ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు.. చంద్రబాబు దూకుడు

  ఓటు నోటు కేసు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటాను కోర్టుకు సమర్పించారు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై తన దూకుడుని ప్రదర్శించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని గతంనుండి చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వీసు ప్రొవైడర్లు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేశామని కూడా చెప్పారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయడానికి బాధ్యులైన కొంతమంది తెలంగాణ అధికారుల పేర్లతో తయారు చేసిన నివేదికను క్రితమేకేంద్రానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్ అధికారులు పేర్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ తోపాటు పలువురు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు దానికి సంబంధించిన ఆధారాలు ఏపీ ప్రభుత్వం సాధించినట్టు చెబుతున్నారు.   ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చంద్రబాబు కూడా తెలంగాణ ప్రభుత్వంపై గట్టిగానే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆధారాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వివరమైన నివేదిక ఉండాలని ఏసీబీ అధిపతిని ఆదేశించినట్టు సమాచారం. గతంలో ఉన్న నివేదిక కంటే ఇప్పుడు తయారుచేసే నివేదిక మరింత క్లియర్ గా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే మొదటి నుండి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం మొత్తుకుంది.. కానీ ఆతరువాత సర్వీసు ప్రొవైడర్లు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు మేం ఫోన్ ట్యాపింగ్ చేశాం.. ఫోన్ ట్యాపింగ్ చేయడం తెలంగాణ హక్కు అని చెప్పారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా పరోక్షంగా ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా తప్పించుకుంటుందో చూడాలి మరి.

యాకుబ్ ను ఉరితీసిన తలారికి 10వేల చెక్

  ముంబై వరుస పేలుళ్ల కేసులో ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమెన్‌ను ఉరి తీసిన సంగతి తెలిసిందే. అయితే యాకుబ్ ను ఉరితీసిన తలారికి పదివేల రూపాయల చెక్ ను పంపించారు. కర్ణాటకకు చెందిన అంబికా పదవి పూర్వ విద్యాలయకు చెందిన కొందరు విద్యార్థి నాయకులకు తలారికి పదివేలు చెక్ పంపిస్తూ.. ముంబైలో యాకుబ్ చేసిన మారణ హోమంలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని.. అలాంటి యాకుబ్‌ను ఉరి తీసిన తలారిని గౌరవించడం తమకు చాలా గర్వంగా ఉందని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అందుకే తలారికీ పదివేల చెక్ ను పంపించాలని నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు.

'శ్రీమంతుడిని' తెగ పొగిడేస్తున్న యాంకర్

    ఇప్పటికే 'శ్రీమంతుడు' సినిమా కోసం థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ అయిపోయాయి. ఈ సినిమా కోసం అభిమానులు అందరూ ఎంతో ఆత్రురతగా ఎదురుచూస్తున్నారు అందులోనూ మహిళా అభిమానులు. ఎందుకంటే మహేశ్ బాబు లేడీ ఫ్యాన్స్ ఎక్కువని చెప్పనవసరం లేదు. సినిమా పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంది. బాహుబలి తర్వాత ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ఏదంటే అది 'శ్రీమంతుడే' అందులో సందేహం లేదు. మరి అలాంటి 'శ్రీమంతుడు' మన ముందుకు వచ్చేస్తున్న సందర్భంగా ఒక లేడీ ఫ్యాన్ మహేశ్ బాబును తెగ పొగిడేస్తుంది. మరి ఆమె పొగడ్తలు మీరే చూడండి ఒకసారి.  

