కాల్ మనీ.. పెండ్యాల శ్రీకాంత్ కు రహస్య విచారణ
కాల్ మనీ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతనిని టాస్క్ఫోర్స్ పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా కాల్ మనీ బాధీతురాలు ఇచ్చిన ఫిర్యాదు వల్ల యలమంచిలి రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీనివాసరావు, విద్యుత్ డీఈ ఎం.సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేశ్‌లపై కేసు నమోదు అయిన తెలిసిందే.
మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో శ్రీకాంత్కు చెందిన మామిడి తోటపై పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.