కలాం మరణంపై వర్మ ట్వీట్స్.. అలా చేయడం థ్రిల్లింగ్ గా ఉంది

  భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి.. దేశానికి ఎనలేని కృషిం చేసిన ఉన్నత మనిషి అబ్దుల్ కలాం మరణంతో యావత్ భారతదేశంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కలాం మృతికి రాజకీయ నేతల దగ్గరనుండి ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలిపారు. అలాగే ఎప్పుడూ వివాదాస్పద విమర్శుల చేసే రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో కలాంకు సంతాపం తెలిపారు. ట్విట్టర్ జనాలు, సెలబ్రెటీలందరూ కలాం కు కలాం జీ రిప్ అని ట్వీట్ చేయకుండా ఆయన గురించి ఇంత కేరింగ్ గా మాట్లాడటం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది అని ట్వీట్ చేశారు. ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయినపుడే వారి విలువ గుర్తిస్తారని.. కానీ జనాలు ఎవరైనా చనిపోయినపుడే వారి విలువ గుర్తిస్తారని అంతేకాదు చనిపోయిన వ్యక్తికి కూడా తనను ఎంత ప్రేమిస్తున్నారో చనిపోయిన తరువాతే తెలుస్తుందని ట్వీటారు. కలాం మరణం తనను చాలా బాధించిందని.. ఆయన మరణాన్ని ఇండియా ఎలా తట్టుకుని ముందుకు వెళ్తుందో తెలియట్లేదని వర్మ ట్వీట్ చేసారు. అబ్దుల్ కలాం లాంటి ఉన్నతమైన వ్యక్తికి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తికి మరణం లేదని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన ఎప్పటికీ బతికే ఉంటారు'' అని రాంగోపాల్ వర్న ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రేపు 11 గంటలకు కలాం అంత్యక్రియలు

  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని ఢిల్లీ నుండి మధురైకి తరలించారు. పాలెం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో కలాం పార్ధీవ దేహాన్ని తరలించారు. ఈ విమానంలో కలాం దేహంతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ కూడా వెళ్లారు. అక్కడ మధురైలోకి కలాం మధురైలో కలాం పార్థివదేహానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య నివాళులర్పించగా అనంతరం అక్కడి నుండి రామేశ్వరానికి తీసుకెళతారు. అనంతరం మజీదుకు తీసుకెళ్లి ప్రార్ధనలు చేయించి అక్కడ ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం ఉండి రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు చేయనున్నారు. కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.

కలాం భౌతిక కాయం మదురైకి తరలింపు

  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తమిళనాడులో పాలం విమానాశ్రయానికి తరలించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం.వెంకయ్య నాయుడు స్వయంగా ఆయన భౌతికకాయాన్ని తమిళనాడు తీసుకువెళ్ళారు. వారితోబాటు రక్షణశాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు కూడా వెళ్ళినట్లు సమాచారం. అక్కడి నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానంలో మదురైకి తరలిస్తారు. మదురై నుండి హెలికాఫ్టర్ ద్వారా ఆయన భౌతిక కాయాన్ని రామేశ్వరం తరలించి అక్కడ ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పుతారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన భౌతిక కాయాన్ని ఒక స్థానిక పాఠశాలలో ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులు తమ మతాచారాల ప్రకారం ఆయన అంత్యక్రియల కార్యక్రమాలు చేస్తారు. రేపు ఉదయం సుమారు 10.30గంటలకు ఆయనను ఖననం చేస్తారు.

కలాం ఎందుకు పెళ్లి చేసుకోలేదు

  భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అక్టోబరు 15, 1931న తమిళనాడులోని రామనాథపురం జిల్లా, రామేశ్వరంలో జన్మించారు. నిరు పేదు కుటుంబలో పుట్టిన ఆయన తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. 1960లో డీఆర్‌డీవోలో తన కెరీర్‌కు కలాం శ్రీకారం చుట్టారు. తరువాత ఇస్రోకు బదిలీ అయ్యి ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేసి సేవలందిచారు. ఒక్క సాంకేతిక రంగంలోనే కాదు అటు రాజకీయ రంగంలోకి కూడా తన పాత్రను పోషించారు. తన ఉద్యోగ జీవితంలో రెండు రోజులు మాత్రమే సెలవు పెట్టారంటే కలాం ఎంత గొప్ప వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. తన జీవితంలో ఎంతో అరుదైన అవార్డులు పొందారు. కాని ఇప్పటి వరకూ కలాం ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా సందేహాలు వచ్చివుంటాయి. ఇదే విషయంపై ఒకసారి మీరేందుకు పెళ్లి చేసుకోలేదని ఒక వ్యక్తి అడినప్పుడు ‘ఎందుకో జరగలేదంతే’ అని సమాధానం ఇచ్చారట. నా కుటుంబంలో ‘‘అయిదుగురు అన్నదమ్ములు, ఒక సోదరి ఉన్నారు నేను ఒక్కడిని పెళ్లి చేసుకోకపోతే నష్టమేంటి? వీరిలో చాలా మందికి నేను అండగా ఉన్నాను అంటూ సమాధానమిచ్చారట.