సోనియమ్మ.. అంత పెద్ద మాటలెందుకమ్మా

  పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి కాంగ్రెస్ నేతలు చేసే రచ్చ అంతా ఇంతాకాదు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ లో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ ఎంపీలను సస్పెండ్ చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు కట్టుకొని నిరసనలు చేస్తున్నారు. అయితే సోనియాగాంధీ చేస్తున్న ఉద్యమానికి అటు మద్దుతు సంగతి పక్కన బెడితే పాపం విమర్శించేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాళ్లు చేసే విమర్శల్లో నిజంకూడా లేకుండా పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలను విడగొడుతూ అతి దారుణంగా రాష్ట్ర విభజన చేసిన సోనియాగాంధీ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శల బాణాలు విసురుతున్నారు.     రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో వ్యవహరించిన తీరు చూస్తే అప్పుడు తప్పు అనిపించని సోనియాగాంధీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేస్తే ఇప్పుడు తప్పునిపిస్తుందా అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. తమ పార్టీ ఎంపీలను ఏదో 5 రోజులపాటు సస్పెండ్ చేసినందుకు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆమె అరిచిగీపెడుతున్నారు. రాష్ట్ర విభజన చేసేప్పుడు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్న ఏంపీలను సస్పెండ్ చేసి.. తలుపులు మూసేసి ఆఖరికి మీడియా కూడా ఆపేసి బిల్లును పాస్ చేసినప్పుడు సోనియాకు అప్పుడు తను ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేశారని గుర్తకు రాలేదేమో. ఆఖరికి తన పార్టీ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్‌ను సైతం పార్లమెంట్ నుండి బయటకు పంపించి మరీ రాష్ట్రాన్ని విడదీశారు. రాష్ట్రంలో మొత్తం 8 కోట్ల మంది తెలుగు ప్రజలను వారి పార్టీ ప్రయోజనాల కోసం రాజకీయ కుతంత్రాలు చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నా మరోవైపు ఏపీ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్లు జనాభా రాష్ట్రాన్ని విడదీయొద్దు అంటూ ఎన్ని ఆందోళనలు చేశారో.. మూడు నెలలు పాటు అందరూ వారి పనులు మానుకొని రోడ్ల మీదకొచ్చి మరీ అంత పోరాటం చేసినా ఏదో బర్తడే కేక్ కట్ చేసి తలో ముక్క ఇచ్చినట్టు కూడా రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీసిన సోనియాను ఏమనాలి.   అందుకే దీనికి సరైన రీతిలో కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడించి అధికారం లేకుండా చేశారు. ఇంక కొన్ని సంవత్సరాలు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం అయితే ఎవరికీ లేదు. అయినా వీళ్లు మాత్రం మారారా అంటే మారలేదు. పైగా ఇప్పుడు రైతు ఆత్మహత్యలకు గాను రైతు భరోసా యాత్రలు చేయడం.. అసలు గత పదేళ్ల ప్రభుత్వ హయాంలో ఎన్నడూ రైతు హత్యల గురించి మాట్లడని రాహులు ఈ యాత్రలు చేయడం ఎవరిని మభ్యపెట్టడానికి అని రాజకీయ వర్గాలు కూడా మండిపడ్డాయి. ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీకి తాము తప్పు చేసింది తెలియదు కాని ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం చేసింది తప్పని గగ్గోలు పెడుతుంది. అప్పుడు తప్పుకానిది ఇప్పుడు తప్పుకాదా? అప్పుడు ప్రజాస్వామ్యం కూనీ కాలేదు కాని ఇప్పుడు కూనీ అయ్యిందా? వాళ్లు చేస్తే న్యాయం అనిపించింది ఇప్పుడు అన్యాయం అనిపిస్తుందా? ఇలా అనుకుంటే ఎన్నోప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి సోనియా గాంధీ గారు ధర్నా చేస్తే చేశారు కాని.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు.. ఇది అన్యాయం అంటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుంటే చాలు.

