జయప్రదకు అరెస్ట్ వారెంట్
posted on Feb 13, 2024 @ 3:32PM
చట్టానికి కళ్లు లేవు . న్యాయదేవత పట్టుకున్న త్రాసు ఎటువైపు తూగుతుందో అక్కడే న్యాయం ఉంటుంది. అంటే బరువు వైపు తూగడం వల్లే న్యాయం జరుగుతుంది. సాక్ష్యం బలంగా ఉండటం వల్లే ఇవ్వాళ అలనాటి జయప్రద న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టింది. ఆమెకు ఉన్న స్టార్ డమ్ , పొలిటికల్ ఇన్ ఫ్లూయెన్స్ అక్కరకు రాకుంబా పోయింది. చట్టం తన పని తాను చేసుకుపోయింది.
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను సమస్యలు చుట్టుముట్టాయి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆ సమయంలో ఆమెపై అక్కడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది. అయితే కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు.
దీంతో, గతంలో ఒకసారి ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. తదిపరి విచారణను ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది.
సినీ నటి.. మాజీ హీరోయిన్ జయప్రద చిక్కుల్లో పడ్డారు. పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నటైమ్ లో ఆమెపై పెట్టిన కేసుకు సబంధించి ప్రస్తుతం జయప్రదకు చిక్కులు తప్పేట్లు లేవు. జయప్రదకు ఎన్ని సార్లు నోటీస్లు ఇచ్చినా.. స్పందించకపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.
ప్రముఖ నటి జయప్రదకు ఈఎస్‌ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా జయప్రదకు మరోసారి షాక్ తగిలిందనే చెప్పాలి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలంటూ రాంపుర్ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాంపుర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.. వీటికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో జయప్రదకు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు.
దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. గతంలో కూడా ఒకసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.