'భూల్ భులయ్యా 2'కు సూపర్బ్ ఓపెనింగ్స్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్!
చాలా కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతూ, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తోన్న బాలీవుడ్, లేటెస్ట్గా రిలీజైన 'భూల్ భులయ్యా 2' మూవీ ఓపెనింగ్ కలెక్షన్లతో హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఆడియెన్స్ నుంచి గొప్ప స్పందన అందుకున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అందుకు అనుగుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన 'భూల్ భులయ్యా 2' సినిమా మే 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది.