Read more!

సదానందకరం .... సాయి సచ్సిదానంద స్వరూపం

 

శ్రీ సాయి ఎలాంటి వారు? బాబా జ్ఞానమూర్తి. వైష్ణవులకు వి ట లుడు.... శివ భక్తులకు సాక్షాత్తూ పరమేశ్వరుడు. బాబా క్లిష్టతరమైన సంసారాన్ని జయించారు. బాబాకు శాంతమే భూషణం .మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు.

బాబా నిత్యం అత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్చమైనది. బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు.బాబాకు అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా సమాధి స్తితి నుండీ మరలువారు కాదు. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు... పాడేవారు.

బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామ స్మరణ. బాబా ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా! బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబా ది సచ్చిదానంద స్వరూపం. నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు. బాబా గురించి ఇంత తెలిసినా ఎవరికీ ఏమీ తెలియదు.