శ్రీవారి లడ్డూకి 300 ఏళ్లు

తిరుపతి శ్రీవారి లడ్డూ అంటే ఇష్టపడని వారు ఉండరూ. దానికున్న ప్రత్యేకతే వేరు. మరి అంతమంది ఇష్టపడే ఈ లడ్డూ తయారీ ఇప్పటికీ 300 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ లడ్డూను మొదట ఆగష్ట్ 2, 1715 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వరునికి ప్రసాదంగా తయారుచేసినట్టు అధికారులు తెలిపారు. తిరుమల ఆలయం ప్రపంచంలోనే అత్యదిక సంపద కలిగిన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఎంత ఫేమస్సో లడ్డూ కూడా అంతే ఫేమస్సు. ఈ ఆలయానికి ఎక్కడెక్కడినుండో జనాలు వస్తుంటారు. ధన, పేద అనే తేడా లేకుండా అందరూ ఈ ఆలయానికి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ లడ్డూలను ప్రసాదంగా అందిస్తారు. 300 గ్రాముల బరువున్న ఈ లడ్డూను రూ. 25 ధరపై విక్రయిస్తారు. సబ్సిడీ కింద ఈ లడ్డూను రూ. 10కే విక్రయిస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్ధానం లెక్కల ప్రకారం 2014లో మొత్తం 9 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించారు.

రెండు రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు..

  రాష్ట్రవిభజన సమయంలో ముఖ్యంగా భద్రాచలంలోని ముంపు మండలాలపై ఇరు రాష్ట్రాల మధ్య చాలా గొడవలే జరిగాయి. ఆ ముంపు మండలాలు కూడా మమ్మల్ని తెలంగాణలోనే కలపండి అని మొత్తుకున్నాయి. కానీ కేంద్రం నాలుగు మండలాలను ఏపీలో కలిపింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఏపీలో కలిపిన నాలుగు రాష్ట్రాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. వాటి అభివృద్ధికి ఏపీ, తెలంగాణలు నిధులివ్వాలన్నారు. ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానని వాపోయారు. ఏపీ అసెంబ్లీలో తనకు అసోసియేటెడ్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఆయన వినతి పత్రం ఇచ్చారు.

చంపడం.. చావడంలో మజా ఉంది..

  పాకిస్తాన్ ఉగ్రవాది ఉస్మాన్ దీ కాశ్మీర్‌లో బిఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపి నిన్న పోలీసులు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉస్మాన్‌దీ ని చూస్తుంటే గతంలో పట్టుబడ్డ కసబ్ కు మరో రూపంలో ఉండటం ఆశ్చర్యం. కసబ్ పట్టుబడినప్పుడు కూడా అతడి కళ్లలో భయం కాని.. బాధ కాని కనిపించలేదు సరికదా.. పైగా వెకిలి నవ్వులు చేష్టలు చేసేవాడు. సాధారణంగా ఇలాంటి ఉగ్రవాదులను వాళ్లను ట్రైనింగ్ చేసేప్పుడే చాలా కఠినంగా చేస్తారు. అందుకే వాళ్లుకు భయం కాని ప్రాణాల మీద ఆశ కాని ఉండవు. ఇప్పుడు ఉస్మాన్‌దీ కూడా అంతే ఎలాంటి భయం లేకుండా కెమెరా ముందు కూర్చుని పోలీసులు వారు అడిగే ప్రశ్నలకు చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పైగా అతని మాటలు తనలోకి పైశాచికానికి నిదర్శనంగా నిలిచాయి. తాను చెప్పిన వివరాలు.. తాను నెలరోజుల కిందటే భారత్ లోకి రావడానికి ప్రయత్నించి తమకు దారి చూపించాల్సిన వ్యక్తి రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. అయితే మళ్లీ తాను తన సహచరుడు మొమిన్ ఖాన్ తో కలిసి 12 రోజుల కింద్రటే కాశ్మీర్ లోకి అడుగుపెట్టామని.. ఇక్కడి హిందువులను చంపడానికి వచ్చామని చెప్పాడు. అయితే ఈ పదిరోజులు అడవుల్లో తిరిగి నిన్నబీఎస్‌ఎఫ్‌ జవాన్లపై దాడి చేశామని చెప్పాడు. అయితే ఈ కాల్పుల్లో తనతో వచ్చిన మొమిక్ ఖాన్ చనిపోయాడని నేను పట్టుబడ్డానని ఎంచక్కా నవ్వుకుంటూ సమాధానం చెపుతున్నాడు. తాను కూడా మొమిక్ లాగా చనిపోయినా బాధ పడేవాడికి కాదని.. అదంతా అల్లా కార్యం అని అనుకునేవాడినని.. అయినా చంపడం.. చావడంలో మజా ఉంటుందని చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. మరీ కసబ్ ను పట్టుకుని అతనిని శిక్షించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. దానికి తోడు కోట్లకు కోట్లు ఖర్చు. ఇప్పుడు ప్రాణాలతో పట్టుబడ్డ ఈ ఉన్నాదిని శిక్షించేసరికి ఎన్నిసంవత్సరాలు పడుతుందో ఎంత ఖర్చవుతుందో మన ప్రభుత్వానికి.