నేను చనిపోతే సెలవు ఇవ్వద్దు.. కలాం

  తాను మృతి చెందినప్పుడు పాఠశాలలకు సెలవు ఇవ్వద్దని.. ఆరోజు ఒక గంట ఎక్కువ పనిచేయాలని కలాం చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఇవాళ గంటపాటు పాఠశాలలు అదనంగా పని చేయనున్నాయి. ఈ మేరకు అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో ఒక గంట ఎక్కవ సేపు పాఠశాలలు పని చేయాలని.. ఆగంటలో అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పైన విద్యార్థులకు బోధన చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. ఒక్క పాఠశాలలే కాదు ప్రభుత్వ కార్యాలయాలు కూడా గంటపాటు అదనంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు అబ్దుల్ కలాం మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా కలాం దేసానికి విశిష్ట సేవలు అందించారని.. ఆత్మీయ వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉందని కలాంతో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

కలాం జన్మదినాన్ని విద్యార్ధుల దినోత్సవంగా మార్చిన ఐకాస

  భారత మిసైల్ మ్యాన్.. భారత క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం నిన్న సాయంత్రం షిల్లాంగ్‌ ఐఐఎంలో ప్రసంగిసిస్తూ కుప్పకూలిపోయారు. అనంతరం కలాంను ఆస్పత్రికి తరలించిన కాసేపటికే తుదిశ్వాస విడిచారు. దీంతో భారత ప్రజలు ఒక్కసారిగా బాధలో మునిగిపోయారు. తన జీవిత కాలంలో ఎన్నో అవార్డులు సొంత చేసుకున్నారు అబ్దుల్ కలాం. ఇప్పుడు ఆయన జన్మదినాన్ని విద్యార్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కాగా అబ్దుల్‌కలాం పార్థివదేహం మంగళవారం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ తదితరులు నివాళులర్పించారు. మరికాసేపట్లో కలాం భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించనున్నారు.

టీడీపీ నేతల ఇంగ్లీష్ వింగ్లీష్

    గోదావరి మహా పుష్కరాల మొదటి రోజునే తొక్కిసలాట జరిగి చాలా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిని టీడీపీ ప్రతిపక్ష నేతలు చాలా అస్ర్తంగా తీసుకొని విమర్శల బాణాలు వదిలారు. పెద్ద రాద్ధాంతమే చేశారు. దీనిపై నేషన్ మీడియా ఛానల్ కూడా సుదీర్ఘ చర్చ కూడా నిర్వహించింది. అయితే ఈ చర్చలో మాత్రం మన టీడీపీ నేతలకు ఇంగ్లీష్ రాక చమటలు కూడా పట్టాయి. తొక్కిసలాటకు జరిగిన కారణాలు గురించి ఇంగ్లీష్లో గట్టిగా సమాధానం కూడా చెప్పలేకపోయారు. దేశ వ్యాప్తంగా పరువు తీసిపెట్టారు. మరి మన పండిత టీడీపీ నేతలు ఎలా మాట్లాడారో ఈ కింద వీడియో ద్వారా మీరే చూడండి.  

అబ్దుల్ కలాం రాష్ట్రపతి.. చంద్రబాబు ముఖ్యపాత్ర

  భారతదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. భారత మిస్సైల్ మాన్ పిలవబడే కలాం దేశానికి ఎనలేని కృషి చేశారు. కలలకు అర్ధం చెప్పి.. కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతలో స్ఫూర్తినింపారు అబ్దుల్ కలాం. తన జీవితంలో ఎవరూ పొందలేని అరుదైన అవార్డులు ఎన్నేన్నో పొందారు. అబ్దుల్ కలాం సాంకేతిక రంగంలోనే కాదు అటు రాజకీయ రంగంలో కూడా రాష్ట్రపతిగా తన పాత్రకు న్యాయం చేశారు. ఒక రకంగా అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ముఖ్యభూమిక పోషించారని చెప్పవచ్చు. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్నారు. ఆసమయంలో వాజపేయి భారత ప్రధానిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడు వాజపేయి భారత రాష్ట్రపతిగా మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని తీర్మానించారు. దీనిలో భాగంగానే ముగ్గురు మైనార్టీ నేతల పేర్లను తీసి ఎన్డీయే కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబును సంప్రదించినప్పుడు చంద్రబాబు అబ్దుల్ కలాం పేరును సూచించారట. ఈ నేపథ్యంలో అబ్దుల్ కలాంను కూడా నో చెప్పవద్దని బాబు ఒప్పించారట.

