నువ్వు చొక్కా మడతపెడితే.. జనం కుర్చీ మడతపెడతారు.. జగన్ కు బాబు వార్నింగ్!

సీఎం జగన్   ఐదేళ్ల  పాలనపై సీనియర్ జర్నలిస్టు ధర్మాగ్రహమే విధ్వంసం అనే పుస్తకంగా రూపుదిద్దుకుంది. ఈ పుస్తకావిష్కరణ గురువారం ( ఫిబ్రవరి 15) విజయవాడలో జరిగింది. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన  విధ్వంసం రాష్ట్ర వాస్తవ సరిస్థితికి అద్దం పట్టింది. అదే విషయాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు చెప్పారు.   ప్రజలతో సైకో అని పిలిపించుకునే ఏకైక ముఖ్యమంత్రి జగనేన్నారు. విధ్వంస పాలనపై తిరగబడతారో, బానిసలుగా ఉంటారో…ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.   ఈ ప్రభుత్వంలో అందరం బాధితులమేనన్నారు. దళితులు, అమరావతి రైతులు, ఉద్యోగులు, పవన్ కళ్యాణ్…తానూ ఇలా బాధితుడు కాని వారు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరని చెప్పిన చంద్రబాబు. ఈ పుస్తక రచయత ఆలపాటి సురేష్ కూడా రేపో మాపో బాధితుడిగా మారతారన్నారు.  జగన్ పాలన ఐదేళ్లలో జరిగిన సంఘటనలు, విధ్వంసాన్ని ఆలపాటి చాలా ధైర్యంగా పుస్తకంగా రాశారన్నారు.  దేశ చరిత్రలో ఒక సీఎం విధ్వంస  పాలనపై పుస్తకం రాయడం ఇదే మొదటిసారి.  అన్నారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే... ఒక ప్రభుత్వం..ఒక పాలకుడు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేశాడో చెప్తూ సురేష్ పుస్తకం రాశారు. ప్రభుత్వ టెర్రరిజంపై పుస్తకం తీసుకురావడం చాలా సంతోషం.  2019 నుండి రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, అప్రజాస్వామిక పోకడలు, దారుణాలు..ఇలా అన్ని సంఘటనలు పుస్తకంలో ప్రస్తావించడం అభినందనీయం. ఒక జర్నలిస్ట్ గా సమాజాన్ని విభిన్నకోణాల్లో చూస్తారు..రాష్ట్రంలోని పరిస్థితిని చూసి చలించి సురేష్ పుస్తకం రాశారు. ప్రజలు నమ్మి గెలిపించిన ప్రభుత్వం ఏ విధంగా నమ్మించి వంచించింది, ఛిన్నాభిన్నం చేసిందో వివరించారు. సమాజంపై బాధ్యతతో రాష్ట్ర దుస్థితిని చూసి పుస్తకం రాశారు. నా మనసులో ఏముందో, 5 కోట్ల ప్రజల మనసులో ఏముందో స్పష్టంగా రాసిన వ్యక్తి ఆలపాటి సురేష్. నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది. రివర్స్ పాలనలో రాష్ట్ర భవిష్యత్ విధ్వంసం అయింది. నమ్మి అధికారం ఇచ్చినందుకు సైకోపాలనలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు విధ్వంసం అయ్యాయి. బీసీ, దళిత, మైనారిటీల ఆత్మగౌరవం విధ్వంసం అయ్యాయి. ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్, భావితరాల భవిష్యత్ దెబ్బతింది. రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింటే దాన్ని తీసుకురావాలంటే సమయం పడుతుంది. 185 అంశాలతో పలు సంఘటనలు గురించి రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శత్రువు కూడా పడని బాధ అమరావతి రైతులు పడ్డారు. ప్రజలు, భావితరాలకు గుర్తుండే విధంగా సురేష్ రాసిన పుస్తకం అమరావతి మహిళలకు, మహిళారైతులకు అంకితం చేయడంలో నిజాయితీ ఉంది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ముందకు రారు..రోడ్డు వేయాలన్నా భూమి చ్చేందుకు ముందుకురారు. పరిహారం ఇచ్చి భూసేకరణ చేసే పరిస్థితి ప్రస్తుతం వచ్చిది. కానీ అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ లో రూపాయి కూడా తీసుకోకుండా రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారంటే అది త్యాగం. ఇలాంటి దుర్మార్గుడు వచ్చి, నష్టం జరుగుతుందని రైతులు అనుకుని ఉంటే నాడే నాకు నమస్కారం పెట్టి మా జోలికి రావొద్దు అని చెప్పేవాళ్లు. శత్రువుకు కూడా రాని బాధను అమరావతి పడ్డారు. అమరావతి దేవతల రాజధాని. అందర్నీ అడిగాక అమరావతి అని రాజధానికి పేరు పెట్టాం. ఒక రాజధాని ప్రజారాజధాని కావాలని..అన్ని దేవాలయాల్లో, చర్చిల్లో మసీదుల్లో పూజలు చేసి అక్కడి మట్టిని తీసుకొచ్చి పునీతం చేశాం. అంతమంది దేవుళ్లు కూడా ఈ దుర్మార్గుడి  నుండి అమరావతిని కాపాడలేకపోయారు. అమరావతి అనేది ఇక్కడి రైతుల రాజధాని మాత్రమే కాదు…అక్కడ భూమి ఉంది..అక్కడ రాజధాని కట్టి ఉంటే ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే అవకాశం ఉండేది. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినప్పుడు భూమి విలువ లక్ష.. తర్వాత కోట్లకు పెరిగింది. పదేళ్లలో అమరావతిని ఒక నమూనాకు తెచ్చి ఉంటే మీకు పరిహారంతో పాటు…అమరావతిని కట్టి కూడా ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చేది..అది రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉండేది. దాన్ని విధ్వసం చేశారు. అమరావతిలో బిల్డింగ్ లు కడితే జీఎస్టీ వచ్చేది..దాని ద్వారా ఆదాయం వచ్చేది. లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి పెరిగేది..దాన్ని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టేవాళ్లం. ఇప్పటి దాకా మూడు రాజధానులు అన్నారు..మళ్లీ నాలుగో రాజధాని అంటున్నారు హైదరాబాద్ అని. నువ్వు దేహీ అంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా ప్రజలు. పరిశ్రమలు తరిమేశారు. ఎదురుదాడి చేస్తే భయపడతారని అనుకుంటున్నారు. హైదరాబాద్, బెంగలూరు, చెన్నై లాంటి రాజధాని కావావాలని ఇప్పుడు అంటున్నారు. మళ్లీ మా విధానం మూడు రాజధానులే అని చెప్తున్నారు అంటే ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో చూడండి. ఒక సైకో విధానాలు ఇవి. ఇలాంటి పనులు చేసి ఎవరైనా సమర్థించుకుంటారా.? ప్రజావేదిక కూల్చారు. నేను అక్కడే ఉన్నా..అద్దె ఇంట్లో నుండి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ప్రజావేదిక కూల్చారు…శిధిలాలు తొలగించలేదు. దాన్ని చూసి నేను ప్రతిరోజు బాధపడాలని కోరుకునే వ్యక్తిని ఏమనాలి.? ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావేదిక ఇవ్వండని అడిగా…నాకు ఇవ్వకపోతే మరో దానికి వాడుకోవచ్చు కదా. ప్రజలు చూస్తుండగానే దీన్ని కూల్చేయండని చెప్పిన వ్యక్తి సైకో సీఎం. ఏ సీఎం, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే…నా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని చేస్తారు. కానీ వచ్చే పరిశ్రమలు కూడా తరిమేసే సీఎంను జగన్ ఒక్కడినే చూశా. సౌత్ కొరియాకు 3 సార్లు వెళ్లి కియాను తెచ్చాం. చిత్తూరులో పరిశ్రమలు పెట్టి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పెడితే వారిని వేధించి అక్కడి నుండి తరిమేశారు. వేధింపులు తట్టుకోలేక జయదేవ్ రాజకీయాల నుండి తప్పుకున్నారు. నేను- పవన్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే దృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అన్నా క్యాంటీన్ ను రద్దు చేశారు. జన్మదినం, పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసేందుకు అన్నక్యాంటీన్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. తిరుపతిలో ఎన్టీఆర్ అన్నదానం ప్రవేశపెట్టారు. పేదవాడికి తిండిపిడితే భరించలేని మనస్థత్వం కలిగిన వ్యక్తి జగన్. ఇప్పటంలో జనసేన మీటింగ్ కు స్థలం రైతులు ఇచ్చారు. దీంతో రోడ్డు వెడల్పు పేరుతో వారి ఇళ్లు తొలగించారు.  దళితుడు మాస్క్ అడిగినందుకు ఉద్యోగం నుండి తొలగించి పిచ్చివాడిని చేసి చంపేశారు. రంగనాయకమ్మ ఎల్జీపాలిమర్స్ కు సంబంధించి ట్వీట్ చేసింది. వెంటాడి వ్యాపారం చేయనీయకుండా చేశారు. హోటల్ పోయింది..ఇతర వ్యాపారానికి అనుమతి ఇవ్వకుండా చేశారు. దీంతో జీవితంలో మళ్లీ ఇక్కడకు రాలేనని హైదరాబాద్ వెళ్లిపోయారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించారు…భయపెట్టారు. ఆ వేధింపులు తట్టుకోలేక కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మనిషి ఎప్పుడు చనిపోతారో తెలీదు…కానీ ఇంత బలవంతపు మరణం చెందారంటే ఆలోచించాలి. సోదరి శీలాన్ని కాపాడటానికి తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు నోట్లో పెట్రోల్ పోసి నిప్పు అంటించి అమర్నాథ్ గౌడ్ ను చంపేశారు. రాష్ట్రంలో అసలు రక్షణ ఉందా.?  సొంత చెల్లి, జన్మనిచ్చిన తల్లిపైనా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో చూశారు. నేను కూడా  అసెంబ్లీలో  అవమానానికి గురయ్యా. ఆనాడే చెప్పా అసెంబ్లీని గౌరవ సభగా మార్చిన తరవాత వస్తానని. క్లైమోర్స్ పెట్టినప్పుడు కూడా నేను భయపడలేదు. ప్రాణానికి బయపడలేదు…ఈ దుర్మార్గులు చేసిన అవమానికి కన్నీళ్ల పెట్టాను. ఒక దళిత డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడు. దర్జాగా సీఎం పక్కన తిరుగుతున్నాడు. సమైక్య రాష్ట్రంలో సీఎంగా ఉన్నసమయంలో ఒక నేరస్తుడు ఆడవాళ్లను చంపి పారిపోయేవాడు. పశువులను మేపే వారిని ఎంపీకి చేసుకునేవాడు.. డబ్బులు, బంగారు ఏమీ తీసుకునేవాడు కాదు చంపడమే అతని లక్ష్యం. సుమారు 30 మందిని చంపాడు. విచారణ చేస్తే అతను ఎప్పుడో జీవీతంలో జరిగిన ఘటన గుర్తంచుకుని మహిళలను చంపుతున్నాడు. జగన్ కూడా సందపాదనే ధ్యేయంగా అమరావతి, పోలవరంను ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. మద్యం, ఇసుక, మైనింగ్ ఏది దొరికితే అది దోచేశాడు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జనార్థన్ నాయుడు అనే వ్యక్తి నుండి క్వారీలు లాక్కుని మైనింగ్ చేసుకుని దోచుకున్నాడు. విద్యుత్ బెల్లు కూడా చెల్లించకుండా బాధితుడినే కట్టాలని, లేదంటే అరెస్టు చేయిస్తాతానని బెదిరిచాడు. మీడియా వాళ్లు కూడా ఈ ప్రభుత్వంలో మొదటి బాధితులు. కేసులు పెట్టి వేధిస్తున్నారు. పవన్ బీమవరం వెళ్లాల్సి ఉంటే హెలికాప్టర్ అనుమతిలేదు అన్నారు..నాకు పర్చూరులో మీటింగ్ కు అనుమతి లేదని చెబుతున్నారు. ప్రజలకు సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరకు వెళ్తాం…ప్రభుత్వమే సమస్య అయితే ఏం చేయాలి.?  సమాజంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడు చేసేవాళ్లు పాలకులు అయితే ప్రజలు భయపడే పిరిస్థితి. తర్వాత బానిసలు అయ్యే పరిస్థితి వస్తుంది. చెడును పూర్తిగా నివారించడానికి నడుం బిగించాలి. కులం, మతం, ప్రాంతం, వర్గం అని లెక్కలు వేసుకుంటే కదరదు..వాటికి అతీతంగా ఉండాలి. యువత ఉంది, సముద్రం ఉంది, బంగారం పండించే రైతులు ఉన్నారు.. కానీ ఈ రాష్ట్రం ఎక్కడికి పోయిందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ పుట్టిన వాళ్లు పక్కన రాష్ట్రాలకు వెళ్లి బ్రహ్మాండంగా రానిస్తున్నారు..కానీ మనం మాత్రం బాధపడుతున్నాం. భయం ఉన్న దగ్గర స్వేచ్ఛ ఉండదు..స్వేచ్ఛ లేని చోట అభివృద్ధి ఉండదు..అభివృద్ధి లేని చోట ఆలోచన కూడా ఉండదు. నేను ఐటీ అంటే ఎగతాళి చేశారు.. కానీ నేడు ఒక్కో ఊరి నుండి పది మంది దాకా విదేశాలకు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి తోడు ఆర్టిఫియల్ ఇంటెలిజన్స్ వస్తోంది…దాన్ని అడాప్ట్ చేసుకుంటే నిర్ణయాలు త్వరగా ఉంటాయి.  వాటని ఉపయోగించుకునే సత్తా తెలుగు ప్రజలకు ఉంది. తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలని నాకు, వపన్ కు ఉన్న సంకల్పం. తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయడానికి పనిచేస్తాం. మీరు కూడా ఆలోచించాలి..తిరగబడతారా..బానిసలుగా ఉంటారో మరో 54 రోజుల్లో మీరు నిర్ణయించుకోవాలి. సీఎం సభలో మాట్లాడుతూ…చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చింది అంటున్నారు. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారు.  నీకు కుర్చీయే లేకుండా పోతుంది. సీఎం హోదాలో ఉన్నావ్..ఎన్నికలు అంటే ద్వంద్వ యుద్ధం, చొక్కాలు మడతపెట్టడానికి కాదు. మంచికి కూడా హద్దులు ఉంటాయి. పిచ్చిపిచ్చి కూతలు కూస్తే దానికి ప్రజలు పరిష్కారం చూపిస్తారు. ఐదేళ్ల నరకాన్ని ప్రతి ఒక్కరూ చర్చించాలి. సురేష్ కుమార్ ను ప్రజల తరపున అభినందిస్తున్నా.’ 