అదే మా లక్ష్యం.. జైట్లీ

  రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రరాష్ట్ర ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతోందని.. ఒక్క హైదరాబాద్ లేకపోవడంవల్ల ఏపీ ఆదాయానికి గండి పడిందని కేంద్ర కేంద్ర ఆర్థికశాఖా మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గర్వించదగ్గ నగరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆలోచనలు చేస్తున్నామని.. భవిష్యత్ లో ఏపీకి ఆర్ధికంగా సహాయపడటమే తమ లక్ష్యమని.. ప్రత్యేకహోదా అనేది తమ అంజెండాలో ఉందని అన్నారు. ఆర్థికలోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అభివృద్ధి అంశంలో తమకు ఏపీ ప్రధానమైనదని జైట్లీ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి ఏపీకీ తీరని నష్టాన్ని మిగిల్చిందని.. అలాంటి కాంగ్రెస్‌కు ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

జనసేనలోకి చిరంజీవి..!

  ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఎంటంటే సినీనటుడు, ప్రస్తుత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నారు. త్వరలోనే ఈ అన్నాదమ్ములిద్దరూ చేతులు కలుపుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే వీళ్లిద్దరూ కలవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడట. అది ఎవరో కాదు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజట. గత కొంత కాలంగా ఈ అన్నాదమ్ములిద్దురూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. ఏదో పైకి అలా ఏం లేదు అని వారు చెప్పినా చూసే వారికి మాత్రం అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు మన హీరో రామ్ చరణ్ తేజ నాన్న బాబాయి లను కలిపేందుకు ఇద్దరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారట. అంతేకాదు రామ్ చరణ్ తేజకు అల్లు అర్జున్ కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా జనసేన పార్టీలోకి రావడానికి చిరంజీవి కూడా సముఖత చూపించినట్టు.. ఎప్పటినుండో వెయిటింగ్ లో ఉన్న తన 150 వ చిత్రం అయిపోయిన వెంటనే జనసేనలోకి వచ్చి రాజకీయాలను పూర్తి స్థాయిలో నడిపే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు చెబుతున్నారు. మరి అన్నాదమ్ములిద్దరూ ఒకే పార్టీలోకి ఉండి రాజకీయాల్లో ఎంత వరకూ అదరగొడతారో చూడాలి.

సోనియాకు ఆ అర్హత లేదు.. జేసీ

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పై దుమ్మెత్తి పోశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు సభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పండ్ చేశారు. దీనికి గాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ ఇతరు కాంగ్రెస్ నేతలందరూ కలిసి పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు సోనియాగాంధీ చేస్తున్నధర్నాను జేసీ తప్పుబట్టారు. ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసేసి.. ఎంపీలను సస్పెన్షన్ చేసి మరీ రాష్ట్ర విభజన బిల్లును పాస్ చేసిన సోనియాగాంధీకి ఇప్పుడు బ్లాక్ డే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. అసలు సోనియా గాంధీకి బ్లాక్ డే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. అనవసరంగా ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తమ పార్టీ స్వప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని విడదీసిన సోనియాకు ఆంధ్ర రాష్ట్రం తగిన బుద్ధి చెప్పిందని.. కొన్నిసంవత్సరాలైనా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కష్టమని విమర్శించారు. ఎంపీలను సస్పెండ్‌ చేస్తే బ్లాక్‌ డే అంటున్నారు...మరి రాష్ర్టాన్ని విభజించిన మిమ్మల్ని ఏమనాలని జేసీ ప్రశ్నించారు.

