పొన్నూరు ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుంది : ధూళిపాళ్ల

  పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు  కాపు కాశారని ఆరోపించారు. గతంలో టీడీపీ నేత బండ్లమూడి బాబురావు, అశోక్‌పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్రపన్నారని ఆరోపించారు.  గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. కూటమిమ ప్రభుత్వంపైన బురద జల్లేందుకు, తమను అప్రతిష్ట  పాలు చేసేందుకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు ప్లాన్ చేశారని  ధూళిపాళ్ల  ఆరోపించారు 
పొన్నూరు ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తుంది : ధూళిపాళ్ల Publish Date: Jul 6, 2025 6:18PM

ఏపీలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ

  ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్‌‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది..బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది.  స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌షాపు నంబరు తదితర వివరాలుంటాయి. కార్డు వెనుకవైపు లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రేషన్‌ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్‌ యంత్రాల సహాయంతో స్కాన్‌ చేస్తే ఆ ఫ్యామిలీ సంబంధించిన వివరాలతోపాటు రేషన్‌ సరుకుల వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రత్యక్షమవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఈ కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ముద్రణ కోసం ఏపీటీఎస్‌ ద్వారా టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం ముద్రణ దశలో ఉన్న కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు
ఏపీలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు  పంపిణీ Publish Date: Jul 6, 2025 5:36PM

ఉగ్ర బంధాలపై గురి...రాయచోటి ఘటనపై లోతుగా విచారణ

  అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.  రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ మొత్తం కేంద్ర స్థాయిలోని.  అత్యున్నత దర్యాప్తు సంస్థలు, నిఘవర్గాల కనుసన్నుల్లో జరుగుతున్నట్టు  తెలుస్తోంది.ఈ విచారణలో రాష్ట్రస్థాయిలోని దర్యాప్తు నిఘ వర్గాల సైతం పాల్గొంటున్నట్టు సమాచారం.  అత్యంత చాకచక్యంగా ఉగ్రవాదులను తమిళనాడు ఐబి, అన్నమయ్య పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదుల నుంచి బాంబులు,పెద్ద ఎత్తున బాంబు తయారీ పదార్థాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.  అంతటితో ఆగకుండా... మూడు దశాబ్దాలకు పైగా. రాయచోటిలో మకాం వేసిన ఉగ్రవాదుల గత చరిత్ర మొత్తం తవ్వే పనిలో పోలీసులు పడ్డారు. రాయచోటీలో ఉగ్రవాదులకు ఆవాసం కల్పించింది ఎవరు. వాళ్లతో అతిస న్నితంగా మెలిగింది ఎవరు. ఉగ్రవాదులు ఇద్దరికీ. ఈ ప్రాంతంలో పెళ్లి చేసింది ఎవరు. అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పట్టణంలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారంలో సాగుతోంది. ప్రస్తుతం పోలీసు విచారిస్తున్న వారిలో  కొందరు. గతంలో రాయచోటిలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. అదుపులోకి తీసుకున్న వారిని. వేర్వేరు ప్రదేశాలలో  ఉంచి పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. వారి భంధాలపై   పోలీసులు అబూబకర్, మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులను  అదుపులోకి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం విచారణ మొత్తం అతని బంధాల చుట్టే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అబూబకర్ అరెస్టు తర్వాత అతని ఇంట్లో పోలీసులు జరిపిన సో దాలలో  భారీ సంఖ్యలో బాంబు తయారీ పదార్థాలు దొరికడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన. అబూబకర్ బాంబులు తయారీలో నిష్ణాతుడు.. 1995లో తన నేర చరిత్రను మొదలుపెట్టిన అబుబకర్ దక్షిణాది రాష్ట్రాలలో పలుచోట్ల బాంబు పేలుళ్ల నేరాలు పాల్పడ్డాడు.  అక్కడ కొన్ని కేసులలో  పోలీసులు చిక్కినప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చి రాయచోటి చేరిపోయాడు. ఇక్కడే స్థిరపడ్డాడు. గత 30 సంవత్సరాల లో రాయచోటిలో మూడు ప్రాంతాలలో అతను నివాసం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇంటి ఓనర్లను,అతనికి ఇల్లు ఇప్పించిన వాళ్లను విచారిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.2021లో  అతనికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసిన వా రిని విచారిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా మొహమ్మద్ అలీ కి ఇక్కడ ఇల్లు ఇప్పించిన వాళ్లను,పెళ్లి చేసిన వాళ్లను కూడా పోలీసులు వి చారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టౌన్ లో ఎక్కడ చూసినా ఈ విషయాలపైనే చర్చ నడుస్తోంది. *రాయచోటి కే పరిమితమా! రాయచోటిలో పట్టుబడ్డ ఉగ్రవాదులు అబూబకర్ ,మహమ్మద్ అలీ రాయచోటికే పరిమితం అయ్యారా?ఇక్కడ నుంచే  కార్యకలాపాలు నిర్వహించారా! లేక ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లోని  మరే ప్రాంతాల్లో అయినా వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 30 ఏళ్లుగా రాయచోటి కేంద్రంగా వీరు రహస్యంగా ఉన్నారంటే వీరి కార్యకలాపాలకు ఎవరైనా సహకారం అందించి ఉంటారేమో అన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఉమ్మడి కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా ఏమైనా పరిచయాలు ఉన్నాయా,  ఎవరైనా సహకారం అందిచారా  అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు ,జిల్లా పోలీసు బృందాలు లోతుగా విచారిస్తుండడంతో తీగ లాగితే డొంక కదిలినట్టు ఎలాంటి  సమాచారం బయటికి వస్తుందో నన్ను ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఉగ్ర బంధాలపై గురి...రాయచోటి ఘటనపై లోతుగా విచారణ Publish Date: Jul 6, 2025 5:00PM

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

  తెలంగాణలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాది కొత్తగూడెంలో పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతొ కలిసి  అందజేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం, చింతపెంటిగూడెంలో హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తొలి ఏకాది శుభ దినాన ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేయం చాలా సంతోషంగా ఉందని  మంత్రి పొంగులేటి అన్నారు.  ఈ విడతలో ఇండ్లు రాలేదని ఏ ఆడబిడ్డ నిరుత్సాహ పడవద్దు.రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాము. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లు  ఇస్తున్నాము. ఈ నియోజకవర్గంలో మరో 1500 అదనంగా ఇండ్లకు జాబితా తయారు చేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా మా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుద్రంపూరం చెందిన శివ అనే యువకుడు తనకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని టవర్ ఎక్కాడు. ఆనాడు మేము అధికారంలో లేము. అయినా మేము అధికారంలోకి రాగానే ఇండ్ల పట్టా ఇస్తామని ఆరోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకే ఇప్పుడు ఇండ్ల పట్టా ఇచ్చామని మంత్రి తెలిపారు.  ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు వారి  సౌలభ్యం, ప్రయోజనాల కోసం పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం ప్రజా శ్రేయస్సు కోసమే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గోదావరి నీటిని ఆంధ్రకు తరలించేందుకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పాలకులే. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు.  ఇప్పుడు అనేక అంశాలపై అవాకులు, చెవాకులు పేలుతున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అధికారంలో ఉండి వాళ్లు చేయలేనిది మేము చేసి చూపిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి  పొంగులేటి Publish Date: Jul 6, 2025 4:33PM

తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట

  తొలి ఏకాదశి సందర్బంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే నమ్మకంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చాయి. దీంతో లిఫ్ట్‌దారి, ఘాట్‌ రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తిచేసుకుని కొండపై నుంచి దిగువకు పంపేందుకు ఈవోశీనానాయక్‌ తో పాటు ఏఈవోలు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా రద్దీని ఈవో పరిశీలిస్తున్నారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలకు అనుమతిపై నియంత్రణ విధించారు.  తొలి ఏకాదశి  పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యంతో పులకించిపోయాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పవిత్రమైన ఈ రోజున శ్రీమహావిష్ణువును దర్శించుకోవడం, ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణాలు “గోవిందా.. గోవిందా..” నామస్మరణతో మార్మోగిపోయాయి.
తొలి ఏకాదశి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట Publish Date: Jul 6, 2025 3:42PM

నెల్లూరులో వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండుగ

  నెల్లూరులోని ప్రసిద్ద బారాషషీద్ దుర్గ వద్ద రొట్టెల పండుగ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరిగే పాటు జరగనున్నది. తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే ఈ విశిష్టమైన ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి.  తమ అనుకున్న కోరికలు తీరాలని ఆశిస్తూ, గతంలో కోరిక తీరిన వారి నుంచి రొట్టెను స్వీకరించడం, తమ కోరిక తీరితే ఇతరులకు రొట్టెను ఇవ్వడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం. దీని కోసం భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో రొట్టెలను మార్చుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాంగణంలో ప్రత్యేక టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన వసతి కల్పించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పండుగ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది.  
నెల్లూరులో వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండుగ Publish Date: Jul 6, 2025 3:16PM

పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

  పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్  పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిజామాబాద్ జైలుకు తరలించిన పోలీసులు. ఈ కేసులో గతంలో అరెస్టయిన ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.  తాము సేకరించిన పేలుడు పదార్థాలను చంద్రశేఖర్‌రెడ్డి వద్ద నుంచే తెచ్చినట్లు నిందితులు పోలీసులకు తెలియజేశారు. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు జూలై 3న రాత్రి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని, నిజామాబాద్ జైలుకు తరలించారు. ఈ కేసులో చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు సూర్య కూడా నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం పరారీలో ఉన్న సూర్య కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.   
పేలుడు పదార్థాల కేసులో కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ Publish Date: Jul 6, 2025 1:01PM

వీళ్లిద్ద‌రి బ‌తుకు రెంటికి చెడ్డ రేవ‌డైందా?

  ఉన్న పార్టీలో ఉన్న‌ట్టు ఉండి ఉంటే వీళ్ల ప‌రిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే క‌ర‌వ‌డంతో పాము, మొస‌లినే మించి పోయారీ ఇద్ద‌రూ. కార‌ణం ఈ భూ ప్ర‌పంచంలో పెట్టిన చేతినే క‌రిచే బుద్ధి కేవ‌లం పాము, మొస‌లికి మాత్ర‌మే ఉంటుంద‌ట‌. ఆ పార్టీలో ఉండి ఏమైనా పేరు సాధించారా అంటే అదీ లేదు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ వ‌ల్లే మేం ఓడాం అంటూ కాసు మ‌హేష్ రెడ్డి వీళ్ల‌పై చూపించిన కోపం తాపం అంతా ఇంతా  కాదు. వంశీ చేసిన కామెంట్లు మాకు చేటు తెచ్చాయ‌ని వాళ్లు కూడా వీళ్ల‌ను చూస్తే అస‌హ్యం వెళ్ల‌గ‌క్కుతున్నారు జోగి ర‌మేష్ వంటి వైసీపీ లీడ‌ర్లు కూడా. ఇక వీళ్ల ప‌రిస్థితి చూస్తే.. సూర్య చంద్రుల‌కే గ్ర‌హ‌ణం ప‌ట్టించిన రాహుకేతుల‌కే గ్ర‌హ‌ణం ప‌డితే ఎలా ఉంటుందో అలా త‌యార‌య్యారు. ఒక‌డు ఇప్ప‌టికే తాను చేసిన ద్రోహాల‌న్నీ ఆ మొహం మీద విల‌య తాండ‌వం చేస్తుంటే.. ప్ర‌త్య‌ర్ధుల‌కే జాలి క‌లిగేలా త‌యార‌య్యాడు.మ‌రొక‌డు గుడివాడ ఓట‌రు జ‌నాలు కొట్టిన దెబ్బ‌కు దిమ్మ తిరిగి గుండాప‌రేష‌న్ చేయించుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. అత్యంత ద‌యనీయంగా.. క‌ట్లు క‌ట్టుకుని తిరుగుతున్నాడు. అదే ఉన్న‌పార్టీలో ఉండి.. ప‌ద్ద‌తిగా బిహేవ్ చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్న కోణంలో సోష‌ల్ మీడియా కామెంట్లు హోరు మంటున్నాయ్ ఈ జంట ద్రోహుల మీద‌.
వీళ్లిద్ద‌రి బ‌తుకు రెంటికి చెడ్డ రేవ‌డైందా? Publish Date: Jul 6, 2025 12:49PM

అతి సర్వత్రా జగనేత్!