బీఆర్ఎస్ కు భారీ షాక్.. కారు దిగేసిన కీలక నేతలు

లోక్ సభ ఎన్నికల ముంగిట  బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది.  పార్టీకి చెందిన నలుగురు ముఖ్య నేతలు కారు దిగి చేయందుకోవడానికి రెడీ అయిపోయారు. అసలే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంతో డీలా పడిన బీఆర్ఎస్ కు ఇప్పుడు వరుసగా కీలక నేతలు గుడ్ బై చెబుతుండటంతో దిక్కుతొచని పరిస్థితి ఎదురైనట్లు కనిపిస్తోంది. పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఇహనో ఇప్పుడో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.  ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్  వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో వీరు కాంగ్రెస్ లో  చేరనున్నారు. ఇటీవల    పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు  సీఎం రేవంత్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే వీరు కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది.  శుక్రవారం (ఫిబ్రవరి 16) గాంధీభవన్ లో వీరి చేరిక కార్యక్రమం అట్టహాసంగా జరగనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.   అయితే బీఆర్ఎస్ నుంచి ఈ వలసల ప్రవాహం ఇక్కడితో ఆగే అవకాశం లేదంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయిపోతుందని కాంగ్రెస్ వర్గాలే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంటున్నాయి.  రాష్ట్ర ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ కొడదామని భావించినప్పటికీ, జనం అందుకు విరుద్ధంగా తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షానికే పరిమితం చేశారు తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్   జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం సత్తా చాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో  కాంగ్రెస్   ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి నిండా మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే గ్రేటర్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రేటర్ లో తిరుగులేని బలం ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ కు అది వాపు మాత్రమేనని అవగతమయ్యేలా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.  గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడానికి  ఎంతో సమయం పట్టదన్నట్లుగా వలసల ప్రవాహం కొనసాగుతోంది. కేవలం కార్పొరేటర్లే కాకుండా ఎమ్మెల్యేలు సైతం కారు దిగిపోవడానికి తొందరపడుతున్నట్లుగా కనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కొడాలి నాని, వల్లభనేని వంశీకి జగన్ పంగనామాలు.. సర్వేల పేరుతో నోటికెట్?

