నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్

 

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద, అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నెహాల్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు యూఎస్ ప్రాసిక్యూషన్ పేర్కొన్నాది. 

ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. ఆ సమయంలో నెహాల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని యూఎస్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. 14 వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరమ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదర్కొంటున్నారు.