ఏపీలో హైకోర్టు కోసం స్థలం అన్వేషణ

  రెండు రాష్ట్రాల మధ్య హైకోర్టు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉన్నపాటున హైకోర్టు విభజన జరగాలని మొండి పట్టుదలతో వైఖరిస్తుంది. అయితే ఈ విషయంలో గతంలోనే హైకోర్టు ఇప్పట్లో హైకోర్టు విభజన లేదని ఏపీలో హైకోర్టు నిర్మించుకునేంత వరకు విభజించేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏపీలో హైకోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని చూడాలని.. కేంద్రమే హైకోర్టు నిర్మాణానికి కావాల్సిన వ్యయం చెల్లించాలని స్పష్టం చేసింది. కానీ కేంద్రం మాత్రం ఇప్పటి వరకూ తగిన చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయంపై 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పుడు దీనిపై కేంద్రన్యాయశాఖ మంత్రి సదానందగౌడ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని.. ఏపీ ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ హైకోర్టును ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ హైకోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని చెప్పారు.

పట్టిసీమపై టీ సర్కార్ లేఖ.. ఘాటుగా స్పందించిన ఏపీ

  ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గోదావరీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం కూడా ఘాటుగానే సమాధాన మిచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పందించి పట్టిసీమ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని, మేమేమి ఇతర రాష్ట్రాల నీటిని వాడుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం రాద్దాతం చేస్తుందని అన్నారు. సాకులు చెప్పేముందు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. అసలు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం ఎక్కడుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో30 కిలోమీటర్లు మేర నీరు సముద్రంలో కలుస్తుందని..సముద్రంలో కలిసే నీరు సద్వినియోగం చేసుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది.

పవన్ కళ్యాణ్ vs శివాజీ? పవన్ రోడ్డెక్కితే ఖాయం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ నేతలందరూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం రెండు హీరోల మధ్య పోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఏపీ ప్రత్యేక హోదా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ నేతలందరినీ ఏకి పారేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ టీడీపీ ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలకు ఘాటుగానే స్పందించారు. కానీ చంద్రబాబు జోక్యం చేసుకోవడం వల్ల కాస్త నెమ్మదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని హీరో శివాజీ కూడా గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఇది పవన్ కళ్యాణ్‌కు, సినీ నటుడు శివాజీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా మారినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నా మరోవైపు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుందని పవన్ కళ్యాణ్‌పై శివాజీ ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు.   ఎందుకంటే డీడీపీ, జనసేన మిత్రపక్షమని అందిరికీ తెలిసిందే. అంతేకాదు పవన్ కళ్యాణ్ బిజెపికి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం టిడిపి వర్గాల్లో ఉంది. బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఏం అనలేని పరిస్థితి. మరోవైపు చంద్రబాబు తమంత తాముగా పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి డైరెక్ట్ గా పవన్ పై ఒత్తిడి తీసుకువస్తే నష్టమని భావిస్తున్న నేతలు ఇలా శివాజీని రంగంలోకి దింపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం శివాజీ చేస్తున్న పోరాటాన్ని సమర్తిస్తున్నట్లు చంద్రబాబు గతంలో ఓసారి చెప్పారు. మొత్తానిక పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని నేతలు గట్టిగానే నమ్ముతున్నారు. మరి ఆ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి..