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి..  సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్  ఇంకా వెలువడకుండానే.. ఈ అధికార పార్టీ ఓటమిని అంగీకరించేసినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి.  దీనికితోడు సీఎం అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించుకున్న స‌ర్వేల్లోనూ ఇవే ఫ‌లితాలు వెల్ల‌డైన‌ట్లు తెలిసింది. దీంతో అల‌ర్ట్ అయిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు నియోజ‌క వ‌ర్గాల్లో సిట్టింగ్ ల‌కు షాకిచ్చారు. ఇన్నాళ్లు.. మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిని నేనే అని చెప్పుకుంటూ వ‌చ్చిన ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు జ‌గ‌న్ రాత్రికిరాత్రే షాకిచ్చారు. కొంద‌రికి అస‌లే టికెట్ ఇవ్వ‌న‌ని తేల్చిచెప్ప‌గా.. మ‌రికొంద‌రికి ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌కాశం క‌ల్పించారు. అయితే, తాజాగా ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ కు అత్యంత విశ్వాసపాత్రులుగా, నమ్మిన బంట్లుగా గుర్తింపు పొందిన కొడాలి నాని, వల్ల‌భ‌నేని వంశీల‌కు సైతం జ‌గ‌న్ స‌ర్వేల పేరుతో షాకిచ్చేందుకు రెడీ అయిపోయారన్న ప్రచారం వైసీపీ సర్కిల్స్ లోనే జోరుగా సాగుతోంది.   వైసీపీలో లోక్ స‌భ‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిల మార్పు  వ్యవహారం కొనసాగుతూనే ఉంది.  ఇప్ప‌టికే  ఆరు జాబితాల‌ను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచ‌న‌ల‌తో  వైసీపీ నేత‌లు విడుద‌ల చేశారు. ఇందులో మొత్తం 32 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీల‌పై వేటు వేసిన జ‌గ‌న్‌.. మ‌రో రెండు రోజుల్లో ఏడో జాబితాను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఆరు జాబితాల్లో కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ పేర్లు లేక‌పోవ‌టం వైసీపీ శ్రేణుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కొడాలి నాని గుడివాడ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి ప్లేటు ఫిరాయించి వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తున్నారు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇద్ద‌రూ కూడా  మూడు రోజుల క్రితం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం జ‌గ‌న్ అంత‌ర్గ‌తంగా చేయించిన స‌ర్వేల వివ‌రాల‌ను వారి ముందు ఉంచిన‌ట్లు, స‌ర్వేల్లో వారిద్ద‌రూ ఓడిపోతార‌ని తేలిన‌ట్లు వైసీపీ వ‌ర్గీయుల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. కొడాలి నాని గ‌తంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ, ఇప్పుడూ టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ జ‌గ‌న్ మెప్పును పొందుతున్నారు. కొడాలి నానికి టికెట్ ఇవ్వ‌క‌పోతే వైసీపీ శ్రేణుల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌న్న కార‌ణంతో నానికి గుడివాడ నుంచి మ‌రోసారి టికెట్ ఇచ్చినా.. వంశీకి జ‌గ‌న్ మొడిచేయి చూపించడం ఖాయమని వైసీపీ వ‌ర్గీయుల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్ తో పాటు చంద్ర‌బాబు కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో  హ‌ద్దులు దాటి బూతులు సైతం మాట్లాడిన విష‌యం తెలిసిందే. నాని భాష‌పై తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చ‌ర్చ‌జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో నానిపై గుడివాడ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నద‌ని జ‌గ‌న్ స‌ర్వేల్లో తేలిన‌ట్లు స‌మాచారం.  వ‌ల్ల‌భ‌నేని వంశీకి వైసీపీ నుంచి గ‌న్న‌వ‌రం టికెట్ ఇచ్చే విష‌యంలో జ‌గ‌న్ ఆస‌క్తి చూప‌డం లేద‌ని పార్టీ వర్గాల నుంచే అందుతున్న స‌మాచారం. గ‌న్న‌వ‌రం కాకుండా వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని వంశీకి జ‌గ‌న్ సూచించిన‌ట్లు కూడా ఆ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై అభ్యంతరకర వ్యాఖ్య‌లు చేసిన‌నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే  గ‌న్న‌వ‌రం ప్ర‌జ‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. జ‌గ‌న్ సొంతంగా చేయించుకున్న స‌ర్వేల్లోనూ ఇదే విష‌యం వెల్ల‌డైన‌ట్లు స‌మాచారం. ఏడో విడ‌త జాబితాలో గ‌న్న‌వ‌రం నుంచి వంశీకి కాకుండా మ‌రో వ్య‌క్తికి ఇంచార్జి బాధ్య‌త‌ల‌ను జ‌గ‌న్ అప్ప‌గిస్తార‌ని, వంశీకి స‌ర్వేల పేరుతో హ్యాండివ్వ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది.  తెలుగుదేశం పార్టీకి గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన ఓటుబ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకును వైసీపీ వైపుకు తిప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్య‌క్తిని తీసుకొచ్చి బ‌రిలోకి దించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో నూజివీడు తెలుగుదేశం నేతపై వైసీపీ అధిష్టానం గురిపెట్టిన‌ట్లు స‌మాచారం. అయనను వైసీపీలోకి తీసుకొచ్చి గ‌న్న‌వ‌రం నుంచి బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ వ్యూహంగా తెలుస్తోంది. తెలుగుశం నుంచి  వైసీపీలోకి వస్తారని  జగన్ అండ్ కో భావిస్తున్న వ్య‌క్తి గ‌తంలో గ‌న్న‌వ‌రం నుంచి ఇండిపెండెంట్  అభ్య‌ర్థిగా పోటీచేసి గెలిచారు. దీంతో ఆయనను గన్నవరం బ‌రిలో నిల‌ప‌డం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకుతో పాటు తెలుగుదేశం ఓటు బ్యాంకుకూడా క‌లిసివ‌స్తుంద‌న్నది జ‌గ‌న్ ప్లాన్ గా వైసీపీ వ‌ర్గీయులు చెబుతున్నారు. అదే జ‌రిగితే వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏమిట‌నేది ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చంద్ర‌బాబు నివాసానికి వైసీపీ నేత‌ల క్యూ.. జగన్ శిబిరంలో ఆందోళన

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య‌నేత‌లు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నియంతృత్వ పోక‌డ‌లకు, ప్ర‌జావ్య‌తిరేక‌ విధానాలకు విసిగి చంద్ర‌బాబు చెంతకు చేరుకుంటున్నారు.  ఫ‌లితంగా చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద వైసీపీ నేత‌ల క్యూ రోజురోజుకు పెరిగిపోతోంది. జ‌గ‌న్ తీరును తీవ్రంగా వ్య‌తిరేకించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిలు ఇప్ప‌టికే  తెలుగుదేశంలో చేరిన విష‌యం తెలిసిందే. పెల‌మనూరు ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి తెలుగుదేశం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  తాజాగా న‌ర్స‌రావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు చంద్ర‌బాబు నివాసానికి వెళ్లి ఆయ‌న‌తో భేటీ అయ్యారు. త్వ‌ర‌లో దేవ‌రాయులు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారు.   మ‌రోవైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల రెడ్డి కూడా తెలుగుదేశంవైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాలలో ప్రచారం జరుగుతోంది.  ఆయ‌న‌తో పాటు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆదాల ప్ర‌భాక‌రెడ్డిలు సైతం టీడీపీ వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే వీరు హైద‌రాబాద్ లో చంద్ర‌బాబుతో భేటీ అయిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది.  వీరితో పాటు వైసీపీలోని ద్వితీయ స్థాయి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో టీడీపీలో చేరుతున్నారు. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ప్ర‌జా సంక్షేమం మ‌రిచి.. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై క‌క్ష‌సాధింపుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టానికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారని ప‌లువురు వైసీపీ నేత‌లు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవ‌లం బటన్ నొక్కి ఖాతాల్లో డ‌బ్బులేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని జ‌గ‌న్ పూర్తిగా విస్మ‌రించార‌ని, త‌ద్వారా ఉపాధి కోసం  యువత హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు పోవాల్సి వ‌స్తుంద‌ని వైసీపీ నేత‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ  క్ర‌మంలోనే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రోజురోజుకు వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. న‌ర‌స‌రావుపేట నుంచి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీలో చేరేందుకు వైసీపీ సీనియ‌ర్ నేత అట్లా చిన్న వెంక‌ట‌రెడ్డి వంద‌కుపైగా కార్ల ర్యాలీతో చంద్ర‌బాబు నివాసానికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుండ‌టంతో ఆ పార్టీ నేత‌లు తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలవైపు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉండ‌టంతో వైసీపీ శిభిరంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ‌న్ నియంతృత్వ పోక‌డ‌తో ఇప్ప‌టికే త‌ల‌లు ప‌ట్టుకుంటున్న వైసీపీ  సీనియ‌ర్ నేత‌లు.. కీల‌క నేత‌లుసైతం పార్టీని వీడుతుండ‌టంతో  ఏం చేయాలో, ఈ వలసలను ఎలా నిరోధించాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తాజా ప‌రిణామాల‌ను చూసి.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర ప‌రాభ‌వం ఎదుర‌వ్వ‌డం ఖాయ‌మ‌న్న భావ‌న‌కు వైసీపీలోని సీనియ‌ర్ నేత‌లు ఇప్పటికే వచ్చేసినట్లు పార్టీ వర్గాలే చెబుతుతున్నాయి.  మ‌రోవైపు ప‌లు స‌ర్వేలుసైతం  జ‌గ‌న్ కు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని తేట‌తెల్లం చేశాయి. ఈసారి వైసీపీకి క‌నీసం 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాలుకూడా వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని ప‌లు ప్ర‌ధాన స‌ర్వేలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి. దీంతో అల‌ర్ట్ అవుతున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను పోగొట్టుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించి ఏదోఒక విష‌యాన్ని తెర‌పైకి తెచ్చి ఏపీ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం జనంలో జగన్ పట్ట ఆగ్ర‌హాన్ని మరింత పెంచేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మ‌రోవైపు అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయించుకుంటున్న జ‌గ‌న్.. ప‌లువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు టికెట్ నిరాక‌రిస్తున్నారు. వారి స్థానంలో వేరే ప్రాంతాల‌కు, వేరే జిల్లాల‌కు చెందిన నేత‌ల‌ను బ‌రిలోకి దింపుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న వైసీపీ శ్రేణులు జ‌గ‌న్ తీరుపై ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మా నేత‌ను కాద‌ని, ఎక్క‌డో వేరే ప్రాంతాలు, జిల్ల‌ల నేత‌ల‌ను తీసుకొచ్చి ఇక్క‌డ నిల‌బెడితే మేం ఎలా ఓటేస్తామంటూ వైసీపీ అధిష్టానాన్ని ప‌లువురు వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి. దీంతో జ‌గ‌న్ వ్యూహం అట్ట‌ర్ ప్లాప్ కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌లే ఆందోళ‌న చెందుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ తీరుతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మిని చ‌విచూడ‌బోతుంద‌ని స‌ర్వేల్లో తేట‌తెల్లం కావ‌డంతోపాటు.. రాష్ట్ర ప్ర‌జలు, వైసీపీ శ్రేణులుసైతం అభిప్రాయ ప‌డుతున్నారు.