  క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.. శ్రీమాన్ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనుల వారు.మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ అభ్యర్ధుల జీవితాలను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టిన జగనన్న తాజాగా.. ముందస్తు ఎన్నికల్లాగా- ముందస్తు అభ్యర్ధుల ఖరారు ప్రకటనలు చేస్తున్నారట. ఇప్పటికి ఓకే అయిన వాటిలో మచ్చుకు కొన్ని పేర్లు.. ఎవరివీ, ఏంటని చూస్తే వాటిలో తొలిపేరు సర్వేపల్లి నుంచి- కాకాణి గోవర్ధన రెడ్డిదేనట. ఇక వరుసగా చూస్తే.. నరసన్న పేట- ధర్మాన కృష్ణదాస్, గననవరం- నుంచి వల్లభనేని వంశి, మచిలీపట్నం- నుంచి పేర్ని నాని, గుడివాడ- నుంచి కొడాలి నాని, దెందలూరు- నుంచి అబ్బయ్య చౌదరి, తాడికొండ- నుంచి  నందిగం సురేష్, మాచర్ల- నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరి పేట- నుంచి విడదల రజనీ, తాడిపత్రి- నుంచి పెద్దారెడ్డి, రాఫ్తాడు- నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం- నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పాతపట్నం- నుంచి రెడ్డి శాంతి.. ఇలా ఒక లిస్ట్ అప్పుడే లీక్ చేశారట. అంటే గతంలోలా పార్టీకి డిమాండ్ లేక పోవడం.. దానికి తోడు కేడర్ కూడా తీవ్ర నిరాశా నిస్పృహలకు లోను కావడంతో ఒక బూస్టింగా ఉంటుంది లెమ్మని జగన్ సార్ ఈ తరహాలో ముందుకెళ్తున్నట్టు తాజా కబర్. ఒక సమయంలో ఎమ్మెల్యేలను కలవడానికే అపాయింట్లు ఇవ్వని.. ఒక వేళ ఇచ్చినా వారిని నిలబెట్టే మాట్లాడే కల్చర్ గల జగనన్న.. ఇటీవల నేనూ మారాను బాస్! అని తెలియ చెప్పడంలో భాగంగా ఈ అడ్వాన్స్డ్ అనౌన్స్ మెంట్స్ ఒక పాలసీగా తీసుకున్నట్టు సమాచార్. రేపటికి రెడ్డెవరో- రాజెవరో అన్నది పాత నాటు సామెత. కానీ ఆ రేపటి ని కూడా ఇప్పటి నుంచే మార్చేసి.. తనకు తాను ఎప్పటిలాగానే అధినాయకుడిలా కాకుండా 'అతి'నాయకుడిలా వ్యవహరిస్తున్నారట జగన్. దానికి తోడు ఇప్పటికే ఈ అతి మీద పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ నేత రవిచంద్రారెడ్డి మాటలను బట్టీ చెబితే.. ఈ వైనాట్ 175 వంటి టూ మచ్ స్లోగన్స్ ఎవరి ఐడియాలో తెలియవు కానీ, ఇవన్నీ పార్టీని నిలువునా ముంచాయని అంటారాయన. దీంతో సామాన్యంగా వ్యవహరించాల్సిన జగన్ అత్యుత్సాహం కొద్దీ ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీ మైలేజ్ మరింత డ్యామేజ్ గా మారుతున్నట్టు సమాచారం.  మరి చూడాలి. జగన్ సార్ ఇదే ఫ్లో మెయిన్ టైన్ చేసి. ఆ పదకొండు కూడా పోగొట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉందంటున్నాయి.. పార్టీ శ్రేణులు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఎన్నికలు వచ్చినట్లు నాలుగు ఏళ్ల ముందే ఊహించడం, తామే గెలుస్తామ‌ని క‌ల‌లు క‌న‌డం.. ఆ ఊహ‌ల్లో తేలియాడ‌టం.. అలా బతికేయడాన్ని ఏమనుకోవాలి? మానసిక సమస్యా.. లేక వేరే వ్యూహమా? నేతల్ని, కార్యకర్తలను తనతో నిలుపుకోవడం లో భాగమా? అన్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే జ‌గ‌న్  చేసిన ప్ర‌తి ఓవ‌రాక్ష‌న్ బెడిసికొట్ట‌డంతో.. ఇలాంటి విష‌యాల‌ను పార్టీలో కొంద‌రు బాహ‌టంగానే వ్య‌తిరేకిస్తున్నార‌ట‌.
అతి సర్వత్రా జగనేత్! Publish Date: Jul 6, 2025 12:26PM

తెలంగాణ ఎవరి జాగీర్?

  హైద‌రాబాద్ న‌డి బొడ్డున 1982 మార్చి 29న పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీఆర్ఎస్ అయినా పుట్టిన పుష్క‌ర  కాలానికిగానీ అధికారంలోకి రాలేదు. అదే టీడీపీ ఏకంగా 9 నెల‌ల్లోనే అధికారం చేప‌ట్టి ప్ర‌పంచ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే మ‌రెవ‌రికీ సాధ్యం కాని ఒక చ‌రిత్ర‌ను సృష్టించింది. హైద‌రాబాద్ ప్ర‌తిష్ట‌ను ఆనాడే ఆకాశానికి అంటేలా చేసింది. అంతేనా ఇదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీలో చేర‌క ముందు ఎలా ఉండే వారో కూడా ఎవ్వ‌రికీ ఊహ‌కంద‌ని విష‌యం. గురువు ద‌గ్గ‌ర రాజ‌కీయం నేర్చుకుని ఆయ‌న మీదే పోటీ చేసిన ఘ‌నుడైన కేసీఆర్ ని కూడా ద‌గ్గ‌రకు చేర్చి.. ఆద‌రించింది టీడీపీ. ఆయ‌న‌కు అప్ప‌ట్లో ర‌వాణా మంత్రిత్వం ఇచ్చింది కూడా టీడీపీనే. త‌ర్వాత త‌న సాటి కుల‌స్తుడికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో.. అది చూసి ఓర్వ‌లేక కొత్త పార్టీ పెట్టారు కేసీఆర్.నిజంగా వైయ‌స్ అన్న‌ట్టు ఆనాడు బాబు మంత్రి ప‌ద‌వి  ఇచ్చి ఉండి ఉంటే కేసీఆర్ గానీ ఆయ‌న బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఉండేదా? అస‌లీ సోయ‌లోనే లేక పోయావారు ఆయ‌న, ఆయ‌న పార్టీ స‌భ్యులు. ఒక‌సారి మంత్రిత్వం ఇస్తే దాన్ని స‌రిగా నిర్వ‌హించ‌లేద‌ని గుర్తించిన చంద్ర‌బాబు.. కేసీఆర్ ని ప‌క్క‌న పెట్ట‌డంతో పుట్టిన ముస‌లం.. తెలంగాణ వాదం.  ఆనాటి నుంచి ఆయ‌న అది  ప‌నిగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని విభిజించ‌డ‌మే ధ్యేయంగా.. యువ‌త‌ను రెచ్చ‌గొట్టి.. వారి ఆశల మేడ‌లపై త‌న పార్టీ పునాదును నిర్మించుకున్నారు టిడిపి వర్గాలు. అదే బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్.అప్ప‌టికి ఎటు నుంచి ఎటు చూసినా అడ‌వుల‌ను త‌ల‌పించిన హైటెక్ సిటీ ప‌రిస‌ర ప్రాంతాన్ని ఇవాళ ఐటీ కారిడార్ గా మ‌ల‌చింది టీడీపి.. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గ‌జ‌ కంపెనీలు రావ‌డానికి కార‌కుడైంది.. నాటి  టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు. అప్ప‌ట్లో పెద్ద పెద్ద ప్ర‌ధానుల‌కు సైతం దొర‌క‌ని బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ ని దొర‌క‌బుచ్చుకుని నిమిషాల్లో ముగించాల‌ని వారు చెబితే, దాన్ని సుమారు గంట‌కు పొడిగించుకుని.. ఆపై యూఎస్ వెళ్లి అక్క‌డి మైక్రోసాఫ్ట్ యాజ‌మాన్యాన్ని హైద‌రాబాద్ లో ఒక క్యాంప‌స్ ఏర్పాటు  చేయాల్సిందిగా వేడుకుని, ఎట్ట‌కేల‌కు ఇక్క‌డికి ర‌ప్పించి.. ఒక ఐటీ బూమ్ క్రియేట్ చేసింది చంద్ర‌బాబు. ఆయ‌న  వెన‌కున్న టీడీపీ. ఆ త‌ర్వాత అనూహ్యంగా ఈ ప్రాంతం మ‌రో సింగ‌పూర్ లా క‌నిపించ‌డంతో.. క‌న్నుకుట్టి.. ఇదంతా త‌మ‌దేనంటూ తెలంగాణ  ప్ర‌జానీకాన్ని  రెచ్చ‌గొట్టి.. రాష్ట్రం రెండుగా చీలిపోయేలా చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు టిడిపి వారు. ఆయ‌న పార్టీ. ఆ త‌ర్వాత కూడా రాష్ట్ర విభ‌జ‌న‌లో ద‌క్కాల్సిన ప‌దేళ్ల రాజ‌ధాని హోదాను ఏపీకి ద‌క్క‌కుండా త‌న  టెలిఫోన్ టాపింగ్ ద్వారా చేసిన ఘ‌న‌త వ‌హించింది కేసీఆర్ కాదా అంటున్నారు.త‌న స్వార్ధం కోసం జ‌గ‌న్న రెడ్డితో కుమ్మ‌క్క‌య్యి.. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతాలు రెండింటినీ మోసం చేసిన ఘ‌న‌త కూడా కేసీఆర్ దే. అంతేనా.. కాళేశ్వ‌రం వంటి అన‌వ‌స‌ర ఖ‌ర్చు దండ‌గ ప్రాజెక్టుల ద్వారా కోట్లు కుమ్మ‌రించుకున్నార‌ని ఆరోపించిన రాజ‌లింగం లాంటి వారిని లేకుండా చేసింది మీరు కాదా? అన్న‌ది స‌గ‌టు తెలంగాణ వాదులు సంధిస్తోన్న ప్ర‌శ్న‌. ఒక‌రిద్ద‌రు కాదు కేసీఆర్ లాంటి ఎంద‌రో తెలంగాణ  వారిని రాజ‌కీయ ధురంద‌రులుగా తీర్చి దిద్దింది టీడీపీ. కేసీఆర్ నుంచి మొద‌లు పెడితే తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న ఏ పొలిటీషియ‌న్ అయినా స‌రే టీడీపీ త‌ల్లి పాలు తాగిన వారు కాదా? అదంతా మ‌ర‌చిపోయి.. ఇప్పుడిలా మాట్లాడ్డం.. త‌ల్లిపాలు తాగి ఆ రొమ్ము గుద్ద‌డంతో స‌మానం కాకుండా పోతుందా? అని  నిల‌దీస్తున్నారు స‌గ‌టు తెలంగాణ ప్ర‌జ‌లు. ఎస్ ఇది టీడీపీ జాగీరే. అప్పుడ‌ప్పుడూ ఓట‌ములు ఎదురు కావ‌చ్చుగాక‌.. కానీ కాల‌గ‌మ‌నంలో ఓట‌మి కూడా ఒక మ‌జిలీయే. ప్ర‌స్తుతం టీడీపీ జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తిరిగి  పోటీకి నిలిస్తే మాత్రం త‌ప్పేంటి? ఎందుకంత  ఉలుకు. త‌ల్లిలాంటి పార్టీ అంటే ఎందుకంత చిన్న‌చూపు? అని నిల‌దీస్తోంది స‌గ‌టు తెలంగాణ ప్రజానీకం. ఆద‌రించ‌డానికి మేం సిద్ధం.. మీకెందుకా సంశ‌యం.. అయినా ఇంకెక్క‌డుందా తెలంగాణ వాదం.. మీ పార్టీలో తెలంగాణ అన్న ప‌దం తీసెయ్య‌డంతోనే అది తెలిసిపోవ‌డం లేదా అని తెలంగాణ  ప్ర‌జ‌లే మీ  పార్టీపై తిర‌గ‌బ‌డుతున్న వేళ‌.. ఇంకా ఎందుకా? మేక‌బోతు గాంభీర్యాలు అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం అభిమానులు.
తెలంగాణ ఎవరి జాగీర్? Publish Date: Jul 6, 2025 12:12PM

