జయలలిత డిమాండ్.. నోట మాట రాని మోడీ..
posted on Jan 6, 2016 @ 2:58PM
తమిళనాడు సీఎం జయలలిత రాజకీయంగా ప్లాన్ వేయడంలో దిట్ట. ప్లాన్ చేయాలంటే ఆమె తరువాతే ఎవరైనా. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పట్టేలా నిర్ణయం తీసుకున్నారు జయలలిత. మొన్నీ మధ్యనే తమిళనాడులో జరిగే జల్లికట్టు క్రీడపై అనుమతి ఇవ్వాలని కేంద్రాన్నికోరారు. దీనికి కేంద్రం కూడా ఏం చేయాలో తెలియక అనుమతినిచ్చింది. ఇప్పుడు అది అయిపోయిందంటే.. భారీ వర్షాల వల్ల తమిళనాడు చాలా నష్టపోయిందని.. దీనికి గాను రూ.25912 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అక్టోబర్-డిసెంబర్ మధ్య నాలుగు దశల్లో కురిసిన భారీ వర్షాల వల్ల తమ రాష్ట్రంలో 470 మంది మృతి చెందారని తెలిపారు. లక్ష పశువులు మృతి చెందగా.. 382768 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వివరించారు. అంతేకాదు భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన 245మంది కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున సాయమందించినట్టు జయలలిత తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా కుటుంబాలకు సాయమందిస్తామన్నారు.
మరోవైపు జయలలిత చేసిన డిమాండ్ కు బీజేపీ నేతలు ఆమెపై గుర్రుమంటున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలున్నాయి కాబట్టి ప్రజలను ఆదుకుంటున్న పేరుతో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని జయలలిత చూస్తుందని అంటున్నారు. మరోవైపు జయలలిత డిమాండ్ కు మోడీ కి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారంట. ఈ నేపథ్యంలో జయలలిత ప్లాన్ వర్కవుట్ అవుద్దో లేదో చూడాలి. కానీ మోడీకి జయలలిత మద్దతు ఖచ్చితంగా కావాల్సిందే.. మరి జయలలిత డిమాండ్ కు మోడీ ఏమంటారో..?