విధ్వంసం ర‌చ‌యిత‌ను స‌న్మానించిన కేశినేని చిన్ని

సీనియ‌ర జ‌ర్న‌లిస్ట్ ఆల‌పాటి సురేష్ ను విజ‌య‌వాడ పార్ల‌మెంట్ తెలుగు దేశం పార్టీ నాయ‌కుడు కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌న్మానించారు.   2019 నుంచి 2024 వ‌ర‌కు ఎపి రాజ‌కీయాలు,  రాష్ట్రంలో జ‌రిగిన దారుణ సంఘ‌ట‌న‌లు, దాడుల‌పై.. ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణ‌యాల‌పై, అమ‌రావ‌తి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందుల‌పై ఓ జ‌ర్న‌లిస్ట్ వ్యాఖ్య‌గా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్  ఆల‌పాటి సురేష్ కుమార్ గారు ర‌చించిన విధ్వంసం పుస్త‌కావిష్క‌ర‌ణ గురువారం (ఫిబ్రవరి 15) విజ‌య‌వాడ‌లోని   ఎ1 క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో జ‌రిగింది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్  ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.  ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ  స‌భ‌లో కేశినేని చిన్ని ప్రసంగిస్తూ.. జ‌గ‌న్ అధికార పీఠం ఎక్కిన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న అనాలోచిత నిర్ణ‌యాలతో ఆంద్ర‌ప్ర‌దేశ్ ను ఇటు సంక్షేమంలో ...అటు అభివృద్దిలో అంథ‌కారంలోకి నెట్టేశారని విమ‌ర్శించార‌.  ఈ నాలుగున్న‌రేళ్ల జ‌గ‌న్  పాల‌న‌లో రాష్ట్రంలో ఇబ్బంది ప‌డ‌ని వారంటూ ఎవ‌రూ లేరనీ,  మూడు రాజ‌ధానులంటూ అమ‌రావ‌తి రైతుల‌ను రోడ్డెక్కించారు,  ద‌ళితుల‌పై జ‌రిగిన ఆకృత్యాలు... చేసిన అఘాయిత్యాలకు అయితే లెక్కే లేదన్నారు.  ఎపి లో ఈ నాలుగున్న‌రేళ్ల కాలంలో జ‌రిగిన అలాంటి సంఘ‌ట‌నల‌కు అక్ష‌ర రూపం...ఆల‌పాటి సురేష్ కుమార్ గారు రాసిన ఈ విధ్వంసం పుస్త‌కమ‌న్నారు.. ఈ పుస్త‌కం క‌వ‌ర్ పేజీ చూస్తేనే  జ‌గ‌న్ పాల‌న ఎలా సాగిందో..ఎంత దుర్మార్గ పూరిత ఆలోచ‌న‌లు చేశారో అర్ధమ‌వుతుంద‌ని కేశినేని శి చిన్న‌ గారు అన్నారు.  ఈ పుస్త‌కాన్ని  ర‌చ‌యిత ఆల‌పాటి సురేష్ కుమార్  అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌కు అంకిత‌మిచ్చి వారి గౌర‌వం పెరిగేలా చేశార‌ని  వ్యాఖ్యానించారు.   ఈ విధ్వంసం పుస్త‌కాన్ని ర‌చ‌యిత ఆల‌పాటి గారు 572 పేజీల్లో ముగించారు. జ‌గ‌న్ పాలనలో అవినీతి గురించి  ఎన్ని పేజీలు రాసినా సరిపోదన్నారు.  ఆ  పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌కు విశాలాంధ్ర ఎడిట‌ర్ ఆర్.వి.రామారావు అధ్య‌క్ష‌త వ‌హించారు.ముఖ్యఅతిథిగా హాజ‌రైన మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు   విధ్వంసం పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. మ‌రో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జ‌న‌సేన అధ్య‌క్ష‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్  తొలి ప్ర‌తిని అందుకున్నారు. ఇంకా విశిష్ట అతిధులుగా  సిపిఐ రాష్ట్ర కార్య ద‌ర్శి కె.రామ‌కృష్ణ,  ఆంధ్ర‌ప్ర‌దేశ్ బార్ కౌన్సిల్ స‌భ్యుడు, సీనియ‌ర్ న్యాయ‌వాది ముప్పాళ్ల సుబ్బారావు, అమ‌రావ‌తి పరిర‌క్ష‌ణ స‌మితి అధ్య‌క్షులు ఏ.శివారెడ్డి,  అమ‌రావ‌తి బ‌హుజ‌న జె.ఎ.సి అధ్య‌క్షులు పోతుల బాల కోట‌య్య  హాజరై ప్ర‌సంగించారు..

ఇండియా కూటమికి  ఫరూక్ అబ్దుల్లా షాక్ 

ప్రపంచంలో ఏ ఇద్దరి మనస్థత్వాలు ఒకేలా ఉండవు. ఓ వ్యక్తిని తన దారిలో తెచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. రాజకీయ పార్టీలు అయితే  ఆయా వ్యక్తులను తమ దారిలో తెచ్చుకోవడానికి ఆ వ్యక్తి  బలహీనతల మీద ఫోకస్ చేస్తాయి. చాణక్య రాజనీతిలో ఇదో టెక్నిక్. ఇండియా కూటమిలో ముఖ్యభూమిక వహించే నేషనల్ కాన్ఫరెన్స్ మెల్లిగా కూటమికి దూరం కాబోతుంది. దీనికి ప్రధాన కారణం ఇండియా కూటమి ప్రత్యర్థి అయిన ఎన్ డిఏ తమ దర్యాప్తు సంస్థ అయిన ఈడీ చేత  ఇండియా కూటమి భాగస్వామి పార్టీల మీద వత్తిడి తేవడమే. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమికి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి వారు కూటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఇండియా కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరో షాక్ ఇచ్చారు.   రానున్న ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సొంత బలంపైనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు, ప్రశ్నలకు తావు లేదని అన్నారు.  ఇండియా కూటమి ఏర్పాటులో ఫరూక్ అబ్దుల్లా కీలక పాత్రను పోషించిన విషయం గమనార్హం. ఇండియా బ్లాక్ అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు, కూటమితో కలిసి వెళ్లకుండా, ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.  ఇంకోవైపు, ఫరూక్ అబ్దుల్లాకు ఇటీవలే ఈడీ సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై సమన్లు పంపింది. క్రికెట్ అసోసియేషన్ నిధులు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు, సంబంధం లేని అకౌంట్లకు మళ్లాయని ఈడీ ఆరోపించింది. అసోసియేషన్ అకౌంట్ల నుంచి అనుమానాస్పదమైన క్యాష్ విత్ డ్రాలు జరిగాయని కేసులో ఈడీ పేర్కొంది. అయితే, ఈ సమన్లపై ఈడీకి ఈమెయిల్ ద్వారా ఫరూక్ అబ్దుల్లా సమాధానం ఇచ్చారు. తాను టౌన్ లో లేకపోవడం వల్ల ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయన తెలిపారు.

కాళేశ్వరం తెలంగాణకు వరం కాదు.. భారం.. తేల్చేసిన కాగ్!

కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి, అక్రమాల పుట్టగా కాగ్ తేల్చేసింది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదికను కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రాజెక్టు వ్యయం 38వేల 500 కోట్ల రూపాయలు అయితే రీ ఇంజినీరింగ్ పేరిట దీనిలో ప్రాణహిత ప్రాజెక్టును కూడా కలిపేసీ కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేసిందని కాగ్ స్పష్టం చేసింది. కాళేశ్వరం వల్ల తెలంగాణకు పెను భారమే కానీ పైసా ప్రయోజనం ఉండదని..పైగా వేల కోట్లలో అక్రమాలు జరిగాయని కాగ్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 500 కోట్లు. అయితే.. రీ-ఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికీ కలిపి 85 వేల 651.81 కోట్లు ఖర్చు అవుతుందని అప్పటి కేసీఆర్ సర్కార్ అంచనాలు పెంచేసింది. వాస్తవానికి  రీ-ఇంజనీరింగ్‌ కారణంగానే  ఈ ప్రాజెక్టు వ్యయం 122 శాతం మేర పెరిగిందని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. అయితే వ్యయం భారీగా పెరిగినా ఆయకట్టు మాత్రం పెద్దగా పెరగలేదని పేర్కొంది. రీ ఇంజినీరింగ్ తరువాత కూడా ప్రాజెక్టులో మార్పులు చేర్పుల పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేశారని తేల్చింది. అయితే వ్యయాన్ని అయితే పెంచేశారు కానీ సాగులోకి వచ్చే ఆయుకట్టలో మాత్రం పెరుగుదల లేదని ఎత్తి చూపింది.   రీ-ఇంజనీరింగ్‌ తర్వాత లిఫ్టులను నడపడానికి అయ్యే వార్షిక విద్యుచ్ఛక్తి, అలాగే విద్యుత్ వినియోగానికి అయ్యే వ్యయం కూడా భారీగా పెరిగిపోయిందనీ, అంతే కాకుండా ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించారనీ, అలాగే గ్రాంట్ల మళ్లింపు కూడా చేశారనీ కాగ్ నివేదిక విస్పష్టంగా పేర్కొంది.  ప్రాజెక్టు పనులలో కొన్నిటికి   అధిక బిల్లులు చెల్లించారనీ, అలాగే రికార్డులను కూడా  సకాలంలో  సమర్పించలేదని కాగ్  వివరించింది. కాళేశ్వరం విషయంలో ప్రతీ అంశంలోనూ తప్పులు జరిగాయని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది.  కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరానికి అనుబంధంగా ఉన్న మేడిగడ్డ కుంగుబాటు. భారీ వర్షాలకు కాళేశ్వరం పంప్ హౌజ్ ల మునక వంటి అంశాలను ఎత్తి చూపుతూ ఆ ప్రాజెక్టు రూపకల్పన నుంచీ అన్నీ తప్పుల తడకలేనని కాంగ్రెస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాగ్ కూడా కాళేశ్వరం తప్పులను ఎత్తి చూపడంతో కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకోనున్నదన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