సిగాచీ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య

  సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆస్పుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో  మృతుల సంఖ్య 41కి చేరింది.  మరో 11 మంది ఆచూకి లభించలేదు. మరికొందరు ఆసుపత్రిలో చికత్స పొందుతుండగా పలువురి పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది.పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.  
 సిగాచీ ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య Publish Date: Jul 6, 2025 11:54AM

కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ఎలాన్ మస్క్

  ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్చ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ తెలిపారు.  మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు మీ స్వేచ్చను తిరిగి ఇవ్వడానికి అమెరికా ఏర్పడింది అంటు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అవినీతితో మన దేశాన్ని దివాళా తీయించే విషయంలో మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒకే పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం. ఈరోజు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అంటూ ఆయన ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలతో పాటు మూడో పార్టీ వచ్చి చేరింది. తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. రెండు నుంచి మూడు సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి, కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని వివరించారు. అయితే, మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ, ఇప్పటివరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత ఇజీ కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ, 'డువర్జర్ సూత్రం' ప్రకారం రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో మూడో పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపువడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.  
కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ఎలాన్ మస్క్ Publish Date: Jul 6, 2025 11:34AM

భారత్ డిక్లేర్ .. ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం

  ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్  427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్‌ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం  ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ (161) చెలరేగిపోయాడు. పంత్‌ (65), జడేజా (69*), కేఎల్‌ రాహుల్‌ (55) అర్ధశతకాలు బాదేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోష్‌, బషీర్‌ చెరో 2, రూట్‌, బ్రైడన్‌ తలో వికెట్‌ తీశారు.  అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా  587 పరుగుల భారీ స్కోరు చేయగా, ఇంగ్లండ్ 407 రన్స్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మ్యాచ్‌లో ఇంకా ఐదు సెషన్ల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, భారత బౌలర్లు రాణిస్తే ఈ టెస్టులో భారత్ గెలిచే ఛాన్స్ ఉంది.
భారత్ డిక్లేర్ .. ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం Publish Date: Jul 5, 2025 9:58PM

క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ

  క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచీ టీడీపీ అభిమాని. చంద్రబాబు అంటే అమిత ఇష్టం. అయితే ఆయన ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతున్నారు. తన ఆరోగ్య క్షీణిస్తుండడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకున్నారు.  ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు  స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు, ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఉన్న కారణంగా సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్న కృష్ణ... స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు.   
క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ Publish Date: Jul 5, 2025 9:34PM

అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

  అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేసి 81 లక్షల రూపాయల విలువైన 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా అదనపు  ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరించిన మేరకు అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి  మండలం, రాయవరం గ్రామం, కావలిపల్లె అటవీ ప్రాంతంలో   అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని  అన్నమయ్య జిల్లా  జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుకు  పక్కా సమాచారం వచ్చింది . ఎస్పీ ఆదేశాల మేరకు, రాయచోటి డి.ఎస్పి. యం.ఆర్. కృష్ణమోహన్  ఆధ్వర్యంలో, రాయచోటి రూరల్ సీఐ ఎన్.వరప్రసాద్, టి.సుండుపల్లి ఎస్ఐ యం.శ్రీనివాసులు, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది మరియు టి.సుండుపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి   కావలిపల్లె అటవీ ప్రాంతంలో కాపుకాశారన్నారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న    ఆండీ గోవిందన్ ను  శనివారం ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.  *మరికొందరికోసం గాలింపు  అరెస్ట్ చేసిన ఆండీ గోవిందన్ విచారణలో  తమిళనాడు రాష్ట్రంలోని మరి కొందరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు తప్పించుకుపోయినట్లు తెలిసిందనని అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.వారికోసం  గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అటవీ సంపదను, ముఖ్యంగా ఎర్రచందనాన్ని రక్షించడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.  
అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్  అరెస్టు Publish Date: Jul 5, 2025 9:17PM

