ఏపీకీ ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగనివ్వం...రాజ్‌నాథ్
posted on Aug 5, 2015 @ 11:15AM
ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అసలే రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ఆర్దిక లోటు భారీగానే ఉంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా తప్పకుండా హామీలు నెరవేర్చుతాం.. దీనిపై చర్చలు జరుగుతున్నాయి అని చెప్పిన నేతలు ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది తేల్చిచెప్పింది. దీంతో వార్తతో కేంద్రం ఒక్కసారిగా ఏపీపై బాంబు వేసినంత పని చేసింది. ఏపీ ప్రజల ఆశల మీద నీళ్లు జల్లింది. ఇప్పటికే ఏపీలో ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు పార్లమెంట్ లో కూడా ఈ విషయంపై ఆందోళనకు దిగడంతో ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని, కచ్చితంగా న్యాయం చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసిందని.. కాంగ్రెస్ చేసిన పనికి ఆంధ్రరాష్ట్రం చాలా నష్టపోయిందని ఆందోళన చేశారు. దీంతో పాటు అప్పట్లో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.. కానీ బీజేపీ మాత్రం తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని.. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీలను పక్కన నెట్టేసి ప్రత్యేకహోదా ఇవ్వనని చెప్పడం న్యాయం కాదని అన్నారు. అనంతరం, మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ప్రత్యేక హోదా అంశంపై లోతుగా పరిశీలన జరుగుతోందన్నారు.