మార్పుల వల్లే కాళేశ్వరం ఖర్చు పెరిగింది: కాగ్ రిపోర్ట్ 

 దేశంలో కెల్లా భారీ నీటిపారుదలా ప్రాజెక్టు కాళేశ్వరం. కెసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్లే ఆయన కొంపముంచింది. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్వీళూరినప్పటికీ సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజులముందే కాళేశ్వరం ప్రాజెక్టులో కుదుపు రావడం కెసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి దారి తీసింది. కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు.   కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన కొన్ని పనులు నిరర్థకంగా మారాయని తెలిపింది. దీంతో రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని తన రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను అనవసరంగా చేపట్టినట్లు అయిందని, దీనికి అదనంగా రూ.25 వేల కోట్లు ఖర్చయిందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.  డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించిందని కాగ్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగునీటిపై మూలధన వ్యయం ఎకరా ఒక్కింటికి రూ.6.42 లక్షలు ఖర్చవుతోందని తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు ప్రయోజనాలు, ప్రాజెక్టుకు అయిన వ్యయం నిష్పత్తి 1:51 గా అంచనా వేశారు. కానీ ఈ నిష్పత్తి 0:75 శాతంగా ఉంది. ఇది మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, మల్లన్న సాగర్ నిర్మాణానికి ముందు భూకంప సంబంధిత అధ్యయనం సమగ్రంగా నిర్వహించలేదని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది.

చిత్తూరులో పడమటి సంధ్యారాగం

పడమటి సంధ్యారాగం. జంధ్యాల పూర్తిగా అమెరికా నేపథ్యంలో తీసిన సినిమా.విజయశాంతి, గుమ్మలూరి శాస్త్రి, థామస్ జేన్, శివమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1987లో విడుదలై విజయం సాధించింది. ఈ చిత్రాన్ని గుమ్మలూరి శాస్త్రి, మీర్ అబ్దుల్లా కలిసి ప్రవాసాంధ్ర చిత్ర పతాకంపై నిర్మించారు. చిత్ర దర్శకుడు జంధ్యాల, గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఒకసారి అమెరికా పర్యటనకు వెళ్ళినపుడు నిర్మాతలకు వీరికి మధ్య జరిగిన సంభాషణ ఈ చిత్రానికి బీజం వేసింది. ఈ చిత్రంలో నటులంతా దాదాపు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులే. చిత్రీకరణ సుమారు తొంభై శాతం అమెరికాలోనే జరిగింది. అమెరికన్ కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి భారతీయ భాషా చిత్రం కూడా ఇదే.  ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగానూ, ఉత్తమ కథా రచయితగా జంధ్యాలకు నంది పురస్కారం లభించాయి. అప్పుడు అమెరికా అబ్బాయిని మన ఇండియన్ అమ్మాయి లవ్ స్టోరీ. కాని ఇక్కడ మన దేశంలోని ఎపి అబ్బాయి నేపాల్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  అమెరికా, జపాన్, చైనా వంటి విదేశీ అమ్మాయి మెడలో మన అబ్బాయిలు తాళి కట్టడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. అయితే, ఈసారి మాత్రం వధువు దేశం మారింది. పొరుగుదేశం నేపాల్‌కు చెందిన అమ్మాయి మెడలో చిత్తూరు జిల్లా పెనుమూరు అబ్బాయి తాళి కట్టాడు. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి మరీ తమ ప్రేమబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. పెనుమూరుకు చెందిన భువన్‌కృష్ణ లండన్‌లో ఉద్యోగం చేస్తుండగా, నేపాల్ అమ్మాయి జి. మనీలతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. వీరిద్దరు ఒకే  కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.  నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి కావాలని భావించారు. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.  పెద్దలు సంతోషంగా వీరి ప్రేమను అంగీకరించారు. ఈ తెల్లవారుజామున చిత్తూరులోని ఓ హోటల్‌లో వీరి విహహం అంగరంగ వైభవంగా జరిగింది.  

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణానికి  డిమాండ్ ... సీట్ల అమరికలో మార్పులు 

ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సులు నిండిపోతున్నాయి. అందరూ ప్రశాంతంగా ప్రయాణించే విధంగా ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు తీసుకుంది.   తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకంకు మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దాంతో ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. బస్సులు కిక్కిరిసిపోతుండటంతో కండక్టర్లకు టిక్కెట్లు జారీ చేయడం కూడా కష్టంగా మారింది. దీంతో, ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులో సీట్ల అమరిక విషయంలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైళ్లల్లో మాదిరిగా బస్సుల్లోనూ సీట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బస్సు మధ్యలో ఉన్న ఆరు సీట్లను తొలగించి, అదే స్థానంలో బస్సు వాల్స్‌కు సమాంతరంగా సీట్లు ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో ఆర్టీసీ దీన్ని పరీక్షిస్తోంది.  మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణానికి విపరీతంగా డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు రోజుకు 11 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రస్తుతం ఈ సంఖ్య ఏకంగా 18 - 20 లక్షలకు చేరింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రద్దీలో బస్సులు ఎక్కలేక, దిగలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు, కండక్టర్లకు టిక్కెట్ల జారీ కూడా ఇబ్బందిగా మారింది. అయితే, ప్రతి ఒక్కరికీ జీరో టిక్కెట్ జారీ చేయాలన్న నిబంధన అమలవుతుండటంతో కండక్టర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా ఆర్టీసీ సీట్ల అమరికలో మార్పునకు సిద్ధమైంది. అధికారుల ప్రకారం, ఆర్టీసీ బస్సుల్లో 44 సీట్లుంటాయి. 63 మంది ప్రయాణిస్తే బస్సు ఆక్యుపెన్సీ రేషియో 100 శాతానికి చేరినట్టు భావిస్తారు.