గుప్తనిధుల కోసం వినాయక విగ్రహం ధ్వంసం.. 13 మంది ముఠా అరెస్టు

  అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో  రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  బీ.వి.రమణ మాట్లాడుతూ గుప్తనిధుల కోసం వినాయకుడి విగ్రహం పగలు గొట్టిన ఘటనపై  పెనగలూరు పోలీస్ స్టేషన్  లో కేసు నమోదు అయ్యింద న్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే  సూచనలతో దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. పెనగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతనెల 24  తేది తెల్లవారుజామున ఓబిలి స్కూలు ఆవరణలో దొంగతనం జరిగిన వినాయక విగ్రహం కేసులో వచ్చిన నమ్మకమైన సమాచారం అందిందన్నారు.  ఈ మేరకు, పెనగలూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్, బి.రవి ప్రకాష్ రెడ్డి మరియు సిబ్బంది పెనగలూరు  పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద ఈ రోజు శనివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న 13 మందిని విచారించారించారని తెలిపారు .వారు గత నెలలో ఓబిలి స్కూలు ఆవరణలో వినాయక విగ్రహ దొంగతనం గురించి తెలుపడం జరిగిందన్నారు. నందలూరు మండలం మదనగోపాలపురం కు చెందిన చుక్కా రవి అను వ్యక్తి గుప్త నిధుల కోసం చిట్వేలి కి చెందిన కొంత మంది కనిశెట్టి వెంకటసుబ్బయ్య, చిట్వేలి సుబ్బరాయుడు, ఆర్కాటు భాస్కర్  మరియు ఈటిమార్పురం నకు చెందిన డొంకా చంద్ర, బైర్రాజు సుధాకర్ రాజు లతో మాట్లాడుకొని గుప్త నిధులు వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో చుక్క రవి వియ్యంకుడు అయిన మనుబోలు కు చెందిన సురేష్ ద్వారా నెల్లూరు లో రాపూరు లక్ష్మమ్మ @ రాపూరు లక్ష్మి, మునుసామి వేలురెడ్డి @పూజారి, గోకిల రమేష్ @ కోకిల రమేష్, ముసునూరు పుల్లారెడ్డి మరియు క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులు వెలికి తీయడం కోసం వారిని మాట్లాడుకొన్నారని తెలిపారు.  అదేవిధంగా గుప్త నిధులు పైన ఆసక్తి ఉన్న పెనగలూరు కు చెందిన దాసరి వెంకట నరసమ్మ ,సుధాకర్ రాజు, చంద్ర వారి దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు సుకదేబ్ రైతో, కలక్వాడ్ శ్యాం లతో పాటుగా అందరూ కలిసి గత నెల 23 తేది రాత్రి  ముఠాగా ఏర్పడి ఓబిలి స్కూలు వద్దకు చేరికున్నారని, వేకువ జామున సదరు వినాయక విగ్రహాన్ని ఈడ్చుకుంటూ ఒదేటివారిపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో ఒక ట్రాక్టర్ లో వేసి  అక్కడ నుండి ఈటిమార్పురం చెరువు దగ్గరకు వెళ్లి, అక్కడ విగ్రహాన్ని దింపి, గుప్త నిధుల కోసం పూజలు చేసి సమ్మెట తో విరగకొట్టగా,  విగ్రహంలో ఎటువంటి నిధులు లేకపోవడంతో  విగ్రహాన్ని అక్కడే ఉన్న కుంట లో పడి వేశారన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన వాహనాలు ఒక ట్రాక్టర్, ఒక ఇన్నోవా కారు, నాలుగు మోటార్ సైకిల్ లు, ఒక సమ్మెట లను, వస్తువులను సీజ్ చేయడం అయినదని. సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా ముద్దాయిలను గుర్తించడం అయినదని తెలిపారు. ఈ  కేసులో ప్రతిభ  కనబరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ శవి.విద్యాసాగర్ నాయుడు  అభినందించారు  
గుప్తనిధుల కోసం వినాయక విగ్రహం ధ్వంసం.. 13 మంది  ముఠా అరెస్టు Publish Date: Jul 5, 2025 9:06PM

ఎయిమ్స్‌లో 13 మంది విద్యార్థులపై చర్యలు

  గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు. ఎయిమ్స్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ర్యాగింగ్ కు పాల్పడినవారిని ఆరు నెలల నుంచి ఏడాదిన్నరపాటు సస్పెండ్ చేయడంతోపాటు ఒక్కొక్కరికి రూ.25వేలు జరిమానా కూడా విధించనట్లు తెలిపారు.   ఆ విద్యార్థులను వసతి గృహం నుంచి పూర్తిగా బహిష్కరించినట్లు చెప్పారు. సస్పెన్షన్ కాలం పూర్తి అయిన తర్వాత కూడా వారు హాస్టల్ లో ఉండే అవకాశం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఈ ర్యాగింగ్ పై ఇతరత్రా ఆరోపణలను ఆయన ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి పేర్లు బయటకు చెప్పడం లేదన్నారు.  
ఎయిమ్స్‌లో 13 మంది విద్యార్థులపై చర్యలు Publish Date: Jul 5, 2025 8:55PM

విశాఖలో కోకైన్ కలకలం

  విశాఖలో కోకైన్ కలకలం రేపింది ఓ ఆఫ్రికన్ వద్ద 25 గ్రాముల కొకై న్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఖాళీ ప్రదేశంలో గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు ముందస్తు సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు థామస్ జియోన్ అనే ఆఫ్రికన్ దేశస్థుడు ఉన్నారు. చేకూరి అక్షయ్ ఏలియాస్ గున్న అనే వ్యక్తితో కలిసి థామస్ జియోన్ ను పోలీసులు విచారించారు వీరి వద్ద 25 గ్రాముల  కోకైన్ లభించింది.  దీని విలువ మార్కెట్లో 15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా ఈ మాదక ద్రవ్యాన్ని  ఢిల్లీ నుంచి ఈ ఆఫ్రికన్ దేశస్థుడు తీసుకువచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది అయితే ఏ రకంగా భారత్ లోకి ఇది  వచ్చిందన్న కోణంలో విచారణ జరుగుతున్నట్టు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.
విశాఖలో  కోకైన్ కలకలం Publish Date: Jul 5, 2025 7:35PM

గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది : మంత్రి కొల్లు

  అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో అసత్యపు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంద, అరాచకాలు, విధ్వంసాలు, కక్షసాధింపులతో ప్రజలను పీడించుకుతిన్నారు.  గుంటూరు జిల్లాలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున దాడులు చేయించి, టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. దీనివల్ల అనేక మంది గ్రామాలు వదిలి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.  గతంలో టీడీపీ నాయకులపైన అచ్చెన్నాయుడు దగ్గర నుంచి నామీద, మా నాయకుడు చంద్రబాబునాయుడుని కూడా కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా?"  పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది వైసీపీయేనని, జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో గ్రామాల్లో కత్తులు తిప్పి అరాచకాలు చేసింది వైసీపీ నాయకులే. నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ నాయకుడు సర్పంచ్‌గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి, గ్రామాల్లో వ్యక్తిగత దాడులకు దిగి అక్రమ కేసులు పెట్టాడని, బాబూరావుపై దాడి చేస్తే దాదాపు నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలి వెళ్లిపోయిన వారు, ఇప్పుడు మళ్లీ వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత కక్షలకు పార్టీ రంగులు పులుముతున్నారు.  విజయవాడలో చెన్నుపాటి గాంధీ కన్ను పొగొట్టింది వైసీపీ ప్రభుత్వమే. దళిత సీఐ ఆనందరావును బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడంతో అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ నాయకుడు పెద్దారెడ్డి చెప్పిన పనులు చేయలేదని గుర్రయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, అలాగే పేదవాడైన అమర్‌నాథ్ ‌ను పెట్రోల్ పోసి తగలబెట్టింది వైసీపీ ప్రభుత్వమే. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి దాదాపు 80 మంది తెలుగుదేశం నాయకులను పెట్టనపెట్టుకుంది వైసీపీ దుర్మార్గమైన ప్రభుత్వమే.  జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక దళిత బిడ్డపై అత్యాచారం జరిగినా పట్టించుకోలేదని, దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగించారని, పోలీస్ స్టేషన్లలో కేకులు కట్ చేయించారు. ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ‌ను హింసించి, వేధించి అతని ప్రాణాలు పోవడానికి కారణం వైసీపీయే. ఇసుక దందాను ప్రశ్నిస్తే దాడులు చేసి శిరోముండనం చేసింది కూడా వైసీపీనే కదా. మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిపింది వైసీపీయేనని, పులివెందులలో అత్యాచారం చేసి హత్య చేస్తే, పరామర్శకు అనిత  వెళ్తే ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా?. అలాగే తెలుగుదేశం కార్యాలయంపై దాడులు చేయించి, దాడులు చేసిన వారికి ప్రమోషన్లు ఇప్పించారు. చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. కక్షపూరితమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి... తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎవరైతే దాడులు చేశారో వారికి ప్రమోషన్లు ఇచ్చి క్రిమనల్స్ ను ప్రోత్సహించింది వైసీపీయే. బూతులు మాట్లాడిన వారికి రక్షణ కల్పించారు. పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఒక జీవో తెచ్చింది కూడా వైసీపీయే. బియ్యం కొట్టేసినవాడు మాట్లాడుతున్నాడు.. దొంగపట్టాలు ఇచ్చినోడు మాట్లాడుతున్నాడు.. ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి దిగజారుతారా.. సిగ్గులేకుండా బరితెగించి మాట్లాడుతారా?. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారులను వేధించారని, అనేకమంది ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు, కథనాలు, ప్రెస్‌ మీట్లు పెట్టించారు.  దోపిడీ దొంగలు వచ్చి ప్రెస్ ‌మీట్లు పెడుతుంటే బాధ అనిపిస్తుంది. గతంలో పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్‌లో చనిపోతే, దాన్ని మతాల మధ్య విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొంటూ, పిల్ల సైకోలు చేసిన తప్పులు తప్పించడం కోసం తప్పుడు ప్రెస్ ‌మీట్లు పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం, అధికారులను వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారో ఆమె స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏడాది కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు,  ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.4000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, వికలాంగులకు రూ.6000, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు రూ.10,000, పూర్తిగా బెడ్ మీద ఉన్నవారికి రూ. 15000 ఇస్తున్నాం. దాదాపు 2 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇచ్చామని, గతంలో 42 లక్షల మందికి ఇస్తే, ఈరోజు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చాం. రోడ్ల గుంతలను పూడ్చి ప్రజలకు సౌకర్యవంతంగా చేశామని, గ్రామాల్లో సీసీరోడ్లు వేశామని తెలిపారు. త్వరలో అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత ఇవ్వనున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నాం. మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే.. చూసి తట్టుకోలేక.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బురదజల్లే కార్యక్రమాలకు కొంతమంది పేటిఎం బ్యాచ్‌లను పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే మీకు బుద్ది చెప్తారని హెచ్చరిస్తున్నాం. త్వరంలో మీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం.. ఫ్రస్టేషన్‌లో రోజుకో మాట మాట్లాడుతున్నారు. సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ రాజీనామా, సింగయ్యకు సంబంధించిన వీడియోలు వంటి విషయాలను కూడా వైసీపీ రాజకీయం చేస్తోంది. దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే.. దొర అయిపోతారా? అక్రమంగా ఇళ్ల పట్టాలు సృష్టించి ఎన్నికల్లో కొడుకును అందలం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులను మీ పక్కన కూర్చోబెట్టుకుని ప్రోత్సహిస్తారా?. తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు.
గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది : మంత్రి కొల్లు Publish Date: Jul 5, 2025 7:27PM

రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్

  సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ, ఆర్ధిక శాఖ, సీసీఎల్ఏకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది. పలనాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలేమల్లే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది.  రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్‌ఎఫ్‌పీ పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్‌పిని ఆహ్వానించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలెక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలియచేసింది.  రాజధాని పనులకు కృష్ణా నది నుంచే ఇసుక   రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు కృష్ణానది నుంచే ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం రాజధానిలో రూ.49,040 కోట్ల విలువైన పనులు  జరుగుతున్న రీత్యా రానున్న రెండేళ్లలో వివిధ ప్రాజెక్టులకు 160 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. రాజధాని నిర్మాణానికి  అవసరం అయ్యే ఇసుకను ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సీఆర్డీఏ కోరింది. రెండేళ్ల పాటు రాజధాని ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను తవ్వుకునేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. ఇసుక డీసిల్టేషన్ ప్రక్రియకు రూ.286 కోట్ల మేర వ్యయం కానున్నట్టు అథారిటీ సమావేశంలో అధికారులు తెలిపారు.  రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కూడా సీఆర్డీఏ అథారిటి ఆమోదాన్ని తెలిపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు 2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్  ల్యాబ్‌కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీకి 12 ఎకరాలు, ఎంఎస్‌కే ప్రసాద్  ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడెమీకి 12 ఎకరాలు కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ అమోదం ఇచ్చింది.  అలాగే ఆదాయపు పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌కు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.40 ఎకరాలు, ఎస్ఐబీకి 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరాలు, కిమ్స్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు 25 ఎకరాలు, భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 2 ఎకరాలను, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 4 ఎకరాలను కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది. అలాగే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంబికా గ్రూప్‌లకు గతంలో కేటాయించిన 1.40  ఎకరాలను రద్దు చేస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి సమీపంలో E-15 రహదారిపై నాలుగులేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది.  అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు రాజధాని అమరావతిలో స్ఫూర్తినిచ్చేవారి స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఎకో పార్కులకూ మంచి పేర్లను పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టుల కోసం అధికారులు ఎలాంటి బేషజాలు లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు.  అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, గతంలో రాష్ట్ర సచివాలయం వేగంగా రికార్డు సమయంలో నిర్మించామని, అదే స్ఫూర్తితో పనులు పూర్తి చేయాలని అన్నారు. అమరావతిలో ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో కేంద్రంతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాజధానిలో నిర్మించతలపెట్టిన ఏ ప్రాజెక్టూ ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు అనుమతులను వేగవంతంగా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సరిగ్గా చేయని సంస్థలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, గడువులోగా పూర్తి చేసేలా నిర్దేశించాలని ముఖ్యంత్రి చంద్రబాబు అన్నారు
రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ Publish Date: Jul 5, 2025 7:12PM