పైసాలేదు.. పనిలేదు

  రెండు రాష్ట్రాల్లో ఉన్న జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు పరిస్థితి మరీ అద్వానంగా తయారయాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నంద మూరి తారకరామారావు హయాంలో గ్రామాల అభివృద్ధే దిశగా.. ప్రజల వద్దకే పాలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్థానిక సంస్ధలు ఇప్పుడు ఏదో విగ్రహల్లా మారిపోయాయి. ఒకప్పుడు నిధులు, విధులతో కళకళలాడిపోయిన జిల్లా పరిషత్‌లు ఇప్పుడు నిధులు లేక వాటి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. అప్పట్లో ఎన్టీఆర్ గ్రామాల్లోని ప్రజల సమస్యలు, అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేశారు.. కానీ కాలక్రమేణా రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి నిధులు విడుదల చేయడమే మరిచిపోయినట్టు ఉన్నాయి. అయితే 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధులను గ్రామ పంచాయితీలకు కేటాయిస్తుంది కాని మండల, జిల్లా పరిషత్ లకు నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పుడు వీటి పరిస్థితి ఉత్సవ విగ్రహాలుగా మారాయి. అటు దీంతో ఆ కార్యలయాల్లోని అధికారులు పనులు లేక పర్యవేక్షణకు మాత్రమే పరిమితమయ్యారు.   మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించాలన్న విషయంపై దృష్టిపెట్టకపోవడంతో కూడా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా మరోవైపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజలచే నేరుగా ఎన్నుకున్న తమకు నిధులు, విధులు లేక ఉత్సవవిగ్రహాలుగా మార్చొద్దని వారు వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల మనుగడకు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటాయో వేచిచూడాల్సిందేమరీ. ఇప్పటికే అన్ని విషయాల్లో గొడవ పడుతున్న రెండు ప్రభుత్వాలు కొంచెం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పరిస్థితి కూడా కొంచెం ఆలోచిస్తుందే బావుంటుంది.

ఏపీకీ ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగనివ్వం...రాజ్‌నాథ్‌

  ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అసలే రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ఆర్దిక లోటు భారీగానే ఉంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా తప్పకుండా హామీలు నెరవేర్చుతాం.. దీనిపై చర్చలు జరుగుతున్నాయి అని చెప్పిన నేతలు ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది తేల్చిచెప్పింది. దీంతో వార్తతో కేంద్రం ఒక్కసారిగా ఏపీపై బాంబు వేసినంత పని చేసింది. ఏపీ ప్రజల ఆశల మీద నీళ్లు జల్లింది. ఇప్పటికే ఏపీలో ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు పార్లమెంట్ లో కూడా ఈ విషయంపై ఆందోళనకు దిగడంతో ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని, కచ్చితంగా న్యాయం చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసిందని.. కాంగ్రెస్ చేసిన పనికి ఆంధ్రరాష్ట్రం చాలా నష్టపోయిందని ఆందోళన చేశారు. దీంతో పాటు అప్పట్లో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.. కానీ బీజేపీ మాత్రం తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని.. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీలను పక్కన నెట్టేసి ప్రత్యేకహోదా ఇవ్వనని చెప్పడం న్యాయం కాదని అన్నారు. అనంతరం, మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ప్రత్యేక హోదా అంశంపై లోతుగా పరిశీలన జరుగుతోందన్నారు.

జమ్మూలో ఉగ్రవాది దాడి, ఒక బి.యస్.యఫ్. జవాను మృతి

  గత మూడు దశాబ్దాలుగా భారతదేశం మీద పాకిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది. అక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ పైకి పంపిస్తూ అనేక వందల మందిని బలిగొంటోంది. అయినా దాని రక్తదాహం తీరడం లేదు. మళ్ళీ ఈరోజు ఉదయం జమ్ములో ఉదంపూర్ జిల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై నరసు నాలా వద్ద సరిహద్దు భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఒక బి.యస్.యఫ్.జవాను మరణించగా మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే జవాన్లు కూడా ఎదురుదాడి చేసి తమపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు.   ఈ ఘటనపై స్పందించిన జమ్మూ&కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా “ఈ దాడి జరిగిన జాతీయ రహదారిలో ఉగ్రవాదుల దాడి జరిగి చాలా కాలమే అయ్యింది. ఎందుకంటే ఆ ప్రాంతాల నుండి ఉగ్రవాదులను ఎరివేయబడ్డారు. కానీ మళ్ళీ ఇప్పుడు దాడి జరగడం చాలా ఆందోళన కలిగిస్తోంది,” అని ట్వీట్ మెసేజ్ చేశారు.