జగన్ త‌ప్పుమీద త‌ప్పు.. బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు జీవో!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి త‌ప్పుమీద త‌ప్పు చేస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల వ్య‌వ‌ధిలోనే పేద‌ల‌కు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను తొల‌గించిన  జగన్  ప్ర‌భుత్వం.. ఏపీ ప్ర‌జ‌లు గొప్ప‌గా చెప్పుకోవాల్సిన అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యం చేసింది.. మూడు రాజ‌ధానుల పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ ఇన్నాళ్లు సీఎం హోదాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాలం వెళ్ల‌దీశారు. నాలుగున్న‌రేళ్ల కాలంలో జ‌గ‌న్ చేసింది కేవలం  క‌క్ష రాజ‌కీయాలేనన్న విమర్శలు ఉన్నాయి.  ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిపై కేసులు పెట్టడం.. పోలీసుల‌తో కొట్టించ‌డం.. ఆ త‌రువాత జైలుకు పంపించ‌డం. ఇదే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగున్న‌రేళ్ల పాల‌న అంటూ ఏపీ ప్ర‌జ‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి కొత్త రాజ‌ధానిని నిర్మించేందుకు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పించారు. దేశంలో, విదేశాల్లో తిరిగి పేరున్న కంపెనీల‌ను ఏపీకి తీసుకొచ్చారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో  భవనాల నిర్మాణం చేప‌ట్టారు.  వాటిని స‌ద్వినియోగం చేసుకొనే ద‌శ‌లో ప్ర‌జ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అధికార బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జ‌గ‌న్ హ‌యాంలో ఏ ప్రాంతంలో నూ కూడా చెప్పుకోద‌గ్గ అభివృద్ధి జ‌రిగిన దాఖ‌లాలు లేవు. ఇది జగన్ రాజకీయ ప్రత్యర్థుల మాట మాత్రమే కాదు.  జనం అభిప్రాయం కూడా.   ప్ర‌స్తుతం.. మ‌రో  ఎన్నిక‌ల  సమయం ముంచుకొస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ కొత్త నాట‌కానికి తెర‌లేపారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్వీర్యం చేశారన్న అప‌వాద‌ను ఎదుర్కొంటున్న జ‌గ‌న్‌.. అదే స‌మ‌యంలో తాను చెప్పిన మూడు రాజ‌ధానుల హామీ కూడా కార్య‌రూపం దాల్చ‌క‌పోవ‌టంతో ఏపీ ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త పెల్లుబికుతోంది. ఈ క్ర‌మంలో విశాఖ‌ను ప‌రిపాల‌నా రాజ‌ధానిగా చేద్దామ‌నుకున్నా..   కోర్టు చిక్కుల వ‌ల్ల అది సాధ్యం కావ‌డం లేదు.. ప్ర‌స్తుతం రాష్ట్ర ప‌రిస్థితిని చూస్తే కొత్త రాజ‌ధానిని నిర్మించుకోలేము.. హైద‌రాబాద్ నే ఉమ్మ‌డి రాజ‌ధానిగా గ‌డువు పెంచాల‌ని కేంద్రంపై పోరాటం చేద్దామ‌ని ఆ పార్టీ నేత‌, జ‌గ‌న్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి చెప్పాడు. తద్వారా ఏపీ ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్యం పై వ్యతిరేకతను పోగొట్టుకోవాలని జగన్ అనుకున్నారు. కానీ, సుబ్బారెడ్డి వ్యాఖ్యల పై విమర్శలు వెల్లువెత్తడం తో జగన్ అప్రమతం అయ్యాడు.   దీంతో మంత్రి బొత్స రంగంలోకి దిగి.. ప‌దేళ్ల త‌రువాత హైద‌రాబాద్ ను ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఎలా అడుగుతామ‌ని ప్ర‌శ్నించారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్య‌ల‌ను మీడియా వ‌క్రీక‌రించిందంటూ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఉమ్మ‌డి రాజ‌ధాని వైసీపీ ప్ర‌భుత్వం విధానం కానేకాదంటూ బొత్స చెప్పుకొచ్చాడు. తాజాగా.. మ‌రో విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ప్పుచేసింద‌న్న వాద‌న ప్ర‌తిప‌క్షాల నుంచి వినిపిస్తోంది. ఈసారి ఏకంగా బ్యాంకుల‌ను బురిడీ కొట్టించే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతుంది.  అమ‌రావ‌తి రాజ‌ధానిని చంపేయాల‌న్న‌ కోరికను బ‌లంగా పెట్టుకున్న జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం.. ఆ కార్య‌క్ర‌మాన్ని నాలుగున్న‌రేళ్లుగా దిగ్విజ‌యంగా చేస్తూ వ‌చ్చింది. అమ‌రావ‌తి ప్రాంతంలో చంద్ర‌బాబు హ‌యాంలో 75శాతం నిర్మాణాలు పూర్త‌య్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్‌లు, సెక్ర‌టేరియ‌ట్ ఉద్యోగుల‌కోసం నిర్మించిన భ‌వ‌నాల‌నుకూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పూర్తిచేయ‌లేదు. దీంతో అక్క‌డ పిచ్చిమొక్క‌లు పెరిగిపోయి, పాడుప‌డ్డ భ‌వ‌నాలుగా మారిపోయాయి. అయితే, ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో ప్ర‌కారం.. అమ‌రావ‌తి క్వార్ట‌ర్స్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులు నివాస‌ముంటున్నార‌ట‌.. సీఆర్డీఏకి 70కోట్లు అద్దెలుకూడా క‌డుతున్నామ‌ని జీవో లో ప్ర‌భుత్వం పేర్కొంది.  దీంతో పాడుప‌డ్డ భ‌వ‌నాల‌కు అద్దెలు చెల్లించ‌ట‌మేంట‌న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత‌కీ ప్ర‌భుత్వం ఈ జీవో ఎందుకు ఇచ్చిందంటే.. సీఆర్డీఏకి గ‌తంలో బ్యాంకులు అప్పు ఇచ్చాయి.  500 కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా కింద 2వేల కోట్లు  బ్యాంకు వాటా కింద అప్పు ఇచ్చాయి. అప్ప‌టి ప్ర‌భుత్వ ఒప్పందం ప్ర‌కారం.. 2023 క‌ల్లా భ‌వ‌నాల నిర్మాణాలు పూర్తిచేయాల‌న్న కండీష‌న్ ఉంది. 2023 నాటికి భ‌వ‌నాలు పూర్తికాక‌పోతే పూర్తి అప్పును ప్ర‌భుత్వం చెల్లించాలి. దీంతో ప్ర‌భుత్వం ఆ అప్పు తిరిగి చెల్లించే బాధ్యత నుంచి త‌ప్పించుకొనేందుకు బ్యాంకుల‌ను  బురిడీ కొట్టించేలా జీవో విడుద‌ల చేసిందంటున్నారు. అయితే.. ఇప్పుడు  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులు ఆ భవనాల్లో నివిసిస్తున్నప్పుడు నెలనెలా వారికి  40వేల కోట్ల రూపాయల  అలెవెన్సులు చెల్లించ‌టం ఎందుకు అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.  మ‌రి ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి ఆ సొమ్మును రిక‌వ‌రీ చేస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

నిన్న సజ్జల, నేడు జగన్ కుటుంబం...ఎపివోటర్ల జాబితాలో అవకతవకలు

ఎపిలో వోటర్ల జాబితాలో తప్పుల తడక ఉందనే ఆరోపణలు మిన్నంటిన నేపథ్యంలో ముఖ్యమంత్రి  జగన్ స్వంత కుటుంబంలో కూడా వోటర్ల జాబితా పలు అనుమానాలకు తావిస్తుంది. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు ఈ అక్రమాలు వెలుగుచూడటం గమనార్హం.  ఏపీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల వివరాలు కూడా తప్పుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పులివెందుల పురపాలక సంఘం పరిధిలో ఉన్న 138వ పోలింగ్ కేంద్రంలో జగన్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో జగన్ పెద్దమ్మ వైఎస్ భారతమ్మ పేరును వైఎస్ భారతి రెడ్డి అని ముద్రించారు. అంతేకాదు ఆమె భర్త జార్జ్ రెడ్డి పేరును కూడా తప్పుగా పేర్కొన్నారు. వయసు 60 సంవత్సరాలు అని ముద్రించారు.  నిరుడు ముఖ్యమంత్రి జగన్ ఫోటో మరో వోటర్ జాబితాలో ప్రత్యక్షమైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో సీఎం జగన్  ఫొటో ఉండడం సంచలనం రేపింది. దోర్నాల మండలం వై చెర్లోపల్లిలో జనపతి గురవమ్మ అనే మహిళ ఓటర్ స్థానంలో సీఎం జగన్ ఫొటో ఉంది. సదరు మహిళకు ఆ విషయం తెలియడంతో తమ ఫోటో కాకుండా జగన్ ఫొటో రావడం ఏంటని కంగు తిన్నారు. బిఎల్ వో తప్పిదంతోనే ఇది జరిగిన్నట్లు స్థానికులు ఆరోపించారు. అదే గ్రామంలో మరి కొందరి ఫొటో స్థానంలో ఏకంగా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేశారు. ఓటర్ల లిస్ట్ లో తప్పిదాలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ!?

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా అధికారం కోల్పోయినా గ్రేటర్ లో మాత్రం సత్తా చాటింది. గ్రేటర్ లో ఆ పార్టీ గెలిచిన స్థానాల కారణంగానే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కింది. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని   గ్రామీణులకు అర్ధమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యామనీ, తాము ప్రచారం కంటే పని తీరుకే ప్రాధాన్యత ఇచ్చామనీ బీఆర్ఎస్ చెప్పుకుని, ఇక తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై క్షేత్ర స్థాయిలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేలా ముందుకు సాగుతామని చెప్పుకుంది.  అయితే ఇప్పడు బీఆర్ఎస్ పరువును కాపాడిన గ్రేటర్ లోనే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కారు దిగిపోయి చేయందుకోవడానికి రెడీ అయిపోతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు కాంగ్రెస్ బాట పడుతున్నారు.  ముందుగా బీఆర్ఎస్ లో కొనసాగే విషయంలో కార్పొరేటర్లు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది.  ఒక్కరొక్కరుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. తాము కలుద్దామన్నా కనీసం అప్పాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా కేటీఆర్ కు సమయం దొరకడంలేదంటూ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ దశలో మాజీ ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు రంగంలోకి దిగి కార్పొరేటర్లతో వరుస భేటీలు అవతూ వారిని కాంగ్రెస్ టూటికి చేరేలా ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మాజీ మేయర్, బీఆర్ఎస్ అధినేతకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బొంతు రామ్మోహన్  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే కలిశాననీ బొంతు చెప్పినా.. ఆయన కారు దిగిపోవడానికే రెడీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి ఎన్నికలలో ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించిన బొంతు రామ్మోహన్, కేసీఆర్ అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశ చెందారు. అసంతృప్తికి లోనయ్యారు.  దీంతో ఆయన బీఆరెస్‌ కు గుడ్ బైచెప్పడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు.   మాజీ డిప్యూటీ మేయ‌ర్‌ బాబా ఫ‌సియుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు.   డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌తా రెడ్డి  కూడా రేవంత్ ను కలిశారు. ఇలా రేవంత్ ను కలిసి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే వీరంతా బీఆరెస్ నుంచి  కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ కూడా సుముఖంగా ఉందంటున్నారు. లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ను బలహీనపరిచి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్   బీఆరెస్ కార్పొరేట‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోందని చెబుతున్నారు. కేటీఆర్ పై అసంతృప్తితో ఉన్న‌వారంద‌రితో  కాంగ్రెస్ ఇప్పటికే టచ్ లోకి వెళ్లిందని అంటున్నారు. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో మరీ ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో  కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.  ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఎన్నికల సమయానికి బలం పెంచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ  జీహెచ్ఎంసి కౌన్సిల్‌లో బీఆరెస్‌ను ఖాళీ చేసి పై చేయి సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లారు. ఒక్కసారి కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బీఆర్ఎస్ నుంచి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే సూచనలే మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు. ముందుగా జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కార్పొరేటర్లను పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

జగన్ కు పవన్ ఫోబియా!?

