌ణ పెర‌గ‌డం కేసీఆర్ ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నది. రోజు రోజుకు ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బ‌లంగా ఢీకొట్టాలంటే ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ ర‌గ‌ల్చ‌డంతో పాటు సానుభూతిని పొందాల‌ని కేసీఆర్ భావిస్తున్నట్లు క‌నిపిస్తున్నది. న‌ల్గొండ బ‌హిరంగ స‌భలో కేసీఆర్ ప్ర‌సంగం చూస్తే ఇదే విష‌యం అర్థ‌మ‌వుతున్నది. స్పష్టంగా చెప్పాలంటే.. వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు బీఆర్ ఎస్ పార్టీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య.  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ విఫ‌ల‌మైతే .. ఆ పార్టీ మ‌నుగడ ప్రశ్నార్థకమౌతుందని కేసీఆర్ ఆందోళ‌న చెందుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డంతోపాటు, సెంటిమెంట్ రెచ్చ‌గొట్ట‌డం ద్వారా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నాటికి వారిని బీఆర్ ఎస్ వైపు తిప్పుకోవాల‌న్నది కేసీఆర్ ప్లాన్ గా క‌నిపిస్తోంది. బీఆర్ఎస్ కు బలమైన ఆయుధం లాటి తెలంగాణ పేరును  పార్టీ నుంచి తొలగించేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ సెంటిమెంట్ కోసం వెంపర్లాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జనం మాత్రం సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలను కోరుకుంటున్నారంటున్నారు. మ‌రి కేసీఆర్ సానుభూతి, సెంటిమెంట్ అస్త్రం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏమేర‌కు ప‌నిచేస్తుందో వేచి చూడాల్సిందే.

ముష్టియా.. కళ్లు చెదిరే సంపాదన..!

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం పోకిరి. కలెక్షన్ వసూళ్లలో ఈ చిత్రం పాత రికార్డులను బద్దలు కొట్టింది. ఆ చిత్రంలో  సాఫ్టేవేర్ ఇంజినీర్ పాత్రలో బ్రహ్మనందం, ముష్టివాడు పాత్రలో ఆలీ మధ్య సంభాషణ... మాఫియాలాగా ముష్టియా.. అంటూ బ్రహ్మనందానికి ఆలీ చెప్పే సమాధానం.. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. అయితే ఆ ముష్టియానే ఆసరాగా చేసుకొని.. ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ.. కోట్లాది రూపాయిలు గడించింది. ఈ ముష్టి ఎత్తుకోవడం ద్వారా ఆ ఫ్యామిలీ రెండతస్తుల భవనం, 20 వేల రూపాయిలు ఖరీదు చేసే అధునిక సెల్ ఫోన్‌తోపాటు వ్యవసాయ భూమి, బైక్‌తోపాటు ఇండ్ల స్థలం.. అలాగే జస్ట్ ఆరు వారాల్లోనే 2.5 లక్షల రూపాయిల ఆ ప్యామిలీ సంపాదన చూసి పోలీసులే నోరు వెళ్లబెట్టేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన మద్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వెలుగులోకి వచ్చింది.   ఫిబ్రవరి 9వ తేదీన ఇండోర్ నగరంలో ముష్టి ఎత్తుకోంటున్న తల్లి ఇందిరా బాయితోపాటు 7 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె కుమార్తెను పోలీసులు అదుపులోకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో ఇందిరాబాయ్‌ వద్ద నుంచి 19,600 రూపాయిలు, అలాగే 7 ఏళ్ల వయస్సు ఉన్న ఆమె కుమార్తె నుంచి 6 వందల రూపాయిలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. ఆమె నుంచి వచ్చిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంత పోయారు. ఆమె స్వయంగా తన ఆస్తుల వివరాలు పోలీసులకు వివరించడంతో.. వారంతా కంగుతినడమే కాకుండా.. దొంగతనం చేయడం కంటే ముష్టి ఎత్తుకోవడమే ఉత్తమైన మార్గమేనంటూ ఆమె ఖాకీలకు హితబోధ చేయడం కోసమెరుపు. అయితే తమ వద్ద ఉన్న ఖరీదైన సెల్ ఫోన్ తాను వాడతానని... బైక్ మాత్రం తన భర్త వాడతాడని..ఇక పొలం అయితే పక్క రాష్ట్రం రాజస్థాన్‌లోని కోట సమీపంలో ఉందంటూ ఆమె సెలవివ్వడం గమనార్హం.  ఇందిరాబాయ్‌కు మరో నలుగురు చిన్నారులు ఉన్నారు. వారి వయస్సు10, 8, 3, 2 ఏళ్లు. వారిని యాచక వృత్తిలోకి దింపి.. ఇండోర్ నగరంలోని ప్రధాన కూడళ్లలో వారితో ముష్టి ఎత్తిస్తోంది. నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలు.. ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ మందిర్‌కు వెళ్లే మార్గం, లవ్ కుష్ స్క్వేర్ వద్ద వారిని ఉంచి.. వారి చేత ముష్టె త్తించుకోవడం.. దాంతో వారి రాబడి బాగా పెరిగిందని.. దీంతో ఆస్తుల బాగా కూడబెట్టారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మరోవైపు... ఇందిరా బాయ్‌తోపాటు ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆ సమీపంలోనే ఉన్న ఆమె భర్తతోపాటు మరో ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి పరారైయ్యారు.   ముష్టివారికి పునరావాసం కల్పించేందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి ఓ ఎన్జీవో పని చేస్తోంది. అందులోభాగంగా ఇండోర్‌లోని 38 ముఖ్య కూడళ్ల వద్ద ఉన్న 7 వేల మంది యాచకులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో సగానికి సగమంది చిన్నారులే ఉన్నారని.. అయితే వారి ఏడాది సంపాదన మాత్రం 20 కోట్ల రూపాయిలుగా ఉందని ఎన్జీవో సంస్థ నిర్వాహకులు వెల్లడిస్తుండడం గమనార్హం.

జగన్ నివాసాన్ని ముట్టడించిన ఎబివిపి కార్యకర్తలు 

రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి అనే నినాదంతో వారు 'ఛలో తాడేపల్లి' పేరిట ఆందోళనకు దిగారు. నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని వారు మండిపడ్డారు. సీఎం నివాసం ముట్టడి సందర్భంగా విద్యార్థి నేతలు ఒక్కసారిగా దూసుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడ్నించి మంగళగిరి పీఎస్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థి నేతలు పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. దొరికిన వాళ్లను ఓ వాహనంలోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ముట్టడిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థి నేతలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థి నేతలకు గాయాలైనట్టు సమాచారం.ఉపాధ్యాయుల పోస్టుల గురించి మాట్లాడని సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డీఎస్సీ విద్యార్థులు మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందల మంది డీఎస్సీ అభ్యర్థులు ఈరోజు రోడ్డెక్కారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించడానికి వచ్చారా లేకపోతే ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వచ్చారా అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని 23వేల పోస్టులతో మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు ఈ ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లలో డీఎస్సీ విడుదల చేయకపోవటం సిగ్గుచేటు, ఆవిరైపోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగ ఆశలు, సున్నాలలో నోటిఫికేషన్ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తే జగన్ ఒక్కసారి కూడా విడుదల చేయకపోవటం సిగ్గు చేటు అని విద్యార్థులు ఎద్దేవా చేశారు. "నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులకు పాల్పడుతుంది. తక్షణమే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే నిరుద్యోగుల సత్తా ఎమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం" అని విద్యార్థులు హెచ్చరించారు. గత నాలుగు సంవత్సరాలుగా మెగా, జంబో, మినీ డీఎస్సీ అంటూన్నారు కాని ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా విడుదల చేయకుండా జాప్యం చేశారని విద్యార్థులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వారం రోజులు లోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే పక్క రాష్ట్రంలో కేసీఆర్​కు పట్టిన పరిస్థితే జగన్​కు పడుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. ఏపీని నిరుద్యోగి రాష్ట్రంగా మారుస్తామన్న మీ హామీ ఏమైందని, నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మెగా డీఎస్సీ ప్రకటించకుంటే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం: నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వం వారం రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని విద్యార్థులు రోడ్డుపై బైటాయింపు ఆందోళన చేశారు.వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో జగన్మోహనరెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. వీరిని అరెిస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మద్దతు తెలిపారు. విద్యార్ధులు చదువుకోవడం వలన నిరుద్యోగ శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి అనడం దారుణం విద్యార్థులు మండిపడ్డారు.

