బీబీకా ఆలంను సందర్శించిన మంత్రులు
posted on Jul 5, 2025 4:02PM

మొహర్రం సందర్బంగా హైదరాబాద్‌లోని డబీర్ పురాలోని బీబీకా ఆలంను ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సందర్మించారు. ఈ సందర్బంగా బీబీకా ఆలయంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వందల సంవత్సరాల అనావాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును ఇప్పటికే తీసుకురావడం జరిగింది.
కాగా, మొహర్రం పర్వదినం పురస్కరించుకొని గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు కొనసాగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎఫండీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పాల్గోన్నారు. దీంతో అధికారులు మొహర్రం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు