Read more!

English | Telugu

సోనాక్షి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. వ‌రుడెవ‌రు?

 

బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా ల‌వ్ లైఫ్ గురించి కొంత‌కాలంగా ర‌క‌ర‌కాల వ‌దంతులు వినిపిస్తూ వ‌స్తున్నాయి. ఆమె ఎవ‌రితోనో ప్రేమ‌లో ఉందంటూ మీడియాలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే చాలా కాలంగా ఈ ప్ర‌చారంపై మౌనంగా ఉంటూ వ‌చ్చిన ఆమె, ఇప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పోస్ట్‌తో అంద‌రికీ షాకిచ్చింది. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో చేతికి ఒక‌ ఉంగ‌రం క‌నిపిస్తోంది. ఆమె చేతిని ఎవ‌రిదో ఒక వ్య‌క్తి చేయి ప‌ట్టుకొని ఉంది. మ‌రో ఫొటోలో అత‌డి భుజంపై ఆ ఉంగ‌రం ఉన్న చేతిని ఆనించి పెట్టింది సోనాక్షి.

దీంతో ఆమె చేతికి ఉన్న‌ది నిశ్చితార్ధం ఉంగ‌ర‌మే అనీ, ఆమె జీవితంలోకి ఒక స్పెష‌ల్ ప‌ర్స‌న్ వ‌చ్చిన‌ట్లేన‌ని అర్థ‌మైపోతోంది. ఆ ఫొటోల‌కు ఆమె పెట్టిన క్యాప్ష‌న్ కూడా దీన్ని బ‌ల‌ప‌రుస్తోంది. "BIG day for me!!! One of my biggest dreams is coming truuuue... and i cant wait to share it with YOUUUU. Can't believe it was SO EZI!!!! ❤️❤️❤️ " అంటూ ఆమె రాసుకొచ్చింది.

అయితే తాను ఎవ‌రితో నిశ్చితార్ధం జ‌రుపుకుందో, అత‌ని పేరును ఆమె వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో అంద‌రిలోనూ అత‌డెవ‌రో తెలుసుకోవాల‌నే ఆత్రుత పెరిగిపోతోంది. ఏదేమైనా సోనాక్షి జీవితంలో కొత్త చాప్ట‌ర్ మొద‌లైంద‌న్న మాటే!

సోనాక్షి చేతిలో ప్ర‌స్తుతం 'క‌కుడా', 'డ‌బుల్ ఎక్స్ఎల్' లాంటి మూవీస్‌తో పాటు, 'ద‌హాడ్' అనే వెబ్ సిరీస్ కూడా ఉంది.