జయప్రదకు అరెస్ట్ వారెంట్ 

చట్టానికి కళ్లు లేవు . న్యాయదేవత పట్టుకున్న త్రాసు ఎటువైపు తూగుతుందో అక్కడే న్యాయం ఉంటుంది. అంటే బరువు వైపు తూగడం వల్లే న్యాయం జరుగుతుంది. సాక్ష్యం బలంగా ఉండటం వల్లే ఇవ్వాళ అలనాటి జయప్రద న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టింది. ఆమెకు ఉన్న స్టార్ డమ్ , పొలిటికల్ ఇన్ ఫ్లూయెన్స్ అక్కరకు రాకుంబా పోయింది. చట్టం తన పని తాను చేసుకుపోయింది.   సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను సమస్యలు చుట్టుముట్టాయి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆ సమయంలో ఆమెపై అక్కడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది. అయితే కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో, గతంలో ఒకసారి ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. తదిపరి విచారణను ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. సినీ నటి.. మాజీ హీరోయిన్ జయప్రద చిక్కుల్లో పడ్డారు. పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నటైమ్ లో ఆమెపై పెట్టిన కేసుకు సబంధించి ప్రస్తుతం జయప్రదకు చిక్కులు తప్పేట్లు లేవు. జయప్రదకు ఎన్ని సార్లు నోటీస్లు ఇచ్చినా.. స్పందించకపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.  ప్రముఖ నటి జయప్రదకు ఈఎస్‌ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా జయప్రదకు మరోసారి షాక్‌ తగిలిందనే చెప్పాలి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ అయింది. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలంటూ రాంపుర్‌ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాంపుర్ నుంచి జయప్రద   పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.. వీటికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో జయప్రదకు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు.  దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. గతంలో కూడా ఒకసారి నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.  

జగన్ పై బ్రదర్ అనీల్ పాశుపతాస్త్రం!

గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన అంశాలన్నీ ఇప్పుడు రివర్స్ గేర్ లో ఆయన ఓటమికి కారణమౌతున్న అస్త్రాలుగా మారుతున్నాయి. గత ఎన్నికలలో జగన్ విజయానికి దోహదపడిన వాటిలో ప్రధానంగా ఆయన సోదరి, వైఎస్ షర్మిల పాదయాత్ర, ప్రచారం అలాగే విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి, ఆ తరువాత సరిగ్గా ఎన్నికల ముందు జరిగిన సొంత బాబాయ్ వివేకా హత్య వంటి అంశాలు ఇప్పుడు జమరోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలన్న గన్ కు  ఆశకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయని చెప్పవచ్చు.  ఔను నాడు తన అన్న అధికారం చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కోసం కాళ్లరిగేలా తిరిగి, గొంతు చినిగేలా ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు అదే అన్న ఓటమి కోసం కంకణం కట్టుకుని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టి రాష్ట్రం చుట్టేస్తున్నారు. నాడు విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి జగన్ పై జనం సానుభూతి పెరిగేలా చేయడానికి ఎంతగానో దోహదపడింది. ఇప్పుడు అదే కోడికత్తి కేసు జగన్ నాడు సానుభూతి కోసం ఆడిన డ్రామాగా ప్రజల ముందు ఆవిష్కృతమై, ఆ కేసులో నిందితుడు కోడికత్తి శ్రీను (జనుపల్లి శ్రీను) బలిపశువుగా మారారన్న భావన జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. అలాగే వైఎస్ వివేకా హత్య ఘటన కూడా జగన్ కు సానుభూతి వెల్లువెత్తి నాటి ఎన్నికలలో విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పడు ఆ కేసులో జగన్ నిందితుల పక్షాన నిలవడం, స్వయంగా సోదరి షర్మిల, వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా వివేకా హత్యకు రాజకీయ కారణాలున్నాయనీ, కడప ఎంపీ సీటు విషయంలో వివేకా ప్రదర్శించిన పట్టుదల కారణంగానే హత్య జరిగిందని చెప్పడంతో ఇప్పుడు వివేకా హత్య కేసు జగన్ కు యాంటీ సెంటిమెంట్ గా మారింది. నిందితుల పక్షాన నిలబడిన జగన్ పై ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా నాడు జగన్ విజయానికి దోహదపడిన అంశాలన్నీ నేడు రివర్స్ అయ్యాయి. ఆ ఆంశాలే జగన్ ను ఆయన పార్టీని గద్దె దించేందుకు వస్తున్న ఆస్త్రాలుగా మారాయి. ఇవే కాకుండా నాడు అంటే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విజయానికి మరో అంశం కూడా ఎంతగానో దోహదపడింది. అదే షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ క్రైస్తవ సంఘాలతో వరుస భేటీలు జరిపి వారిని జగన్ కు అనుకూలంగా మార్చడం. ఇప్పుడు 2024 ఎన్నికల సమయం వచ్చే సరికి అదే బ్రదర్ అనీల్ కుమార్ జగన్ కు వ్యతిరేకంగా క్రస్తవ సంఘాలతో భేటీలు నిర్వహిస్తూ వాటిని జగన్ కు వ్యతిరేకంగా ఏకం చేస్తున్నారు.  మామూలుగానే రాజకీయాలలో కులం కార్డు విజయానికి దోహదపడే అంశంగా అంతా పరిగణిస్తారు. ఇక మతం కార్డైతే తిరుగేలేని అస్త్రంగా భావిస్తారు. గత ఎన్నికలలో మతం అస్త్రాన్ని అప్పటి విపక్ష నేతకు అండగా, అప్పటి అధికార పార్టీ తెలుగుదేశంకు వ్యతిరేకంగా సంధించిన బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు అదే అస్త్రాన్ని జగన్ కు వ్యతిరేకంగా సంధిస్తున్నారు.  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తన సతీమణి వైస్ షర్మిలకు మద్దతుగా బ్రదర్ అనీల్ కుమార్ రంగంలోకి దిగారు.  నాడు జగన్ విజయం కోసం ఆయన ఏ విధంగా పని చేశారో, అదే విధంగా ఇప్పుడు జగన్ ఓటమి కోసం పని చేస్తున్నారు.   బ్రదర్ అనీల్ కుమార్ కు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవసమాజంలో ఒక ఇమేజ్ ఉంది.  ఆ ఇమేజ్ ను గత ఎన్నికలలో  బావమరిది జగన్ ని సీఎం చేయాలన్న లక్ష్య సాధన కోసం ఉపయోగించిన బ్రదర్ అనీల్ కుమారు ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఉపయోగిస్తున్నారు.  నాడు అనిల్ ప్రభావంతో రాష్ట్రంలోని క్రేస్తవ సమాజం మొత్తం జగన్ కు మద్దతుగా నిలిచింది. రానున్న ఎన్నికల్లో అదే అనీల్ ప్రమాభంతో రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం జగన్ వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తోంది. జగన్ పైకి మతం అనే పాశుపతాస్త్రాన్ని బ్రదర్ అనీల్ కుమార్ విశాఖ నుంచి సంధించారని చెప్పవచ్చు. ఆయన మంగళవారం విశాఖలో మత పెద్దలతో భేటీతో రాష్ట్రంలోని క్రైస్తవ మతస్థులను జగన్ కు వ్యతిరేకంగా ఏకతాటికి తీసుకు వచ్చే ప్రయత్నానికి ప్రారంభంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.