Read more!

మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని ఎందుకంటారు? ఈ రోజు చంద్రుని అనుగ్రహం కోసం ఏం చెయ్యాలంటే!

 

మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని ఎందుకంటారు? ఈ రోజు చంద్రుని అనుగ్రహం కోసం ఏం చెయ్యాలంటే!

హిందూ క్యాలెండర్ లో ప్రతి పౌర్ణమికి ఒక విశిష్టత తప్పకుండా ఉంటుంది.  ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్యలకు చాలా పెద్ద ప్రాధాన్యతే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన మాసాలలో ఈ పౌర్ణమి, అమావాస్యలను చాలా శక్తివంతమైన, పుణ్యప్రదమైన తిథులుగా పేర్కొంటారు. ప్రస్తుంత మార్గశిర మాసంలో డిసెంబర్ 26వ తేదీన పౌర్ణమి తిథి ఉంది. ఈ తిథి చాలా ప్రత్యేకమైనదని భావిస్తారు.  మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ తిథి సమయం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది? ఈ తిథి రోజున పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పనులేంటి తెలుసుకుంటే..

మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 26వ తేదీన ఉదయం 5.46గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది డిసెంబర్ 27వ తేదీ ఉదయం 6.02గంటల వరకు ఉంటుంది. మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అని పిలవడం వెనుక ఒక పురాణ కథనం కూడా ప్రచారంలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తమ కోరలు తెరచుకుని ఉంటాడట. దీంతో ఎన్నో రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యులు తొలగిపోతాయి. కోరల పున్నమి రోజు ముఖ్యంగా యమధర్మరాజును పూజిస్తారు. ఈ రోజు ఆయన్ను పూజించడం వల్ల శాంతిని అందిస్తాడని నమ్మకం.  

కోరల పున్నమి రోజు  చాలాచోట్ల  మరొక ఆచారం కనిపిస్తుంది. చాలా ప్రాంతాలలో ఈ రోజు కుడుములు తయారుచేసి వాటిని శునకాలకు పెడతారు. శునకాలు కాలభైరవుడి వాహనం. అందుకే ఈరోజు శునకాలకు కుడుములు పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.

పౌర్ణమి అంటే చంద్రుడు పూర్ణ స్థితిలో ఉంటాడు. ఈ రోజు భక్తితో కూడుకున్న ఏ పని చేసినా చెప్పలేనంత పుణ్యాన్ని చేకూర్చుతుంది. ఇంకక విషయం ఏమిటంటే మార్గశిర పౌర్ణమి రోజు చేసే ఏ దానం అయినా సరే మిగిలిన మాసాల్లో చేసే దానాని కంటే 32రెట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది.

పౌర్ణమి రోజు చంద్రునికి పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.  పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తరువాత పచ్చి పాలలో చక్కెర, బియ్యం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు.  

                        *నిశ్శబ్ద.