Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాయచోటి ఘటనపై ఏన్‌ఐఎ విచారిస్తోంది ..అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ
posted on: Jul 5, 2025 7:02PM

రాయచోటి ఘటన జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని,దీనిపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఓక ప్రకటనలో హెచ్చరించారు. జాతీయ భద్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ఇతర ప్రసారమాధ్యమాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా, అవాస్తవాలను సృష్టించినా, పుకార్లు ప్రసారం చేసినా, షేర్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాజిక మధ్యమాలలో గ్రూప్ అడ్మిన్ లు ప్రతి సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని, మరియు ఒక వేళ ఆయా గ్రూపుల్లో తప్పుడు సమాచారం వస్తే గ్రూప్అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాయచోటి ఘటనపై ఈ నెల 3వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేశామని, ఈ విషయం గురించి కేంద్ర దర్యాప్తు బృందం విచారణ చేస్తున్నారన్నారు. కనుక ఎటువంటి విషయాలు ఉన్నా అధికారికంగా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు తెలియజేస్తారని,ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని, ప్రజలు భయభ్రాంతులు కలిగించే ఊహాగానాలు, కథనాలు, దృశ్యాలు సృష్టించినా, పుకార్లు వ్యాప్తి చేసినా, ప్రసారం చేసినా షేర్ చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సమాజంలో ముఖ్యంగా మీడియా పాత్ర విలువైనదని పోలీసు శాఖకు సహకరించాలన్నారు.
ఏదైనా విషయానికి సంబంధించి పోలీసు అధికారులను సంప్రదించి నిర్ధారించుకోవాలి న్నారు .తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై, సృష్టిస్తున్న వారిపై, షేర్ చేస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు .వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జాతీయ భద్రతకు కు సంబందించిన విషయాలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తీవ్రమైన నేరం గా పరిగనించబడుతుందన్నారు. మరియు చట్ట పరమైన పర్యావసనాలు కఠినంగా ఉంటాయన్నారు. కావున ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని ప్రమాణీకతను తనిఖీ చేసుకోవడం చాలా ఎస్పీ సూచించారు.


.webp)
.webp)