రామేశ్వరంలోనే కలాం అంత్యక్రియలకి కేంద్రం ఏర్పాట్లు

  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యుల విజ్ఞాప్తి మేరకు ఆయన అంత్యక్రియలను ఆయన స్వస్థలమయిన రామేశ్వరంలోనే నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయాన్ని డిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లోగల ఆయన అధికారిక నివాసంలో ఉంచుతారు. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఆయన భౌతిక కాయాన్ని రామేశ్వరం తరలించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అధికారిక లాంఛనాలతో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా కొందరు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా హాజరవుతారు.

జగన్ పార్టీ వైపు ఆనం సోదరులు.. బొత్సా ప్రయత్నాలు

  ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మొదలు డీఎస్ వరకూ చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇప్పుడు ఆనం సోదరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే నెల్లూరు జిల్లాకి చెందిన ఆనం సోదరులు బొత్సా సత్యనారాయణకి సన్నిహితులు కావడంతో ఈ ఇద్దరు సోదరులను వైసీపీ లోకి తీసుకొచ్చే బాధ్యతను తను తీసుకని దీనిలోభాగంగా ఆనం సోదరులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారట. మరో వైపు బొత్సా ప్రయత్నాలు ఫలించనచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.   అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆనం సోదరులకు తిరుగుండేది కాదు. అంతేకాదు రాజశేఖర్ రెడ్డి కి కూడా ఈ సోదరులు చాలా సన్నిహితలుగా ఉండేవారు. గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలని చర్చలు జరిగినప్పుడు సంతకాలు చేసిన వారిలో ఆనం సోదరులు ముందున్నారు. అయితే తరువాత జగన్ వేరే పార్టీ పెట్టినా వీరిద్దరు మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. అప్పట్లో జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేదు.. అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో లేదో కూడా తెలియదు.. ఈనేపథ్యంలో ఆనం సోదరులు కూడా పార్టీ మారడానికే సముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే చాలా రోజులనుండి వీరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ఆనం సోదరుల ఎంట్రీకి జిల్లాలోని ఇతర నేతల అభిప్రాయాలను కనుగొన్న తరువాత జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి బొత్సా ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.   ఇదిలా ఉండగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చాలా మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. దీనిపై ఇప్పటికే చాలామంది విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అందరూ కలిసి జగన్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తారేమో అని విమర్శించారు కూడా మరి నిజంగానే కాంగ్రెస్ నేతలందరూ కలిసి జగన్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తారేమో చూడాలి.

అబ్దుల్ కలాం అవార్డులు...

  భారత మాజీ రాష్ట్రపతి, దివంతగ అబ్దుల్ కలాం తన జీవితంలో ఎన్నో అవార్డులు పొందారు. వాటిలో కొన్ని అవార్డులు ఇవి... 2014 సైన్స్ డాక్టరేట్ (ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం,UK), 2012 గౌరవ డాక్టరేట్ (సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం), 2011 IEEE గౌరవ సభ్యత్వం, 2010 ఇంజనీరింగ్ డాక్టర్ (వాటర్లూ విశ్వవిద్యాలయం), 2009 గౌరవ డాక్టరేట్ (ఓక్లాండ్ యూనివర్శిటీ), 2009 హూవర్ పతకం (ASME ఫౌండేషన్ USA), 2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు (కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA), 2008 ఇంజనీరింగ్ డాక్టర్ (నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్), 2007 కింగ్ చార్లెస్ II పతకం (రాయల్ సొసైటీ, UK), 2007 సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ (వోల్వర్థాంప్టన్ విశ్వవిద్యాలయం, UK), 2000 రామానుజన్ అవార్డు (ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై), 1998 వీర్ సావర్కర్ అవార్డు (భారత ప్రభుత్వం), 1997 నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం (భారత జాతీయ కాంగ్రెస్), 1994 గౌరవనీయులైన ఫెలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం), 1990 పద్మ విభూషణ్ (భారత ప్రభుత్వం) 1981 పద్మ భూషణ్ (భారత ప్రభుత్వం), 1997 భారతరత్న (భారత ప్రభుత్వం).

అబ్దుల్ కలాం జీవిత విశేషాలు-2

  అబ్దుల్ కలాం తండ్రి జైనుల్బదీన్, పడవ యజమాని. తల్లి ఆశి అమ్మ గృహిణి. వారిది నిరుపేద కుటుంబ కావటంతో కుటుంబ అవసరాల కోసం ఆయన చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా తోడ్పడటానికి వార్తాపత్రికలు పంపిణీ చేశాడు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ పాఠశాలలో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. ఆ తర్వాత యుద్ధ పైలట్ కావాలనే తన కలను ఒక్క స్థానం వెనుకబడటంతో కోల్పోయారు. ఆ తర్వాత కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ అండ్ ఎస్టాబ్టిష్‌మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ కింద INCOSPAR కమిటీలో పనిచేశారు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేరి ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేశారు. జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్య లో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

పంజాబ్ లో ముగిసిన ఆర్మీ ఆపరేషన్, ముగ్గురు తీవ్ర వాదులు హతం

  పంజాబ్ రాష్ట్రంలో గురుదాస్ పూర్ జిల్లాలో దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఈరోజు (సోమవారం) ఉదయం ఉగ్రవాదులు చేసిన దాడిలో మొత్తం ఎనిమిదిమంది చనిపోగా మరొక 15మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కనుక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఉదయం సుమారు 8గంటల భద్రతా దళాలు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న భవనంలో నక్కిన ఉగ్రవాదులను చుట్టుముట్టారు. అప్పటి నుండి సాయంత్రం వరకు వారి మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటల సమయానికి భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపడంతో మిలటరీ ఆపరేషన్ ముగిసింది.   మరణించిన ఉగ్రవాదులు బహుశః పాకిస్తాన్ కి చెందిన లష్కర్-ఏ-తోయిబా సంస్థకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారివద్ద అత్యాధునిక ఆయుధాలతో బాటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం కూడా ఉండటం అందరినీ విష్మయానికి గురి చేసింది. అంటే దీనికి చాలా ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక ప్రకారమే వారు ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఈ దాడిలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బల్జీత్ సింగ్ (డిటెక్టివ్) కూడా మరణించారు. కొన్ని రోజుల క్రితమే భారత్, పాక్ ప్రధాన మంత్రులు రష్యాలో సమావేశామయినప్పుడు ఇరు దేశాల మధ్య మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకోవాలని నిశ్చయించుకొన్నారు. కానీ సరిగా నెల తిరక్కుండానే పాక్ ఉగ్రవాదులు భారత్ పై దాడికి తెగబడటంతో పాకిస్తాన్ వైఖరి ఇక ఎన్నటికీ మారదని స్పష్టమయింది.

అబ్దుల్ కలాం కన్నుమూత... పుకారు కాదు...

  భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం యావత్ భారతదేశాన్ని విషాదంలో ముంచింది. అయితే గతంలో అనేక పర్యాయాలు అబ్దుల్ కలాం మరణించారంటూ పుకార్లు వచ్చాయి. ఒకసారి కాదు... రెండుసార్లు కాదు.. అనేకసార్లు ఆ పుకార్లు వచ్చాయి. ఆయన కిందపడిపోయి గాయపడ్డారని, ఐసీయులో వున్నారని... ఇలా అనేకసార్లు పుకార్లు వ్యాపించాయి. సోమవారం షిల్లాంగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ కుప్పకూలారన్న వార్తలు మొదటిసారి వినప్పుడు ఈ వార్తలు కూడా గతంలో తరహాలో పుకార్లేనని చాలామంది భావించారు. అయితే అవి పుకార్లు కావు.. ఆయన నిజంగానే కన్నుమూశారన్న విషయం తెలుసుకుని భారత ప్రజల గుండెలు ఆవేదనతో బరువెక్కాయి.

అబ్దుల్ కలాం జీవిత విశేషాలు-1

  సోమవారం నాడు కన్నుమూసిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా గడిచింది. జీవితంలో చివరి క్షణం వరకూ ఏదో ఒక పనిచేస్తూనే ఆయన తాను నిరంతర శ్రామికుడినని నిరూపించారు. నిరంతరం శ్రమించండి అని ఈ దేశానికి తన మరణం ద్వారా కూడా సందేశాన్ని ఇచ్చారు. అబ్దుల్ కలాం భారత దేశానికి 11వ రాష్ట్రపతి. జూలై 25, 2002 – జూలై 25, 2007 మధ్య ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు. తమిళనాడులోని రామేశ్వరం వద్ద వున్న ధనుష్కోడిలో ఆయన అక్టోబరు 15, 1931. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో, మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్న ఆయన దేశంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించి, క్షిపణి శాస్త్రవేత్తగా తన ఆధ్వర్యంలోనే భారత ప్రభుత్వం అణు పరీక్షలు జరిపే స్థాయికి ఎదిగారు. అందరూ ఏపీజే అబ్దుల్ కలాంగా పిలిచే ఆయన పూర్తి పేరు అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలాం. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టడానికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. ఆయననను భారతీయ మిస్సైల్ మాన్ అని పిలుస్తారు. కలాం బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998లో భారతదేశం జరిపిన పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును కూడా అందుకున్నారు. అబ్దుల్ కలాం బ్రహ్మచారి.