మధ్యప్రదేశ్ లో రెండు ఘోర రైలు ప్రమాదాలు

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి 11.45 గంటలకు ఒకేచోట రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి.ముంబై నుండి వారణాశికి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్, జబల్ పూర్ నుండి ముంబై వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ రైళ్ళు హర్దా జిల్లాలో ఖిర్కియా -బిరంగీ రైల్వే స్టేషన్ల మధ్య మాచక్ నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయాయి.   మొదట కామయాని ఎక్స్ ప్రెస్ రైలు వంతెనపై పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా 6 బోగీలు నదిలో పడిపోయాయి. మరికొన్ని నిమిషాలకి రెండవ వైపు నుండి వస్తున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా అదే వంతెనపైకి రాగానే పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా నాలుగు బోగీలు నదిలో పడిపోయాయి.   మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వానల కారణంగా మాచక్ నదికి వరద వచ్చి పట్టాల క్రింద రాళ్ళు, మట్టి కొట్టుకుపోవడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంతవరకు 12మంది మరణించగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. కానీ రెండు రైళ్ళకి చెందిన బోగీలు నదిలో పడిపోవడం వలన ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయి ఉండవచ్చును. నదిలో రెండు రైళ్ళకు చెందిన మొత్తం 15బోగీలు పడిపోయినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే నిజమయితే మృతుల సంఖ్య చాలా భారీగా ఉండవచ్చును.   ఈ ప్రమాదం సంగతి తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అర్ధరాత్రి చీకటిలో చాలా జోరుగా వాన కురుస్తున్న సమయంలో ఉదృతంగా ప్రవహిస్తున్న మాచక్ నది మీద ఉన్న రైల్వే వంతెనపై సహాయ కార్యక్రమాలు చేప్పట్టడం చాలా కష్టం అయినప్పటికీ అధికారులు, సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి ఇంతవరకు సుమారు 300 మందిని రక్షించగలిగారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరుతో సహా ఉన్నతాధికారులు, పోలీసులు అందరూ ప్రమాద స్థలానికి తరలివచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు సహాయ కార్యక్రమాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఒకేసారి, ఒకేచోట రెండు రైళ్ళు పట్టాలు తప్పి నదిలో పడిపోవడం వెనుక మరేవయినా కారణాలున్నాయా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆయన చేతులూ తినేయడం ఖాయం... మోదీపై వర్మ ట్వీట్లు

  ఇతరులను విమర్శించడం అనేది విమర్శల వర్మ రాంగోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన విమర్శల బాణాలకు ఎవరైనా బలవ్వాల్సిందే. ఆఖరికి ఆయన దేవుడినే వదలలేదు పాపం మనుషులను ఏం వదులుతాడు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్సలు విసిరారు. అంటే ప్రత్యక్షంగా ఎక్కడా మోదీ పేరు వినిపించకపోయినా పరోక్షంగా మాత్రం మోదీనే విమర్శించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫోర్న్ సైట్లను నిషేదించిన సంగతి తెలిసిందే. దీనిపై రాంగోపాల్ వర్మ విమర్శిస్తూ ట్వీట్టర్ లో ట్వీట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు మోదీ పై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆయన హీరో అయ్యారని.. సోషల్ మీడియా ఆయనను హీరో చేసిందని.. తనకు కూడు పెట్టిన సోషల్ మీడియా చేతులనే ఆయన తినేశారని వర్మ విమర్శించారు. ఇప్పుడు ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆయన రెండు చేతులనూ తినేయడం ఖాయమని ఆయన అన్నారు.