Read more!

English | Telugu

హిందీలో 350 కోట్ల క్లబ్ లో 'కేజీఎఫ్-2'

హిందీలో 'కేజీఎఫ్ చాప్టర్-2' కలెక్షన్ల తుఫాన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా 350 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఫీట్ సాధించడానికి 'బాహుబలి-2'కి 12 రోజులు పడితే 'కేజీఎఫ్-2'కి 16 రోజులు పట్టింది. త్వరలోనే కేజీఎఫ్-2 హిందీలో 400 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.

మొదటివారం హిందీలో 'బాహుబలి-2' రూ.247 కోట్ల వసూలు చేయగా 'కేజీఎఫ్-2' రూ.255.05 కోట్ల నెట్ రాబట్టింది. రెండో వారం 'బాహుబలి-2'కి 143.25 కోట్లు రాగా 'కేజీఎఫ్-2'కి 88.08 కోట్లు వచ్చాయి. దీంతో హిందీలో బాహుబలి-2 రెండు వారాల్లో 390.25 కోట్లు కలెక్ట్ చేయగా.. 'కేజీఎఫ్-2' 343.13 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 15వ రోజు(గురువారం) 5.68 కోట్లు, 16వ రోజు(శుక్రవారం) 4.25 కోట్లు వసూలు చేసిన కేజీఎఫ్-2.. 16 రోజుల్లో హిందీలో 353.06 కోట్ల నెట్ రాబట్టింది.

ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో పాటు మంగళవారం నాడు రంజాన్ ఉంది. దీంతో ఈ నాలుగు రోజులు 'కేజీఎఫ్-2'కి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశముందని అంటున్నారు. మూడో వారం ముగిసే నాటికి ఈ సినిమా 400 కోట్లకు చేరువయ్యే ఛాన్స్ ఉంది.