రాయచోటి ఘటనపై ఏన్‌ఐఎ విచారిస్తోంది ..అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ

  రాయచోటి ఘటన జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని,దీనిపై  అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఓక ప్రకటనలో హెచ్చరించారు. జాతీయ భద్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ఇతర ప్రసారమాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా, అవాస్తవాలను సృష్టించినా, పుకార్లు ప్రసారం చేసినా, షేర్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాజిక మధ్యమాలలో గ్రూప్ అడ్మిన్ లు ప్రతి సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని, మరియు  ఒక వేళ ఆయా గ్రూపుల్లో తప్పుడు సమాచారం వస్తే గ్రూప్అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాయచోటి ఘటనపై  ఈ నెల 3వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేశామని, ఈ విషయం గురించి కేంద్ర దర్యాప్తు బృందం విచారణ చేస్తున్నారన్నారు. కనుక ఎటువంటి విషయాలు ఉన్నా అధికారికంగా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు తెలియజేస్తారని,ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని, ప్రజలు భయభ్రాంతులు కలిగించే ఊహాగానాలు, కథనాలు, దృశ్యాలు సృష్టించినా, పుకార్లు వ్యాప్తి చేసినా, ప్రసారం చేసినా షేర్ చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సమాజంలో ముఖ్యంగా మీడియా పాత్ర విలువైనదని పోలీసు శాఖకు సహకరించాలన్నారు.  ఏదైనా విషయానికి సంబంధించి పోలీసు అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలి న్నారు .తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై, సృష్టిస్తున్న వారిపై, షేర్ చేస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు .వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జాతీయ భద్రతకు కు సంబందించిన విషయాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తీవ్రమైన నేరం గా పరిగనించబడుతుందన్నారు. మరియు చట్ట పరమైన పర్యావసనాలు కఠినంగా ఉంటాయన్నారు. కావున ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని ప్రమాణీకతను తనిఖీ  చేసుకోవడం చాలా ఎస్పీ సూచించారు.
రాయచోటి ఘటనపై ఏన్‌ఐఎ విచారిస్తోంది ..అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ Publish Date: Jul 5, 2025 7:02PM

పలు పోలీస్ స్టేషన్‌‌లో హాజరై కొడాలి నాని

మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ పలు పోలీస్ స్టేషన్‌‌లో  హాజరయ్యారు. ఇవాళ ఉదయం ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు అత్కూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్, పటమట పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం చేసి వెళ్లారు. అయితే అనేక మంది వైసీపీ నేతలతో కొడాలి నాని పోలీస్‌స్టేషన్‌కు రావడం వివాదస్పదంగా మారింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాజీ మంత్రి.. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇంటి వద్ద నుంచి స్టేషన్‌కు వచ్చి మరీ సంతకాలు చేశారు.  గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై దాడి జరిగిన ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కింది కోర్టులోనే బెయిల్ తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో, ఆయన గుడివాడ కోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయంలో నాని పోలీస్ స్టేషన్‌కు వస్తే పోలీసులు రాచమర్యాదలు చేసేవారు. అప్పుడు అధికార ధీమాతో పోలీసులను బెదిరించేవారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. ఓడలు, బండ్లు  అవుతాయి బండ్లు  ఓడలు అవుతాయి అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు
పలు పోలీస్ స్టేషన్‌‌లో హాజరై కొడాలి నాని Publish Date: Jul 5, 2025 6:47PM

సింహాద్రి అప్పన్న ఆలయంలో కూలిన షెడ్డు

సింహాచలం అప్పన్న ఆలయంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డు కుప్పకూలింది. ఈ షెడ్డను  ఈ నెల తొమ్మిదో తేదీన గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ఏర్పాటుచేశారు.  అదృష్టవశాత్తు షెడ్డు కూలిన  సమయంలో  భక్తులు లేకపోవడంతో  ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై భారీ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలినట్లు  తెలుస్తోంది. ప్రమాద సమయంలో షెడ్డు క్రింద ఎవరూ లేకపోవడంతో సరిపోయింది.  ఈ ఏడాది  ఏప్రిల్ 30న సింహాద్రి అప్పన్న చందన యాత్ర సందర్భంగా మెట్ల మార్గంలో  క్యూ లైన్ గోడ కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా గిరిప్రదర్శన సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నది. ఇదే సంఘటన 9వ తేదీన జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకపోయినప్పటికీ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టే సమయంలో నిర్లక్ష్యం, అశ్రద్ధను ఇప్పటికైనా వీడాలని భక్తులు కోరుతున్నారు.  
సింహాద్రి అప్పన్న ఆలయంలో కూలిన షెడ్డు Publish Date: Jul 5, 2025 5:33PM

ఏపీలో బాలింతలకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

  ఏపీలో కూటమి సర్కార్ మరో మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందించాలని నిర్ణయంచింది. 2016లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఈ స్కీమ్ మొదలుపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నాళ్లు అమలు చేసిన తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 'ఎన్టీఆర్‌ బేబీ కిట్లు' పేరుతో మళ్లీ మొదలు పెడతోంది.  ఈ కిట్‌లో దోమతెరతో ఉన్న వాటర్‌ ప్రూఫ్ షీటు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ, బట్టలు, తువ్వాలు, పరుపు, నాప్కిన్లు లాంటి 11 వస్తువులు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రెండేళ్ల పాటు DMHOలు, DCHSలు, GGHలకు 'రేట్ కాంట్రాక్ట్' పద్ధతిలో కిట్లు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ కిట్లను పంపిణీ చేసే బాధ్యతను ఏపీఎంఎస్‌ఐడీసీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే 11 రకాల వస్తువులతో కలిపి.. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.1410గా ఉంటుందని చెబుతున్నారు
ఏపీలో బాలింతలకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లు Publish Date: Jul 5, 2025 5:23PM

నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్

  వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద, అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నెహాల్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు యూఎస్ ప్రాసిక్యూషన్ పేర్కొన్నాది.  ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. ఆ సమయంలో నెహాల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని యూఎస్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. 14 వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరమ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదర్కొంటున్నారు.
నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్ Publish Date: Jul 5, 2025 4:47PM

