ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు.. చంద్రబాబు దూకుడు
posted on Aug 6, 2015 @ 6:03PM
ఓటు నోటు కేసు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటాను కోర్టుకు సమర్పించారు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై తన దూకుడుని ప్రదర్శించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారని గతంనుండి చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వీసు ప్రొవైడర్లు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాపింగ్ చేశామని కూడా చెప్పారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయడానికి బాధ్యులైన కొంతమంది తెలంగాణ అధికారుల పేర్లతో తయారు చేసిన నివేదికను క్రితమేకేంద్రానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్ అధికారులు పేర్లు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ తోపాటు పలువురు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు దానికి సంబంధించిన ఆధారాలు ఏపీ ప్రభుత్వం సాధించినట్టు చెబుతున్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చంద్రబాబు కూడా తెలంగాణ ప్రభుత్వంపై గట్టిగానే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆధారాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వివరమైన నివేదిక ఉండాలని ఏసీబీ అధిపతిని ఆదేశించినట్టు సమాచారం. గతంలో ఉన్న నివేదిక కంటే ఇప్పుడు తయారుచేసే నివేదిక మరింత క్లియర్ గా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే మొదటి నుండి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం మొత్తుకుంది.. కానీ ఆతరువాత సర్వీసు ప్రొవైడర్లు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు మేం ఫోన్ ట్యాపింగ్ చేశాం.. ఫోన్ ట్యాపింగ్ చేయడం తెలంగాణ హక్కు అని చెప్పారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా పరోక్షంగా ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది. మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా తప్పించుకుంటుందో చూడాలి మరి.