Read more!

English | Telugu

24 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి చెప్పిన స‌ల్మాన్ ఖాన్ త‌మ్ముడు

 

బాలీవుడ్ న‌టుడు సొహైల్ ఖాన్‌, అత‌ని భార్య సీమా ఖాన్ 24 సంవ‌త్స‌రాల వైవాహిక జీవితం త‌ర్వాత విడాకుల కోసం శుక్ర‌వారం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ముంబైలోని ఫ్యామిలీ కోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా ఆ ఇద్ద‌రూ క‌నిపించారు. 1998లో వారికి పెళ్ల‌యింది. వారికి నిర్వాణ్‌, యోహాన్ అనే ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. సొహైల్ ఖాన్ ఎవ‌రో కాదు.. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్‌కు సొంత త‌మ్ముడు. సొహైల్‌, సీమ విడివిడిగా ఉంటున్న‌ట్లు 'ద ఫాబ్యుల‌స్ లివ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' షోలో మ‌న‌కు క‌నిపించింది. వారి పిల్ల‌లు రెండు ఇళ్ల మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఆ ఇద్ద‌రూ ఇంకెంతో కాలం క‌లిసి ఉండ‌ర‌ని ఆ షోలోనే మ‌న‌కు తెలిసింది.

ఆ షోలో మాట్లాడిన సీమా, "బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ మ‌నిషిని నేను పెళ్లి చేసుకున్నాను. అత‌ని మీద పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డి, అర్ధ‌రాత్రి వేళ అత‌నితో క‌లిసి లేచిపోయాను. నేను బాగా చిన్న‌దాన్నిగా ఉన్న‌ప్పుడు అత‌డు ప‌రిచ‌య‌మ‌య్యాడు. నిర్వాణ్ పుట్టే స‌మ‌యానికి నేను చిన్న‌దాన్నే" అని చెప్పింది.

త‌మ‌ది సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన పెళ్లి కాద‌ని కూడా సీమ వెల్ల‌డించింది. స్వ‌త‌హాగా డిజైన‌ర్ అయిన ఆమె, "మాది వండ‌ర్‌ఫుల్ ఫ్యామిలీ. పిల్ల‌లు పుట్టిన‌ప్ప‌ట్నుంచీ అత‌ను చాలా బాగా ఉంటూ వ‌చ్చాడు. అత‌డంటే నాకు చాలా ఇష్టం. మా మ‌ధ్య గొప్ప అనుబంధం ఉంది. అయితే వ‌య‌సు పెరిగేకొద్దీ అనుబంధం అనేది భిన్న దిశ‌ల‌కు మ‌ళ్లుతుంది. దీనికి నేనేమీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నుకోవ‌ట్లేదు. ఎందుకంటే మేము, మా పిల్ల‌లం సంతోషంగా ఉన్నాం. మాది సంప్ర‌దాయ వివాహం కాక‌పోయినా, మేం కుటుంబంగా ఉన్నాం. ఐక‌మ‌త్యంగా ఉన్నాం. చివ‌ర‌కు అత‌ను, నేను, పిల్ల‌లం ఎలా ఉన్నామ‌న్న‌దే ముఖ్యం" అని చెప్పుకొచ్చింది సీమ‌.