ఎరువుల కోసం రైతుల తిప్పలు.. అధికారుల నిర్లక్ష్యంతో తప్పని అవస్థలు

తెలంగాణలో రైతాంగం అవస్థలు వ్యవసాయ అధికారులకు పట్టడం లేదు. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ అధికారులకు ముందు చూపు కొరవడటంతో అన్నదాతలు అవస్థలు పడున్నారు.  ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంట అదును దాటుతున్నా.. సరిపడా యూరియా సరఫరా చేయడంలో విఫలమైన అధికారుల తీరును దుయ్యబడుతున్నారు.  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుల్లపెల్లి లోని రైతులు గంటల తరబడి ఎరువుల కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా నిలబడే ఓపిక లేక తమ చెప్పులను క్యూలైన్ లో వదిలేసి పక్కకు వెళ్లి కూర్చుంటున్న దుస్థితి కళ్లకు కడుతోంది. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇటీవల సాగుచేసిన మక్కజొన్న వంటి పంటలకు మందు వేసే సమయం ఆసన్నమైనా యూరియా కొరత పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. దీంతో రైతాంగం. యూరియా కోసం   సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్‌లో పెట్టి పొద్దంతా పనులు మానుకుని వేచి ఉంటున్నారు. అయినా వారికి ఒకటి, రెండు సంచులకు మించి యూరియా దొరకడం లేదు. ఆ అరకొర సరఫరా వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోతోందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  సహకార శాఖ అధికారుల మాయాజాలానికి తోడు వ్యవసాయశాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందంటున్నారు. ఒకవైపు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతుంటే, మరోవైపు అసలు కొరతే లేదని యంత్రాంగం చెబుతుండడం విడ్డూరంగా ఉంది.
ఎరువుల కోసం రైతుల తిప్పలు..  అధికారుల నిర్లక్ష్యంతో తప్పని అవస్థలు Publish Date: Jul 5, 2025 4:39PM

బీబీకా ఆలంను సందర్శించిన మంత్రులు

  మొహర్రం సందర్బంగా హైదరాబాద్‌లోని డబీర్ పురాలోని బీబీకా ఆలంను ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సందర్మించారు. ఈ సందర్బంగా బీబీకా ఆలయంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వందల సంవత్సరాల అనావాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును ఇప్పటికే తీసుకురావడం జరిగింది. కాగా, మొహర్రం పర్వదినం పురస్కరించుకొని గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు కొనసాగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎఫండీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పాల్గోన్నారు. దీంతో అధికారులు  మొహర్రం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు
బీబీకా ఆలంను సందర్శించిన మంత్రులు Publish Date: Jul 5, 2025 4:02PM

కవిత కారు దిగిపోవడం ఖాయమేనా?

కల్వకుంట్ల కవిత.. పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడిన కవిత.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కూడా. తండ్రి చాటు బిడ్డగానే రాజకీయాలలో తొలి అడుగులు వేసినా.. ఆ తరువాత ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బతుకమ్మ, బోనాల పండుగలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. లోక్ సభ సభ్యురాలిగా తన ప్రతిభనూ చాటారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.  అటువంటి కల్వకుంట్ల కవిత ఇటీవల గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలే గత ఎన్నికలలో పరాజయంపాలై, అధికారానికి దూరమై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కవిత ధిక్కార ధోరణితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పైన, ఆ పార్టీ నాయకత్వం పైన కవిత చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు కవితను బీఆర్ఎస్ కే కాకుండా.. కేసీఆర్ కుటుంబానికి కూడా దూరం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. దీంతో కవిత పొలిటికల్ జర్నీపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ తన దేవుడంటూనే కవిత బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. దీంతో కేసీఆర్ కూడా కవితను దూరంపెడుతున్నారు. ఇందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న తరుణంలో తండ్రిని కలవడానికి వచ్చిన కవితవైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదు. చిన్న సైగతో ఆమె తన సమీపానికి కూడా రాకుండా నిలువరించారు. ఇక తాజాగా కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సందర్భంగా సొంత కుమార్తె అయి ఉండి కూడా ఎవరో పరాయి వ్యక్తిలా, అతిథిలా కవిత యశోదా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చేయాల్సి వచ్చింది. వీటన్నిటికీ మించి ఇటీవల కవిత ఒక ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె కారు దిగిపోవడానికే నిర్ణయించుకున్నారని తేటతెల్లం అయ్యింది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆమె ఎంచుకున్న ఛానెల్.. అలాగే ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కవిత రాజకీయంగా బీఆర్ఎస్ తో కలిసి నడిచే పరిస్థితి ఎంత మాత్రం లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. భవిష్యత్ లో తాను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని అని కుండబద్దలు కొట్టడమే కాకుండా.. తన సోదరుడు కేటీఆర్ తో తనకు విభేదాలున్నాయని కూడా స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా మరో అడుగు ముందుకు వేసి ఆ ఇంటర్వ్యూలో తన తండ్రిపైనే విమర్శలను గురిపెట్టి వదిలారు. తన నియోజకవర్గ అభివృద్ధికి స్వయంగా తాను కోరినప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు.  ఇక బిఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిర చేస్తున్న.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కవిత పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేశారు.  వీటన్నిటినీ బట్టి చూస్తుంటే కవిత కారు దిగి సొంత దారి చూసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కవిత కారు దిగిపోవడం ఖాయమేనా? Publish Date: Jul 5, 2025 3:38PM

రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌‌కు కేటీఆర్ సవాల్

  రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.  72 గంటలు సమయం ఇస్తున్నా.. ప్రిపేర్‌ అయ్యి చర్చకు రండి ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లెలోనైనా చర్చకు సిద్దమని తేల్చి చెప్పారు. ప్లేస్, టైం, డేట్ అన్నీ రేవంత్ ఇష్ట్రమన్నారు. బేసిన్‌కు తేడా తెలియని రేవంత్..కేసీఆర్‌ను చర్చకు పిలుస్తారా అని ప్రశ్నించారు. ఆయన స్థాయికి తాము చాలని సెటైర్ల వేశారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్‌. రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్‌ఎస్‌. నిజం తెలిసినా ఒప్పుకోలేని వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని కేటీఆర్ అన్నారు.  ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో చర్చకు సిద్ధమని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. తన అనుచరులకు నియామకాలు ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా, ఎవరూ చేయలేదు. 70 లక్ష మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేశాం. రైతులకు  Free electricity ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే చెందుంతన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ చేశారు. నాలుగు వేల పెన్షన్, రూ. 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదన్నారు.‘వందనా.. వాళ్ళ‌ బొందనా? వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. వంద గెలవాలంటే.. ముందు ప్రజలు ఓట్లు వేయాలి కదా. రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుంది. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటుని కేటీఆర్ అన్నారు.
రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌‌కు కేటీఆర్ సవాల్ Publish Date: Jul 5, 2025 3:26PM

గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి.. చివరకు ఏమైందంటే?

  గూగుల్ మ్యాప్ సాయంతో కారులోవెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఈ క్రమంలో వడ్డకొండ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో నలుగురి స్వల్పగాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ ని చాలా మంది వాడుతుంటారు. అయితే కొంతమంది గూగుల్ మ్యాప్స్ పైనే గుడ్డిగా ఆధారపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే ఈ యాప్‌ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఎంతోమంది ప్రమాదాల్లో పడ్డారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి.. చివరకు ఏమైందంటే? Publish Date: Jul 5, 2025 2:47PM