గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి.. చివరకు ఏమైందంటే?

 

గూగుల్ మ్యాప్ సాయంతో కారులోవెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఈ క్రమంలో వడ్డకొండ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. 

ఈ ప్రమాదంలో నలుగురి స్వల్పగాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ ని చాలా మంది వాడుతుంటారు. అయితే కొంతమంది గూగుల్ మ్యాప్స్ పైనే గుడ్డిగా ఆధారపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే ఈ యాప్‌ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఎంతోమంది ప్రమాదాల్లో పడ్డారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.