Read more!

English | Telugu

'లాల్ సింగ్ చ‌ద్ధా'కి చైతూ నెగ‌టివ్ సెంటిమెంట్!

ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు చిత్రాల్లోనే సంద‌డి చేస్తూ వ‌చ్చిన యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌.. త్వ‌ర‌లో హిందీనాట ఎంట‌ర్టైన్ చేయ‌నున్నాడు. అయితే, క‌థానాయ‌కుడిగా కాకుండా ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో వినోదాలు పంచనున్నాడు ఈ అక్కినేని వారి యంగ్ హీరో. ఆ చిత్ర‌మే.. `లాల్ సింగ్ చ‌ద్ధా`. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో న‌టించిన ఈ సినిమాలో క‌థ‌కు కీల‌క‌మైన వేషంలో చైతూ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ డ్రామా.. ఈ ఏడాది ఆగ‌స్టు 11న తెర‌పైకి రాబోతోంది.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ఇదే తేదిన నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన ఓ సినిమా విడుద‌లై నిరాశ‌ప‌రిచింది. ఆ చిత్ర‌మే.. `ద‌డ‌`. 2011 ఆగ‌స్టు 11న మంచి అంచ‌నాల న‌డుమ విడుద‌లైన `ద‌డ‌` బాక్సాఫీస్ ముంగిట బోల్తా ప‌డింది. మ‌రి.. 11 ఏళ్ళ త‌రువాత అదే ఆగ‌స్టు 11న మ‌రోసారి ప‌ల‌క‌రించ‌బోతున్న చైతూకి ఈ సారి ఎలాంటి ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.

కాగా, `లాల్ సింగ్ చ‌ద్ధా`లో ఆమిర్ కి జంట‌గా క‌రీనా క‌పూర్ న‌టించ‌గా షారూక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.