మోచేతి పద్మం నోము పాట (Mocheti Padmam Nomu Paata)

 

మోచేతి పద్మం నోము పాట

(Mocheti Padmam Nomu Paata)

 

మోచేతి పద్మమ్ము పట్టేటి వేళ

మొగ్గల తామర్లు పూసేటి వేళ

కాకర్ల పువ్వులు పూసేటి వేళ

కడవలా ఉదకాలు తెచ్చేటి వేళ

ఆనప పువ్వులూ పూసేటి వేళ

అటికెల ఉదకాలు తెచ్చేటి వేళ

గుమ్మడీ పువ్వులూ పూసేటి వేళ

గుండిగల ఉదకాలు తెచ్చేటి వేళ

బీరపాదుల పూలు విచ్చేటి వేళ

బిందెలా ఉదకాలు తెచ్చేటి వేళ

సందేల దీపాలు పెట్టేటి వేళ

చాకళ్ళు మడతలు తెచ్చేటి వేళ

ఆవులూ గోవులూ వచ్చేటి వేళ

ఆబోతు రంకెలూ వేసేటి వేళ

అన్నలూ అందలా లెక్కేటి వేళ

తమ్ములూ తాంబూలమేసేటి వేళ

అక్కల్లు పక్కల్లు మార్చేటి వేళ

చెల్లెళ్ళు చేమంతి ముడిచేటి వేళ