నవగ్రహ దీపాల నోము (Navagraha Deepala Nomu)

 

నవగ్రహ దీపాల నోము

(Navagraha Deepala Nomu)

 

నవగ్రహాల అనుగ్రహం కోసం, ఐశ్వర్యం పొందేందుకు కార్తీక పౌర్ణమి రోజున ఈ నోము నోచుకుంటారు.

విధానం

శివాలయంలో అభిషేకం చేయించి వినాయకుడిని ఆరాధించాలి. తొమ్మిది ప్రమిదలు, తొమ్మిది ఒత్తుల చొప్పున వెలిగించి, ఒక్కొక్క ప్రమిద వద్ద నవధాన్యాలలో ఒక్కొక్క రకం ధాన్యం కొద్దిగా ఉంచి, ఒక్కొక్క ప్రమిదను ( ధాన్యం సహా ) ఒక్కొక్క బ్రాహ్మణునికి దానమివ్వాలి.