Home

»

Bollywood News

రణబీర్‌ కపూర్‌ని ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. రెచ్చిపోయిన చిన్మయి!

Jul 5, 2025 11:33AM

ఈమధ్యకాలంలో సోషల్‌ మీడియా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఏ చిన్న విషయమైనా వివాదంగా మారిపోవడం మనం చూస్తున్నాం. అదీ ఇదీ అని లేదు.. ఏదైనా కాంట్రవర్సీగా మారే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే సెలబ్రిటీలు అప్పుడప్పుడు నోరు పారేసుకోవడం, నోరు జారడం చేస్తున్నారు. దీంతో ట్రోలర్స్‌కి మంచి స్టఫ్‌ దొరుకుతోంది. తాజాగా అలాంటి ఓ అంశంపై సోషల్‌ మీడియాలో యుద్ధం జరుగుతోంది. కాంట్రవర్సీలకు పెట్టింది పేరుగా చెప్పుకునే చిన్మయి ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తోంది. 

హిందీలో రామాయణ గాధను మరోసారి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘రామాయణ’ పేరుతో నితిష్‌ తివారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రణబీర్‌కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్‌ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్‌ అయ్యాయి. దీనిపై సోషల్‌ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఓ పక్క రామాయణ గ్లింప్స్‌ బాగున్నాయని, విజువల్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయని కొందరు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇదే సమయంలో ఓ నెటిజన్‌ రణబీర్‌ కపూర్‌ ఫోటోను షేర్‌ చేస్తూ ‘బీఫ్‌ తినేవాడు రాముడు పాత్ర పోషిస్తున్నాడు. ఇది చాలా దారుణం’ అంటూ కామెంట్‌ చేశాడు. దీన్ని మిగతా నెటిజన్లు కూడా అందుకొని వైరల్‌ చెయ్యడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ‘రాముడు పాత్ర రణబీర్‌ చెయ్యడమేంటో’ షాక్‌ అయినట్టుగా ఓ ఎమోజీని పెట్టాడు మరో నెటిజన్‌ 

ఇలాంటి విషయాలపై ఎంతో స్పీడ్‌గా స్పందించే చిన్మయి ఎప్పటిలాగే నెటిజన్లపై విరుచుకుపడింది. ‘దేవుడి పేరు చెప్పుకుంటూ తిరిగే కొందరు బాబాలు రేప్‌లు చేస్తున్నారు. జైళ్లలో ఉన్నవారు ఓట్ల కోసం పెరోల్‌ మీద బయటికి వస్తున్నారు. సమస్యలంటే ఇవి. అంతేగానీ, ఏదో తిని ఏదో చేస్తున్నారు అనేది సమస్య కాదు’ అని పోస్ట్‌ పెట్టారు చిన్మయి. ఆమె పోస్ట్‌పై తీవ్ర అభ్యంతరాన్ని వెలిబుచ్చారు నెటిజన్లు. ఆమె పెట్టిన పోస్ట్‌పై ట్రోలింగ్‌ మొదలెట్టారు. వాటిపై కూడా స్పందిస్తూ.. ‘రేపిస్టులు రాజ్యాన్ని ఏలుతున్నారు. అది మీకు సమస్య కాదు. బీఫ్‌ తినే వ్యక్తి రాముడు పాత్ర పోషిస్తేనే మీకు సమస్య. అంతేనా?’ అంటూ ప్రశ్నించారు. మరో నెటిజన్‌ చేసిన ఓ కామెంట్‌పై చిన్మయి చాలా ఫైర్‌ అయిపోయింది. ‘మీరు ఫెమినిజం, ఫెమినిస్ట్‌ వరకు మాత్రమే మాట్లాడండి..’ అని కామెంట్‌ చేశాడు. ‘దేవుడి పేరుతో అలజడి సృష్టించాలని, వారి పబ్బం గడుపుకోవాలని చాలా మంది చూస్తుంటారు. అలాంటివారు ఎప్పటికైనా నాశనం అవుతారు. ఇది మన పెద్దలు చెప్పిన విషయమే. మీరు గుర్తుంచుకోండి’ అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా కొన్ని గంటలుగా నెటిజన్లకు, చిన్మయికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరి ఈ యుద్ధానికి ఎప్పుడు తెరదించుతారో చూడాలి.

 

Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com