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పవన్ అంటే అంటే భ‌యం ప‌ట్టుకుందా?  ఆయన జనంలోకి రాకుండా చేయడానికి  కంక‌ణం క‌ట్టుకున్నారా?  అంటే వైసీపీ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క ఛాన్స్ అంటూ సానుభూతితో ప్ర‌జ‌ల‌ను మాయ‌చేసి అధికారంలోకి వ‌చ్చిన‌ జ‌గ‌న్.. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయ‌మ‌నే భావ‌న‌కు వచ్చేసినట్లు ఆయన తీరు గమనిస్తే అర్ధమౌతోందని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. త‌న నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో  ఒక్కటంటే ఒక్క  అభివృద్ధి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌క‌పోవ‌టంతోపాటు.. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని కొనసాగించడంలో కూడా జగన్ విఫలమయ్యారు. దీంతో జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే ఏపీ మ‌రింత నష్ట పోతుంది, మరింత వెనుకబడిపోతుందన్న భావ‌న‌కు వ‌చ్చేసిన ప్ర‌జ‌లు.. జ‌గ‌న్, ఆయ‌న టీంకు గ‌ట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. జ‌గ‌న్ తాజాగా జ‌రిపిన స‌ర్వేల్లోనూ ఇదే రుజువైందని ఆయన పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న‌ వ్య‌తిరేక‌త‌ను పోగొట్టుకునేందుకు జ‌గ‌న్ త‌న త‌ప్పును ఎమ్మెల్యేల‌పై నెట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు.  మ‌రో రెండు నెల‌ల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగూ ఓట‌మి ఖాయ‌మని భావిస్తున్న జ‌గ‌న్.. ప‌వ‌న్ క‌ల్యాణ్  గెలుపును అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. . ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ జిల్లాల టూర్ ల‌కు వెళ్లిన‌ప్పుడ‌ల్లా అడ్డంకులు సృష్టిస్తున్న జ‌గ‌న్.. తాజాగా ఆయ‌న భీమ‌రం ప‌ర్య‌ట‌న‌ విషయంలో నూ అవరోధాలు సృష్టించారు. ఆయన హెలికాప్ట‌ర్ ల్యాండింగ్ కు ప్ర‌భుత్వం అనుమ‌తులు నిరాక‌రించింది. ప‌వ‌న్ నాలుగు రోజులు గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించేందుకు తొలుత ప్లాన్ చేసుకున్నారు.  ఆ త‌రువాత వివిధ జిల్లాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప‌ర్య‌ట‌న‌లు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో  తెలుగుదేశంతో పొత్తు నేప‌థ్యంలో సీట్ల స‌ర్దుబాటు విష‌యంపై చ‌ర్చ‌లు జ‌రిపేందుకు, జ‌న‌సేన నాయ‌కుల‌కు అందుబాటులో ఉండేందుకు ప్రతి రోజూ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు ముగించుకొని సాయంత్రానికి అమ‌రావ‌తికి చేరుకొనేలా ప‌వ‌న్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో హెలికాప్ట‌ర్ ద్వారా ప‌వ‌న్ జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ ద్వారా అయితే సాయంత్రం వ‌ర‌కు జిల్లాల్లో స‌భ‌లు, స‌మావేశాల్లో పాల్గొని రాత్రికి అమ‌రావ‌తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌వ‌న్ భావించారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం ప‌వ‌న్ భీమ‌వ‌రం వెళ్లాల్సి ఉంది. అక్క‌డ విష్ణు ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ హెలిప్యాడ్ లో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ  జ‌గ‌న్ ప్ర‌భుత్వం అక్క‌డ‌ హెలిప్యాడ్‌లో దిగేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో జ‌గ‌న్ తీరుపై జ‌న‌సేన శ్రేణులు మండిపడుతున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఎన్నిక‌ల్లో పూర్తి స్థాయిలో ప్ర‌చారంలో పాల్గొన‌కుండా జ‌గ‌న్ అడ్డుకుంటున్నారని, ప‌వ‌న్ అంటే జ‌గ‌న్ కు ఎందుకంత భ‌యం అని జ‌న‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.  ప్రత్యర్థులను చూసి భయంతో వణికే వ్యక్తి నాయకుడెలా అవుతారని సెటైర్లు వేస్తున్నారు. సొంత పార్టీలోనే విశ్వసనీయత కోల్పోయిన జగన్ ను జనం ఎందుకు నమ్ముతారని అంటున్నారు. 

మంగళగి వైసీపీ ఇన్ చార్జ్ గా కాండ్రు కమల?.. చిరంజీవులు చీటీ చిరిగిపోయిందా?

వైసీపీ అధినేత జగన్ కు లోకేష్ పేరు వినగానే వణుకు పుడుతోందా? అంటే సాక్షాత్తూ వైసీపీ కేడరే ఔనని బదులిస్తోంది. లోకేష్ పేరెత్తితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో తెలియ‌ని ఆందోళ‌న క‌నిపిస్తోంద‌ని వైసీపీ వర్గాల్లో చర్చ జ‌రుగుతున్నది.  గ‌తంలో లోకేష్  వేరు.. ఇప్ప‌టి లోకేష్  వేరు. ఆ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అధికార ప‌క్షం ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను లోకేష్  స‌మ‌ర్థ‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌ల్గుతున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో రాష్ట్రంలో ప‌ర్య‌టించిన లోకేష్ .. తాజాగా శంఖారావం యాత్ర పేరుతో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై లోకేష్ స్ప‌ష్ట‌మైన ఆధారాల‌తో  విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  మ‌రోవైపు మంగ‌ళ‌గిరిలో లోకేష్ ను ఓడించేందుకు జ‌గ‌న్ ప‌డ‌రానిపాట్లు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ ఓట‌మి పాలైన  విష‌యం తెలిసిందే. ఓడిపోయిన నాటి నుంచి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని లోకేష్ వ‌దిలిపెట్ట‌లేదు. తెలుగుదేశం క్యాడ‌ర్ కు అండ‌గా ఉంటూ, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేశారు లోకేష్.  మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన క్యాడ‌ర్ ను లోకేష్ ఏర్పాటు చేసుకున్నారు. అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకోవ‌డంలో లోకేశ్ స‌ఫ‌ల‌మ‌య్యారు. అయితే, లోకేష్  ను మ‌రోసారి ఓడించేందుకు జ‌గ‌న్ ప‌లు విధాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ కు న‌మ్మిన‌బంటుగా కొన‌సాగుతూ వ‌చ్చిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డిని త‌ప్పించి.. తెలుగు దేశం పార్టీ నుంచి వ‌చ్చిన చిరంజీవుల‌ను నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇంచార్జిగా జ‌గ‌న్ నియ‌మించారు. తాజాగా చిరంజీవుల‌ను  కూడా నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇంచార్జి బాధ్య‌త‌ల నుంచి జ‌గ‌న్ త‌ప్పించేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న స్థానంలో కాండ్రు క‌మ‌ల‌కు ఇన్ చార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యార‌ని పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. తాజాగా ఆమెను సీఎంవో కార్యాలయానికి పిలిపించి మాట్లాడిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతానికి వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాక‌పోయినా.. త్వ‌ర‌లో రాబోయే లిస్ట్ లో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా కాండ్రు క‌మ‌ల పేరు వెలువ‌డుతుంద‌ని వైసీపీ వ‌ర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మొత్తానికి  లోకేష్  ను ఓడించేందుకు జ‌గ‌న్ ప‌డుతున్న తంటాలు అన్నీ ఇన్నీకావని తేట‌తెల్లం అవుతున్నది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో లోకేష్ బ‌ల‌మైన నేత‌గా ఎదిగిన క్ర‌మంలో జ‌గ‌న్ వ్యూహాలు అక్క‌డ ఏ మాత్రం పని చేసే అవకాశాలు లేవని రాజ‌కీయాల్లో చర్చ జరుగుతోంది.

అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నట్లు.. జగన్ వైఫల్యాల పాపం చంద్రబాబుదేనా?

