రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
posted on Jul 5, 2025 3:26PM
.webp)
రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 72 గంటలు సమయం ఇస్తున్నా.. ప్రిపేర్ అయ్యి చర్చకు రండి ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లెలోనైనా చర్చకు సిద్దమని తేల్చి చెప్పారు. ప్లేస్, టైం, డేట్ అన్నీ రేవంత్ ఇష్ట్రమన్నారు. బేసిన్‌కు తేడా తెలియని రేవంత్..కేసీఆర్‌ను చర్చకు పిలుస్తారా అని ప్రశ్నించారు. ఆయన స్థాయికి తాము చాలని సెటైర్ల వేశారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్. రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్‌ఎస్. నిజం తెలిసినా ఒప్పుకోలేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు.
ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్ధమని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. తన అనుచరులకు నియామకాలు ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా, ఎవరూ చేయలేదు. 70 లక్ష మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేశాం. రైతులకు Free electricity ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే చెందుంతన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ చేశారు. నాలుగు వేల పెన్షన్, రూ. 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదన్నారు.‘వందనా.. వాళ్ళ బొందనా? వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. వంద గెలవాలంటే.. ముందు ప్రజలు ఓట్లు వేయాలి కదా. రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుంది. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటుని కేటీఆర్ అన్నారు.