Read more!

వసంత పంచమిరోజు సరస్వతి దేవిని ఎందుకు పూజిస్తారు?

 

వసంత పంచమిరోజు సరస్వతి దేవిని ఎందుకు పూజిస్తారు?

వసంతం వచ్చిందంటే చాలు ప్రకృతిలోని ప్రతి అణువు  వికసిస్తుంది. చెట్లు, మొక్కలు,  జంతువులలో కొత్తదనం నిండుకుంటుంది. ప్రకృతి అంతా కొత్తగా కనిపిస్తుంది.  వసంత ఋతువును ఋతువుల రాజుగా పిలుస్తారు. ఈ ఋతువులో ప్రకృతి పులకిస్తుంది. సంవత్సర కాలంలో సృష్టి మొత్తం యవ్వనంగా ఉండే దశ అది.  మరొకవైపు ఈ ఋతువులో సంగీతం, విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి అవతరించిన రోజు. అందుకే వసంత పంచమి అన్ని శుభకార్యాలకు చాలా పవిత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఈరోజు ముఖ్యంగా విద్యాభ్యాసానికి, గృహ ప్రవేశానికి చాలామంచిది.

మరొకవిషయం ఏమిటంటే.. ఈ వసంత పంచమి రోజే మన్మమధుడు, ఆయన భార్య రతిదేవి ఇద్దరూ మానవుల హృదయాలలో ప్రేమ అనే ఆకర్షణను నింపారట. ఈరోజున కామదేవుడు అయిన మన్మధుడిని, రతిదేవిని పూజించడం వల్ల వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని అంటారు. ఇక సరస్వతిదేవిని పూజించడం వల్ల  అజ్ఞానం తొలగిపోయి జ్ఞానవంతులవుతారని అంటారు.

సరస్వతి దేవి ఎలా ఉద్బవించిందంటే..

సృష్టి ప్రారంభ రోజుల్లో విష్ణువు ఆజ్ఞతో బ్రహ్మ జీవులను, ముఖ్యంగా మానవ గర్భాన్ని సృష్టించాడు. అయితే ఆయన  తన సృష్టితో సంతృప్తి చెందలేదు.  చుట్టూ ఉన్న నిశ్శబ్దం కారణంగా ఏదో కోల్పోయినట్లు అనిపించింది. అందుకే  విష్ణువు అనుమతితో బ్రహ్మ తన కమండలం నుండి నీటిని చిలకరించాడు.  అప్పుడు  నీటి బిందువులు  భూమిపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ నీటి బిందువులు కంపించడం ప్రారంభించాయి.  అప్పుడు నాలుగు చేతులు కలిగిన స్త్రీ రూపంలో ఒక అద్భుతమైన శక్తి  ఆవిర్భవించింది.  ఒక చేతిలో వీణను పట్టుకుని, మరో చేతిలో వరాలు ఇచ్చే వరదాభయ  భంగిమలో ఉంది. మరో రెండు చేతులలో  పుస్తకాలు పూలమాలలు ఉన్నాయి. బ్రహ్మ దేవతను వీణ వాయించమని కోరాడు. దేవి వీణను వాయించిన వెంటనే  మధురమైన ధ్వని వెలువడింది.  ఆ ప్రవాహం శబ్దంగా మారింది.  గాలికూడా కంపించింది. దీంతో ప్రపంచంలోని మానవులకు  వాక్కు లభించింది. అప్పుడు బ్రహ్మ ఆమెను వాక్కును ప్రసాదించింది కాబట్టి వాగ్దేవి అని అన్నారు. అలా ఆమె వాగ్దేవి అయింది. వాక్కును ప్రసాదించింది కాబట్టి సరస్వతి అని కూడా అన్నారు.

సరస్వతిని బాగీశ్వరి, భగవతి, శారదా, వీణా పాణి,  వాగ్దేవి వంటి అనేక పేర్లతో పూజిస్తారు. ఈమె  జ్ఞాన ప్రదాత, కళలకు,  సంగీతానికి అధిదేవత. ఈ కారణంగా సరస్వతిని సంగీత దేవత అని,కూడా పిలుస్తారు.  

పురాణం ప్రకారం వసంత పంచమి రోజున శ్రీ కృష్ణుడు సరస్వతి దేవికి  ఒక వరం ఇచ్చాడు..

 ఈ విశ్వంలోనూ, మాఘ శుక్ల పంచమి రోజున విద్యాభ్యాసం పేరుతో  గొప్పగా పూజించబడతారు. శ్రీకృష్ణుని అనుగ్రహ ప్రభావంతో  చివరి వరకు ప్రతి కల్పంలో మానవులు, మునులు, దేవతలు, మోక్షకామి, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ నిన్ను ఎంతో భక్తితో పూజిస్తారు. పూజ చేసే పవిత్ర సందర్భంలో  పండితులు ప్రశంసిస్తారు. పుస్తక రూపంలో సరస్వతి దేవిని ఆరాధిస్తారని సరస్వతి దేవికి వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఇలా చెబుతూ శ్రీకృష్ణుడు మొదట సరస్వతీ దేవిని పూజించగా ఆ తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవతల రాజు అయిన  ఇంద్రుడు కూడా  సరస్వతీ దేవిని పూజించారు. అప్పటినుండి సరస్వతీ మాతను ప్రతి వసంత పంచమి రోజున భక్తిశ్రద్దలతో పూజించడం ప్రారంభించారు.

                                              *నిశ్శబ్ద.