పవన్ కళ్యాణ్ vs శివాజీ? పవన్ రోడ్డెక్కితే ఖాయం
posted on Aug 5, 2015 @ 12:42PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ నేతలందరూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం రెండు హీరోల మధ్య పోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఏపీ ప్రత్యేక హోదా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ నేతలందరినీ ఏకి పారేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ టీడీపీ ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలకు ఘాటుగానే స్పందించారు. కానీ చంద్రబాబు జోక్యం చేసుకోవడం వల్ల కాస్త నెమ్మదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని హీరో శివాజీ కూడా గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఇది పవన్ కళ్యాణ్‌కు, సినీ నటుడు శివాజీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా మారినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నా మరోవైపు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుందని పవన్ కళ్యాణ్‌పై శివాజీ ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు.
ఎందుకంటే డీడీపీ, జనసేన మిత్రపక్షమని అందిరికీ తెలిసిందే. అంతేకాదు పవన్ కళ్యాణ్ బిజెపికి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం టిడిపి వర్గాల్లో ఉంది. బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఏం అనలేని పరిస్థితి. మరోవైపు చంద్రబాబు తమంత తాముగా పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి డైరెక్ట్ గా పవన్ పై ఒత్తిడి తీసుకువస్తే నష్టమని భావిస్తున్న నేతలు ఇలా శివాజీని రంగంలోకి దింపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం శివాజీ చేస్తున్న పోరాటాన్ని సమర్తిస్తున్నట్లు చంద్రబాబు గతంలో ఓసారి చెప్పారు. మొత్తానిక పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని నేతలు గట్టిగానే నమ్ముతున్నారు. మరి ఆ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి..