వీళ్లిద్దరి బతుకు రెంటికి చెడ్డ రేవడైందా?
posted on Jul 6, 2025 12:49PM

ఉన్న పార్టీలో ఉన్నట్టు ఉండి ఉంటే వీళ్ల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే కరవడంతో పాము, మొసలినే మించి పోయారీ ఇద్దరూ. కారణం ఈ భూ ప్రపంచంలో పెట్టిన చేతినే కరిచే బుద్ధి కేవలం పాము, మొసలికి మాత్రమే ఉంటుందట. ఆ పార్టీలో ఉండి ఏమైనా పేరు సాధించారా అంటే అదీ లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వల్లే మేం ఓడాం అంటూ కాసు మహేష్ రెడ్డి వీళ్లపై చూపించిన కోపం తాపం అంతా ఇంతా కాదు. వంశీ చేసిన కామెంట్లు మాకు చేటు తెచ్చాయని వాళ్లు కూడా వీళ్లను చూస్తే అసహ్యం వెళ్లగక్కుతున్నారు జోగి రమేష్ వంటి వైసీపీ లీడర్లు కూడా.
ఇక వీళ్ల పరిస్థితి చూస్తే.. సూర్య చంద్రులకే గ్రహణం పట్టించిన రాహుకేతులకే గ్రహణం పడితే ఎలా ఉంటుందో అలా తయారయ్యారు. ఒకడు ఇప్పటికే తాను చేసిన ద్రోహాలన్నీ ఆ మొహం మీద విలయ తాండవం చేస్తుంటే.. ప్రత్యర్ధులకే జాలి కలిగేలా తయారయ్యాడు.మరొకడు గుడివాడ ఓటరు జనాలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి గుండాపరేషన్ చేయించుకోవడం మాత్రమే కాకుండా.. అత్యంత దయనీయంగా.. కట్లు కట్టుకుని తిరుగుతున్నాడు. అదే ఉన్నపార్టీలో ఉండి.. పద్దతిగా బిహేవ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న కోణంలో సోషల్ మీడియా కామెంట్లు హోరు మంటున్నాయ్ ఈ జంట ద్రోహుల మీద.