తెలంగాణ అమరులపై ప్రజా తెలంగాణ..
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు గాను 36 మంది అమరులకు తెరాస ప్రభుత్వం ఆర్ధిక సహాయం ప్రకటించింది. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా.. ఈ ఉద్యమంలో ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారని.. ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్లు ఉన్నారని వాళ్లకు కూడా మంచి ఫలితాలు వస్తే బావుటుందని "ప్రజా తెలంగాణ" అనే ప్రతిక ఆరోపిస్తుంది.
దీని గురించి ప్రజా తెలంగాణ స్పందిస్తూ.. డిసెంబర్ 14 నుండి ఇప్పటి వరకు ప్రతి రోజూ జిల్లా కేంద్రాల్లో ‘ప్రజా తెలంగాణ’ ఆధ్వర్యంలో జరిగిన శిబిరాల్లో దాదాపు ఐదువేల మంది ఉద్యమంలో తమ పాత్రకు సంబంధించి ఆధారాలతో వచ్చారని..సామాన్య ప్రజలు, పలురకాల జేఏసీ సభ్యులు, టీ.ఆర్.ఎస్ సహా పలు పార్టీల క్రియాశీల సభ్యులూ, ఉద్యమ కారులూ, కుల సంఘాలు అందరూ ఇందులో ఉన్నారని తెలిపారు. ప్రజా తెలంగాణ దగ్గర 1254 మంది అమరుల బేసిక్ డేటా ఉందని.. ప్రభుత్వం ప్రతి ఒక్క అమరునికీ న్యాయ చేయాల్సిన బాధ్యత తమదేనని తెలిపింది. వాస్తవానికి.. ప్రభుత్వ లెక్కలకీ చాలా తేడాలున్నాయంటూ.. ఉద్యమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి న్యాయం జరగాలని.. ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదైన నేపథ్యంలో వారు కేసులు కొట్టివేయాలని కోరుతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన డిమాండ్స్ కూడా తెలియజేశారు.
డిమాండ్స్
* పన్నెండు వందల పైచిలుక అమరుల కుటుంబాలన ఆదుకోవాలి. అందరి చరిత్ర అధికారికంగా లిఖించాలి. అసెంబ్లీ సాక్షిగా అమరు ల కుటుంబాలకు యిచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి.
* ఉద్యోగాలు కోల్పోయి, చదువులు కోల్పోయి, నేడు ఏ ఆసరా లేని త్యాగధనులపై అన్ని కేసులూ ఎత్తివేయాలి. వీరు జీవితాల్లో స్థిర పడేందుకు గాను అన్ని చర్యలూ చేపట్టాలి.
* ఇప్పటికే చాలా విలువైన సమయం కోల్పోయి ఉన్న యువతకు స్వాంతన నిచ్చేందుకు వీలుగా, పై డిమాండ్లను నెల రోజుల లోగా నెరవేర్చాలి.