వైపీపీ  తన తప్పిదాలన్నిటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణం అంటోది. చివరకు  రేపు ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే.. అందుకు కూడా జగన్ పాలనా వైఫ్యల్యం కాదు చంద్రబాబు సమర్థతే కారణమంటూ విమర్శలు గుప్పిస్తుందేమో అనిపిస్తోంది వైసీపీ నేతల మాటలు, చేతలూ చూస్తుంటే. తాజాగా జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడానికి చంద్రబాబే కారణమంటూ చేసిన ఆరోపణలు ఇందుకు నిదర్శనం.  రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు తన అపార అనుభవాన్నంతా రంగరించి.. కనీసం రాజధాని కూడా లేకుండా మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించారు. ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచేలా రాజధాని అమరావతి నిర్మాణానికి నడుం బిగించారు. నభూతో న భవిష్యత్ అన్న చందంగా రాజథాని కోసం పైసా ఖర్చు లేకుండా భూమిని సమీకరించారు. రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. తాత్కాలిక భవనాలే అయినా ఇంద్ర భవనాలను తలపించే విధంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలను పూర్తి చేశారు. మొత్తం పాలన అంతా అమరావతి కేంద్రంగా జరిగేలా తీర్చి దిద్దారు. అనతి కాలంలోనే అమరావతి కామధేను అన్న విషయం అందరికీ అవగతమైపోయింది. అమరావతి నిర్మాణాలను, పురోగతిని చూసేందుకు జనం తండోపతండాలుగా రావడం కూడా ఆరంభమైంది. చంద్రబాబు విధానాలు, దార్శనికత కారణంగా పరిశ్రమలు కూడా ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఏపీకి క్యూ కట్టాయి. సైబరాబాద్ నిర్మాణం తరువాత హైదరాబాద్ అభివృద్ధి ఎలా పరుగులు పెట్టిందో అంతకు మించిన వేగంతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి దారిలో రేసు గుర్రంలా పరుగులు తీయడం మొదలైంది.  అయితే 2019 ఎన్నికలలో కారణాలేమైతేనేం.. ఏం లేకపోతేనేం.. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ విజయం సాధించి, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్షణం నుంచీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ తిరోగమన బాట పట్టాయి. ఇది వాళ్లూ వీళ్లూ చెబుతున్న మాట మాత్రమే కాదు.. గణాంకాలు సాక్ష్యాధారాలతో సహా వెల్లడిస్తున్న వాస్తవం. పాలన అంటే బటన్ నొక్కి పప్పుబెల్లాలు పంచినట్లుగా సంక్షేమం పేరుతో అరకొర నిధులను పందేరం చేయడమే అన్నట్లుగా జగన్ పాలన సాగింది. అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు హయాంలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని ఆనవాలు లేకుండా చేయాలన్న కంకణం కట్టుకున్నట్లుగా విధ్వంస పాలనకు జగన్ తెరతీశారు. ప్రజాదర్బార్ కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలన గత ఐదేళ్లుగా అప్రతిహాతంగా సాగుతూనే ఉంది. గుంతల రోడ్లు, నీరు పారని కాలువలు, సాగుకు నోచని భూములు, కొత్త పరిశ్రమల రాక సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి తరలిపోవడం జగన్ సుందరముదనష్ట పాలనకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అమరావతి ని నిర్వీర్యం చేశారు. రాష్ట్రం కోసం, రాజథాని కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిచ్చిన రైతులను నానా రకాలుగా వేధించారు. చట్టాలను లెక్క చేయకుండా ఇష్టారీతిన వ్యవహరించారు. చివరికి జనానికి ముఖం చూపించలేక.. జగన్ తన పర్యటనలను పరదాల మాటున కానిచ్చేస్తున్నారు. బటన్ నొక్కేందుకు తప్ప బయటకు రాలేని పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నారు.   ఎన్నికల ముంగిట ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఏం చేయాలో, అసలెలా ముందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో మరిన్ని తప్పుటడుగులు వేస్తున్నారు. ఆ తప్పుటడుగుల్లో అతి ముఖ్యమైనది తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ చేసిన ప్రకటన.  ఆ ప్రకటనే ఇంత కాలం మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ చేసిన తతంగమంతా పనికిరాని వ్యవహారమని తేలిపోయింది. విశాఖ నుంచి పాలన అన్నది ఉత్తిదేనని రుజువైపోయింది. ఇప్పుడు విభజన చట్టంలో పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ పొందుపరిచిన అంశానికి దుమ్ము దులిపి బయటకు తీశారు సుబ్బారెడ్డి. జూన్ తో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుంది. కానీ ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డికి ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందన్న విషయం గుర్తుకు వచ్చింది. అలా ఎలా కుదురుతుంది. హైదరాబాద్ ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా మరి కొన్నేళ్ల పాటు పొడిగించాలంటూ కేంద్రాన్ని కోరదాం అందుకోసం పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. అసలు ఈ ఐదేళ్లుగా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా తాను చెప్పిన మూడు రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా వేయని జగన్ తప్పిదాల గురించి ప్రస్తావించకుండా ఉమ్మడి రాజధాని కోసం పోరు అన్న పిలుపు వెనుక ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ విభజనకు ముందు నాటి ఉద్వేగాలను రెచ్చగొట్టాలన్న దురుద్దేశమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపి సీనియర్ నేతలలో  ఒకరైన వైవీ సుబ్బారెడ్డి  జగన్‌కు బంధువు కూడా. అటువంటి వైవీ సుబ్బారెడ్డి జగన్‌కు తెలియకుండా, జగన్ ప్రోత్సాహం లేకుండా, అన్నిటికీ మించి ఆయన ఆదేశం లేకుండా  హైదరాబాద్‌ని మళ్ళీ ఉమ్మడి రాజధానిగా చేయాలనే  ప్రతిపాదన చేయరు కాక చేయరు అని అంటున్నారు. వైవీ ప్రకటన వెనుక ఉన్నది జగన్‌ వ్యూహమే అని గట్టిగా చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ద్వారా అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. రాజకీయంగా రోజు రోజుకూ వెనుకబడిపోతున్న  బిఆర్ఎస్ పార్టీకి, లోక్‌సభ ఎన్నికలకు ముందు  సెంటిమెంట్ అస్త్రాన్ని అందించడమే కాకుండా, ఇటు ఏపీలో కూడా హైదరాబాద్ లో ఏపీ వాటా అన్న అంశాన్ని ప్రజలలో నాటుకునేలా చేయాలన్న దురాలోచన ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే వ్యూహంతో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు సాగర్ నీటిలో వాటా అంటూ నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు పోలీసులను పంపిన సంగతి ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నాడు ఆ ప్రయత్నం, కుట్రా కేసీఆర్ ను రక్షించలేకపోయింది. అది వేరే సంగతి. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి తన మిత్రుడికి లోక్ సభ ఎన్నికలలో సహాయపడాలన్న ఆత్రం కనిపిస్తోందంటున్నారు. అయితే ఈ దురాలోచన, దుష్ట వ్యూహం తెలంగాణలో ఏ మేరకు పని చేస్తుందో తెలియదు కానీ, ఏపీలో మాత్రం బూమరాంగ్ కావడం ఖాయం. ఒక రోజు ఆలస్యంగా ఆ విషయాన్ని వైసీపీ గుర్తించింది. ఉమ్మడి రాజధాని విషయం ఎత్తితే ఈ ఐదేళ్లలో నీ నిర్వాకం ఏమిటి? అని జనం నిలదీస్తారన్న భయం పట్టుకుంది. దీంతో నష్ట నివారణకు బొత్స సత్యనారాయణను జగన్ రంగంలోకి దింపారు. గతంలో వోక్స్ వ్యాగన్ విషయంలో నిండా మునిగిపోయిన తరువాత సొమ్ములు పోనాయి మరేటి చేస్తాం అన్నట్లుగానే ఇప్పుడు.. మూడు రాజధానులు కట్టలేకపోయాం, అయినా ఇప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని అనలేం.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు మీడియా వక్రభాష్యం చెబుతోందంటూ మీడియా ముందుకు వచ్చేశారు బొత్స. అంతే కాదు అసలు ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనంటూ భాష్యం చెప్పారు. అమరావతి నిర్మాణానికి పూనుకోవడమే చంద్రబాబు చేసిన తప్పిదమంటూ  వక్రభాష్యం చెప్పారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా అయినా హైదరాబాద్ వదిలి వచ్చేసి చంద్రబాబు తప్పు చేశారంటూ బొత్స తనకే అర్థం కాని తర్కాన్ని తెరమీదకు తీసుకువచ్చారు.  తన హయాంలో  అమరావతిలో అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించి పాలనను కూడా అక్కడ నుంచే చంద్రబాబు ప్రారంభించారనీ, ఇప్పటికీ అదే సచివాలయ, అసెంబ్లీ భవనాలలోనే జగన్ పాలన సాగిస్తున్నారనీ బొత్స కన్వీనియెంట్ గా మరచి పోయారు. జగన్ కూడా చంద్రబాబులా  అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు తరలివచ్చేవి. కానీ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందన్న దుగ్ధతో, వ్యక్తిగత కక్షతో జగన్ అమరావతిని పక్కన పెట్టేశారు. ఇదే జగన్ అప్పట్లో అమరావతిని శ్మశానంగా అభివర్ణించారు. ఇంత చేసీ తన ఐదేళ్ల పాలనలో జగన్  మూడు రాజధానుల దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.   ఇక ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో వైవీ ప్రకటన, ఆ తరువాత బొత్స ఖండనలే వచ్చే ఎన్నికలలో వైసీపీ పతనాన్ని ఖరారు చేసే కీలక అంశాలుగా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాజ్యసభ బరిలో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ 

రానున్న లోకసభ ఎన్నికలలో ఖమ్మం లోకసభ స్థానం నుంచి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్  పేర్లు  బలంగా వినిపించాయి.  అయితే ఈ వార్తలను కాంగ్రెస్ హై కమాండ్ పటా పంచలు చేసింది.  తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి,  సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు. అనిల్ కుమార్ యాదవ్ లకు రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధకారిక ప్రకటన వెలువడింది. మరోవైపు కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ లకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేరును ఖరారు. వీరి అభ్యర్థిత్వాలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారని ఏఐసీసీ తెలిపింది. మరోవైపు రేణుకా చౌదరి రాజ్యసభకు వెళ్తుండటంతో... ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ;